Ticker

6/recent/ticker-posts

5వ తరగతి తెలుగు (భాగం 1)

1. స్వతంత్రోత్సవం
  • శ్రీ వేదుల సత్యన్నారాయణ శాస్త్రి గారు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా "భారత విజయాన్ని చాటండి" అని పాడిన గేయం  
  • సవిత్రి - తల్లి, మాత
  • లాల్ ఖిల్లా - ఎర్రకోట
  • త్రివర్ణ కేతనం - మూడు రంగుల జెండా
  • పిశాచ దాస్యం - బానిసత్వం
  • ఆనంద బాష్పాలు - ఆనందంతో కూడిన కన్నీళ్లు
  •  సమీకరించారు - ఒకటిగా చేశారు
  • హిమాద్రి - హిమాలయాలు
  • పోరు - యుద్ధం






2. సహవాసం
  • చెవులు కోరుక్కోవడం - గుసగుసలాడు
  • మరీ ఎక్కువ మాట్లాడేవారు - వాగుడుకాయ
  • అనర్గళంగా మాట్లాడేవారు - వక్త
  • తక్కువగా మాట్లాడేవారు - మితభాషి
  • హేళన చేయడం - ఎగతాళి
  • తన గురించి ఎక్కువ చేసి చెప్పుకోవడం - గొప్పలు చెప్పుకోవడం
  • మాటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించడం - మాటకారి
  • ముద్దు ముద్దు మాటలు - చిలక పలుకులు







3. త్రిలింగాలు
  • శ్రీశైలం, దాక్షారామం, కాళేశ్వరం అనేవి మూడు ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. ఈ మూడింటిని "త్రిలింగాలు" అంటారు.
  • వీటి మధ్య విస్తరించి ఉన్న ప్రాంతం - త్రిలింగ దేశం
శ్రీశైలం :
  • ఇది కర్నూల్ జిల్లాలో ఉంది. 
  • ఈ క్షేత్రంలో భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ప్రారంభంలో "సాక్షి గణపతి" దేవాలయం ఉంది.
  • ఈ ఆలయానికి తూర్పున త్రిపురాంతకం, పడమరన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణాన సిద్ధవటం ఉన్నాయి.
  • మల్లికార్జున స్వామికి ఎడమవైపు పార్వతీ దేవి ఆలయం, వెనుక భ్రమరాంబ ఆలయం ఉన్నాయి.
  • భ్రమరాంబ దేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
  • ఈ క్షేత్రానికి దిగువ రెండు కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ప్రవహిస్తుంది. దీనిని "పాతాళగంగా" అంటారు.
  • ఈ క్షేత్రంలో పాలధార, పంచధార ప్రవహిస్తూ ఉంటాయి.
  • ఈ ఆలయంలో సంక్రాంతి నాడు పార్వతీ కళ్యాణం, శివరాత్రి నాడు భ్రమరాంబ కళ్యాణం లింగోద్భవం గొప్పగా జరుపుతారు.
దాక్షారామం :
  • ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది.
  • ఇక్కడ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ విలసిల్లుతున్నారు.
  • దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడని అందుకే దాక్షారామం అని పేరు వచ్చిందని ప్రతీతి.
  • దాక్షారామం గురించి తెలుపుతూ శ్రీనాదుడు రాసిన కావ్యం - భీమఖండం. దుష్యంతుడు, భరతుడు, నలుడు ఈ స్వామిని అర్చించారని ఈ కావ్యంలో ఉంది.
  • ఈ ఆలయం రెండు అంతస్తులతో ఉంది. ఇక్కడ శివలింగం ఎత్తు - 15 అడుగులు  
  • ఇది పాలరాతి లింగం. సగం నలుపు, సగం తెలుపు రంగులో ఉంటుంది.
  • గుడిలో 400 వరకు శాసనాలు ఉన్నాయి.
  • గుడి ముందు ఉన్న చెరువును "సప్తగోదావరం" అంటారు.
  • కాశీ క్షేత్రం వదిలిన తర్వాత వ్యాసుడు, అగస్త్యుడు అనే ఋషులు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు.
  • దాక్షారామం పంచారామలలో ఒకటి.
  • పంచారామాలు - అమరారామం(అమరావతి -గుంటూరు), భీమారామం(భీమవరం - పశ్చిమ గోదావరి), క్షీరారామం(పాలకొల్లు - పశ్చిమ గోదావరి), దాక్షారామం(తూర్పు గోదావరి), కుమారారామం(సామర్లకోట - తూర్పు గోదావరి)
కాళేశ్వరం :
  • ఇది తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉంది.
  • ఇది ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమ స్థలంలో గల పవిత్ర క్షేత్రం.
  • ఆలయంలో ఒకే పానవట్టం పై కాళేశ్వర లింగం, ముక్తీశ్వర లింగం ఉన్నాయి. మొదట కాళేశ్వరుని, తర్వాత ముక్తీశ్వరుని పూజించాలి.
  • ఇక్కడ ఉన్న ఆలయాలు - విజయగణపతి ఆలయం, వెంకటేశ్వర ఆలయం, సరస్వతీ ఆలయం, బిందుమాధవ ఆలయం,వీరభద్రేశ్వర ఆలయం
  • దగ్గర్లోని అడవిలో ఆదిముక్తీశ్వర ఆలయం ఉంది. గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో సంగమేశ్వర ఆలయం ఉంది.
  • కరీంనగర్ జిల్లాలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, మంథని వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.






4. మా తోట
  • శివ కధల పుస్తకం చదివాడు - జరిగిపోయిన పని
  • శివ కధల పుస్తకం చదువుతూ ఉన్నాడు - జరుగుతున్న పని
  • శివ కధల పుస్తకం చదువుతాడు - జరగబోయే పని
  • వాక్యాలలో "కాలం" బట్టి క్రియలు మారుతూ ఉంటాయి.
శిబి చక్రవర్తి
  • శిబి చక్రవర్తి ఔదార్యం పరీక్షించడానికి ఇంద్రుడు "డేగ" రూపంలో, అగ్నిదేవుడు "పావురం" రూపంలో వచ్చారు.
  • శ్యేనం - డేగ






5. గోపి డప్పు కధ
  • కర్రచక్రం - రొట్టె - మట్టి పాత్ర - పాత కంబలి - గుర్రం - డప్పు
అర్ధాలు
  • బిడ్డ - కొడుకు
  • కంబలి - దుప్పటి
  • బట్టలు - దుస్తులు
  • చెట్టు - వృక్షం
  • డప్పు కొట్టుకుంటూ - డప్పు వాయిస్తూ
  •  ఒక హల్లుకు వేరే హాల్లు ఒత్తుగా వస్తే - సంయుక్తాక్షరాలు
  • పాప వచ్చి భోజనం చేసింది - భూతకాల క్రియాపదం
  • పాప వచ్చి భోజనం చేస్తూ ఉంది - వర్తమాన కాల క్రియాపదం
  • పాప వచ్చి భోజనం చేస్తుంది - భవిష్యత్ కాల క్రియాపదం







6. అన్నం
  • ఒక సర్వే లో "మన దేశంలో జరిగే వేడుకల్లో 20% వండిన ఆహారం వృధాగా పడేస్తున్నారు" అని తేలింది.
  • "ఎవరు" అనే పదానికి సమాధానంగా వచ్చే పదాలను "కర్త" అంటారు.
  • ఎవరిని, దేనిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలు "కర్మ" అంటారు.


7. జాతీయ జెండా


  • స్వాతంత్య్రం - వర్ధిల్లాలి అనే నినాదంతో బీహార్ కళాశాల విద్యార్థులు పతాకం చేతబూని ఊరేగింపు చేస్తున్నారు. ఈ ఊరేగింపులో పోలీసుల కాల్పులలో చనిపోయిన వ్యక్తి - జగపతి రామానంద్
  • అలహాబాద్ లో "లాల్ బహదూర్ శాస్త్రి" గారు స్త్రీ వేషధారణలో జెండా ఎగురవేశారు.
జాతీయ పతకాలు :
  • 1905 లో వివేకానంద శిష్యురాలు అయిన సిస్టర్ నివేదిత ఒక పతాకం రూపకల్పన చేశారు.
  • తొలిసారిగా 1906 ఆగస్ట్ 07 న కోల్ కత్తాలో పార్శీబాగాన్ వద్ద జెండా ఎగురవేశారు.
  • తర్వాత 1907 ఆగస్ట్ 22 న జర్మనీ స్టెడ్ గార్డ్ లో జరిగిన రెండవ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో "మేడం బిక్కజి రూస్టం కామా" జాతీయ జెండా ఎగురవేశారు.
  • చాలా మార్పులకు లోనైన మూడో పతాకం 1917 లో రూపొందించారు. దీన్ని అనిబిసెంట్, తిలక్ లు ఎగురవేశారు.
  • 1921 మార్చ్ 31 న విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీ సూచన మేర "పింగళి వెంకయ్య" గారు ఒక పతాకం రూపొందించారు.
  •     1931 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో జెండా స్వరూపం నిర్ణయించారు.
  • కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం గుర్తుతో రూపొందించిన జెండాను 1931 ఆగస్ట్ 06 న భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించింది.
  • పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాకు1947 జులై 22 న ఆమోద ముద్ర వేశారు.
  • మధ్యలో రాట్నానికి బదులు "ధర్మచక్రం" ఉంచారు.
  • దీనిని తొలిసారి ఆవిష్కరించింది - జవహర్ లాల్ నెహ్రు
  • కాషాయం రంగు ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి భూమికి సంకేతం
  • మధ్యలో గల అశోక ధర్మ చక్రంలో 24 ఆకులు 24 గంటలకు, క్రమశిక్షణకు, ధర్మానికి, న్యాయానికి సంకేతం. సూర్యబింబానికి సూచిక.
  • జాతీయ పతాకానికి సంబంధించి కొన్ని నిబంధనలు "బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్" ఖరారు చేసింది.
  • జెండా పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండాలి. ఖాదీ లేదా చేనేత వస్త్రంతో దీనిని తయారుచేయాలి.
  • సూర్యోదయం తర్వాత జెండా ఎగురవేయాలి. సూర్యాస్తమయం లోపల జెండాను అవనతం చేయాలి.
  • పింగళి వెంకయ్య గారు "జెండా వెంకయ్య" గా ప్రసిద్ధి.
  • ఈయన 1876 ఆగస్ట్ 02 న కృష్ణ జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. తండ్రి హనుమంతరావు.
  • ఆఫ్రికాలో బోయర్లు యుద్ధంలో పాల్గొన్నారు. ఆఫ్రికాలో ఈయనకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది.
  • దేశానికి సేవ చేయడమే జీవితానికి పారితోషకం - పింగళి వెంకయ్య







8. మనసుంటే మార్గం ఉంది

  • ఒకే ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాలు - సామాన్య వాక్యాలు
  • ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉండి, ఒక సమాపక క్రియ గల వాక్యాలు - సంశ్లిష్ట వాక్యాలు
  • సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒక వాక్యంగా ఏర్పడడాన్ని "సంయుక్త వాక్యం" అని అంటారు.

Prepared By: A.B.Rao