నాది నాదనే ఆరాటం పెరుగుతోంది మనుషుల్లో ఎందు కోసం
కూడబెడుతున్నావు ధనం ధర్మాన్ని మరచి నా అన్నవారికోసం
కొందరికి శాపంగా మారుతుంది నీలోభం
మరిచి ప్రవర్తిస్తుంటే ధర్మం సత్యం
మరికొందరికి స్వేచ్చగా మారుతుంది నీ
వ్యామోహం విస్మరిస్తుంటే న్యాయం
అవినీతి అన్యాయం నా అస్త్రశస్త్రాలు
నన్నెదిరించలేదీ చట్టమంటావు
నీతి నిజాయతనే అద్దాన్ని పగలగొడు
తుంది కూడబెట్టన ధనమంటావు
ఓ మనిషి ఎందుకు ఈ అధర్మంపై పను
లు ఎదుటివారు మనిషులే కదా
ఓ మనిషి ఆలోచించవా స్వార్థాన్ని అధ
ర్మాన్ని కుటిలత్వాన్ని వదలవా
పొయ్యే కాలం దగ్గరుంది ఆలోచించుకో
ఈ జన్మ మరొస్తుందో రాదో
ఈ జన్మ అత్యంత దుర్లభం ఆలోచించు కో పాపకర్మాలు వదులుకో
(జి రామమోహన నాయుడు మాజీ సైని కుడు,మదనపల్లె రచయితల సంఘం )