8th Class Social 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు, AP TET 2022 Social Content, Exams with content for DSC and APTET, Most imp bits for AP TET and AP DSC.
2. సూర్యుడు - శక్తి వనరు
- రెండు ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలు గాలులను, వానలను ప్రభావితం చేస్తాయి.
- సూర్యుడు నుండి శక్తి కాంతి, వేడిమి రూపంలో
విడుదల అవుతూ ఉంటుంది. సూర్యుడు నుండి వెలువడే ఈ శక్తిని "సౌర వికిరణం" అంటారు.
- భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని "సౌరపుటం" అంటారు.
- సౌరశక్తిలో మూడవ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం అవుతుంది. మరికొంత శక్తి వాతావరణ పై పొరలలో చెల్లాచెదురు అవుతుంది.
- భూమి ఉపరితలం ఒంపుగా ఉండడం వల్ల సూర్యకిరణాలు ఉపరితలం అంతటా ఒకేలా వేడి కలిగించవు.
- భూ ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని "పతన కోణం (యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్)" అని అంటారు.
8th Class Social 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు, AP TET 2022 Social Content, Exams with content for DSC and APTET, Most imp bits for AP TET and AP DSC.
- భూమధ్యరేఖ వద్ద (00) - 100 యూనిట్స్ సూర్యపుటం చేరితే
- 450 వద్ద - ఉత్తర జపాన్ - 75 యూనిట్స్
- 66 1/20 - ధ్రువ మండలం - 50 యూనిట్స్
- 900 వద్ద - దృవాలు - 40 యూనిట్స్
- భూమధ్యరేఖ వద్ద సూర్యకిరణాలు ఎక్కువ సాంద్రతలో పడినా సాధారణంగా అక్కడ మధ్యాహ్నం నుండి మబ్బుగా ఉండి నేల మీద తక్కువ సూర్యకిరణాలు పడతాయి. కాబట్టి భూమధ్యరేఖా ప్రాంతం కంటే దానికి
ఉత్తర, దక్షిణ ప్రాంతం వేడిగా ఉంటుంది.
- ఉత్తర భాగంలో
నవంబర్, డిసెంబర్ నెలల్లో పతనకోణం పెరుగుతుంది. మే, జూన్ నెలల్లో తగ్గుతుంది.
- భూమి త్వరగా
వేడెక్కి, త్వరగా చల్లబడును. ఇందుకు విరుద్ధంగా సముద్రాలు వేడెక్కడానికి, చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి. తర్వాత
వేడి వికిరణం చెంది చుట్టూ ఉన్న గాలిని వేడెక్కిస్తుంది.
- బొగ్గుపులుసు వాయువు లాంటి కొన్ని వాయువులు భూవికిరణాన్ని అడ్డుకుంటున్నాయి.
- వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు శాతం పెరిగి
భూవికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనిని "భూగోళం వేడెక్కడం" అని అంటారు.
- భూమిపై
నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత - 1992 జులై - లిబియా(ఆఫ్రికా) లోని అజీజియ - 57.80
- అత్యల్ప ఉష్ణోగ్రత - 1983 జులై - అంటార్కిటికా లోని వోస్టాక్ కేంద్రం - (-)89.20
- ఉష్ణోగ్రతలలో అత్యల్ప ఉష్ణోగ్రత - (-)273.160. ఉష్ణోగ్రత ఇంతకంటే తగ్గదు.
- ఒక్కరోజులో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చేసే పరికరం - సిక్స్ గరిష్ఠ కనిష్ట ఉష్ణమాపకం.
- సముద్ర
తీర ప్రాంతాలలో సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణస్థితులు ఒకేలా ఉంటాయి. దీనినే "సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి" అంటారు.
- గరిష్ట
కనిష్ట ఉష్ణోగ్రతలలో తేడా ఉండడాన్ని "ఖండతర్గత శీతోష్ణస్థితి" అని అంటారు.
- సముద్ర
మట్టం నుండి పైకి వెళ్లే కొద్దీ ప్రతీ వెయ్యి మీటర్లకు 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది.
- శీతాకాల సమయంలో సూర్యపుటం తక్కువగా ఉండి వికిరణం కూడా తక్కువగా ఉండడం వల్ల భూ ఉపరితలానికి చాలా తక్కువ
ఉష్ణోగ్రత అందుతుంది. దీనిని "ఉష్ణ విలోమనం" అని అంటారు.
Special Thanks To
ABR