Ticker

6/recent/ticker-posts

4వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం -1)


1. కుటుంబ వ్యవస్థ - మార్పులు
  • కుటుంబంలో చిన్న పిల్లలు పుట్టడం వల్ల వారందరి పనుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
  • "పెళ్లి" జరగడం వల్ల కుటుంబ సభ్యులు సంఖ్య తగ్గవచ్చు లేదా పెరగవచ్చు.
  • ఎవరి కుటుంబంలో అయిన పెళ్లి అయిన, పిల్లలు పుట్టిన కొత్తగా సభ్యులు చేరతారు.
  • ఏవైనా కారణాల వల్ల కుటుంబం వదిలి వెళ్ళిన, చనిపోయినా సభ్యుల సంఖ్య తగ్గును.
  • కుటుంబాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రకరకాల కారణాల వల్ల మార్పులు చోటు చేసుకుంటాయి.
  • ఎక్కువ మంది సభ్యులు గల కుటుంబాన్ని "సమిష్టి కుటుంబం" అని అంటారు.
  • అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటే "చిన్న కుటుంబం" అని అంటారు.
  • ఇంట్లో రోజు చేసే పనులకు శ్రమ పడకుండా ఉండడానికి విద్యుత్ ఉపకరణాలు వాడుతున్నారు.
2. ఆటలు - నియమాలు
  • కబడ్డీ ఆటలో జట్టుకు ఏడుగురు ఉంటారు.
  • కూతకి వెళ్లే వారు వెనక్కి వచ్చేలోగా "తొక్కుడు గీత(డెడ్ లైన్)" తప్పక తాకాలి.
  • ఆటలో నియమాలు ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయి.
  • రోడ్డు ప్రమాదాల నివారణకు "రోడ్డు నియమాలు(Traffic Rules)" ఉంటాయి.




  • ఎర్ర లైట్ - ఆగడం, పచ్చ లైట్ - ముందుకు వెళ్లడం, ఆరంజ్ లైట్ - సిద్ధంగా ఉండడం. దీనిని "సిగ్నలింగ్ సిస్టం" అంటారు.
  • రోడ్డుపై నడిచేవారు ఎడమవైపు నడవాలి
  • రోడ్డుపై చారలు ఉన్న చోట మనుషులు రోడ్డు దాటాలి. దీనిని "జీబ్రా క్రాసింగ్" అంటారు.
  • సైనా నెహ్వాల్, సానియా మీర్జా - షటిల్ బాడ్మింటన్
  • విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి - చెస్




  • మిథాలీ రాజ్ - క్రికెట్
  • మేరీకోమ్ - బాక్సింగ్
  • కరణం మల్లీశ్వరీ - వెయిట్ లిఫ్టింగ్
  • గగన్ నారంగ్ - షూటింగ్
  • ఆటల్లో గెలుపు, ఓటములు సమానంగా తీసుకుని అభినందించుకోవడాన్ని "క్రీడాస్ఫూర్తి" అంటారు.
  • 4 -6 గంటలు పిల్లల ఆటల సమయం
  • 2011 లో మనదేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది. 
3. రకరకాల జంతువులు
  • కొన్ని జంతువులు అడవిలో ఉంటే, కొన్ని జంతువులు ఇళ్లల్లో మనతో పాటే జీవిస్తున్నాయి.




  • మొసలి తలపై చెవులుగా పని చేసే రంధ్రాలు ఉంటాయి.
  • పాముకి చెవులు ఉండవు. చెవులు చేసే పని పాము చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారా ధ్వనులు గుర్తిస్తుంది.
  • చెవులు బయటికి కనిపించి, చర్మంపై వెంట్రుకలు ఉండే జంతువులు పిల్లలను కంటాయి. వాటిని "శిశోత్పాదకాలు" అంటారు.
  • చెవులు బయటికి కనిపించకుండా, చర్మం పై వెంట్రుకలు లేని జంతువులు గుడ్లు పెడతాయి. వాటిని "ఆండోత్పాదకాలు" అంటారు.




  • జంతు చర్మం చెప్పులు, డోలు వంటివి తయారీ చేయుటకు వాడతారు.
  • పెద్దపులి (పాంథరా టైగ్రిస్) మన దేశ జాతీయ జంతువు
4. జంతువులు - జీవన విధానం, జీవవైవిధ్యం
  • మనుషులు అందరూ కుటుంబాలతో కలసి జీవిస్తారు. అందుకే మనిషిని "సంఘజీవి" అని అంటారు.
  • ఏనుగులు ఒక్కో గుంపులో 10 -12 ఏనుగులు మరియు వాటి పిల్లలు ఉంటాయి. 15 ఏళ్ళు రాగానే గుంపు నుండి వేరు పడతాయి.
  • ఏనుగుల గుంపుకి పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది.
  • ఏనుగులు గుంపులుగా నివసించడం వల్ల పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారం వెదుక్కోవడం, శత్రువుల్ని భయపెట్టడం ద్వారా రక్షణ వంటి ప్రయోజనాలు పొందుతాయి.
  • జంతువులకు సంబంధించిన సమాచారం టి.వి.లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, డిస్కవరీ ఛానల్ లలో ప్రసారం అవుతాయి.




  • పులి పిల్లలకు పుట్టినప్పుడు వేటాడడం తెలీదు. పులుల గుంపు వేటాడే విధానాన్ని చూసి నేర్చుకుంటాయి.
  • ఆహారం కోసం, ఆశ్రయం కోసం కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసే శక్తి పక్షులకు ఉంది.
  • భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ. పి.జె.అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్రతీరంలో ఎగిరే పక్షులు చూసేవారు. అవి ఎలా ఎగురగల్గుతున్నాయి అని ఆలోచించేవారు. ఆ ఆలోచనే రాకెట్ పరిశోధనలకు మూలం అయ్యాయి.
  • దర్జీ పిట్ట దారాలతో ఆకుల్ని అల్లి గూడు తయారు చేస్తుంది.
  • పక్షులు సాధారణంగా గడ్డిపోచలు, చిన్న రెమ్మలు, దారాలు, వైర్లు, కాగితపు ముక్కలు, పీచు, బట్టముక్కలు, మెత్తటి నూలు, చెట్ల ఆకులను ఉపయోగించి గూడు తయారీ చేస్తాయి.
  • గిజిగాడు పక్షులలో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. వాటిలో తనకిష్టమైన గూటిలో ఆడ పక్షి గుడ్లు పెడుతుంది.
  • పక్షులు గుడ్లు పెట్టె సమయంలో గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే ఆ పక్షులు గూడును వదిలేస్తాయి.




  • మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త - డా. సలీం ఆలీ
  • సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
  • కందిరీగలలో ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి.
  • కొన్ని వందల తేనెటీగలు తమ నోటి నుండి వచ్చే స్రావంతో తేనేతుట్టెను తయారుచేసుకుంటాయి.
  • చీమలు సంఘజీవనంలో ఆదర్శప్రాయులు. చీమల్లో కూలి చీమలు, మగచీమలు, రాణిచీమలు ఉంటాయి.
  • రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని రక్షించడం, చీమ పిల్లలకు, చీమలకు ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మత్తులు చేయడం వంటి పనులు చేస్తాయి.
  • చీమలు దూరంగా వెళ్లే సమయంలో ఒక రకమైన వాసన ఇచ్చే పదార్ధం వదులుతూ పోతాయి. ఆ వాసన ఆధారంగా అదే దారి వెంట తిరిగి గూడును చేరుకుంటాయి.




  • చీమలు ఆహారం దొరికే చోటు గూర్చి, వెళ్లే దారి గూర్చి ఒకదానికొకటి సమాచారం ఇచ్చుకుంటాయి.
  • చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువు మోయగలదు. చీమ తల ముందు భాగంలో "ఫీలర్స్" ఉంటాయి. 
  • ఫీలర్స్ ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి.
  • ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, చెట్లు మొదలైన వాటిని "జీవవైవిధ్యం" అంటారు.
  • అడవులు నరకడం జంతువుల వేట వంటి చర్యల వల్ల ప్రకృతి సమతౌల్యం నశించి జీవవైవిధ్యం దెబ్బ తింటుంది.
  • జీవవైవిధ్యంలో భాగం అయిన వివిధ జీవరాసులు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి.
  • కలుషిత వాయువులు అయిన కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మొనాక్షైడ్ వంటివి వాతావరణంలో మార్పులకు కారణం. దీని వల్ల గాలి, నీరు, ఉష్ణోగ్రతలు, సముద్రజీవులు, సముద్ర నీటిమట్టాలు ప్రభావితం అవుతున్నాయి.




  • తెల్లపులులు ప్రస్తుతం అంతరించిపోనున్నాయి.
  • జంతువులు, పక్షులని రక్షించడానికి ప్రభుత్వం అభయారణ్యాలు ఏర్పాటు చేసింది.
5. మన చుట్టూ ఉండే మొక్కలు
  • బీర, కాకర, మల్లె - కాండాలు బలహీనం - వీటిని "తీగ మొక్కలు" అని అంటారు.
  • చామంతి, మిరప, గులాబీ - గుంపులుగా - వీటిని "పొదలు" అంటారు.
  • చింత, రావి, మామిడి - దృఢమైన కాండం - వీటిని "వృక్షాలు" అంటారు.
  • నేల లోపల మొక్క భాగం "వేర్లు". వేర్లు నేల లోపల ఉండి మొక్క నిటారుగా ఉండడానికి తోడ్పడును. వేర్లు ద్వారా మొక్కలకు నీరు, పోషక పదార్ధాలు అందుతాయి.
  • నేల పైన మొక్క భాగం - కాండం. కాండం నుండి కొమ్మలు, శాఖలు, వివిధ భాగాలు ఏర్పడతాయి.
  • కాండాలు మొక్కలు నిలబడడానికి బలాన్నిస్తాయి. వేర్లు గ్రహించిన నీరు, పోషక పదార్ధాలను మొక్క అన్ని భాగాలకు కాండం సరఫరా చేస్తుంది.
  • మొక్క ఆకులతో ఆహారం తయారు అవుతుంది. ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణం "పత్రహరితం"




  • మొక్కలు విత్తనాల నుండి వస్తాయి. విత్తనానికి మూలం పువ్వు.
  • ప్రపంచంలో అతి పెద్ద పువ్వు "రఫ్లెషియ" 1మీ వ్యాసం, 4కేజీ బరువు ఉంటుంది. పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన 2కి.మీ దూరం వరకు వస్తుంది.
  • జొన్న, మొక్కజొన్న, దానిమ్మ వంటివి ఎక్కువ విత్తనాలు ఇస్తాయి. ఆపిల్, చిక్కుడు వంటి మొక్కలు నాలుగు, ఆరు విత్తనాలు కల్గి ఉంటాయి.
  • విత్తనాలు/గింజలు మొలకెత్తడానికి గాలి, నీరు, వెలుతురు అవసరం.
  • వరి గింజలను "వడ్లు" అని అంటారు. వడ్లు నుండే బియ్యం వస్తాయి.
  • చనిపోయిన జంతు, వృక్ష జాతులు, నేల పై రాలిన ఆకులు, జంతు విసర్జకాలు అన్ని నేలలో సూక్ష్మజీవులు వల్ల కుళ్ళి నేలను సారవంతం చేస్తాయి.
  • వానపాము - రైతు మిత్రుడు
  • పార్ధీనియం మొక్కను "వయ్యారి భామ" అంటారు. అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసినపుడు మన దేశానికి వచ్చింది.
  • ఈ మొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి.
  • విత్తనాలు ఒక చోటు నుండి మరో చోటుకు గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి.




  • మొక్కల ఉత్పత్తి కేంద్రాలను " నర్సరీ' అంటారు. వీటిలో మొక్కలు పెంచి సరఫరా చేస్తారు.
  • అటవీ శాఖ వారు వేప, కానుగా, టేకు వంటివి నర్సరీలో పెంచి సామాజిక అడవుల పెంపకానికి అవసరం అయిన మొక్కలు సరఫరా చేస్తారు.
  • మన రాష్ట్రంలో తూ. గో.జిల్లా రాజమండ్రి దగ్గర "కడియం' నర్సరీ ఉంది. ఇక్కడ సుమారు 5 వేల ఎకరాల్లో 700 నర్సరీలు మొక్కలు పెంచుతున్నారు.
  • అంటుకట్టడం, కణజాలవర్ధనం, విత్తనాలు చల్లడం వంటి వాటి ద్వారా మొక్కలు ఉత్పత్తి చేస్తారు.
  • షెడ్ నెట్స్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణంలో మొక్కలు పెంచడం ఇక్కడ ప్రత్యేకత.
  • కడియం నర్సరీ మన రాష్ట్రంలో అతిపెద్ద జీవవైవిధ్యం గల ప్రాంతం.
6. దారి తెలుసుకుందామా !

  • సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు ఎదురుగా తూర్పు, వెనుక పడమర, కుడివైపు దక్షిణ, ఎడమవైపు ఉత్తర దిక్కు.
  • దేనికైనా చుట్టూ ఆనుకుని ఆయా దిక్కులలో ఏమున్నాయో చెప్పడాన్ని "సరిహద్దులు" అని అంటారు. సరిహద్దులు ఆధారంగా ఒక ప్రాంత ఉనికి గుర్తించవచ్చు.
  • రెండు దిక్కుల మధ్య ప్రదేశం - మూల
  • పెద్ద, పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీసిన దానిని "పటం" అంటారు.కాగితం పై పటం గీసేటప్పుడు ఉత్తర దిక్కు పైన ఉండేలా గీయాలి.
  • గ్రామాల సముదాయం - మండలం. మండలాలు కలిపి - జిల్లా. జిల్లాలు కలిపి - రాష్ట్రం




  • నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి.
  • మన రాష్ట్రం దేశ విస్తీర్ణంలో 11వ స్థానం.
  • ఆంధ్రప్రదేశ్ ను భౌగోళికంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ అని మూడు భాగాలుగా విభజించారు.
  • అట్లాస్ - పటాల సముదాయం
  • మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా వంటి నదులు ప్రవహిస్తున్నాయి.
  • తూ. గో, ప.గో, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అడవులు ఉన్నాయి.
  • వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు మొదలైన పంటలు పండుతాయి. 

Prepared By: A.B.Rao