Ticker

6/recent/ticker-posts

*జీవిత ధ్యేయం*






జీవితం,పాఠం
నేర్పతూంది, ప్రతి నిత్యం ఓ వైవిధ్యం, 
అనుకూలంగానె.

ప్రజానుకూలంగ
మార్చుకోవడం నీ బాధ్యత, మరవొద్దు,
ప్రతి అడుగు నీదే.

నీకు నీవు మారు
నిన్నెవరు మార్చలేరనుటయె సత్యం
ఆత్మ పరిశోధనె

గెలుపోటములన్నీ-
నీ చేతుల్లోనే,ధర్మ బద్దమైతే 
నీకెదురెవరంట? 





నిరాశా నిస్పృహ- 
లమయం కాకూడదు జీవిత ధ్యేయం, 
ధైర్యంగా వుంటె

ఓటమిని తొలి మెట్టు-
గా,మలుచుకో, నేర్చుకున్న పాఠంతో.  
సరిదిద్దుకో లోటు

తప్పునొప్పుకుంటె,
అడుగు ముందుకే సాగుతూవుంటుంది,
నిత్య సత్యమిదే

నిన్ను నువ్వు దిద్దుకొ,
మనశ్శాంతిని, నీకు నువ్వు నింపుకో,
నీకు నువ్వే సాటి.

ఆశామయంగా, 
ఆత్మీయంగా, ఆనందంగానే, 
ఆలోచిస్తూనే





నువ్వు అద్భుతంగా,
జీవితాన్ని గడపవచ్చు తృప్తిగాను,
సుఖమయంగానూ! 
(జి రామమోహన నాయుడు -మాజీ సైని కుడు,మదనపల్లె రచయితల సంఘం )