❇️నవోదయ విద్యాలయ సమితి (హైదరాబాద్ రీజియన్) టీచర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తాత్కాలిక ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ, క్రియేటివ్ టీచర్ల నియామకాలు చేపట్టనున్నారు.
❇️తెలుగు రాష్ట్రాలు సహా యానాం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు 2020-21 విద్యా సంవత్సరానికి పని చేయాలి.
🍁ఖాళీల వివరాలు
❇️మొత్తం 166 ఖాళీలు ప్రకటించారు. వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 52, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 62, క్రియేటివ్ టీచర్లు 27, ఫ్యాకల్టీ కం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ 25 ఖాళీలు ఉన్నాయి.
• ❇️పీజీటీ ఖాళీలు: హిందీ 9, ఇంగ్లీషు 6, మేడ్స్ 1, ఫిజిక్స్ 9, కెమిస్ట్రీ 8, కామర్స్ 3, జాగ్రఫీ 4, హిస్టరీ 5, ఎకనామిక్స్ 2, కంప్యూటర్ సైన్స్ 5.
• ❇️టీజీటీ ఖాళీలు: హిందీ 23, ఇంగ్లీషు 18, మేడ్స్ 6, సైన్స్ 3, సోషల్ 12, తెలుగు 6.
❇️క్రియేటివ్ ఖాళీలు: ఆర్ట్ 4, మ్యూజిక్ 1, పీఈటీ మేల్ 8, పీఈటీ ఫీమేల్ 5, లైబ్రేరియన్ 3.
🍁అర్హత వివరాలు
❇️పీజీటీలకు బీఎడ్ తోపాటు 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
❇️టీజీటీలు, క్రియేటివ్ టీచర్లకు 50 శాతం మార్కులతో సంబంధిత డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. సీటెట్ అర్హత పొందినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
• ఎఫెసీఎస్ఏలకు కంప్యూటర్ అప్లికేషన్స్ లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉండాలి.
❇️కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసినవారు; బీసీఏ, ఎంసీఏ అభ్యర్థులు కూడా అర్హులే.
• ఇంగ్లీషు, హిందీతోపాటు ప్రాంతీయ భాషలు తెలిసి ఉండాలి.
• ఆగస్టు 31 నాటికి 65 ఏళ్లలోపు ఉండాలి.
🍁ముఖ్య సమాచారం
• వెబ్ సైట్:navodaya.gov.in
• దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 17