డీఎస్సీ మరియు టెట్ నోటిఫికేషన్లు వెనువెంటనే రావడం వల్ల మనం చేసే ప్రిపరేషన్ రెండింటికీ సమతూకంగా ఉండేలా చూడాలి. మనం ఒక పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆచరించాల్సిన నాలుగు సోపానాలు
1.సామాగ్రి సేకరించడం
2. క్రమమైన పద్ధతిలో చదవడం.
3.వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్లు రాయడం .
4 టెస్టుల ఫలితాన్ని ఆధారంగా మన యొక్క బలహీనతలను గుర్తించి వాటిపైనే దృష్టి సారించడం.
ఇలా ప్రతిసారి మనం చదివిన కంటెంట్ పైన పునఃసమీక్ష చేసుకుంటే రాబోయే పరీక్షలు తప్పులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ డిఎస్సీ మరియు టెట్ పరీక్షకు ప్రామాణికం మన అకాడమీ పుస్తకాలు. అకాడమీ పుస్తకాలను ముందుగా చదివి పరీక్ష రాసి తప్పులుగానే ఎక్కువ ఉన్నట్లయితే క్విక్ రివిజన్ గా మనం రాసుకునే రన్నింగ్ నోట్స్ లేదా యూట్యూబ్ వీడియోస్ లేదా బయట దొరికే మెటీరియల్ ఉపయోగించవచ్చు. ప్రతి దశలోనూ మన సామర్థ్యం మనమే అంచనా వేసుకోవడానికి సహకరించేది రోజువారి పరీక్షలు. కావున వీలైనన్ని ఎక్కువ పరీక్షలు రాయండి భవిష్యత్తులో తప్పులు రాకుండా జాగ్రత్తపడండి.
ఈ రోజు పరీక్షకోసం క్రిందన ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.