డిఎస్సీ ఎగ్జామ్ లోనూ టెట్ ఎగ్జామ్ లోనూ ప్రధానంగా స్కోరింగ్ సబ్జెక్ట్ గా తెలుగుని చెప్తాము. తెలుగు విషయం శంలో పరిశీలిస్తే ప్రధానంగా పదజాలం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. ప్రతి పాఠ్యాంశం లోనూ పరిచయం చేసే తెలుగు పదాల అర్థాలు, నానార్ధాలు,
పర్యాయపదాలు చాలా ముఖ్యమైనవి. ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చే ఏరియా వ్యుత్పత్తి అర్థం. కావున మీ కోసం ఎగ్జామ్ ముందు ఒక పాఠం కు సంబంధించి పదజాలం ఇక్కడ ఉంటాయి.
పర్యాయపదాలు చాలా ముఖ్యమైనవి. ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చే ఏరియా వ్యుత్పత్తి అర్థం. కావున మీ కోసం ఎగ్జామ్ ముందు ఒక పాఠం కు సంబంధించి పదజాలం ఇక్కడ ఉంటాయి.
10 వ తరగతి
1. మాతృభావన
పర్యాయపదాలు
ఆజ్ఞ - ఆదేశం, ఆన, ఉత్తరువు, నిర్దేశం
కన్ను - అక్షి, చక్షువు, నేత్రం, నయనం
అనలం - అగ్ని, వహ్ని, జ్వలనం
కాంత - మగువ, కొమ్మ, ఇంతి, పడతి
ప్రకృతి - వికృతి
రాజ్ఞి - రాణి బ్రాహ్మ - బమ్మ
ఆజ్ఞ - ఆన జ్యోతి - జోతి
ఛాయ - చాయ గృహము - గీము
రత్నం - రతనం రాశి - రాసి
భక్తి - బత్తి భాగ్యం - బాగ్గెం
గౌరవం - గారవం అంబ - అమ్మ
పుణ్యం - పున్నెము దోషం - దోసం
వ్యుత్పత్తర్ధాలు
శివుడు - సాధువుల హృదయాన శయనించి ఉండువాడు, మంగలప్రదుడు
పతివ్రత - పతిని సేవించుటయే వృతముగా కలది (సాధ్వి)
పురంధ్రి - గృహమును ధరించునది (గృహిణి)
అంగన - చక్కని అవయముల అమరిక కలది (అందగత్తె)
నానార్ధాలు
వాసము - ఇల్లు, వస్త్రం, వెదురు, కాపురం
సూత్రం - నూలుపోగు, తీగ, తాడు, మొలనూలు, చట్టము
చరణము - పాదము, కిరణము, పద్యపాదం, వేరు, వేదశాఖ
హరి - యముడు, సింహం, ఇంద్రుడు, విష్ణువు, కోతి, కప్ప
రత్నం - మణి, వజ్రం, నీరు, సూదంటురాయి
ఈ రోజు పరీక్ష కొసము ఇక్కడ నొక్కండి.