Ticker

6/recent/ticker-posts

10 తరగతి సాంఘిక శాస్త్రము. ప్రజలు - నివాసప్రాంతాలు

ప్రజలు - నివాసప్రాంతాలు
  • ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరుచుకున్న పద్దతిని "నివాస ప్రాంతం" అని అంటాం.
  • ఇది మనం నివసించే, పని చేసే భౌగోళిక ప్రదేశం. నివాసప్రాంతంలో విద్య, వాణిజ్యం, మాటపర కార్యకలాపాలు ఉంటాయి.
నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి ?

  • తొలి మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు. అందుకే వాళ్ళని వేటగాళ్ళు అని అంటారు.
  • వారు సంచార జీవులు - ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉంటారు.
  • మానవులు సుమారు 2 లక్షల సంవత్సరాలు సేకరణ - వేటగాళ్ళు గుంపులో జీవించారు.
  • ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి పూనుకొన్నాయి. ఇది సుమారు 12,000 సంవత్సరాల క్రితం జరిగింది. దీని వల్ల మానవ జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి.
  • వ్యవసాయం వల్ల ఒకచోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం మొదలుపెట్టారు.




వ్యవసాయ వృద్ధి, పట్టణాల ఆవిర్భావం :
  • వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలో రీతులు ప్రజలు బాగా అర్ధం చేసుకోగలిగారు.
  • జనాభా పెరగటంతో నేత, కుండల తయారీ, లోహాలు తయారీ, ఇతర వృత్తులు పెరిగాయి. తద్వారా వర్తకం పెరిగింది.
  • వృత్తిపనివాళ్ళు పట్టణ ప్రాంతాలలో స్థిరపడడాన్ని పాలకులు ప్రోత్సహించారు. ఈవిధంగా పట్టణ నివాస ప్రాంతాలు, వ్యవసాయం చెయ్యని ప్రజలు ఉండే ప్రాంతాలు విస్తరించాయి.
నివాస ప్రాంతాలు ఎందుకు మారతాయి ?
  • నివాస ప్రాంతాలు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. 
ఢిల్లీకి సంబంధించిన వివరాలు
  • భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఢిల్లీ కేంద్రంగా ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ దేశ రాజధాని కావడంతో ఇక్కడకు చాలా మంది ప్రజలు ఉద్యోగం, ఉపాధి వెతుక్కుంటూ వలస వచ్చారు.
  • నేడు ఢిల్లీ రెండవ అతి పెద్ద నగరం. నగర జనాభా కోటి అరవై లక్షలు.
  • 1951 లో ఢిల్లీ జనాభా 20 లక్షలు. గత 60 సంవత్సరాలలో దీని జనాభా 8 రెట్లు పెరిగింది. ఈ జనాభా పెరుగుదలకి ప్రధాన కారణం వలస వచ్చిన ప్రజలు.
  • నగరంలో అనేకరకాల మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి.
  • వీటిలో స్థానిక అధికారులు క్రమబద్దీకరించిన ప్రాంతాలను "గుర్తించిన మురికివాడలు" లేదా "పునఃనివాస కాలనీలు" లేదా "అనాధీకృత కాలనీలు" అని అంటారు.
  • అయితే చట్టబద్ధమైన నివాసలుగా గుర్తించని "గుడిసెలు (జగ్గీ జోప్డి)" కూడా ఉన్నాయి.
  • ప్రతీ నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించడానికి, కేటాయించడానికి ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ఢిల్లీ కి ఇటువంటి మాస్టర్ ప్రణాళికలు మూడుసార్లు తయారు చేశారు. అయితే ఈ ప్రణాళికలు అమలుచేసినట్లు కనపడదు.
  • నగరంలో ఉమ్మడి భూములుగా ఉన్న ప్రాంతాలు బస్తీలుగా, మురికివాడలుగా ఆక్రమణకు గురి అయ్యాయి.






ఎటువంటి ప్రదేశాలు నివాసప్రాంతాలుగా మారతాయి ?
  • దీనిని అర్ధం చేసుకోవడానికి మూడు మౌలిక విషయాలను పరిశీలించాలి. అవి
  • 1. ప్రదేశం, 2. పరిస్థితి, 3. ప్రదేశం యొక్క చరిత్ర
  • ప్రదేశం ఒక ప్రాంతం యొక్క లక్షణాలు తెలియజేస్తుంది.
  • ప్రాచీన కాలంలో నీటి సరఫరా బాగా ఉన్న ప్రాంతాలు, శత్రువుల నుంచి రక్షణ ఇచ్చే ప్రాంతాలు నివాసలుగా ఎంపిక చేసుకునేవారు. ఉదాహరణ - శివాజీ కట్టించిన ప్రతాప్ గడ్ కోట (మహారాష్ట్ర)
  • పరిస్థితి అనేది ఇతర ప్రదేశాలలో ఉన్న సంబంధాలను తెలుపుతుంది.
  • గ్రామంలో వారం, వారం జరిగే సంతలు ఇతర ప్రదేశాలతో సంబంధానికి ముఖ్యమైన వేదికగా ఉంటాయి.
  • కొన్ని గ్రామాలలో వార్షిక సంతలు జరుగుతాయి. ఇక్కడ మార్కెట్ తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
  • వారపు, లేదా వార్షిక సంతలు ఆ ప్రాంత వృక్ష, జంతు సంపదకు చాలా కీలకం. ఈ సంతలు వల్ల వేరు వేరు గ్రామాల మధ్య వివాహ సంబంధాలు కుదురుతాయి.
భారతదేశంలో పట్టణీకరణ :
  • భారతదేశంలో 35 కోట్ల మంది అనగా జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాలలో నివసిస్తున్నారు.
  • 1950 లో దేశంలో అధిక జనాభా 5.6 లక్షల గ్రామాల్లో నివసిస్తుండేవాళ్ళు. అప్పుడు 10 లక్షలు జనాభా దాటిన నగరాలు 5 మాత్రమే. లక్ష జనాభా దాటిన పట్టణాలు 40 ఉండేవి.
  • ఈనాడు గ్రామాల సంఖ్య 6.4 లక్షలకు పెరిగింది. గ్రామీణ జనాభా 85 కోట్లుగా ఉంది. 10 లక్షలు జనాభా దాటినా నగరాలు 50 కి పైగా ఉన్నాయి.
  • పట్టణ జనాభా అధిక భాగం సహజ వృద్ధి వల్ల జరిగింది. ఐదింట ఒక వంతు మాత్రమే గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారి వల్ల పెరిగింది.





భారతదేశ నివాస ప్రాంతాల స్థాయిలు :
  • మహానగరాలు - కోటికి మించి జనాభా గల నగరాలు
  • ముంబై(1.84కోట్లు), ఢిల్లీ(1.63కోట్లు), కోల్ కతా(1.41కోట్లు)
  • మెట్రోపాలిటన్ నగరాలు - 10 లక్షలు నుండి కోటి జనాభా
  • చెన్నై(86 లక్షలు), హైద్రాబాద్(78లక్షలు), అహ్మదాబాద్(62 లక్షలు)
  • క్లాస్ 1 నగరాలు - లక్ష నుండి 10 లక్షలు జనాభా
  • పట్టణాలు - 5000 నుండి లక్ష జనాభా
  • రెవిన్యూ గ్రామాలు - నిర్దిష్ట సరిహద్దు గలవి
  • ఆవాసం ప్రాంతాలు - రెవిన్యూ గ్రామంలోపల కొన్ని ఇళ్ల సముదాయం
విమానాశ్రయ నగరాలు (ఏరోట్రోపొలిస్) - జెట్ యుగపు నగరాలు :
  • పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడిన నగరాలు. ఇక్కడ విమానాశ్రయమే ఒక నగరంగా పని చేస్తుంది.
  • భారతదేశంలో విమానాశ్రయ నగరాలు - బెంగుళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఢిల్లీ), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(హైద్రాబాద్)
  • ఇతరదేశాలలో - సువర్ణభూమి 
  • అంతర్జాతీయ విమానాశ్రయం(బ్యాంకాక్, థాయిలాండ్), దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, కైరో అంతర్జాతీయ విమానాశ్రయం(ఈజిప్టు), లండన్ హిత్రో విమానాశ్రయం(లండన్, యూ.కె)


పట్టణీకరణ సమస్యలు :
  • పట్టణీకరణ పెరగటం అంటే ప్రజల అవకాశాలు పెరగటం, ఆర్ధిక కార్యకలాపాలు పెరగటం మాత్రమే కాదు ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.
  • పట్టణీకరణ పెరగటంలో ఒక సమస్య భూమిలో కలసిపోని, కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టే పదార్ధాల వినియోగం పెరగడం. 

Prepared By : A.B.Rao