7. ప్రభుత్వ సంస్థలు
- సమాజంలో ప్రజలందరికీ అవసరమయ్యే పనులు చేసే సంస్థలను "ప్రభుత్వ సంస్థలు" అంటారు.
- రేషన్ కార్డ్ కోసం మీసేవ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు గ్రామ నివాసి అని తెలిపే రుజువు పత్రం జత చేయాలి.
- రేషన్ కార్డ్ దరఖాస్తు ఎన్ఫోర్స్మెంట్ అధికారి ద్వారా జిల్లా పౌర సరఫరా అధికారికి పంపిస్తారు.
- రేషన్ కార్డ్ పొందుటకు 45 రోజులు వ్యవధి అవసరం అయింది.
- రేషన్ కార్డ్ కుటుంబంలో సభ్యులందరికి గుర్తింపు కార్డ్ వంటిది. మన ఇంటి చిరునామా తెలియజేయడానికి అధికారికమైన కార్డుగా దీన్ని ఉపయోగిస్తారు.
- రేషన్ కార్డులు గులాబీ రంగు, తెల్ల రంగులో ఉంటాయి.
-
- పంటల వివరాల నమోదు కొరకు "ఫహాని" ఆధారంగా గ్రామ రెవిన్యూ సహాయకునితో కలసి గ్రామ కార్యదర్శి రికార్డులు పరిశీలిస్తారు.
- ఐరిస్ కెమెరా కనుగొన్నది - మిమిజోయ్
ప్రభుత్వ సంస్థలు - మండల కేంద్రం
మండల పరిషత్ కార్యాలయం :
- ఇది మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నడుస్తుంది.
- ప్రాధమిక విద్య అందించడం
- వ్యవసాయం, పశుపోషణ, చేపలు కోళ్ల పెంపకం అభివృద్ధి చేయడం
- మండలంలో రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు
- సాగునీటి సరఫరా
- ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం మొదలైనవి.
పోలీస్ స్టేషన్ :
- సబ్ ఇన్స్పెక్టర్ అధికారిగా ఉంటారు.
- శాంతి భద్రతలు కాపాడడం, నేరాలు జరగకుండా చూడడం.
- ఫిర్యాదులు స్వీకరించడం, స్పందించడం
- ఫిర్యాదుల పై విచారణ చేయడం, రికార్డ్ చేయడం
తాహసిల్దారు కార్యాలయం :
- గ్రామ రెవిన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయం సిబ్బంది పనిని పర్యవేక్షించడం.
- ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడడం
- కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం
- వెట్టిచాకిరి నుండి ప్రజలని విముక్తులని చేయడం
- రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం, భూ వివాదాలు పరిష్కరించడం.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం :
- మండల పరిధిలో రోగులను పరీక్షించడం, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్వహణ పర్యవేక్షించడం.
- మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చేయడం.
బ్యాంకు :
- ప్రజల నుండి డిపాసిట్ స్వీకరించడం
- మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం, మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం
మండల వనరుల కేంద్రం :
- మండలంలో 100% బడి ఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం
- పాఠశాలలు పర్యవేక్షించడం
పశువైద్యశాల :
- జంతువులకు వచ్చే రోగాలు గుర్తించి చికిత్స చేయడం
- జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులు గుర్తించి నివారణ చర్యలు తీసుకొనుట
- మండల పరిధిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతీ మూడు నెలలకొకసారి సమావేశాలు జరుగుతాయి. దీనిలో మండలంలోని అన్ని కార్యాలయాల అధికారులు పాల్గొంటారు.
- మండల పరిషత్ అధ్యక్షులు అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయి.
- ఈ సమావేశానికి ముందుగానే మండల అధ్యక్షుల పేరుతో సమాచార లేఖ సభ్యులకు పంపిస్తారు.
- ఆరోగ్యశ్రీ కార్డ్ ఉంటే ఉచితంగా వైద్యం చేస్తారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు ఆరోగ్యశ్రీ కార్డ్ పొందడానికి అర్హులు
- దీనికోసం జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు చేయాలి. కలెక్టర్ గారు ఆరోగ్యభీమా విభాగ అధికారికి పంపిస్తారు. వారం రోజులలోగా కార్డ్ వస్తుంది.
- ప్రభుత్వ సంస్థలు పౌరుల ప్రాధమిక అవసరాలు తీరుస్తాయి.
- సమాచార హక్కు చట్టం ( Right to Information Act ) - 12/10/2005
- ప్రజాసంస్థల నుండి సమాచారం పొందే హక్కు - సమాచార హక్కు
- గ్రామ స్థాయిలో సమాచారం పొందడానికి రుసుము లేదు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవాళ్లు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
- దరఖాస్తు చేసుకున్న 30 రోజులలోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. జీవించే హక్కు, స్వేచ్ఛకు సంబంధించినవి అయితే 48 గంటలు
- RTI Act 2005 - సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం ఇవ్వాలి. సెక్షన్ 4(4) కింద తెలుగు/హిందీ/ఆంగ్లంలో ప్రతీ పేజీ ఇవ్వాలి. సెక్షన్ 2 (జె)(ii) ప్రకారం దృవీకరించాలి
8. ఇళ్ల నిర్మాణం - పారిశుధ్యం
- పూర్వం ఇసుక, సున్నం గానుగలో వేసి బాగా తిప్పిన తర్వాత వచ్చిన మిశ్రమం ఉపయోగించి గోడలు కట్టేవాళ్ళం.
- టేకు, మద్ది, వేగిస దూలాలు ఉపయోగించేవారు. బెంగుళూరు పెంకుతో పైకప్పు వేసేవాళ్ళం.
- నేలపై తాండూరు, బేతంచర్ల బండలు వేసేవాళ్ళు.
- సిమెంట్, ఇసుక, కంకర మిశ్రమం - కాంక్రీట్
- చల్లగా ఉండడానికి పైకప్పు "ప్లాస్టర్ ఆఫ్ పారిస్" షీట్లతో సీలింగ్ చేస్తారు.
- ఇంటి పైకప్పు పై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మందులు చేసి కూరగాయలు, మొక్కలు పెంచడాన్ని "రూఫ్ గార్డెన్" అని అంటారు.
ఇటుక తయారీ దశలు :
- బంక మట్టి సేకరించడం
- బంకమట్టి బూడిదలో కలపడం
- నీటితో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేయడం
- మట్టిముద్దలు ఇటుక ఆకారంలో అచ్చు వేయడం
- పచ్చి ఇటుకలు రెండు రోజులు పాటు నానబెట్టడం
- ఎండిన ఇటుకలు బట్టీలో పేర్చి కట్టెలు, వరిపొట్టుతో కాల్చడం ( 30 రోజుల వరకు )
- ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చి తర్వాత అమ్మడం
- నేలపై పరిచే బండలు మన రాష్ట్రంలో బేతంచర్ల, తాడిపత్రి లలో లభిస్తున్నాయి.
- పెద్ద పెద్ద రాళ్లు కంకరగా చేయడానికి "క్రషర్" ఉపయోగిస్తారు.
- వేడిమి, వర్షపాతం, లభించే సామాగ్రి బట్టి ఇల్లు నిర్మిస్తారు
- అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ కురుస్తాయి. చిత్తడి వాతావరణం ఉంటుంది.
- బ్రిటీష్ వారు 1826 లో ఇక్కడ ఇండ్లు కట్టడం ప్రారంభించారు.
- చెక్కతో ఇల్లు ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. కింద వర్షం నీరు. వెళ్లే మార్గాన్ని " స్లిట్" అంటారు.
- శ్రీనగర్ లో జీలం నదిపై "డోంగా" అనే పడవ ఇల్లు కనిపిస్తాయి
- మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగుబండలు లభిస్తాయి.
- సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకులను, నల్లమల మన్యం అడవుల్లో వెదురును ఇంటి నిర్మాణానికి ఉపయోగిస్తారు.
- ఆరుబయట మలవిసర్జన వల్ల నులిపురుగులు (ఏలిక పాములు) వ్యాప్తి చెందుతాయి. వీటినే "నట్టలు" అని అంటారు
- కడుపులో నట్టలు ఉంటే "రక్తహీనత' ఏర్పడును.
- సంవత్సరానికి రెండు సార్లు కడుపులో నులిపురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి.
- మధ్యప్రదేశ్ లో బెతుల్ జిల్లాలో చిచౌలి గ్రామానికి చెందిన "అనితాబాయి" పారిశుధ్య విప్లవానికి కారకురాలైంది.
- మరుగుదొడ్డి లేని కారణంగా అత్తగారింట్లో మరుగుదొడ్డి కట్టిస్తేనే కాపురానికి వెళ్తానని చెప్పింది.
- కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్ ఈమెకు "సులబ్ శానిటేషన్ అవార్డ్" కింద 50,000 చెక్కు అందించారు
- 100% పారిశుధ్యం ఉండే గ్రామాలకు "నిర్మల్ పురష్కార్" అవార్డ్ లభిస్తుంది.
- చండీగఢ్ లో "లేక్ చంద్" అనే వ్యక్తి చెత్త సేకరించి అందమైన "రాక్ గార్డెన్" నిర్మించాడు.
9. మా ఊరు - మా చెరువు
- చెరువు నిండి "అలుగు" పారుతుంది. చెరువు నిండిన తర్వాత ఎక్కువైన నీరు పోవడానికి వీలుగా చెరువుకు ఒకవైపు అలుగు కడతారు.
- తూము - తూము దిమ్మ పైకి లాగితే చెరువు నీరు కాలువలోకి పారుతుంది. కిందికి వదిలితే నీరు వెళ్లడం ఆగుతుంది.
- కొన్ని చెరువులు ఒకదానితో ఒకటి కాలువలతో కలిపి ఉంటాయి. వర్షాకాలంలో చెరువు నిండితే నీరు కాలువ గుండా మరో చెరువు చేరుతుంది. అనంతపురంలో బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఇలాంటివే. కృష్ణ ఉభయగోదావరి జిల్లాలో ఇలాంటి చెరువులు ఉంటాయి.
రామప్ప చెరువు :
- వరంగల్ జిల్లా రామప్ప దేవాలయం దగ్గర ఉంది. ఇది మానవ నిర్మిత చెరువు.
- 13వ శతాబ్దంలో నిర్మించారు. చెరువు విస్తీర్ణం 24 చ.కి.మీ
- రామప్ప దేవాలయం శిల్పకలకు ప్రసిద్ధి.
కంభం చెరువు :
- ప్రకాశం జిల్లాలో ఉంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మానవ నిర్మిత చెరువు
- నల్లమల కొండలలో గల ఈ చెరువు 15వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు.
- పొడవు 7కి.మీ., వెడల్పు 3.5 కి.మీ గల ఈ చెరువు 10,300 ఎకరాల పొలాలకు నీరు అందిస్తుంది.
హుస్సేన్ సాగర్ :
- 1562 లో హజ్రత్ హుస్సేన్ షావలీ నిర్మించాడు.
- ఈ నది ఒడ్డున గల హైద్రాబాద్, సికింద్రాబాద్ పట్టణాలను కలుపుతూ దాని కట్టని 1946 లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్ని "ట్యాంక్ బండ్"అంటారు.
- చెరువు విస్తీర్ణం 5.7 చ.కి.మీ., 32 అడుగుల లోతు
- మరొక చెరువు పేరు - ఉస్మాన్ సాగర్. దీనిని మూసీ ఉపనది పై నిర్మించారు. దీనినే గండిపేట చెరువు అంటారు.
- చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం "సాగునీటి యాజమాన్య సంఘాలు" ఏర్పరిచింది.
- రాజస్థాన్ లో ఉదయ్ పూర్ నగరాన్ని "సిటీ ఆఫ్ లెక్స్" అంటారు.
- ఉదయ్ పూర్ లోని అన్ని సరస్సులలో "పిచోల సరస్సు" ముఖ్యమైనది. 1362 లో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత మహారాజా ఉదయసింగ్ తో అభివృద్ధి పరచబడింది.
- సరస్సు ఒడ్డున గల భవనాలలో జగ్ నివాస్, సిటీప్యాలెస్ ముఖ్యమైనవి.
10. మన ఆహారం - మన ఆరోగ్యం
- కూరగాయలు, మాంసం, చేపలుకి తగినంత ఉప్పు కలిపి ఎండపెట్టి నిలువ చేసి అవసరమైనప్పుడు వాడతారు. వీటినే "ఒరుగులు" అంటారు.
జనతా ఫ్రిజ్ :
- రెండు మట్టి లేదా సిమెంట్ తొట్టెలు వాటి మధ్య మూడునాలుగు సెంటీమీటర్ ఖాళీ ఉండేలా ఏర్పాటు చేయాలి.
- పెద్ద తొట్టెలో రెండు మూడు సెంటీమీటర్ల ఇసుక పొయ్యాలి.
- నీటితో తడిపిన జనపనార సంచి గాని మందపాటి గుద్ద గాని కప్పాలి.
- రోజులో మూడు నాలుగు సార్లు నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి.
- జనతా ఫ్రిజ్ అంటే "పేదవారి ఫ్రిజ్" అని అర్ధం
- 5 నక్షత్రాలు గుర్తు గల ఫ్రిజ్ విద్యుత్తు తక్కువగా వినియోగించుకుంటుంది.
11. ఊరు నుండి డిల్లీకి
- TIMS - TICKET ISSUING MACHINE
- ఆర్డినరీ బస్సుని "పల్లెవెలుగు" అని కూడా అంటారు.
- మన రాష్ట్రంలో బస్సులు నడిపే సంస్థ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
- పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, లగ్జరీ, గరుడ, ఇంద్ర వంటి బస్సులు నడుపుతున్నారు.
- వనిత, నవ్య క్యాట్ కార్డ్ ఉన్నవారికి ప్రయాణ ధరలో 10% రాయితీ ఇస్తారు.
- టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. అందుకు 500/- వరకూ జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష లేదా రెండూ వేయవచ్చు.
- సిగ్నల్స్ : ఎర్రలైట్ - ఆగడం, ఆరంజ్ - సిద్ధంగా ఉండడం, పచ్చ - వెళ్లడం
- "జీబ్రా క్రాసింగ్" ఉన్న చోట పాదచారులు రోడ్డు దాటాలి.
- వాహనాలు నెమ్మదిగా వెళ్ళవలసిన చోట "స్పీడ్ బ్రేకర్" అమరుస్తారు.
- రైళ్లలో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తి - టి.సి
- మన రాష్ట్రంలో రైళ్ళు నిర్వహించేది - దక్షిణ మధ్య రైల్వే
- ముందుగా సీట్లు పొందడానికి రిజర్వేషన్, తత్కాల్ ద్వారా కూడా టికెట్లు ఇస్తారు. ముసలివాళ్లకు, వికలాంగులకు రాయితీ ఉంటుంది.
- రైళ్లు జాతీయ సమైక్యతను చాటి చెబుతాయి.
- రైల్వే సిగ్నల్స్ : ఎర్రలైట్ - ఆగడం, పచ్చ లైట్ - వెళ్లడం
12. భారతదేశ చరిత్ర - సంస్కృతి
- జరిగిపోయిన అనేక విషయాలు గూర్చి తెలిపేది - చరిత్ర
- ఆదిమానవులు సంచార జీవనం చేసేవారు. కొండ గుహలలో, చెట్ల తొర్రలలో నివసించేవారు. పచ్చి మాంసం తినేవారు.
- నిప్పు కనిపెట్టిన తర్వాత ఆహారం కాల్చి తినడం నేర్చుకున్నారు.
- తర్వాత వ్యవసాయం చేయడం ప్రారంభించారు.
- అనగా "ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నారు.
- చక్రం కనుగొన్న తర్వాత మానవ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి.
భారతదేశ చరిత్ర :
- చరిత్ర తెలుసుకోవడానికి పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరుపుతారు.
- 1922 - సర్ జాన్ మార్షల్ - సింధూ నది ప్రాంతంలో తవ్వకాలు. ఈ తవ్వకాలలో "హారప్ప నాగరికత" బయటపడింది.
- హారప్ప ప్రజల ముఖ్య వృత్తి - వ్యవసాయం. గోధుమ, వరి, బార్లీ ప్రధాన ఆహార పంటలు.
- రాగి, సీసం, తగరం లోహాలతో వీరు వస్తువులు తయారు చేసేవాళ్ళు.
- పచ్చిమాసియా, ఈజిప్టు దేశాలతో వర్తకం చేసేవారు.
- ప్రధాన రేవుపట్నం - లోథాల్, లిపి - బొమ్మలతో కూడినది.
- వీరు ప్రధానంగా అమ్మతల్లి, పశుపతిని పూజించేవారు.
- చరిత్ర తెలుసుకోవడానికి తవ్వకాలలో పాటు కట్టడాలు, నిర్మాణాలు, వస్తు ప్రదర్శన శాలలు, శాసనాలు, గ్రంధాలు ఉపయోగపడతాయి.
- పురాతన కాలం నాటి అవశేషాలను సేకరించి ఒకచోట భద్రపరుస్తారు. వీటిని "చారిత్రక మ్యూజియం" అంటారు.
- గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుకోవడానికి "గిరిజన ప్రదర్శన శాల" శ్రీశైలంలో ఉంది.
- సాలర్ జంగ్ మ్యూజియం - హైదరాబాద్
సంస్కృతి :
- మనం ధరించే దుస్తులు, మాట్లాడే భాష, పండుగలు, ఉత్సవాలు, పండించే పంటలు, తినే ఆహారం, ఆడే ఆటలు, పాడే పాటలు, మొదలైనవి మన సంస్కృతిని తెలిపే అంశాలు.
- జీవవైవిద్యానికి ప్రాధాన్యత ఇచ్చేలా మన సంస్కృతి ఉండడం మన దేశానికే గర్వకారణం.
భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టడాలు :
సారనాధ్ స్థూపం
- అశోకుడు నిర్మించాడు. ఉత్తరప్రదేశ్ లో వారణాసి దగ్గర సారనాధ్ లో ఉంది.
- ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని "స్థూపం" అంటారు.
ఆశోకుని స్తంభం
- నిలువుగా ఉన్న రాతి స్తంభం. దీనిపై నాలుగు వైపులా నాలుగు సింహాలు ఉన్నట్లు ఉంటుంది.
- దీనిలో "రాజస్థాన్" శిల్పకళ ఉంటుంది.
- వారణాసి సమీపంలో "చూనార్" నుండి తవ్వి తీసిన ఇసుకరాయితో దీన్ని నిర్మించారు.
అమరావతి స్థూపం
- ఇది భౌద్ధమత స్మారక నిర్మాణం. శాతవాహనుల నిర్మించారు.
- గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది.
కుతుబ్ మీనార్
- ఢిల్లీలో ఉంది. దీని ఎత్తు - 225 మీ.
- దీనిని కుతుబద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్ టుట్ మిస్ పూర్తి చేశాడు.
ఎర్రకోట
- ఢిల్లీలో ఉంది. ఎర్రరాయితో నిర్మించారు.
- ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండూ స్పష్టంగా కనిపిస్తాయి.
చార్మినార్
- హైదరాబాదులో ఉంది. ఎత్తు - 58 మీ.
- దీనిపై నాలుగు వైపులా నాలుగు స్తంభాలు ఉంటాయి. 1591 లో నిర్మించారు.
వేయి స్తంభాల గుడి
- తెలంగాణ రాష్ట్రం వరంగల్ లో ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం.
భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖులు :
మౌర్యులు
- మౌర్య సామ్రాజ్య స్థాపకుడు - చంద్ర గుప్తుడు. ఇతని మనవడు అశోకుడు
- అశోకుడు కళింగ యుద్ధం తర్వాత భౌద్ధమతం స్వీకరించాడు. భౌద్ధమత వ్యాప్తికి కృషి చేశాడు.
- జాతీయ పతాకం మధ్యలో "ధర్మ చక్రం" అశోకుడు నిర్మించిన సారనాధ్ స్థూపం నుండి తీసుకున్నది.
శాతవాహనుల
- శాతవాహన వంశ స్థాపకుడు - శ్రీముఖుడు
- వీరు సుమారు 400 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలను పరిపాలించారు.
- శాతవాహన రాజు అయిన హాలుడు "గథా సప్తసతి" గ్రంధం రాసాడు.
- వీరిలో గొప్పవాడు - గౌతమీ పుత్ర శాతకర్ణి
- వీరి కాలంలో నాగార్జున కొండ వద్ద విశ్వవిద్యాలయం ఉండేది.
గుప్తులు
- గుప్త సామ్రాజ్య స్థాపకుడు - శ్రీగుప్తుడు (క్రీ. పూ. 320)
- చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు" అనే కవులు ఉండేవారు.వీరిలో కాళిదాసు గొప్పవాడు.
- ఎల్లోరా గుహలు వీరికాలంలోనే నిర్మించబడ్డాయి.
విజయనగర రాజులు
- వీరిలో శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు. 1509 నుండి 1529 వరకు పరిపాలించారు.
- ఇతని ఆస్థానంలో "అష్ట దిగ్గజాలు" అనే కవులు ఉండేవారు.
- ఈయన "ఆముక్తమాల్యద" అను గ్రంధం రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఈయనే.
కాకతీయులు
- వీరిలో గణపతి దేవుడు, ఈయన కుమార్తె రుద్రమ దేవి ప్రసిద్ధి చెందారు.
- వీరి కాలంలోనే వరంగల్ కోట, వేయిస్థంబాల గుడి, రామప్ప దేవాలయం, పాకాల వంటి చెరువులు నిర్మించారు.
మొఘలులు
- వీరిలో అక్బర్ ప్రముఖుడు. మహమ్మదీయుడైన పరమత సహనం కలిగినవాడు
మరాఠాలు
- మొఘలులని ఎదిరించి మరాఠా సామ్రాజ్యం స్థాపించిన గొప్ప వీరుడు "శివాజీ"
- శివాజీ గురువు "సమర్ధ రామదాసు". తుకారం అనే భక్తుడు ఈయన కాలంలోని వాడే
Prepared By : A.B.Rao