Ticker

6/recent/ticker-posts

8th Class Biology Bits 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

 1. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి ?

8th Class Biology Bits 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?  Most imp key points for DSC and TET, AP TET 2022, AP TET 2022 practice exams, aptet 2022 biology, tet 2022 science key points, imp bits for tet 2022, 8th class biology imp bits, class 8th biology key points for tet and dsc.

8th Class Biology Bits 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

 • మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి దాని పూర్వాపరాలను అవగాహన చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో, ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలు అన్నింటిని కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు.
 • విజ్ఞాన శాస్త్రం అంటే మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడం.
 • విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగపడుతుంది.
 • జీవుల ప్రవర్తన - పర్యావరణ శాస్త్రవేత్తలు
 • శిలాజాలు, ఖనిజాలు గూర్చి తెలుసుకునేది - భూగర్భ శాస్త్రవేత్తలు
 • ఆకాశంలో మిల మిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు గెలాక్షీల ఛాయాచిత్రాలు తీసి పరిశీలించేది - ఖగోళ శాస్త్రవేత్తలు
 • వర్షాలు, మేఘాలు సమాచారం - వాతావరణ శాస్త్రవేత్తలు
 • వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యల వేగాలు పరిశీలించేది - రసాయన శాస్త్రవేత్తలు
 • వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాలను కొలిచేది - అణుభౌతిక శాస్త్రవేత్తలు
 • కణాల ప్రతిచర్యలు పరిశీలన, వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలు  - జీవ శాస్త్రవేత్తలు
 • కొన్ని లక్షణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా సంక్రమిస్తాయో అవగాహన కలిగించేది - జన్యు శాస్త్రవేత్తలు 
 • ప్రకృతిని మరింత మెరుగ్గా, అర్థవంతంగా వివరించడానికి గతంలో కనుగొన్న సూత్రాలు, సిద్ధాంతాలు వంటి పాత భావనలనకు బదులుగా కొత్త భావనలు ఆవిష్కరించడం శాస్త్రవేత్తలు ప్రధాన లక్ష్యాలలో ఒకటి.
8th Class Biology Bits 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?  Most imp key points for DSC and TET, AP TET 2022, AP TET 2022 practice exams, aptet 2022 biology, tet 2022 science key points, imp bits for tet 2022, 8th class biology imp bits, class 8th biology key points for tet and dsc.
 • 'శాస్త్రం' అనే పదం 'సెన్షియా(Scientia)' అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సెన్షియా అంటే 'జ్ఞానం(Knowledge)' అని అర్ధం.
 • అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానం తెలిపేది సైన్స్
 • శాస్త్రవేత్తలు తమ సంతృపి కోసం తాము శ్రమిస్తుంటారు.
 • విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే భవిష్యత్తుకు కావలసిన ఆర్ధిక వనరులు పెంపొందించుకునేందుకు పెట్టుబడి పెట్టడమే.
 • సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం నిరంతరం మార్పు చెందుతుంది.
 • పరిశోధనల ఫలితంగా "సిద్ధాంతాలు" వస్తాయి, పోతాయి లేదా కాలానుగుణంగా మార్పు చెందుతాయి.
 • సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రే సైన్స్ - కార్ల్ పాపర్
 • నేను ప్రతీ సంవత్సరం గత సంవత్సరం రాసిన దానిని మారుస్తుంటాను - ఐనిస్టీన్
 • నూతన విషయాలు బయట పెట్టడంలో శాస్త్రవేత్తలు అనుసరించిన విధానాన్ని "శాస్త్రీయ పద్దతి (Scientific Method)" అంటారు.
 • అలాగే వీరు "శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు(Scientific Process Skills)" వినియోగిస్తారు.
 • ప్రయోగాలు నిర్వహించేటపుడు లేదా ప్రశ్నలకు జవాబులు కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచనా సరళిని "ప్రక్రియా నైపుణ్యాలు" అంటారు. 
 • శాస్త్రీయ పద్దతి సోపానాలు - ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రణాళిక చేయడం, ప్రయోగం నిర్వహించడం, ఫలితాలు ప్రదర్శించడం
 • పరిశోధనా ఫలితాలను ప్రభావితం చేసే అంశాలను "చరరాశులు(Variables)" అంటారు.
 • సాకేత్ - గవ్వలను పరిశీలించి రంగు, ఆకారం, పరిమాణం వంటి లక్షణాలు పోల్చాడు
 • ఉపయోగించిన ప్రక్రియా నైపుణ్యాలు : పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం
 • చరిత - రాయి ఆకృతి పరిమాణంలో మార్పుకు గల కారణం అధ్యాయనం చేసింది
 • ఉపయోగించిన ప్రక్రియా నైపుణ్యాలు : కొలవడం, సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, ఊహించడం
8th Class Biology Bits 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?  Most imp key points for DSC and TET, AP TET 2022, AP TET 2022 practice exams, aptet 2022 biology, tet 2022 science key points, imp bits for tet 2022, 8th class biology imp bits, class 8th biology key points for tet and dsc.
 • అరవింద్ - బల్బ్ వెలగడానికి స్విచ్ కి ఉన్న సంబంధం తెలుసుకోవాలనుకున్నాడు
 • ఉపయోగించిన ప్రక్రియా నైపుణ్యాలు : నమూనా వినియోగం, ఊహించడం, నిర్ధారించడం
 • శ్వేత - ఏ రకమైన తువ్వాలు ఎక్కువ నీరు శోషిస్తుందో తెలుసుకోవాలనుకుంది
 • ఉపయోగించిన ప్రక్రియా నైపుణ్యాలు : పరికల్పన చేయడం, ప్రణాళిక - ప్రయోగం నిర్వహించడం, చరరాశులు నియంత్రణ
 • మన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్ధం చేసుకుని దానికి ఆటంకం కలగకుండా మన అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో శాస్త్రీయపద్దతి సహాయపడుతుంది.
 • ఆవిష్కరణల రహస్యమంతా సమస్య గుర్తించడంలో ఉంది.
 • "చరిత్రలో సైన్స్" పుస్తక రచయిత - ఎఫ్. ఖజోరి 

విజ్ఞాన శాస్త్ర విభాగాలు :

విజ్ఞాన శాస్త్ర విభాగం 

పరిశీలించే అంశాలు 

భౌతిక శాస్త్రం 

చలనం, కాలం, గురుత్వాకర్షణ మొదలైన అంశాలు గూర్చి అధ్యాయనం 

రసాయన శాస్త్రం 

పదార్ధాల నిర్మాణం, ధర్మాలు, ప్రతిచర్యలు 

వృక్ష శాస్త్రం 

మొక్కలు నిర్మాణం, పెరుగుదల, వ్యాధులు మొదలైనవి 

జంతు శాస్త్రం 

వివిధ జీవరాశుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాలు, వర్గీకరణ 

ఖగోళ శాస్త్రం 

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవి 

భూ విజ్ఞాన శాస్త్రం 

భూమి నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు, శిలలు 

వ్యవసాయ శాస్త్రం 

పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం 

శరీర ధర్మ శాస్త్రం 

జీవుల శరీర నిర్మాణాలు, పని చేసే విధానాలు 

మానవ శాస్త్రం 

ప్రాచీన ఆధునిక మానవుల జీవన విధానాలు 

సూక్ష్మ జీవ శాస్త్రం 

బాక్టీరియా, వైరస్ మొదలైనవి 

జీవ సాంకేతిక శాస్త్రం 

జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి 

కీటక అధ్యయన శాస్త్రం 

కీటకాల లక్షణాలు, ఉపయోగాలు 

పక్షుల అధ్యయన శాస్త్రం 

పక్షులు వాటి జీవన విధానాలు, వలసలు 

మనో విజ్ఞాన శాస్త్రం 

మానవుల ప్రవర్తన, మానసిక స్థితి 

సిస్మాలాజి 

భూకంపాలు 

వర్గీకరణ శాస్త్రం 

వృక్ష, జంతు ప్రపంచ వర్గీకరణ 

శిలాజ శాస్త్రం 

వృక్ష, జంతు సంబంధ శిలాజాలు గూర్చి 

ఆవరణ శాస్త్రం 

పర్యావరణ వ్యవస్థ గురించి 

రోగ నిర్ధారణ శాస్త్రం 

వివిధ వ్యాధులు, కారణాలు, రోగ లక్షణ శాస్త్రం 

వాతావరణ శాస్త్రం 

వాతావరణంలో భౌతిక రసాయన గతిశీలతలు, భూమి, సముద్రాలు, పవనాలు ప్రభావాలు 

జన్యు శాస్త్రం 

జన్యువుల సమాచారం 

పరిణామ శాస్త్రం 

జీవుల పరిణామ క్రమం 

  8th Class Biology Bits 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?  Most imp key points for DSC and TET, AP TET 2022, AP TET 2022 practice exams, aptet 2022 biology, tet 2022 science key points, imp bits for tet 2022, 8th class biology imp bits, class 8th biology key points for tet and dsc.

Special Thanks to : ABR