AP TET 2022 Telugu Notes for Class 5 | Best notes for Home Preparation 5వ తరగతి - తెలుగు తోట
1. ఏ దేశమేగినా
ఇతివృత్తం - దేశభక్తి
ప్రక్రియ - గేయం
కవి పరిచయం :
రాయప్రోలు సుబ్బారావు
(13.03.1892 -
30.06.1984)
రచనలు - తృణకంకణం, స్నేహాలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావాళి, జడకుచ్చులు, వనమాల
రమ్యా లోకం, మాధురీ దర్శనం
- లక్షణ
గ్రంధాలు
బిరుదులు - అభినవ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు, పద్మ భూషణ్
పదాలు - అర్ధాలు :
పీఠం - గద్దె, సింహాసనం
యోగం - అదృష్టం
స్వర్గ ఖండం - స్వర్గం లాంటి భారతదేశం
జనియించుట - పుట్టుట
తెనుంగు - తెలుగు
కాలిడు - అడుగుపెట్టు
భారతి - భారతదేశం
గర్భం - కడుపు
సోకు - తగులు
అనంతం - అంతు లేనిది
పద్యం :
ఆంధ్రభాష యమృత
మాంద్రాక్షరంబులు
మురుపు లొలుకు
గుండ్ర ముత్తియములు
ఆంధ్రదేశ మాయురారోగ్య
వర్ధకం
భాంద్రజాతి నీతి
ననుసరించి
- వేటూరి
ప్రభాకర శాస్త్రి
భావం :
ఆంధ్ర
భాష అమృతం వంటిది.
తెలుగు అక్షరాలు గుండ్రముగా ముత్యాల్లా ఉండి అందాలొలుకుతూ
ఉంటాయి. ఆంధ్ర
దేశం ఆయుష్షును, ఆరోగ్యాన్ని
వృద్ధి చేస్తుంది.
ఆంధ్ర జాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది.
వివేకానందుని
షికాగో ప్రసంగం
- స్వామి చిరంతనానంద
1893 సెప్టెంబర్ 11 - షికాగో కొలంబస్
హాల్ - సర్వమత
మహాసభ
సాయం
ఇతివృత్తం - పరోపకారం (భూతదయ)
ప్రక్రియ - కథనం
కవి పరిచయం :
జాక్ కొప్ ( 1913 - 1991)
దక్షిణాఫ్రికా
నవలా రచయిత
ఇది ఒక అనువాద
కధ
పదాలు - అర్ధాలు :
దృశ్యం - చూడదగినది
కష్టం - ఇబ్బంది
ఆత్రం - తొందర
అవధులు - హద్దులు
గుంపు - సమూహం
ఆసక్తి - ఆపేక్ష
పద్యం :
గువ్వ కొరకు మేనుకోసి
యా శిబిరాజు
వార్త విడువరాక
కీర్తి కెక్కె
ఓగు నెంచబోవ రుపకారి
నెంతురు
విశ్వదాభిరామ వినుర
వేమ !
- వేమన
భావం :
తన
దేహమును కోసి ఇచ్చి పావురమును కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు. చెడ్డ వారిని ఎవరు
తలచుకోరు. ఉపకారం
చేయువారిని అందరూ గుర్తుంచుకొంటారు.
అనకు
కనకు వినకు
కవి పరిచయం :
జంధ్యాల పాపయ్య
శాస్త్రి (
04.08.1912 - 21.06.1992)
కరుణశ్రీ గా సుప్రసిద్ధులు
రచనలు - ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, అరుణకిరణాలు
పిల్లల కోసం తెలుగు
బాల శతకం
గాంధీకి 3 కోతులు బొమ్మను
బహుమతిగా పొందారు.
ఆ 3 కోతులు మనకి "చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు" అనే
విషయం భోదిస్తున్నాయి అని
మహాదేవ్ దేశాయ్
గారికి వివరించారు.
కొండవాగు
ఇతివృత్తం - ప్రకృతి వర్ణన
ప్రక్రియ - లేఖ
కవి పరిచయం :
చెరుకుపల్లి జమదాగ్ని
శర్మ (1920 -
1986)
కలం పేరు - జమదాగ్ని
రచనలు - మహోదయం, చిలకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి
పదాలు - అర్ధాలు :
మేట - ఇసుక ప్రవాహం
వాగు - చిన్న ఏరు
జాలువారు - జారుతున్న
బాట - దారి
క్షేమం - కులాసా
పొద్దు - రోజు, దినం
దృశ్యం - సన్నివేశం
బారులు - వరుసలు
లంక - నదిలో పైకి లేచి ఉన్న భూభాగం
కదంతొక్కు - ఉత్సాహంతో ముందుకెళ్లు
పదజాలం :
మొదటి వాక్యం ఏ
పదంతో ముగుస్తుందో రెండో వాక్యం ఆ పదంతో ప్రారంభం అవ్వడం - ముక్తపదగ్రస్తం
ఉదా :
సెలయేటి దరివొక్క
చెంగల్వ బాట
బాట వెంట పోతే
పువ్వుల్ల తోట
పాఠ్యభాగం :
లేఖ రాసినది - జావేద్
జావేద్ లేఖ ఎవరికి
రాసాడు - వెంకట్
ఊరు చూడడానికి
వెళ్లినది - జావేద్, రామం, సూర్య
వాగు - కామధేనువు
బండ - సింహాసనం
దారులు - గీతలు
ఇల్లు - కొండపల్లి బొమ్మలు
మేఘాలు - ఏనుగుల బారులు
నేలపట్టు పక్షి
సంరక్షణ కేంద్రం -
నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం సమీపంలో ఉంది
ఈ ప్రాంతానికి
సముద్ర రామచిలుకలు (ఫ్లెమింగో), గూడబాతులు (పెలికాన్), ఎర్రకాళ్ళ కొంగలు, నల్లకాళ్ళ కొంగలు, నారాయణ పక్షులు, స్వాతి కొంగలు, తెడ్డు ముక్కు
కొంగలు, చుక్కమూతి
బాతులు
లాంటి పక్షులు దేశ విదేశాల నుండి వస్తాయి.
పెలికాన్ పక్షులు
ఇక్కడ గూడు కట్టి గుడ్లు పొదుగును.
ప్రతి సంవత్సరం
జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్లూరు పేటలో జరుగుతుంది.
ఫ్లెమింగోలు నైజీరియా
నుండి వస్తాయి.
పద్యం :
జననీ జనకుల గొలుచుట
తనయునకును ముఖ్యమైన
ధర్మము జననీ
జనకుల గొల్చుట
కంటెను
దనయున కభ్యదికమైన
ధర్మం గలదే
- శ్రీనాధుడు
భావం :
తల్లిదండ్రులను
సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకి తల్లిదండ్రులను
సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు
వడగళ్ళు
రచయిత - ఏడిద కామేశ్వరరావు
( 12.09.1913 -
1984 )
ఆకాశవాణిలో పని
చేశారు.
"రేడియో అన్నయ్య" గా ప్రసిద్ధులు
రచనలు - రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర
Special Thanks To Mr.ABR