Ticker

6/recent/ticker-posts

8వ తరగతి తెలుగు




1. అమ్మ కోసం
రచయిత : నన్నయ్య భట్టు - శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం ద్వితీయాశ్వాసం లోనిది
ప్రక్రియ - పద్యం                                                                                              ఇతివృత్తం - మాతృభక్తి, విలువలు

నేపధ్యం : కద్రువ, వినత కశ్యప ప్రజాపతి భార్యలు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వల్ల వేయిమంది కుమారులు పుట్టారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు సూర్యుని రథసారథి. వినత పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ పుత్రులకు సేవలు చేస్తూ ఉండేవాడు. మహా శక్తివంతమైన గరుత్మంతుడు తన దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు.

  




సమానార్ధక వాక్యంశాలు
అ) అనిమిషనాధ సుగుప్తమయిన యమృతము --- ఇంద్రుడు దాచి కాపాడుతూ వచ్చిన అమృతం
ఆ) ఆయత పక్షతుండ --- పెద్ద రెక్కలున్నవాడ్ని
ఇ) నీ వంటి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే ? --- నీవంటి ఉత్తమ కుమారుణ్ణి పొంది కూడా దాసీగానే  ఉండనా ?

కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు
అ) మా యీ దాస్యము వాయు నుపాయము సేయుండు --- గరుత్మంతుడు కద్రువ పుత్రులతో
ఆ) నీ కతమున నా దాస్యము ప్రాకటముగ బాయునని --- వినత గరుత్మంతునితో
ఇ) నీదయిన దాస్యము వాపికొనంగ నీకు జిత్తము గలదేని --- కద్రువ పుత్రులు గరుత్మంతునితో
ఈ) దినకరపవనాగ్ని తుహినదీప్తుల కరిగాన్ --- గరుత్మంతుడు కద్రువ పుత్రులతో

పర్యాయపదాలు :




నభము - ఆకాశం, గగనం, అంబరం                                                              విపినం - అడవి, అరణ్యం, వనం 
వారిదము - మేఘము, మబ్బు, అబ్రము                                                       పన్నగము - పాము, ఫణి, సర్పము  
కులిశము - పిడుగు, ఆశని, నిర్ఘతము                                                           పతంగుడు - సూర్యుడు, రవి, భానుడు

సామాన్య వాక్యాలు --- సంశ్లిస్ట వాక్యాలు
అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది --- జ) విమల వంట చేస్తూ పాటలు వింటుంది
ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది --- జ) అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది
ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడిపండ్లు తెచ్చాడు --- జ) రవి ఊరికి వెళ్లి మామిడిపండ్లు తెచ్చాడు

సంశ్లిష్ట వాక్యాలు --- సామాన్య వాక్యాలు
అ) తాత భారతం చదివి నిద్ర పోయాడు --- జ) తాత భారతం చదివాడు. తాత నిద్ర పోయాడు
ఆ) చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి --- జ) చెట్లు పూత పూస్తాయి. చెట్లు కాయలు కాస్తాయి
ఇ) రాము నడుచుకుంటూ వెళ్లి తన ఊరు చేరుకున్నాడు --- జ) రాము నడుచుకుంటూ వెళ్ళాడు. రాము తన ఊరు చేరుకున్నాడు.


సంధులు :
ఔరౌర - ఔర + ఔర                                                                                 మొదట + మొదట - మొట్టమొదట 




దధ్యోధనము - దధి + ఓధనము                                                             దేవ + ఐశ్వర్యం - దేవైశ్వర్యం 
ప్రధమైక - ప్రధమ + ఏక                                                                         దేశ + ఔన్నత్యం - దేశౌన్నత్యం 
చిట్టచివర - చివర + చివర                                                                     కడ + కడ - కట్టకడ 
అత్యుగ్రము - అతి + ఉగ్రము                                                                 అతి + ఉగ్ర - అత్యుగ్ర 
అమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది
పిడుగు + పిడుగు - పిట్టపిడుగు,               బయలు + బయలు - బట్టబయలు

దేశ భాషలందు తెలుగు లెస్స - శ్రీనాదుడు "క్రీడాభిరామం" లో
దేశాభాషలందు తెలుగు లెస్స - శ్రీ కృష్ణ దేవరాయలు "ఆముక్తమాల్యద" లో





2. ఇల్లు ఆనందాల హరివిల్లు
ప్రక్రియ - వ్యాసం                                                                                                 ఇతివృత్తం - కుటుంబ విలువలు

ఉద్దేశ్యం : ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనం తలచుకుంటూ దాన్ని కాపాడుకోవాలని తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం

సామాజిక, మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో "ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్ధిక సహాయ సహకారాలు అందుకుంటూ సమాజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీపురుషులు వారి పిల్లలు ఉన్న సమూహం కుటుంబం"
"విశ్వసనీయత, సమగ్రత, ఏకత" అనే మూడు మూలస్తంబాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.
"అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారికోసమే నా జీవితం" అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.
ఆశ్రమాలు : బ్రహ్మచర్యం,    గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం,    సన్యాసాశ్రమం
ఆర్ధిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్య్రం అనే మూడు అంశాలపై "వ్యష్టి కుటుంబం" ఆధారపడి ఉంది.

1. ఇల్లు అంటే ఇలా ఉండాలి --- ప్రేమానురాగాలు నిలయం
2. వేదకాలం అంటే --- రామాయణ, భారతాల ముందు కాలం
3. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది --- భార్యాభర్తలకు సమ ప్రాధాన్యం
4. సంస్కృతి సంప్రదాయాలు ఎలా అలవడుతాయి --- కుటుంబం, పాఠశాల, సమాజం ద్వారా
5. అందరి సుఖంలో నా సుఖం ఉంది. దీనిలో గల భావన --- విశాల భావన





పాఠంలో అర్ధాలు 
పునాది - మూలకారణం
పెద్దమలుపు - మార్పుకి ముఖ్య కారణం
అవధానం - పెద్ద ఘనకార్యం
మరుగున పడడం - మూలన పడడం
కనుమరుగవడం - కంటికి కనపడకుండా పోవుట

వ్యతిరేఖ పదాలు
సహాయత - నిస్సహాయత                             ఉత్సాహం - నిరుత్సాహం 
ఐక్యత - అనైక్యత                                         ప్రాధాన్యం - అప్రాధాన్యం 
సమానత్వం - అసమానత్వం  

సామాన్య వాక్యాలు --- సంశ్లిష్ట వాక్యాలు
అ) శార్వాణి పాఠం చదివింది. శార్వాణి నిద్ర పోయింది --- జ) శార్వాణి పాఠం చదివి, నిద్ర పోయింది
ఆ) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. --- జ) మహతి ఆట ఆడి, అన్నం తిన్నది
ఇ) శ్రీనిధి జడ వేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది. --- జ) శ్రీనిధి జడ వేసుకుని, పూలు పెట్టుకుంది
ఈ) మాధవి పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది --- జ) మాధవి పాఠం చదివి, పద్యం చెప్పింది
ఉ) శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొంది --- జ) శివాని కళాశాలకు వెళ్లి, పాటల పోటీలో పాల్గొంది.
ఊ) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్లు తాగుతాడు --- జ) నారాయణ అన్నం తిని, నీళ్లు తాగుతాడు




ఋ) సుమంత్ పోటీలకు వెళ్ళాడు. సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. --- జ) సుమంత్ పోటీలకు వెళ్లి, మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు

సంశ్లిష్ట వాక్యాలు - సామాన్య వాక్యాలు
అ) శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు --- జ) శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు.
ఆ) కందుకూరి రచనలు చేసి సంఘసంస్కరణ చేసాడు --- జ) కందుకూరి రచనలు చేసాడు. కందుకూరి సంఘసంస్కరణ చేసాడు
ఇ) రంగడు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చాడు --- జ) రంగడు అడవికి వెళ్ళాడు. రంగడు కట్టెలు తెచ్చాడు
ఈ) నీలిమ టీవీ చూసి నిద్ర పోయింది --- జ) నీలిమ టీవీ చూసింది. నీలిమ నిద్ర పోయింది
ఉ) రజియా పాట పాడుతూ ఆడుకుంటున్నది --- జ) రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది

సంయుక్త వాక్యాలు :
రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడడాన్ని సంయుక్త వాక్యం అంటారు




ఉదా : విమల తెలివైనది. విమల అందమైనది --- విమల తెలివైనది, అందమైనది
వనజ చురుకైనది. వనజ అందమైనది --- వనజ చురుకైనది, అందమైనది ( రెండు నామపదాల్లో ఒకటి లోపించడం )
అజిత అక్క. శైలజ చెల్లెలు --- అజిత, శైలజ అక్కాచెల్లెళ్ళు (రెండు నామపదాలు ఒకచోట చేరి బహువచనం వచ్చింది)
ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ? --- ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? ( రెండు సర్వనామాల్లో ఒకటి లోపించడం )
3. హద్దులు హద్దులు
రచయిత : నండూరి సుబ్బారావు
ప్రక్రియ - కధ                                                                                                                       ఇతివృత్తం - హాస్యం

పాత్రలు : అత్తగారు, మామగారు, మరిది, అల్లుడు, డాక్టర్
షడ్డకుడు - అల్లుడు
4. నీతి పరిమళాలు
ప్రక్రియ - పద్యం                                                                                                       ఇతివృత్తం - నైతిక విలువలు

ఉద్దేశ్యం : శతక పద్యాలు సమాజ పోకడలు తెలుపుతాయి. మనిషి ఎలా జీవించాలో చెబుతాయి. వీటి ద్వారా విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం

తనకు ఫలంబు లేదని ------------------------ భాస్కరా!                                                                          చంపకమాల
చదువది యెంతగల్గిన ----------------------- భాస్కరా!                                                                           చంపకమాల




భూషలు గావు మర్త్యులకు ---------------------------- నశియించు నన్నియున్                                           ఉత్పలమాల
వనకరి చిక్కే మైనసకు ----------------------------- దాశరధీ కరుణాపయోనిధీ!                                           చంపకమాల
క్షమను కడక -------------------------------------------------------   క్షములు వారు ఆటవెలది
ఊరూరం జనులెల్ల ---------------------------------------------- శ్రీకాళహస్తీశ్వరా!                                            శార్దూలం
దుష్టు సూర్యుని దెస ---------------------------------------- కొనుగాక దాని కేమి                                            సీసం
యెదిరి సత్త్వంబు -------------------------------------------------------  వెంకటేశా! తేటగీతి
చదువు జీర్ణమైన ------------------------------------------------------- వినర మిత్ర                                            ఆటవెలది

ఇంద్రియ చాపలత్వం - దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచి ఆశించి చేప, సంగీతానికి లొంగి పాము, అందానికి బానిసై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి

పాఠంలో పదాలు :
రసజ్ఞత - ఉప్పు




అవివేకం - ఎదుటి వాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగడం
వాక్కు - అలంకారం
క్షమ అనే పదానికి అర్ధాలు - ఓరిమి, భూమి, సహనం, సమర్థులు
అర్ధాలు - హృదయం - డెందము,     ఎద - చిత్తాలు, చిచ్చు - వహ్ని, అగ్ని

వ్యతిరేక పదాలు
కీర్తి - అపకీర్తి,     నిస్సారం - సారం, అహితం - హితం,     ఫలం - నిస్ఫలం

సంధులు
చాలకున్న - చాలక + ఉన్న                (అత్వ సంధి)
అదేమిటి - అది + ఏమిటి                  (ఇత్వ సంధి)
వెళ్లాలని - వెళ్ళాలి + అని.                 (ఇత్వ సంధి)
ఒకింత - ఒక + ఇంత                         (అత్వ సంధి)

"న" కారాన్ని ద్రుతం అంటారు. పదం చివర న కారం గల పదాలను "ద్రుత ప్రకృతికాలు" అంటారు.
ఉదా : పూచెను, వచ్చెను, తినెను, చూచెను, ఉండెను మొదలైనవి.

అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసేన్ + టక్కు = చేసేన్ + డక్కు
ద్రుత ప్రకృతికానికి క పరమైతే గ, చ పరమైతే జ, ట పరమైతే డ ఆదేశంగా వస్తాయి.
క, చ, ట, త, ప లకు పరుషాలు అని, గ, జ, డ, ద, బ లకు సరళాలు అని అంటారు.
"ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి. ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి.

ఛందస్సు 




ఏకాక్షర గణాలు : గురువు 'U', లఘువు 'I'
రెండక్షర గణాలు : ఒక గురువు, ఒక లఘువు - గలం / హ ( UI )
                           ఒక లఘువు, ఒక గురువు - లగం / వ ( IU )
                           రెండు గురువులు - గగం ( UU )
                           రెండు లఘువులు - లలం ( II )
మూడక్షర గణాలు : 




ఆది గురువు - భ గణం ( UII ).                   ఆది లఘువు - య గణం ( IUU )
మధ్య గురువు - జ గణం ( IUI )                    మధ్య లఘువు - ర గణం ( UIU )
అంత్య గురువు - స గణం ( IIU )                   అంత్య లఘువు - త గణం ( UUI )  
సర్వ గురువు - మ గణం ( UUU )                  సర్వ లఘువు - న గణం ( III )