Ticker

6/recent/ticker-posts

టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు

*టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు*
*ముందే టెట్ . . జనవరిలో* *కొత్త డీఎస్సీ*

*ఇంగ్లీషు మీడియం సబ్జెక్టులకే ప్రాధాన్యం . . !నోటిఫికేషన్లకు ప్రభుత్వం సిద్ధం*

*20వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలు*
నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట .

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది . డిసెంబరులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్ ) నిర్వహించే ఆలోచనలో ఉంది . ఆ తర్వాత జనవరిలో నూతన డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి . . ఏప్రిల్ / మేలో పరీక్షలకు కేలెండర్లు రూపొం దించాలని ప్రాథమికంగా నిర్ణయించించినట్లు తెలు స్తోంది . విద్యాశాఖా ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష అనంతరం ఖాళీల భర్తీకి | కేలెండర్ రూపొందించాలని ఆదేశించడంతో నూతన  _ డీఎస్సీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తోంది .ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై జగన్ దృష్టిపెట్టారు . సీఎం ఆదేశాల మేరకు జన - వరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ' | విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు .

పోస్టుల భర్తీకి కసరత్తు
డీఎస్సీ - 2018 ప్రకటన విడుదల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 20వేలకుపైగా ఖాళీలు ఉండగా . . అందులో కేవలం 7902 పోస్టులకే టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఆ సమయంలో దాదాపు14వేల ఖాళీలు మిగిలిపోయాయి . అప్పటి నుంచి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులతోపాటు ఇతరత్రా ఖాళీలు కలుపుకుని *20వేల నుంచి 25 వేలకు ఖాళీలు . ఉండొచ్చని ఒక అంచనా* . రాబోయే డీఎస్సీ పరీక్ష సిలబస్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయని సమాచారం .

*ఇంగ్లీషు మీడియం పోస్టులకే ప్రాధాన్యత*

రాబోయే డీఎస్సీలో ఇంగ్లీషు మీడియం ( అన్ని సబ్జెక్టులకు ) అత్యంత ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి . 7030 నిష్పత్తిలో 70శాతం ఇంగ్లీషు మీడియం , 30శాతం తెలుగు మీడియం ) పోస్టుల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది . అయితే తెలుగు సబ్జెక్టుకూ సముచిత స్థానం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది . ప్రభుత్వ పాఠశాలల్లో తొలి విడతగా 1 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లీషు మీడియంలో బోధించాలని నిర్ణయించారు . ఆ తర్వాత 9 , 10 తరగతులకు ఇంగ్లీషు మీడి యాన్ని విస్తరించనున్నారు . దీన్ని దృష్టిలో ఉంచు కుని సర్వీసులో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయు లను హైదరాబాద్లోని  పంపనున్నారు .

టెట్ అర్హత తప్పనిసరి . . !

డీఎస్పీ రాయాలంటే ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి అభ్యర్థి టెట్లో అర్హత సాధించాల్సిందే . విద్యాహక్కు చట్టం ( ఆర్టీఈ ) - 2009 ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ను నిర్వహిస్తున్నారు . ఆర్టీఈ నిబంధనల ఆధారంగా ప్రతి ఏటా ( ఆర్నెళ్లకోసారి ) ప్రభుత్వం టెట్లు నిర్వహించాలి . గత పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ విడత డీఎస్సీ కంటే ముందస్తుగానే టెట్ నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం . నెల రోజుల్లో టెట్ నోటిఫికేషన్ పై స్పష్టత వచ్చే అవకాశముంది .
సిలబస్ పై స్పష్టత ఇవ్వాలి
నూతన డీఎస్సీలో సిలబస్ పై పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి . దీంతో ముందస్తుగా సిలబస్ పై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు . టెట్ , డీఎస్పీలను ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహించనుంది . టెట్ - 2018 డీఎస్సీ - 2018 తరహానే దాదాపుగా సిలబస్ ఉంటుందని భావిస్తున్నారు . పాత సిలబస్ ఆధారంగానే టెట్ , డీఎస్సీలు నిర్వహిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని , గత ఏడాది తరహాలో తుది దశలో సిలబసను కొత్తగా మార్పు చేస్తే అభ్యర్థులు గందరగోళానికి గురయ్యే అవకాశముంది అభ్యర్థులు భావిస్తున్నారు . ఇప్పటికే డీఎస్సీ - 2018లో తెలుగు , ఇంగ్లీషు పండిట్లకు సిలబసను అదనంగా రూపొందించ డంతో అభ్యర్థులు న్యాయ స్థానాల్ని ఆశ్రయించారు . ఇప్పటివరకు తెలుగు , హిందీ లాంగ్వేజ్ పండిట్స్ , స్కూల్ అసిస్టెంట్స్ ( ఎస్ఏ ) పోస్టులకు మెరిట్ జాబితాను రూపొందించలేదు . గత సంఘటనల్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని టెట్ , డీఎస్సీ సిలబసను సబ్జెక్టుల వారిగా ముందస్తుగా ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు.