Ticker

6/recent/ticker-posts

*🌼 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020*



*🌼 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020*

 *🎯అమలుకు ఆమోదం తెలిపిన ఏపీతో సహా పలు రాష్ట్రాలు*

 *✳️నాలుగు దశలుగా రూపాంతరం చెందనున్న ప్రస్తుత పాఠశాల , ఇంటర్ విద్య*

*❇️ఒత్తిడి తగ్గింపు , క్రీడా చైతన్యం , సామాజిక స్పృహే లక్ష్యంగా సిలబస్*

*✳️12 వ తరగతి పూర్తి నాటికి విద్యార్థికి సంపూర్ణ నైపుణ్యమే లక్ష్యం*


*🎯టీచర్ ఎడ్యుకేషన్ నూ మార్పు*

 *❇️నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయుడి అర్హత విధానంలోను మార్పు తెచ్చింది . ఈ విధానం ద్వారా ప్రతి ఉపాధ్యాయుడికి 4 ఏళ్ల వ్యవధి గల బీఈడీ అర్హత ఉండాలి. ఇందుకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ( ఎన్సీ టీఈ ) ఈ అర్హతను పర్యవేక్షిస్తుంది . అయితే ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు ఈ తరహా అర్హత పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2030 వరకు వెసులు బాటు కల్పించింది .*

*🎯పాఠ్యాంశాలు ఇలా...*

*ఫౌండేషన్ తరగతులు*

 *✳️తొలిదశను ఫౌండేషన్ దశగా నూతన విద్యావిధానం సూచించింది . 0 + 3 నుంచి 1 , 2 వ తరగతులను ఈ దశలో విద్యార్థి ( 8 ఏళ్ల వయసు ) పూర్తి చేయాల్సి ఉంటుంది . ఈ దశలో పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని నింపే విధంగా సిలబస్ ఉంటుంది . ఆట ఆధారిత , బహుళస్థాయి , కార్యా చరణ ఆధారిత విద్యను ఈ దశలో అందించను న్నారు . వర్ణమాల , రంగులు , ఆకారాలు , డ్రాయింగ్ , పెయింటింగ్ , సంగీతం , కళలు , సమ స్యలు - పరిష్కారాలు , మంచి ప్రవర్తన , వ్యక్తిగత పరిశుభ్రత , నీతి , ఇండోర్ , అవుట్ డోర్ గేమ్స్ వం టివి పాఠ్యాంశంలో అంతర్భాగంగా ఉంటాయి .*

*మధ్య దశ* 

*✳️ఈ దశలో 6 నుంచి 8 తరగతులు వరకు విద్యార్థులు విద్యనభ్యసించనున్నారు . విద్యార్థి వయసు 11 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు ఉండ నుంది . ఈ దశలో గణితం , సైన్స్ , సాంఘిక శాస్త్రం , మానవీయ శాస్త్రాలు సిలబస్ బోధి స్తారు . కళలతో పాటు మానవీయత విద్యార్థు లకు పరిచయం కానుంది . ఈ దశలోనే కోడింగ్ బోధనతో పాటు , ఇంటర్నషిప్ పాలసీని అమలు చేయనున్నారు .*

*ప్రిపరేటరీ దశ ..* 

*✳️ఈ దశలో 3 నుంచి 5 వ తరగతి వరకు విద్యార్థులు ( 8 నుంచి 11 ఏళ్ల వయసు ) విద్యనభ్యసించనున్నారు . ఈ దశలో స్పీకింగ్ స్కిల్స్ , రైటింగ్ స్కిల్స్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ , భాషలు , సైన్స్ , గణిం తాలను పాఠ్యాంశాల్లో సిలబస్ అందిం చనున్నారు . విద్యార్ధి వ్యక్తిగత సామార్థ్యా లను పెంచే విధంగా ఈ సిలబస్ ఉంటుం ది . దీంతో ఈ దశను సన్నాహక దశగా పేర్కొన్నారు .*

*సెకండరీ స్టేజ్ ..*

*❇️ఈ దశలో 9 నుంచి 12 తరగతులు వరకు విద్యార్థులు విద్యనభ్యసించను న్నారు . విద్యార్థి వయసు 14 నుంచి 19 ఏళ్లుగా ఉంటుంది . ఈ దశలో క్రిటికల్ థిం కింగ్ , మల్టీడిసిప్లీనరీ స్టడీని విద్యార్థుల కోసం అందించనున్నారు . ప్రస్తుత 10 వ తరగతితో పాటు ఇంటర్ విద్యను ఇందులో మిళితమవుతుంది . ఇక్కడ విద్యార్థికి ఆప్ష నల్ ( ఛాయిస్ ) విధానం అందుబాటులో ఉండనుంది . విద్యార్థి సైన్స్ నుంచి ఆర్ట్స్ సబ్జెక్టులకు , ఆర్ట్స్ నుంచి సైన్స్ సబ్జెక్టులకు మారవచ్చు . ఆప్షనల్ విధానం ద్వారా వారి కి నచ్చిన సబ్జెక్టుపై పట్టుసాధించుకోవచ్చు . ఈ దశలో సెమిస్టర్ విధానాన్ని సైతం అమలు చేయనున్నారు .*

*❇️ప్రస్తుత విద్యావిధానం ప్రకారం ప్రైమరీ స్కూల్ ( 1 + 5 ) , సెకండరీ స్కూల్ ( 6 + 10 ) గా ఉంది . అనంతరం ఇంటర్ , ఇంటర్ అనంతరం బీటెక్ , ఎంబీబీఎస్ , లేదా డిగ్రీ , ఇతర కోర్సులను అం దిస్తున్నారు . మొత్తంగా ఈ విధానం 10 + 2 + 3 గా ఉంది . అయితే నూతన విద్యా విధానం -2020 ద్వారా ప్రాథమిక స్థాయి నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి . మొత్తంగా ఈ కొత్త విధానం 5 + 3 + 3 + 4 గా ఉండనుంది . 0 + 3 ( నర్సరీ , యూకేజీ , ఎల్కేజీ ) తో పాటు 1 , 2 వ తరగతుల ఎడ్యుకేషన్ను కేంద్రం కంప్లీట్గా ఐదేళ్ల ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్గా మార్చింది . రెండో దశలో 3 నుంచి 5 వ తరగతులు ఉం టాయి . మూడో దశలో 6 నుంచి 8 తరగతులను అందించనున్నారు . దీన్ని మిడిల్ స్టేజ్ పరిగణిస్తారు . చివరి దశ 9 నుంచి 12 వ తరగతి వరకు ఉంటుంది . ఈ దశకు చేరుకునేలోపు విద్యార్థి సంపూర్ణ నైపుణ్యవంతుడు కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది*

*అమల్లోకి తెచ్చిన రాష్ట్రాలు .. •*

 *❇️ఎన్ఎస్ఈపీ -20200 ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనంతరం పలు రాష్ట్రాలు ఈ విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చాయి . • కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 2021 లో ఈ విద్యావి . ధాన్ని అమలులోకి తెచ్చింది . * 2021 ఆగస్టులో మధ్యప్రదేశ్ . ప్రభుత్వం ఎన్ఎస్ఈసీ - 2020 ను అమ లోకి తెస్తున్నట్లు ప్రకటించింది . ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2022 నుంచి దశల వారీగా ఈ విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు . • తెలంగాణ , మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు 2021 లో ప్రకటించాయి . అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ 2022 ఏప్రిల్ నుంచి ఎన్ ఈపీ - 20201 ను అమలులోకి తెస్తు న్నట్లు ప్రకటించారు . * 2021 డిసెంబర్లో రాజస్తాన్ ప్రభుత్వం ఎన్ఎస్ఈపీ -2020 ను దశల వారీగా అమలులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది . • ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎన్ఎస్ఈ పీ -2020 ను అమలోకి తీసుకురానున్నట్లు ప్రక టించారు . ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకు వచ్చేందుకు కావల్సిన చర్యలు చేప టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు .*