Ticker

6/recent/ticker-posts

These are the recipients of this year's prestigious Nobel Prize in Economics

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి గ్రహీతలు వీరే

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వగా.. మిగతా సగాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు. 

The prestigious Nobel Prize in Economics has been awarded to three people this year. American economists David Card, Joshua D. Angrist‌, Guido W. The Royal Swedish Academy has announced that it is awarding the Nobel Prize in Economics this year to the Imbens. However, half of the award will be given to David Card and the other half will be shared by Joshua and Guido.

కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్ అందిస్తున్నట్లు అకాడమీ వెల్లడించింది. ఇక ఆర్థికశాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు తెలిపింది. 

The Academy has awarded the Nobel Peace Prize to David Card for his research contributions to the field of labor finance. Joshua also said that Guido would be rewarded for his contribution to analytical research in economics.

nobel prize 2021

సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఉపాధి, ఉద్యోగుల వేతనంపై వలసవిధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓ వ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది?వలసవిధానం తగ్గడం, వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధానమివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్‌, జాషువా, గైడో రుజువు చేశారని అకాడమీ వీరిని ప్రశంసించింది.

In the social sciences there are at once very big big questions. What effect does immigration have on employment and wages? To what extent does long-term education work for a person's future? What are the consequences of declining immigration and long-term illiteracy? It is very difficult to answer such questions. However, the academy praised scientists David, Joshua and Guido for proving that their questions could be answered with their natural research.