Ticker

6/recent/ticker-posts

AP TET 2022 Class 4 EVS Best notes for Self Preparation

AP TET 2022 Class 4 EVS Best notes for Self Preparation,  1. కుటుంబం


 


 • కుటుంబాలు అన్ని ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో తల్లి, నాన్న , పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాలలో పిల్లలతో పాటు తాతయ్య, నాయనమ్మ కలసి జీవిస్తారు


నాన్నకి నాన్న - తాతయ్య

నాన్నకి సోదరుడు - పెదనాన్న

నాన్నకి సోదరి - అత్తయ్య

పెదనాన్న కూతురు -- అక్క/ చెల్లి

అత్తకొడుకు - బావ


 • త్రల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరుపు కుటుంబ సభ్యులు అంటాం


 • నాన్నకి చెందిన కుటుంబ సభ్యులను నాన్న తరపు కుటుంబ సభ్యులు అంటారు


 • తల్లి యొక్క అమ్మనాన్నలను అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తారు


 • నాన్న యొక్క అమ్మనాన్నలను నాయనమ్మ, తాతయ్యలని పిలుస్తారు.


 • తల్లికి సోదరుడు - మామయ్య


 • అత్తలు, మామయ్యలు వారి పిల్లలు మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలో భాగం. వీరందరినీ విస్తరించిన కుటుంబం అంటారు


 • విహహం లేదా పుట్టుక వలన కుటుంబంలో మార్పులు వస్తాయి.


 • వ్యాపారం, చదువు, ఉద్యోగం, కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తుల మరణం వలన కుటుంబాలలో మార్పులు వస్తాయి.


 • తల్లి, నాన్న పిల్లలతో ఉన్న కుటుంబం -- చిన్న కుటుంబం.


 • తాతయ్య, నాయనమ్మ, పెదనాన్న, అత్త, అక్క / చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు.


 • మద్యపానం ఆరోగ్యానికి హానికరం.


 • ఆధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్యపానాన్ని దశల వారీగా నిషేధించే చర్యలు తీసుకుంది.


 • విద్యుత్‌ ను ఎక్కువగా ఉపయోగిస్తూ శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం.


 • వంశవృక్షం వలన కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు తెలుసుకోవచ్చు

2. హరిత ప్రపంచం


 


 • నేలవాతావరణం బట్టి వివిధ ప్రదేశాలలో వివిధ మొక్కలు పెరుగుతాయి.


 • నివాస స్థలాలు ఆధారంగా మొక్కలు రండు రకాలు


1. నేలపై పెరిగే మొక్కలు

2. నీటిపై పెరిగే మొక్కలునేలపై పెరిగే మొక్కలు : -


 • మరి చెట్టు, రావి, మావిడి, చింత, బ్లాక్‌ బెరి వంటి వృక్షాలు మైదాన ప్రదేశాలలో పెరుగును


 • పైన్‌, ఓక్‌ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రదేశాలలో పెరుగుతాయి.


 • బ్రహ్మ జెముడు మొక్కలు ఎడారిలో పెరుగుతాయి.


 • నాగజెముడు మొక్కలు ఎడారి ప్రాంతాలలో పెరుగుతాయి


 • ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి.


 • నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు. • నీటి మొక్కలు :- నీటిలో పెరిగే మొక్కలను నీటిమొక్కలు అంటారు.


 • నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ -- డక్‌ విడ్‌, గుర్రపుడెక్క .


 • చెరువు, సరస్సులు అడుగు భాగంలో వేర్లు పాతుకుని ఉండే మొక్కలు - కలువ, తామర .


 • నీటిలోపల పెరిగే మొక్కలకు ఉదాహరణ -- హైడిల్లా, టేప్‌ గాస్‌


 • బురద లేదా చిత్తడి నెలల్లో పెరిగే మొక్కలకు ఉదాహరణ -- మడ చెట్లు .


 • మొక్కను రెండు వ్యవస్థలుగా విడదీయవచ్చు.


1. వేరు వ్యవస్థ

2. ప్రకాండ వ్యవస్థ.


 • నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు.


 • నెలలోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అంటారు.


 • క్యారట్‌ అనునది ఆహరాన్ని నిల్వ చేసుకునే ఒక వేరు.


 • బీట్ రూట్‌, ముల్లంగి అనునది నెలలోపల పెరిగే వేర్లు.


 • మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేలనుండి పోషకాలను గ్రహించేవి -- వేర్లు.


 • మొక్కలలో వేర్లు రెండు రకాలు.


 • త్రల్లివేరు ఒక బలమైన ప్రధానవేరును కలిగి ఉంటుంది.


 • త్రల్లి వేరు నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.


 • త్రల్లి వేరుకు అన్నివైపులా సన్నని వేర్లు పెరుగుతాయి.


 • Ex: వేప, చింత


 • గ్రుబురు వేర్లు లేదా పీచు వేర్లు గుబురుగా పెరుగుతాయి .


 • కాండం అడుగుభాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుంపు గా పెరుగుతాయి.


 • Ex: - వరి, జొన్న, మొక్క జొన్న .


 • మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు నేలలోనికి చొచ్చుకుని పోయి ఉంటాయి .


 • గులాబీ, మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతులోనికి పెరగవు.


 • నీటి మొక్కల వేర్లు మృదువుగా, స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి.


 • వేర్లు సాధారణంగా ఏ రంగులో ఉంటాయి -- బూడిద.


 • ఆహారంగా తీసుకునే వేర్లకు ఉదాహరణ -- క్యారెట్‌, బీట్‌ రూట్‌, ముల్లంగి


 • వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్‌ మ్యాట్‌ లో ఉపయోగించే వేరు - వట్టివేర్లు.


 • దుస్తులు ఉంచే అలమరలో మంచి వాసన కోసం ఉపయోగించే వేర్లు - వట్టివేర్లు


 • సువాసన తైలాలలోనూ, దోమలను తరిమే పదార్భాలలోనూ ఉపయోగించే వేర్లు - నిమ్మగడ్డివేర్లు


 • పువ్వులో భాగాలు 1. ఆకర్షక పత్రం 2.రక్షక పత్రం 3. కేసరం 4. కాడ 5. అండ కోశం


 • పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని పమంటారు -- ఆకర్షక పత్రం.


 • మందార, వేప, తులసి మొక్కల పుష్పాలు జౌెషధాల తయారీలో ఉపయోగిస్తారు


 • గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్‌ పుష్పాలను సెంట్లు, సౌందర్య తైలాల తయారీలో వాడతారు.


 • ఆహారంగా తీసుకునే పువ్వుకు ఉదాహరణ -- కాలీఫ్లవర్‌ .


 • రైతులు విత్తనాలు లేని పండ్లను సంకరీ కరణ పద్దతి సాంకేతికత ద్వారా పండిస్తున్నారు.


 • ఫలాలలో విటమిన్లు , ఖనిజలవణాలు మనకు అందించే అద్భుత వనరులు.


 • ప్రత్యేకంగా పండుగనాడు మాత్రమే తయారీ చేయు పదార్థం - ఉగాది పచ్చడి.


 • AP, తమిళనాడు, కర్నాటకలో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకం -- ఉగాది పచ్చడి .


 • ఉగాది పచ్చడిలో రుచుల సంఖ్య -- 6


అవి -- తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు.


 • షడ్రచులు జీవితంలో మనకు 6 భావోద్వేగాలను సూచిస్తాయి.


 • భ్రౌషద విలువలు కలిగి ఉన్న ఫలాలు -- నిమ్మ, ఉసిరి.


 • వెంట్రుకలు శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫలాలు -- కుంకుడు కాయ, సీకాయ .


 • మొక్కలు CO2, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకుని స్వయంగా ఆహారం తయారు చేసుకునే ప్రకియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
3. మన చుట్టూ ఉండే జంతువులు 
 • పక్షి తలకు ఇరువైపులా రంధ్రాలు ఉంటాయి .


 • ఆ రంధ్రాలు ఈకలతో కప్పివేయబడి ఉంటాయి


 • ఈ రంధ్రాలు పక్షులకు వినికిడి కలిగిస్తాయి


 • జీబ్రా శరీరంపై తెలుపు, నలుపు చారలు చాలా అందంగా ఉన్నాయి


 • చిరుత శరీరంపై నల్లని మచ్చలు ఉన్నాయి


 • గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రకలను స్వెట్టర్‌ లు, కోట్‌ ల తయారీలో ఉపయోగిస్తారు


 • జంతువుల చెవులు బయటకు కనిపించి, చర్మం పై వెంటుకలు ఉండే జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్సాదకాలనని అంటారు


 • శిశోత్వాదకాలనే క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులు అంటారు


 • జంతువు చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండని జంతువులు గుడ్డు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి ఇలాంటి జంతువులను ఆండోత్వ్సాదకాలు అంటారు.


 • డాల్ఫిన్‌ లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి


 • జంతువుల నోరు. చలనాంగాలు అవి తీసుకునే ఆహరాన్ని బట్టి నిర్మించబడ్డాయి .


 • మొక్కలు, మొక్కల నుండి లబించే పదార్ధాలను మాత్రమే ఆహరంగా తీసుకునే జీవులు - శాకాహరులు


 • శాకాహరులకు పదునైన కోరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి


 • శాకాహరులకు ఉదాహరణ :. గేదె, మేక, జింక, గుర్రం


 • గొంగళిపురుగులకు ఆకులను తినే లక్షణం ఉండని తెలుసుకదా. గొంగళి పురుగు శాకాహరి


 • ఇతర జంతువుల మాంసాన్ని ఆహరంగా తీసుకునే జంతువులు - మాంసాహరులు


 • మాంసాహర జంతువులుకు పొడవైన, బలమైన చీల్చే దంతాలు ఉంటాయి


 • Ex:- పిల్లి, కుక్క, సింహం


 • మాంసాహర పక్షులు పదువైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకుని తింటాయి.


 • Ex:- గద్ద, రాబందు


 • పులి దేనికి ఉదాహరణ -మాంసారహరులు


 • ఎలుగుబంటి మొక్కలను, జంతువులను రెండిటినీ తింటుంది .


 • ఎలుగుబంటి దేనికి ఉదాహరణ - ఉభయహరి .


 • ఉభయాహర జీవులు మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహరంగా తీసుకుంటాయి .


 • మాంసాహరులకు పదునైన కోరికే దంతాలు, బలమైన నమిలే దంతాలుతోపాటు చీల్లే దంతాలు కూడా ఉంటాయి.


 • మానవుల ఆహారపు అలవాట్ల వలన వారిని ఉభయాహరులు అంటారు.


 • కాకి ఉభయాహరి.


 • పక్షులు ముక్కల ఆకారాలు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి.


 • ముక్కులు పక్షుల యొక్క దవడలు .


 • ఆహరాన్ని పట్టు కోవడానికి, తమను తాము రక్షించుకోవడం కోసం పక్షులు కాలిగోళ్లను ఉపయోగిస్తాయి .


 • పక్షుల పాదం, కాలిగోళ్ల ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటాయి .


 • పక్షుల కాలిగోళ్ళు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి


 • పక్షులు గుద్దు పెట్టి సమయానికి ముందుగా గూళ్ళు కట్టుకొంటాయి .


 • సాధారణంగా మగ పక్షులు గూళ్ళు కడతాయి .


 • కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది .


 • గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి కొమ్మలు, వైర్లతో అల్లుకుంటుంది .


 • చెట్టు ఆకులను కలిపి , గుడ్డుగా మలిచే పక్షి - టైలర్‌ బర్డ్‌


 • గద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్టు కొమ్మలతో రాతి శిఖరాలపైనా లేదా ఎత్తెన చెట్టుపైన పెడుతుంది .


 • కుందేలు బొరియలో ఉంటుంది .


 • పులులు, సింహాలు గుహలలో ఉంటాయి


 • సాలెపురుగు తన గూడు తానే అల్లుకుంటుంది


 • వలస వెళ్ళే పక్షులు తమ ప్రయాణంలో శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీనిని నివారించుకోవడానికి పక్షులు v ఆకారంలో ప్రయాణిస్తాయి.


 • చీమలు సముహంగా జీవిస్తాయి.


 • చీమల కాలనీలో రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి .


 • చీమలలో క్రమశిక్షణ, పనివిభజన ఉంటుంది .


 • చీమలు విడుదల చేసే రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి


 • తేనెటిగలన్ని కలిసి తుట్టిని నిర్మించుకుని జీవిస్తాయి .


 • తేనెటిగలన్ని కలిసి ఆహరాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి .


 • సమూహంగా కలిసి పనిచేయకపోతే తేనెటీగలు అంతటి అందమైన ఇల్లు నిర్మించుకోలేవు.


 • 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటు సమూహంగా వెళుతుంటాయి .


 • వయసులో పెద్ద ఏనుగు గుంపుకు నాయకత్వం వహిస్తుంది.


 • గుంపులుగా జీవించే ప్రవర్తన ఏనుగులకు రక్షణ ఇస్తుంది.


4. జ్ఞానేంద్రియాలు


 • మానవ శరీరం మూడు భాగాలుగా విభజించబడింది.


 • 1.తల 2. మొండెం 3. చేతులు, కాళ్ళు


 • శబ్దజ్ఞానం ఇచ్చే అవయువం -- చెవి


 • దృష్టి జ్ఞానం ఇచ్చే అవయువం -- కన్ను


 • రుచి జ్ఞానం ఇచ్చే అవయువం -- నాలుక


 • స్పర్శ జ్ఞానం ఇచ్చే అవయువం -- చర్మం


 • వాసన జ్ఞానం ఇచ్చే అవయువం -- ముక్కు


 • జ్ఞానేంద్రియాలు మొత్తం - 5


 • జ్ఞానేంద్రియాలు వివిధ అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందించుటకు సహాయపడతాయి .


 • కళ్ళు చూడడానికి సహాయ పడతాయి


 • కనురెప్పలు, కంటి పక్షాలు కంటిని సంరక్షిస్తాయి.


 • చదివే సమయంలో కంటికి, పుస్తకానికి మధ్య 3౦ సెంటి మీటర్ల దూరం ఉండాలి .


 • టెలివిజన్‌ ను కనీసం 6 అడుగుల దూరం నుండి చూడాలి.


 • అంధులు అనగా కంటి చూపు లేనివారు.


 • అంధులు ఉపయోగించే లిపి - బెయిలి లీపి.


 • అంధుల కోసం ప్రత్యేక లిపి రూపొందించింది - లూయిస్‌ బెయిలీ


 • బెయిలీ లిపిలి లో స్పర్శ ద్వారా చదవగలుగుతాము .


 • ఈగలు కలిగి ఉండే కాళ్ళ సంఖ్య - 5


 • గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కను దృష్టిని కలిగి ఉంటాయి.


 • గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలుగుతుంది .


 • ముక్కు సహాయంతో శ్వాస తీసుకుంటాం, వాసనలు తెలుసుకుంటాం .


 • ముక్కు లోపలి సన్నని వెంట్రుకలు గాలిలోని దుమ్మును వడగట్టి శుభ్రమైన గాలిని లోనికి పంపుతాయి


 • ఘ్రాణ శక్తి అనగా వాసన శక్తి


 • పిల్లులు, కుక్కలకు బాగా సుశిశితమైన ఘ్రాణ శక్తి కలదు.


 • డాగ్‌ స్క్వాడ్‌ గా ఉపయోగించేది - స్నిఫర్‌ డాగ్‌.


 • నేరస్తులను గుర్తించడం కోసం దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలు కనుగొనడం కోసం ఉపయోగించేవి - స్నిఫర్‌ డాగ్‌


 • ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలవు.


 • చెవులతో శబ్బాలను వింటాం .


 • నిశాచర జీవులకు ఉదాహరణ -- గుడ్ల గూబ, గబ్బిలాలు


 • నిశాచర జీవులు అనగా రాతిరి పూట సంచరించేవి.


 • వినికిడి శక్తి చాలా ఎక్కువ గల నిశాచర జీవులకు ఉదాహరణ -- గుడ్ల గూబలు, గబ్బిలాలు


 • పిల్లులు చిన్న శబ్బాలను కూడా వినగలవు .


 • నాలుకపై ఉండే రుచి మొగ్గలు మనకు వివిధ రకాల ఆహారపదార్థాల రుచిని తెలుసుకొనుటకు సహాయపడతాయి .


 • నాలుక సహాయంతో మనం మాట్లాడగలం


 • వినలేని, మాటలాడ లేని వారు సంకేతాలతో తమ భావాలు ఇతరులతో పంచుకుంటారు.


 • ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జంతువులు -- కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు


 • జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది .


 • పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి.


 • జ్ఞానేంద్రయాలు అన్నింటిలో సున్నితమైనది - చర్మం .


 • చర్మం స్పర్శకు ప్రతిస్వందిస్తుంది .


 • పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు .


 • వ్యక్తి గత పరిశుభ్రత అనగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం .


 • PWD చట్టం చేయబడిన సంవత్సరం -- 2016


 • PWD చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు .


 • దివ్యాంగులుకు ఉదాహరణ -- సుధా చంద్రన్‌, రవీంద్ర జైన్‌.


 • సుధా చంద్రన్‌ ఒక నర్తకి. ప్రమాదంలో కాలు కోల్పోయింది.


 • కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయడం మొదలు పెట్టి విజయం సాధించారు .


 • రవీంద్ర జైన్‌ పుట్టుకతో అంధత్యం కలిగి ఉన్నారు .


 • కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోరశ్రమ ఆయనను సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానంలో నిలబెట్టాయి .


 • భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు.


 • అభద్రతా భావం కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు.


 • మన శరీరంలో ఎవరూ చూడకూడని, తాకకూడని కొన్ని భాగాలను రహస్య భాగాలు అంటారు. క6- ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుకభాగం

5. మనం తినే ఆహారం


 


 • ఆహారం తీసుకోవడం సంతోషదాయకం. అది మనకు పని చేయడానికి శక్తిని ఇస్తుంది.


 • మధ్యాహ్న బోజన పధకంలో ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలు .


1. సోమవారం --అన్నం ,పప్పు చారు ,కోడి గుడ్డు కూర ,చిక్కి


2. మంగళ వారం -- పులిహార ,టమాటా పప్పు ,ఉడకబెట్టిన గుడ్డు


3. బుధవారం -- వెజిటబుల్‌ రైస్‌ ,ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు ,చిక్కి


4. గురువారం -- కిచిడీ ( పెసరపప్పు అన్నం ), టమాటా చట్నీ , ఉడకబెట్టిన గుడ్డు


5. శుక్ర వారం - అన్నం ,ఆకు కూర పప్పు , ఉడకబెట్టిన గుడ్డు ,చిక్కి


6. శనివారం - అన్నం ,సాంబార్‌ ,స్వీట్‌ పొంగల్‌


 • మోదుగ, బాదం, మరిచెట్టు ఆకులతో విస్తరాకులు చేస్తారు.


 • ప్లాస్టిక్‌ ప్లేట్లు కవర్ల, సీసాలు ఆహారం నిలువచేయడానికి ఉపయోగిస్తే అందులోని ప్లాస్టిక్‌ కరిగి ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో ప్రవేశించి మనకు వ్యాధులను కలిగిస్తుంది .


 • పచ్చళ్ళకు బూజు పట్టకుండా బాక్టీరియాను నిరోధించడానికి ఉప్పు, నిలువచేసే కారకంగా నూనెలు వాడతారు


 • తాజా పండ్ల ను చక్కెర పాకంలో నిలువ ఉంచవచ్చు.


 • కూరగాయలు, మాంసం , చేపలను అధిక చల్లదనం గల పెట్టెలో నిలువ ఉంచడాన్ని ఫ్రీజింగ్‌ అంటారు .


 • కందిపొడి తయారీకి కావలసిన పద్దార్ధాలు -- కండిపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి.


 • వరి, గోధుమ, పప్పుధాన్యాలు కీటకాలు, బూజుల చేత పాడు చేయబడకుండా ఉండడం కోసం వేప ఆకులను ఎండ బెట్టి నిల్వ ఉంచే సంచులలో వేస్తారు.


 • టిన్‌, స్టీల్‌, అల్యూమినియం డబ్బాలలో నిల్వ ఉంచడం ద్వారా ధాన్యాలను మనం సంరక్షించగలం .


 • కొడవలి తయారు చేసేవాడు - కంసాలి


 • నాగలి తయారు చేసే వాడు - వడ్రంగి
6. నీరు • గ్రామాలలోని చెరువులు నీటి వనరులుగా వ్యవసాయానికి తాగడానికి, ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి.


 • యతలవంక చెరువు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో నీటి గుంటపల్లి వద్ద కలదు.


 • కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి.


 • బుక్కపట్నం, ధర్మవరం చెరువులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి.


 • వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహించే వాటికి ఉదాహరణ -- బుక్కపట్నం, ధర్మవరం చెరువులు.


 • నదుల నీటితో చెరువులు నింపడానికి కూడా కాలువలు తవ్వుతారు. ఇటువంటి చెరువులు కృష్ణా , ఉభయగోదావరి జిల్లాలో ఉన్నాయి.


 • చెరువులు నిర్మాణం వలన భూగర్ధ నీటి మట్టం పెరుగును.


 • చెరువులోని నీటిని అలాగే తాగితే టైఫాయిడ్‌ , కలరా, నీళ్ళ విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి .


 • గ్రామీణ ప్రాంత ప్రజలుకు తాగునీటిని, అందించే బాధ్యత తీసుకునేది - గ్రామ పంచాయతి


 • చెరువులోని నీటి శుద్ది చేయడంలో కొన్ని దశలుంటాయి


 1. చెరువు నుండి నీరు తెర్పే తోట్టెలలో నింపుతారు. నీటిలోని ఇసుక రేణువులు కిందకు చేరుతాయి.

 2. తరువాత నీటిని వడపోత తోట్టెలోనికి పంపిస్తారు.

 3. వడపోయబడిన నీరు క్లోరినేషన్‌ తోట్టెలోకి పంపుతారు .

 4. క్లోరినేషన్‌ చేయబడిన నీరు పెద్దగా ఉండే ఓవర్‌ హెడ్‌ టాంక్‌ లోనికి పంపిస్తారు.

 5. ఓవర్‌ హెడ్‌ టాంక్‌ ల నుండి ఇళ్లకు సరఫరా చేస్తారు.


 • క్లోరినేషన్‌ తోట్టెలో నీటిలోని సూక్ష్మ జీవులను చంపడానికి నీటికి బ్లిచింగ్‌ పౌడర్‌ కలుపుతారు.


 • ప్రభుత్వం రైతులతో నీటి వినియోగ దారుల సంఘాల ఏర్పాటు చేసి వారికి చెరువుల నిర్వహణ బాధ్యత ఇచ్చింది .


 • ఈ సంఘాలవారు కాలువలు, చెరువుల నుండి మొక్కలు, పూడికలు తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. చెరువులోని మట్టి నిక్షేపాలను  పొలంలో వేస్తారు. దీనితో చెరువులలో నీటి మట్టం పెరుగుతుంది


 • నీరు, ఆవిరిగా మారే ప్రకీయను భాష్పీభవనం అంటారు .


 • సూర్యరశ్మి వలన నీరు, గాలిలోనికి ఆవిరి రూపంలో భాష్పీభవనం చెందును.


 • ఇదిఘనీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి


 • మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీనినే ఘనీభవనం అంటారు


 • నీటి చుక్కలు మేఘం నుండి కిందకు రావడాన్ని వర్షం అంటారు


 • నీరు భూమి ఉపరితలం నుండి భాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడి, ఆ తరువాత మేఘాలు చల్లబడి భూమిపైకి ఆవిరి వర్షం రూపంలో తిరిగి చేరుతుంది . ఈ నిరంతర ప్రకియనే జలచక్రం అంటారు..


7. వారి సేవలు విలువైనవి


 


 • రంగుల వేసేవారిని పెయింటర్‌ అంటారు .


 • రంగులు వేయడానికి ఉపయోగించిన పనిముట్లు - బ్రష్‌


 • ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును పనిముట్లు అంటారు.


 • పెయింటర్స్‌ వాడే బ్రష్‌ - పెయింటింగ్‌ బ్రష్‌.


 • క్షురకుడు(షేవింగ్‌) వాడే బ్రష్‌ - షేవింగ్‌ బ్రష్‌


 • చెప్పులు కుట్టేవాడు వాడే బ్రష్‌ - షూ పాలిస్‌ బ్రష్‌


 • నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారు.


 • రైతులు పారతో నేలను చదును చేయడంతో పాటు, నీరు పారడానికి కావలసిన బోదేలను ఏర్పాటు చేస్తారు.


 • రైతులు కొడవలితో కోతలు కోస్తారు.


 • నాగలితో భూమిని దున్నుతారు .


 • దుస్తుల రూపకర్తను ఏమంటారు - దర్జీ(టైలర్‌).


 • ఇంటి నిర్మాణం చెయ్యడానికి మనకు సహాయం చేసే వ్యక్తిని తాపీ మేస్త్రీ అంటారు .


 • కుండలు తయారు చేయువారు - కమ్మరి.


 • బెజవాడ విల్సన్‌ - సామాజిక ఉద్యమకారుడు


 • పొడి మరుగు దొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రంచేసే పారిశుద్ద్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కలిగించడానికి కృషి చేసింది - బెజవాడ విల్సన్‌


 • మరుగుదొడ్డి శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్షికుడి కుమారుడు అదే వృత్తి చేపట్టవలసిన అవసరం లేదు. వారికి స్వేచ్చను సమాన అవకాశాలు ఇవ్వనట్లయితే సామాజిక విభజన పోత్సహించిన వారము అవుతాము అన్నది - బెజవాడ విల్సన్‌.


 • పరిశుభ్రత దైవకార్యం లాంటిది అన్నది - మహాత్మాగాంధి.


 • బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేది - చాకలి/ రజికుడు .


 • బంగారు ఆభరణాలు తయారు చేసేది - కంసాలి .


 • చెప్పులు కుట్టి, సరిచేసేవాడు -- చర్మకారుడు .


 • విధ్యుత్‌ పరికరాలను మరమత్తు చేసేది - ఎలక్ట్రీషియన్‌


 • నీటి పైపుల, పంపుల నిర్వహణ చేసేది - పంబర్‌


 • సామానులు మోయడానికి సహాయపడేది - కూలి (పోర్టర్‌)


 • చేపలను పట్టి అమ్మేది - జాలరి


 • పరిసరాలను శుభ్రంగా ఉంచేది - పారిశుద్ద్య కార్మికులు


 • రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలు, పనిముట్లు అందించేది - వ్యవసాయ అధికారి


 • రైతులకు విద్యుత్‌ సరఫరా చేసి సహకరించేది - విద్యుత్‌ ఇంజనీరు.


 • రైతులకు భూమిహక్కు పాస్‌ పుస్తకాలు అందించేది - తహసిల్డారు .


 • జగదీష్‌ చంద్రబోస్‌ 1858 నవంబర్‌ 30న జన్మించారు


 • మొక్కల పెరుగుదలను గురించే పరికరం అయిన kreskograph(క్రెస్కోగ్రాఫ్‌) ని కనుగొన్న శాస్త్ర వేత్త - జగదీష్‌ చంద్రబోస్‌ .

8. రవాణా
 • మనుషులు, వస్తువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి భూ, జల, వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు.


 • రవాణా వాహనాలకు ఉదాహరణ -- సైకిల్‌, బస్‌, కారు, రైలు .


 • మైదాన ప్రాంత రవాణాకు , కొండ ప్రాంత రవాణాకు వ్యత్యాసం ఉంది.


 • రవాణా వ్యవస్థ అనునది ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది .


 • మైదాన ప్రాంతాలలో సైకిల్‌, బైక్‌, కారు, లారీ, ట్రాక్టర్‌ , ఎద్దులబండి, జట్కా(టాంగా) లాంటివి రవాణాకు ఉపయోగిస్తారు .


 • కొండప్రాంతాలలో ప్రజలు కాలిబాటలలో ప్రయాణిస్తారు .


 • కొండ ప్రాంతాలలో గాడిదలు, గుర్రములు వస్తువుల రవాణాకు ఉపయోగిస్తారు .


 • విశాఖ పట్టణం జిల్లాలోని అరుకు లోయ కొండ ప్రాంత రవాణాకు ఒక ఉదాహరణ .


 • ఈ రోజులలో కొన్ని కొండ ప్రంతాలలో రోప్‌ వే లను ఏర్పాటు చేసుకుని ఏరియల్‌ కార్లు రవాణాకు ఉపయోగిస్తున్నారు .


 • అడవులలో శాస్వత రోడ్డు మార్గాలు ఉండవు .


 • అడవులలో వృద్దులను, రోగులను డోలీలలో మోసుకుని వెళతారు .


 • ఎడారి ప్రాంతాలలో రవాణా సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది.


 • ఎడారిలో ప్రధాన రవాణా సౌకర్యం - ఒంటె.


 • ఒంటె సునాయాసంగా ఎడారిలో ఎక్కువ దూరం నీరు తాగకుండా ప్రయాణిస్తుంది .


 • ఒంటెను ఎడారి పీడ అంటారు.


 • ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది.


 • ధృవ ప్రాంతాలు వఎల్లప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి .


 • ధృవ ప్రంతాలలో కుక్కలు లాగే స్తేడ్డ్‌ బండ్లను రవాణా కొరకు వినియోగిస్తారు .


 • భారత దేశంలో మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు - హిమాలయ పర్వతాలు .


 • హిమాలయ పర్వతాలలోని ప్రజలు జడలబరె, డొలీలు లేక స్లేడ్డ్‌ లను ప్రయాణం కోసం వినియోగిస్తారు.


 • దాల్‌ సరస్సు ఎచట కలదు - జమ్మూకాశ్మీర్‌


 • దాల్‌ సరస్సు పై పడవ రవాణా సాధనంగా ఉపయోగిస్తారు .


 • మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య అనేక లంక గ్రామాలు (ఐలాండ్‌) లో పట్టీలు , 


 • పడవలు రవాణా కోసం వినియోగిస్తారు .


 • అత్యంత వేగంగా ప్రయాణించే రైలు - బూల్లెట్‌ రైలు .


 • నీటిపైన వేగంగా ప్రయాణించే కార్‌ - వాటర్‌ కార్‌


 • గాలిలో ఎగిరేవి - డ్రోన్‌ లు (dron)

9. సమాచార ప్రసారం


 


 • భావాలను అనుభూతులను వ్యక్తంచేయు ప్రకియలను భావప్రసారం అంటారు.


 • భావప్రసారం 2 రకాలు 1. వ్యక్తిగత భావప్రసారం 2. బహుళ సమాచార ప్రసారం


 • ఇది వార్తలను, సందేశాలను పంపించడం లేదా తీసుకోవడం ద్వారా జరుగుతుంది


 • వ్యక్తిగత భావ ప్రసారం కోసం మనం పోస్టల్‌ సేవలు ఉపయోగిస్తాం.


 • Ex: పోస్ట్‌ కార్డులు, ఇన్లాండ్‌ లెటర్‌, పోస్టల్‌ కవర్‌ .


 • పోస్టల్‌ కవర్‌ ను ఎన్వలప్‌ కవర్‌ అంటారు .


 • దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీసుకు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీనిని పిన్‌ కోడ్‌ అంటారు .


 • పిన్‌ కోడ్‌ ను అడ్రస్‌ తో పాటు రాయాలి


 • చిరునామా కలిగి ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించుటకు సహయం చేసేది - పిన్‌ కోడ్‌.


 • PIN = Postal Index Number


 • ప్రస్తుత కాలంలో సత్వర సమాచారం కోసం మొబైల్‌ ఫోన్లు, Emails ఉపయోగిస్తున్నారు


 • ఒక కంప్యూటర్‌ నుండి మరొక కంప్యూటర్‌ కు పంపే సంక్షిప్త సమాచారాలను Email అంటారు .


 • సూచనలు చేయడానికి, డాక్యుమెంట్లను, లెటర్లు, ఫైళ్ళు, ఫోటోలు, వీడియోలు పంపుటకు Email వాడతారు .


 • బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే మాధ్యమం .


 • వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు, ప్రపంచ వార్తలను సమాచారాన్ని ప్రింట్‌(print) రూపంలో అందించేది - వార్తా పత్రిక.


 • రేడియో వినికిడికి సంబంధించిన పరికరం .


 • TV వినికిడి మరియు దృష్టికి సంబంధించిన పరికరం.


 • రేడియో కనుగొన్నది - మూర్కొని .


 • TV కనుగొన్నది - JL బయర్డ్‌.

10. చూసివద్దాం • జాతీయ పండుగలు - గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం


 • స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు - ఆగష్టు 15


 • గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు - జనవరి 26


 • వ్యవసాయానికి సంబంధించిన పండుగ - ఏరువాక


 • మతపరమైన పండుగలు -- దీపావళి, christmas, రంజాన్‌


 • శ్రీరామ నవమి పండుగను హిందువులు మారి లేదా లేదా 20 నెలలో జరుపుకుంటారు .


 • శ్రీరామ నవమి శ్రీరాముని పుట్టిన రోజు.


 • శ్రీరామనవమి రోజున బెల్లంతో చేసిన పానకం అనే ద్రవాన్ని తీసుకుంటారు.


 • కైస్తవులు christmas పండుగను డిసెంబర్‌ 25 న జరుపుకుంటారు.


 • christmas ఏసుకిస్తు పుట్టినరోజు.


 • కిస్‌ మస్‌ పండుగ రోజు శాంతా క్లాజ్‌ పిల్లలకు ఇష్టమైన బహుమతులు ,స్వీట్లు ఇస్తారు.


 • ముస్లిం ల ప్రధాన పండుగ ఈద్‌ - ఉల్‌ - ఫీతర్‌.


 • ఈ రోజు మసీదులో అల్లాను ప్రార్ధిస్తారు .


 • పేదవారికి బహుమతులు, కానుకలు అందచేస్తారు .


 • ఈద్‌ మూబారక్‌ అంటూ శుభాకాంక్షలు ఒకరికి ఒకరు తెలుపుకుంటారు .


 • సిక్కుల ప్రధాన పండుగ -- గురునానక్‌ జయంతి .


 • గురునానక్‌ జయంతిరోజున గురుద్వారాకు వెళ్ళి ౧౧౫/6 చేస్తారు .


 • గురునానక్‌ జయంతిని గురుపరబ్‌ గా పిలుచుకుంటారు.


 • బౌద్దులు జరుపుకునే ముఖ్యమైన పండుగ -- బుద్ధపూర్ణిమ


 • బుద్దపూర్ణిమ అనునది గౌతమబుద్దుని జయంతి.


 • మోదకొండమ్మ జాతర పాడేరు వద్ద గల మోదుగల గ్రామంలో జరుపుతారు.


 • ఉత్తరాంధ్రలోని గిరిజనులు మోదుకొండమ్మ జాతర జరుపుతారు.


 • ఈ జాతర 3 రోజుల పాటు జరుగుతుంది


 • గ్రామదేవత ప్రతిరోజూ రాతిరి వేళ ఊరిలో బండను సందర్శిస్తుంది . ఆ రాయిని పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ఆ ఊరిని బండపల్లి అని పిలుస్తారు .


 • లేపాక్షి ఏ జిల్లాలో గలదు - అనంతపురం


 • లేపాక్షి లో వీరభథ్రుని గుడి ఉన్నది .


 • 1530 వ సంరంలో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడి కట్టారు . 


 • లేపాక్షిలో నంది విగ్రహం కలదు.


 • లేపాక్షిలో గల నందిని లేపాక్షి బసవన్న అంటారు


 • సిద్దవటం కోట ఏ జిల్లాలో గలదు - ysr కడప


 • సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున కలదు - పెన్నా.


 • సిద్దవటం కోటను 1303వ సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు .


 • సిద్దవటం కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు


 • సిద్దవటం కోటకు గల రెండు ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి


 • చంద్ర గిరి కోట ఏజిల్లాలో గలదు -- చిత్తూరు .


 • చంద్ర గిరి కోట 11వ శతాబ్దంలో కట్టబడింది


 • చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత విజయనగర రాజ్య పాలకుల ఆభీనంలో కట్టబడింది .


 • చంద్రగిరి కోటలో గల మహల్‌ లు - రాజమహల్‌ , రాణీ మహల్‌


 • ఈ మహల్‌ లు 300 సంవత్సరాల నుండి అలాగే ఉన్నాయి.


 • రోళ్ళపాడు శాంక్తుయరి ఎ జిల్లాలో కలదు -- కర్నూలు .


 • రోళ్ళపాడు అనునది పక్షుల సంరక్షణా కేంద్రం.


 • రోళ్ళపాడు ఏ పక్షికి ఆవాసం -- బట్టమేక .


 • ISRO అనగా - ఇండియన్‌ స్పేస్‌ రీసెర్ట్‌ ఆర్గనైజేషన్‌


 • ISRO కు ఏ శాస్త్ర వేత్త పేరు పెట్టారు - సతీష్‌ ధావన్‌


 • ISRO రాకెట్‌ ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు .


 • ISRO రాకెట్‌ ప్రయోగ కేంద్రం పులికాట్‌ సరస్సు దగ్గరలో సూళ్ళూరు పేటలో నిర్మించబడింది .


 • కృతిమ ఉపగ్రహలను ఈ రాకెట్‌ ప్రయోగ కేంద్రం ద్వారా అంతరిక్షంలోనికి పంపుతున్నారు.


 • ప్లేమింగో బర్డ్‌ శాంకువరీ ఎచట గలదు -- నేలపట్టు .


 • నేలపట్టు అనునది పులికాట్‌ సరస్సులో గలదు .


 • నేలపట్టులో ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పెస్టివల్‌ నిర్వహిస్తారు .


 • కాకతీయుల కాలంలో ప్రసిద్ద నౌకాశ్రయం -- మోటుపల్లి .


 • 13వ శతాబ్దంలో మోటుపల్లి రేవును సందర్శించిన వెనిస్‌ దేశస్థుడు -- మార్కోపోలో.


 • మోటుపల్లి రేవు ఏ జిల్లాలో గలదు -- ప్రకాశం .


 • మోటుపల్లి రేవు ద్వారా గంధం, ముత్యాలు, లోహాలు, పట్టు, మిరియాలు, దంతం వంటివి అన్నీ దేశాలకు ఎగుమతి అయ్యేవి.


 • అమరావతి స్థూపం లా బౌద్ధ స్థూపం .


 • అమరావతి స్టూపం ఏ జిల్లాలో కలదు -- గుంటూరు .


 • శాతవాహనులు అనుసరించిన మతం -- బౌద్ద మతం .


 • ఆంధ్ర శాతవాహనుల రాజధానులు -- అమరావతి, ధరణి కోట .


 • కొండపల్లి కోట ఏ జిల్లాలో గలదు -- కృష్ణా జిల్లా .


 • కొండపల్లి కోట విజయవాడ దగ్గరలో కలదు .


 • కొండపల్లి కోట నిర్మించింది - ముసునూరి నాయకులు .


 • ముసునూరి నాయకులు 1370 లో పతనం చెందిన తరువాత కొండపల్లి కోటను ఆక్రమించింది - కొండవీడు రెడ్డి రాజులు .


 • కొండపల్లి ప్రాంతం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ది .


 • కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో గలదు - పశ్చిమ గోదావరి


 • కొల్లేరు సరస్సు గోదావరి - కృష్ణ నదుల మధ్య విస్తరించి ఉంది .


 • కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు.


 • కొల్లేరు సరస్సు వద్ద పక్షుల సంరక్షణా కేంద్రం ఎచట గలదు - ఆటపాక


 • కోరింగ వన్యప్రణి సంరక్షణా కేంద్రం ఏ జిల్లాలో కలదు - తూర్పు గోదావరి


 • భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో కోరింగ ఎన్నవ స్థానంలో ఉంది - 2


 • కోరింగ సంరక్షణా కేంద్రంలో అనేక రకాలైన మడచెట్లు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షిజాతులు ఉన్నాయి.


 • మడ ఆవరణ వ్యవస్థ అనునది సముద్రం లేదా మహాసముద్రంలో కలిసే నదీ ప్రదేశం.


 • బొర్ర గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి -- విశాఖపట్టణం


 • బొర్ర గుహలు విశాఖపట్టణం జిల్లా అరకులోయలోని అనంతగిరి కొండలలో ఉన్నాయి .


 • బొర్ర గుహలు పొడవు - 705 మీటర్లు .


 • బొర్ర గుహలు లోతు - 80 మీటర్లు


 • బొర్ర గుహలు సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన ఏ నది కారణంగా ఏర్పడ్డాయి -- గోస్తనీ .


 • బొబ్బిలికోట ఏ జిల్లాలో కలదు - విజయనగరం


 • 19వ శతాబ్దం మధ్య కాలంలో బొబ్బిలిలో ఈ కోట నిర్మించారు .


 • బొబ్బిలి యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది - 1757


 • బొబ్బిలియుద్దం ఎవరెవరికి మద్య జరిగింది - విజయనగర రాజులు, బొబ్బిలి రాజులు .


 • బొబ్బిలి యుద్దంలో మట్టికోట నాశనమైంది తరువాత అదే పేరుతో తిరిగి నిర్మించారు .


 • బొబ్బిలి కి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ది వడ్రంగులు బొబ్బిలి వీణ తయారు చేస్తారు.


 • తెలినీలాపురం మరియు తెలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రలు ఏ జిల్లాలో కలవు -- శీకాకుళం


 • తెలినీలాపురం పక్షుల సంరక్షణా కేంద్రంలో ప్రతిసంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్‌ పక్షులు, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు వలస వస్తాయి.


 • పెలికాన్‌ పక్షులు, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు ఎచట నుండి వలస వస్తాయి -- సైబీరియా


 • ఈ పక్షులు సెప్టెంబర్‌ నుండి మార్షి నెలవరకూ సందర్శిస్తుంటాయి

11. మనమెక్కడ ఉన్నాం


 • ప్రజలు కలసి నివసించే ప్రదేశాన్ని గ్రామం అంటారు.


 • ఒక గ్రామం కలసి స్థిరపడిన వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుంది .


 • దోనూబాయ్‌ గ్రామం శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉంది .


 • దోనూ బాయ్‌ గ్రామం తూర్పున ఉన్నవి -- కొండల, ఫైనాఫిల్‌ తోటలు పడమర -- మల్లి గ్రామం, ఉత్తరాన


 • - ముత్యాలు గ్రామం, దక్షిణాన -- సంభం గ్రామం ఉన్నాయి.


 • సీతంపేట మండలానికి సరిహద్దున తూర్పున -- కొత్తూరు మండలం, పడమరన -- పాలకొండ మండలం , ఉత్తరాన -- భూమిని మండలం, దక్షిణాన -- బూర్జ మండలం


 • శ్రీకాకుళం జిల్లాకు తూర్పున - బంగాళాఖాతం , పడమర, దక్షిణాన - విజయనరం జిల్లా , ఉత్తరాన - బరిసా రాష్ట్రం


 • మన రాస్ట్రం - ఆంధ్ర ప్రదేశ్‌


 • ఆంధ్రప్రదేశ్‌ రాజధాని - అమరావతి


 • ఆంధ్రప్రదేశ్‌ కు తూర్పున - బంగాళాఖాతం ,పడమరన -- కర్ణాటక ,ఉత్తరాన -- ఒడిస్సా, తెలంగాణా, ఛత్తీస్‌ ఘడ్‌ దక్షిణాన - తమిళనాడు ఉన్నాయి.


 • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గల జిల్లాలు - 13


 • దేశంలో విస్తీర్ణంపరంగా ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో ఉంది


 • గ్రామాల కలయిక వలన మండలం, మండలాల కలయిక వలన జిల్లా, జిల్లాల కలయిక వలన రాష్ట్రం ఏర్పడుతుంది .
12. జిల్లాలు -- ప్రధాన కార్యాలయాలుశ్రీకాకుళం - శ్రీకాకుళం


విజయనగరం - విజయనగరం


విశాఖపట్టణం - విశాఖపట్టణం


తూర్పు గోదావరి - కాకినాడ

పశ్చిమ గోదావరి - ఏలూరు


కృష్ణ - మచిలీపట్టణం


గుంటూరు - గుంటూరు


ప్రకాశం - ఒంగోలు


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు - నెల్లూరు


చిత్తూరు - చిత్తూరు


YSR కడప - కడప


అనంతపురం - అనంతపురం


కర్నూలు - కర్నూలు

ఆంధ్ర ప్రదేశ్‌ లో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలో -- వాటి కార్యాలయాల వివరాలు .శ్రీకాకుళం - శ్రీకాకుళం


పార్వతిపురం - పార్వతిపురం


విజయనగరం - విజయనగరం


విశాఖపట్నం - విశాఖపట్నం


అల్లూరి సీతా రామరాజు - పాడేరు


అనకాపల్లి - అనకాపల్లి


కాకినాడ - కాకినాడ


ఈస్ట్ గోదావరి - రాజమండ్రి


కోనసీమ - అమలాపురం


ఏలూరు - ఏలూరు


వెస్ట్ గోదావరి - భీమవరం


NTR - విజయవాడ


కృష్ణ - మచిలీపట్నం


పల్నాడు - నరసరావ్‌ పేట


గుంటూరు - గుంటూరు


బాపట్ల - బాపట్ల


ప్రకాశం - ఒంగోల్


శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు - నెల్లూరు


కర్నూల్‌ - కర్నూల్‌


నంద్యాల్‌ - నంద్యాల్‌


అనంతపూర్‌ - అనంతపూర్‌


శ్రీసత్య సాయి - పుట్టపర్తి 


YSR - కడప 


అన్నమయ్య - రాయచోటి 


తిరుపతి - తిరుపతి 


చిత్తూర్‌ - చిత్తూర్ 
 • రాష్ట్రముల కలయిక వలన దేశం ఏర్పడుతుంది . • మన దేశం పేరు - భారతదేశం


 • భారతదేశ రాజధాని - న్యూడిల్లీ .


 • భారత దేశంలో రాష్ట్రాలు - 28


 • కేంద్ర పాలిత ప్రాంతాలు - 8


 • భారతదేశం విస్తీర్ణ పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది.


 • జనాభా పరంగా భారతదేశం 2వ స్థానంలో ఉంది


 • భారత దేశానికి తూర్పున - బంగాళాఖాతం ,పడమర -- అరేబియా సముద్రం .,.ఉత్తరాన - హిమాలయ పర్వతాలు ,దక్షిణాన - హిందూ మహాసముద్రం ఉన్నాయి.

రాష్ట్రములు 

రాజధానులు 

ఆంధ్రప్రదేశ్‌

అమరావతి

అరుణాచల్‌ ప్రదేశ్‌

ఈటానగర్‌

అస్సాం

డిస్పూర్‌

బీహార్‌

పాట్నా

చత్తీస్ ఘడ్ 

రాయ్‌ పూర్‌

గోవా

పనాజీ

గుజరాత్

గాంధీనగర్‌

హర్యానా

ఛండీగడ్‌

హిమాచల్‌ ప్రదేశ్‌

సిమ్లా

జార్కండ్‌

రాంచీ

కర్ణాటక 

బెంగళూరు

కేరళ

తిరువనంతపురం

మధ్యప్రదేశ్‌

భోపాల్‌

మహారాష్ట్ర

ముంబాయి

మణిపుర్‌

ఇంఫాల్‌

మేఘాలయ

షిల్లాంగ్‌

మిజోరాం

ఐజ్వాల్‌

నాగాలాండ్‌

కొహిమా

ఒడిశా

భువనేశ్వర్‌

పంజాబ్‌

ఛండీగడ్‌

రాజస్థాన్‌

జైపూర్‌

సిక్కిం

గ్యాంగ్‌ టక్‌

తమిళనాడు

చెన్నై 

త్రిపుర 

అగర్హలా

ఉత్తర ప్రదేశ్‌

లక్నో

ఉత్తరాఖండ్‌

డెహ్రడూన్‌

పశ్చిమ బెంగాల్‌

కోల్‌ కతా
 • కొన్ని దేశాలు కలసి ఏర్పరిచేది - ఖండం


 • భూగోళం 3 వంతుల నీటితో నూ, ఒక వంతు భూభాగంతోనూ నిండి ఉంది


 • భూగోళంపై ఉన్న భూభాగం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించారు. ఈ భాగాలను ఖండాలు అంటారు


 • ఖండాలు మొత్తం పా - 7


 • ఖండాలన్నింటితో కలపిన భూమిని ప్రపంచం అంటారు.


 • ఖండాలు - 1. ఆసియా 2 ఆఫ్రికా 3.ఉత్తర అమెరికా 4.దక్షిణ అమెరికా 5.అంటార్కిటికా 6.ఐరోపా 7.ఆస్టేలియా


 • అతిపెద్ద ఖండం - ఆసియా


 • అతి చిన్న ఖండం -- ఆస్టేలియా


 • మంచు ఖండం - అంటార్కిటికా


 • చీకటి ఖండం -- ఆఫ్రికా


 • పక్షిఖండం -- దక్షిణ అమెరికా


 • భూగోళంపై ఉన్న జలభాగాన్ని 5 భాగాలు గా విభజించారు .


 • ఈ 5 భాగాలను మహాసముద్రములు అంటారు.


1. పసిఫిక్‌ మహాసముద్రం

2. అట్లాంటిక్‌ మహాసముద్రం

3. హిందూ మహాసముద్రం

4. ఆర్కిటిక్‌ మహాసముద్రం

5. ఆంటార్కిటికా మహాసముద్రం


 • మహాసముద్రలలో బాగా లోతైనది - పసిఫిక్‌ మహాసముద్రం


 • భూమిపై ఉన్న బాగా దట్టమైన అరణ్యాలు కు ఉదాహరణ -- ఆమెజాన్‌


 • భూమి పై ఉన్న ఎత్తెన పర్వతాలుకు ఉదాహరణ -- హిమాలయాలు


 • భూమి పైన ఉన్న విశాలమైన ఎడారులు కు ఉదాహరణ -- సహారా.


 • భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు


 • భూ భ్రమణానికి పట్టే సమయం - 24 గంటలు


 • భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు.


 • భూ పరిభ్రమణానికి పట్టే సమయం - 365¼ రోజులు.


 • భూమి యొక్క చలనం వలన రాతిరి, పగలు ఏర్పడతాయి


 • నక్షత్రముల గుంపును నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు.


 • నక్షత్రములు గుంపులుగా ఒక ఆకారంలో ఉంటాయి.


 • చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతుంది. ఈ మార్పులను చంద్ర దశలు అంటారు .


 • రాతిరి వేళ చందుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజును ఏమంటారు -- పార్ణమి


 • చంద్రుడు కనిపించని రోజును ఏమంటారు -- అమావాస్య .