Ticker

6/recent/ticker-posts

కలాం సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ( October 1-15 CA)

 

current affires in telugu

Amit Shah: నేషనల్‌ సైన్స్‌ యూనివర్సిటీకి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు?

గోవా రాష్ట్రం దక్షిణ గోవా జిల్లాలోని ధర్బండోరాలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అక్టోబర్‌ 14న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ క్యాంపస్‌కు శంకుస్థాపన చేసి, ప్రసంగించారు. 2016లో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అక్రమంగా సరిహద్దులు వచ్చి, దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు. కశ్మీర్‌లోని ఉడి ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడికి ప్రతిగా 2016 సెప్టెంబర్‌ 29వ తేదీన భారత ఆర్మీ నియంత్రణరేఖను దాటి వెళ్లి మెరుపుదాడులు చేపట్టి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు  : అక్టోబర్‌ 14
ఎవరు    : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
ఎక్కడ    : ధర్బండోరా, దక్షిణ గోవా జిల్లా, గోవా రాష్ట్రం


DRDO Chairman: కలాం సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?


కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని సాంబ జిల్లాలో ఉన్న జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ(సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ)లో కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) ఏర్పాటు కానుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కేసీఎస్‌టీకు అక్టోబర్‌ 14న డీఆర్‌డీవో చీఫ్‌ జి.సతీశ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ... తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు వెల్లడించారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. 1958లో ఏర్పాటైన డీఆర్‌డీవో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు  : అక్టోబర్‌ 14
ఎవరు    : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చీఫ్‌ జి.సతీశ్‌రెడ్డి
ఎక్కడ  : జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ(సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ), సాంబ జిల్లా, జమ్మూ, కశ్మీర్‌
ఎందుకు : శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలకు...


Global Student Prize 2021: స్టూడెంట్‌ ప్రైజ్‌ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయురాలు?


ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌–2021’ టాప్‌–10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారి(18)కి చోటు లభించింది. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌తో సత్కరిస్తారు. చెగ్‌.ఓఆర్‌టీ వెబ్‌సైట్‌ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్‌ 10న ప్రకటించనున్నారు.

భారత్‌లోని జార్ఖండ్‌కు చెందిన సీమా కుమారి... అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతోంది. జార్ఖండ్‌లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ‘యువ’ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్‌ యూనివర్సిటీలో చేరింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌–2021’ టాప్‌–10 ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకున్న భారత విద్యార్థిని?
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : సీమా కుమారి(18)
ఎందుకు : ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపినందున...



Covid-19: డబ్ల్యూహెచ్‌ఓ సాగో బృందంలో చోటు దక్కించుకున్న భారతీయుడు?


భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్‌ల గుట్టుని నిగ్గు తేల్చడానికి 25 మందితో కూడిన శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఫర్‌ ది ఆరిజన్స్‌ ఆఫ్‌ నోవెల్‌ పాథోజెన్స్‌(ఎస్‌ఏజీవో–సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ గంగఖేడ్కర్‌తో సహా గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు కూడా చోటు లభించింది.

డాక్టర్‌ రామన్‌ గంగఖేడ్కర్‌
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నుంచి 2020 ఏడాది పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌కు అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా పేరుంది. ఐసీఎంఆర్‌లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్‌లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
 25 మందితో కూడిన బృందం సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఫర్‌ ది ఆరిజన్స్‌ ఆఫ్‌ నోవెల్‌ పాథోజెన్స్‌(ఎస్‌ఏజీవో–సాగో)లో చోటు దక్కించుకున్న భారతీయుడు?
ఎప్పుడు    : అక్టోబర్‌ 14
ఎవరు    : డాక్టర్‌ రామన్‌ గంగఖేడ్కర్‌
ఎందుకు : భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుక్కొనేందుకు...


Chhattisgarh: ఇటీవల కన్నుమూసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత?

మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే(66) మృతి చెందారు. అనారోగ్యం, కిడ్నీలు విఫలమైన కారణంగా అక్టోబర్‌ 14న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని దక్షిణ బస్తర్‌ అటవీప్రాంతంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటకు చెందిన ఆర్కే దేశంలోనే మావోయిస్టు కీలక అగ్రనేతల్లో ఒకరుగా గుర్తింపు పొందారు.

ప్రభుత్వంతో చర్చలు...
1975లో పీపుల్స్‌వార్‌ ఉద్యమం వైపు ఆకర్షితులైన ఆర్కే... నాలుగు దశాబ్దాల ఉద్యమ జీవితంలో ప్రధానంగా నల్లమల, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లను కేంద్రస్థానాలుగా చేసుకుని పీపుల్స్‌వార్‌/మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీసీఐ) పార్టీలు విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించడంలో కీలకంగా వ్యవహరించారు. ఏవోబీ కార్యదర్శిగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు.

రూ.కోటిన్నరకుపైగా రివార్డు
దేశవ్యాప్తంగా దాదాపు 200కిపైగా కేసుల్లో నిందితుడైన ఆర్కేపై పలు రాష్ట్రాల్లో రివార్డులున్నాయి. మొత్తంగా రూ.1.52 కోట్ల రివార్డు ఉంది. 2003లో అలిపిరిలో అప్పటి  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై క్లెమోర్‌మైన్స్‌తో దాడి కేసు కూడా ఆయనపై ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే(66)
ఎక్కడ    : దక్షిణ బస్తర్‌ అటవీప్రాంతం, బీజాపూర్‌ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం
ఎందుకు : కిడ్నీలు విఫలమైన కారణంగా...


Medical Rapid Transport: ఏఎంఆర్‌టీ25 డ్రోన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?


మెడిసిన్‌ ఫ్రం స్కై కార్యక్రమం స్ఫూర్తితో, స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వినూత్నమైన డ్రోన్‌.. ‘ఎయిర్‌బార్న్‌ మెడికల్‌ రాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌–25 (ఏఎంఆర్‌టీ25)’ను టీవర్క్స్‌ విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్‌ నిలువుగా పైకి ఎగిరి, వేగంగా ప్రయాణించి, మళ్లీ నిలువుగా (వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌– వీటీఓఎల్‌) కిందికి దిగుతుందని అక్టోబర్‌ 15న టీవర్క్స్‌ వెల్లడించింది. దేశంలో ఇలాంటి హైబ్రిడ్‌ డ్రోన్లను రూపొందించి, తయారు చేసి, పరీక్షించగలిగే అతికొద్ది సంస్థల జాబితాలో ‘టీవర్క్స్‌’ కూడా చేరినట్టు తెలిపింది. డ్రోన్‌లో ప్రధాన ఫ్రేమ్‌తోపాటు ఇతర విడిభాగాలన్నింటినీ హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న టీవర్క్స్‌లో తయారు చేసినట్లు పేర్కొంది.

ఏఎంఆర్‌టీ25 ప్రత్యేకతలివీ..

  • ఉన్నది ఉన్నట్టుగా పైకి ఎగిరి, అదే తరహాలో కిందికి దిగుతుంది. టేకాఫ్, ల్యాండింగ్‌ కోసం కేవలం ఐదు మీటర్లు పొడవు, 5 మీటర్లు వెడల్పు ఉన్న స్థలం సరిపోతుంది. 
  • గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం తరహాలో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. సుమారు 80–90 మీటర్ల ఎత్తులో.. గంటకు 100 కిలోమీటర్లకుపైగా
  • వేగంతో వెళ్లగలదు. 
  • ప్రస్తుతం ఔషధాల సరఫరాకు వినియోగించినా.. ఏరియల్‌ సర్వే, తనిఖీలు, నిఘా, రక్షణ రంగ అవసరాల కోసం వీటిని ఉపయోగించవచ్చు. 
  • ఏఎంఆర్‌టీ25 కిలో నుంచి కిలోన్నర బరువు మోసుకుని.. గరిష్టంగా 45–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 
  • వంద కిలోమీటర్ల దూరం, 3.5 కిలోల బరువు మోసుకెళ్లేలా ఈ డ్రోన్‌ కొత్త మోడల్‌ను తయారు చేస్తున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి  : ఎయిర్‌బార్న్‌ మెడికల్‌ రాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌–25 (ఏఎంఆర్‌టీ25)ను విజయవంతంగా పరీక్షించిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : టీవర్క్స్‌
ఎక్కడ : హైదరాబాద్‌
ఎందుకు : ఔషధాల సరఫరాకు వినియోగించేందుకు...



Single-Use Plastics: ప్లాస్టిక్‌ కవర్లపై నిషేధాన్ని ఎన్ని మైక్రాన్లకు విస్తరించారు?


పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వినియోగంపై తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ యుద్ధం ప్రకటించింది. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ క్రయవిక్రయాలు, వినియోగంపై అక్టోబర్‌ 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో నిషేధాన్ని విధించింది. అక్టోబర్‌ 14 నుంచి 2022, ఏడాది జూన్‌ 30 వరకు ఈ నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. 2022, ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది.

ఇప్పటివరకు...
ఇప్పటివరకు 50 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులపై నిషేధం ఉంది. 2021, సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్లలోపు, 2022, డిసెంబర్‌ 31 నుంచి 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ క్రయవిక్రయాలు, వినియోగంపై నిషేధం
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ 
ఎక్కడ    : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : పర్యావరణానికి హాని కలిగిస్తున్నందున...



UNHRC: ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికైన దక్షిణాసియా దేశం?

దక్షిణాసియా దేశం భారత్‌ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఎన్నికైంది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీలోని 18 కొత్త సభ్యుల కోసం అక్టోబర్‌ 14న నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. ఐరాస సర్వప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో 2022 జనవరి నుంచి 2024, డిసెంబర్‌ వరకు మూడేళ్ల పాటు... యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో భారత్‌ సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి భారత్‌ ఎన్నిక కావడం ఇది ఆరోసారి. భారత్‌తో పాటు కజకిస్తాన్, మలేసియా, ఖతర్, యూఏఈ సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి.

యూఎన్‌హెచ్‌ఆర్‌సీ...
అంతర్జాతీయంగా మానవహక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడానికి ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌ను 1946 డిసెంబర్‌ 10న ఏర్పాటుచేశారు. సాంఘిక, ఆర్థిక మండలిలో అంతర్భాగమైన ఈ కమిషన్‌లో 53 సభ్యదేశాలకు మూడేళ్ల పదవీకాలానికి సభ్యత్వముండేది. కమిషన్‌ పనితీరు అనేక విమర్శలకు గురవడంతో దాని స్థానంలో 2006 మార్చి 15న మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో ఉంది. మూడు సంత్సరాలకొకసారి యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపునిస్తుంది.

నిర్మాణం..
యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో 47 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఐరాస  సర్వప్రతినిధి సభ వీరిని ఎన్నుకుంటుంది. సభ్యదేశాల పదవీకాలం మూడేళ్లు. వరుసగా రెండు పర్యాయాలకు మించి ఎన్నికయ్యేందుకు వీలుండదు. సభ్యదేశాల కేటాయింపు ప్రాంతాల వారీగా ఉంటుంది.

  • ఆఫ్రికా – 13
  • ఆసియా – 13
  • తూర్పు యూరప్‌ – 6
  • లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ – 8
  • పశ్చిమ యూరప్, ఇతర గ్రూపులు – 7

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
 ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఎన్నికైన దక్షిణాసియా దేశం?
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : భారత్‌
ఎందుకు : యూఎన్‌హెచ్‌ఆర్‌సీలోని 18 కొత్త సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించడంతో...


DRDO Chairman: కలాం సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?


కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని సాంబ జిల్లాలో ఉన్న జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ(సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ)లో కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) ఏర్పాటు కానుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కేసీఎస్‌టీకు అక్టోబర్‌ 14న డీఆర్‌డీవో చీఫ్‌ జి.సతీశ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ... తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు వెల్లడించారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. 1958లో ఏర్పాటైన డీఆర్‌డీవో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
 

క్విక్‌ రివ్యూ   :

ఏమిటి    : కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చీఫ్‌ జి.సతీశ్‌రెడ్డి
ఎక్కడ    : జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ(సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ), సాంబ జిల్లా, జమ్మూ, కశ్మీర్‌
ఎందుకు : శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలకు...

 

కోవెలకు ఆచార్య పోలూరి అవార్డు

తన గురువు, తెలుగు ఆచార్యులైన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పేరిట ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో అవార్డును ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 13న ఆయన తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్యకు అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... తెలుగు భాష సంరక్షణ కోసం 1943లో  తెలంగాణ సారస్వత పరిషత్‌ ఏర్పాటైందని అన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
ఎక్కడ    : ధర్బండోరా, దక్షిణ గోవా జిల్లా, గోవా రాష్ట్రం