సూక్ష్మదర్శిని - సూక్ష్మజీవులు ఆవిష్కరణ :
- 1674 లో సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. ల్యువెన్ హుక్ కుంట నీటిని భూతద్దంలో నిశితంగా పరిశీలించి సూక్ష్మజీవులు ఆవిష్కరణకు నాంది పలికాడు.
- ల్యువెన్ హుక్ ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శినిని తయారుచేశాడు. అది వస్తువుని 300 రెట్లు పెద్దది చేసి చూపగలిగింది.
- 1678 లో జరిపిన ఈ పరిశీలనలు సూక్ష్మజీవులు కనుకోవడానికి తోడ్పడ్డాయి.
- వీటిని "ఎనిమల్ క్యూల్స్" అని పిలిచాడు. తర్వాత వీటికి బాక్టీరియా అని పేరు పెట్టారు.
- సూక్ష్మజీవులు మనం కంటితో చూడలేము. కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం.
- బాక్టీరియా - కోకస్, బాసిల్లస్, లాక్టోబాసిల్లస్
- శైవలాలు - క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్స్, స్పైరులీనా, ఈడోగోనియం, సెరాటియం
- శీలింధ్రాలు - పెన్సిలిన్, బ్రెడ్ మోల్డ్, రైజోపస్, ఆస్పరజిల్లాస్,
- ప్రోటోజావా - అమీబా, పెరమీషియం, వర్దిషెట్ల
- సూక్ష్మ ఆర్డ్రోపోడా - సైక్లాప్స్, డాఫ్నియా, గజ్జిక్రిమి, కనురెప్ప క్రిమి
- చెట్ల కాండం పైన తెల్లని మచ్చలు శీలింధ్రాలు వల్ల ఏర్పడతాయి.
- బాక్టీరియా అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవిస్తాయి.
- 1999 లో హైడ్.యన్. సూల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్రతీర ప్రాంతంలో "థియోమార్గరీట నమీబియాన్సిస్" అనే బాక్టీరియా కనుకొన్నాడు. ఇది 0.75mm పొడవు ఉంటుంది. దీన్ని మనం కంటితో చూడవచ్చు.
- నీటిలో పెరిగే శైవలాలు వల్ల నీటికి పచ్చదనం వస్తుంది. స్పైరోగైరా, ఖారా లాంటి శైవలాలు మనం కంటితో చూడవచ్చు.
- సూక్ష్మ శైవలాలు(మైక్రో ఆల్జే) జరిపే కిరణజన్యసంయోగ క్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం. ప్రాణవాయువులో సగం ఇవే ఉత్పత్తి చేస్తాయి.
- నేల సారం పెంచడానికి కొన్ని రకాల మైక్రో ఆర్డ్రోపోడా జీవులు అవసరం. ఇవి జీవ పదార్ధం కుళ్ళిపోయేలా చేస్తాయి.
- కొన్ని సూక్ష్మ ఆర్డ్రోపోడాలు మన చర్మం పై, కనురెప్పలుపై, పరుపులో, దుప్పట్లలో, మొదలైన ప్రదేశాలలో ఉంటాయి.
- కొన్ని మైక్రో ఆర్డ్రోపోడా జీవులు స్కాబిస్(గజ్జి) లాంటి చర్మవ్యాధులు కలిగిస్తాయి.
- మైక్రో ఆర్డ్రోపోడా లను "కీళ్లు గల కాళ్ళున్న జీవులు" అంటాం.
- ఒక ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందంలో పై పొరలో బాక్టీరియా, శీలింధ్రాలు 5 1/2 టన్నుల వరకు ఉంటాయి.
- వైరస్ సజీవ కణం బయట నిర్జీవి గాను, అతిథేయి కణాలలో సజీవులుగా ప్రవర్తిస్తాయి.
- పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, ఎయిడ్స్ వంటివి వైరస్ వల్ల కలిగే వ్యాధులు.
- టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయేరియా లాంటి జబ్బులు బాక్టీరియా వల్ల కలుగుతాయి.
- అమీబియాసిస్ లాంటి వ్యాధులు ప్రోటోజావాల వల్ల వస్తాయి.
Prepared by: A.B.Rao