Ticker

6/recent/ticker-posts

స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో పిల్లలకు ఎడిట్ ఆప్షన్...!



*స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో పిల్లలకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగినది.*

•    ముఖ్యంగా గమనించాల్సిన అంశం సిండికేట్ బ్యాంకు (ప్రస్తుతం కెనరా బ్యాంక్) ,ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) IFSC కోడ్ లు మారి ఉన్నవి.

•    కావున సిండికేట్ బ్యాంక్ మరియు ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ కలిగిన పిల్లల తల్లులు యొక్క IFSC కోడ్ లను స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో మీరు ఖచ్చితంగా మార్చవలసిన అవసరం ఉన్నది.

•    మీరు ఒకసారి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఎడిట్ కి వెళితే caste  ఎంచుకోవాల్సి ఉంటుంది.

•    2 3 4 5 తరగతుల పిల్లలకు తండ్రి పేరు, తండ్రి ఆధార్ నెంబర్, తండ్రి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

•    తల్లిదండ్రులు లేని పిల్లలకు orphan ఎంచుకుని గార్డియన్ వివరాలను ఇవ్వవలసి ఉంటుంది.

•   తల్లి ఉండి తండ్రి లేని వారు (semi orphan without father) ఎంచుకోవాల్సి ఉంటుంది.

•    తండ్రి ఉండి తల్లి లేని వారు (semi orphan without mother) ఎంచుకోవాల్సి ఉంటుంది.

•    దానితో పాటు బ్యాంకు IFSC కోడ్ (సిండికేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు వాళ్లు)  మార్చుకోవలసి ఉంటుంది.

•    ఈ రెండు బ్యాంకుల వారు మాత్రమే కాకుండా ఇంకా ఏదైనా బ్యాంకులు విలీనం అయి ఉంటే అటువంటి వారు కూడా వారి యొక్క IFSC కోడ్ లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

•    పై వాటితో పాటు పిల్లవాడు PH నా, కాదా..?  Parent literacy status కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది.

•    కార్పొరేషన్ బ్యాంకు, గోదావరి చైతన్య బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్  బ్యాంకు ఆఫ్ ఇండియా), విజయ బ్యాంకు (ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా) ఇవి మనకున్న (మన ప్రాంతాల్లో) బ్యాంకులు మరొక బ్యాంకుల్లో కలిసినవి (merge).