’Jul 10 2020 @ 03:54AM
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ పోస్టు ఎంపికకు ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. వీసీ పోస్టుకు తగిన అర్హతలు కలిగిన ముగ్గురు వ్యక్తులను కమిటీ ఎంపిక చేయనున్నది. ఈ పోస్టుకు 27 మంది పోటీ పడుతున్నారు. అందులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. విశ్వవిద్యాలయంలో గతంలో పని చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న పలువురు అధికారులు వీసీ పోస్టుకు దరఖాస్తు చేసినట్లు సమాచారం.