విద్యా లక్ష్యాలు - బ్లూమ్స్ - వర్గీకరణ
1948 సంవత్సరంలో అమెకికన్ సైకలాజికల్ అసోసియేషన్ వారి సమావేశంలో పాల్గొన్న అనేక కళాశాలలకు చెందిన పరీక్షకులు ఒప్పందం ప్రకారం మొత్తం విద్యా లక్ష్యాలను మూడు వర్గాలుగా విభజించారు అవి
1)జ్ఞానాత్మక రంగం
2)భావావేశ రంగం
3)మానసిక చలనాత్మక రంగం
పై మూడు రంగాలలో జ్ఞానాత్మక రంగం గురించి బెంజిమన్ ఎస్. బ్లూమ్, భావావేశ రంగం గురించి డేవిడ్ ఆర్. క్రాతాల్ విశేష కృషి చేయడం జరిగింది. మానసిక చలనాత్మక రంగం గురించి ఎలిజబెత్ సంప్సన్. ఆర్.హెచ్. దావే
హీరో మొదలైన వారు కృషి చేశారు.
విద్యార్థి ప్రవర్తన మూడు రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఎందువలనంటే గాంధీజీ చెప్పినట్లు విద్య యొక్క పరమావధి
శారీరక మానసిక, ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడమే. జ్ఞానాత్మక రంగం మెదడుకు (Head) భావావేశ
రంగం హృదయానికి (Heart) మానసిక చలనాత్మక రంగం మనస్సుకు - శరీరానికి (Hand - Body) సంబంధించినది.
బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణ
జ్ఞానాత్మక రంగం
-
జ్ఞానము
-
అవగాహన (లేదా) అవబోధం
-
వినియోగం (లేదా) అన్వయం
-
విశ్లేషణ
-
సంశ్లేషణ
-
మూల్యాంకనం
భావావేక రంగం
1. గ్రహించడం
2. ప్రతిస్పందించటం
3. విలువ కట్టడం
4. వ్యవస్థాపన
5. శీలస్థాపన
మానసిక చలనాత్మక రంగం
1. అనుకరణ
2. హస్తలాఘనం
3. సునిశితత్వం
4. ఉచ్చారణ
5. సహజీకరణ స్వాభావీకరణ
ఎ. జ్ఞానాత్మక రంగం :-
బ్లూమ్స్ మాటలలో జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేది జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించుకోవటం అనే వాటికి సంబంధించినది. ఈ క్షేత్రంలో 6నీపానాలు ఉన్నాయి. వీటిని సరళం నుంచి సంక్లిష్టం అనే లక్షణం ఆధారంగా ఒక ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి. ఉదాహరణకు వినియోగం అవగాహన కంటే ఎక్కువ క్లిష్టంగాను, విశ్లేషణ కంటే తక్కువ క్లిష్టంగాను ఉంటుంది.
3. వినియోగం :- ప్రస్తుత విద్యావ్యవస్థలో ముఖ్యమైనది.
జ్ఞానం లేకుండా అవగాహన జరగదు. అవగాహన జరగకుండా వినియోగం జరగదు.
ఇది అవగాహన కంటే క్లిష్టమైనది.
విద్యార్ధి నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో సమస్య పరిష్కారానికి ఉపయోగించడం
4. విశ్లేషణ :- ఒక స్థూలమైన విషయాన్ని అనేక సూక్ష్మ అంశాలుగా విడగొట్టి వాటి మధ్యగల తార్కిక సంబంధం, వ్యవస్థీకరణ విధానాన్ని గురించి తెలుసుకోవడమే విశ్లేషణ.
H20 → H2 + O2
5. సంశ్లేషణ :- వివిధ దత్తాంశాల ఆధారంగా నూతన విషయాల ఆవిష్కరణ జరుగుతుంది. వ్యాసాల్ని రాయటం, సిదాంత వ్యాసాల్ని వ్యవస్థీకరించటం, క్రమబద్ధమైన భాషణలు ఇవ్వడం, నూతన పద్ధతులు కనుగొని సమస్యాపరిష్కారం చేయటం మొదలైనవి.
6. మూల్యాంకనం :- ఉన్నత క్రమ లక్ష్యం. వివిధ వాక్యాలు, సత్యాలు, విలువలు, విధానాలు, పద్ధతులకు సంబంధించిన నిర్ణయాలను చేయగలిగే శక్తిని పెంపొందించడమే ఈ లక్ష్యం యొక్క ఉద్దేశ్యం
మంచి - చెడు - ఉత్తమ, అధమాల మధ్య గల తేడాలను గుర్తించగలగడమే మూల్యాంకనం
ఉదా :- మితిమీరిన కంప్యూటర్లు వినియోగం ఎంత వరకు సమర్ధనీయమో నిర్ణయించగలగడం
2) భావావేశ రంగం :-
-
డేవిడ్ ఆర్. క్రామ్హల్ ఈ రంగానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు.
-
ఈ రంగంలో అభిరుచులు, విలువలు, వైఖరులు, దృక్పథాలు, అభినందన మొదలైన లక్ష్యాలను పొందుపరచటం జరిగింది.
-
ఈ రంగం హృదయానికి, ఉద్వేగాలకు సంబంధించినది.
-
నేటి విద్యావ్యవస్థలో ఈ రంగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాత్మకమైన మూల్యంకనం జరగడం లేదు.
-
ఈ రంగానికి సంబంధించి 5 ముఖ్య దశలున్నాయి. అవి గ్రహిండటం, ప్రతిస్పందించటం, విలువ కట్టడం, వ్యవస్థాపన చేయడం, శీలస్థాపన చేయడం. ఈ ఐదింటిని క్రమానుగతంగా అమర్చటం జరిగింది.
1. గ్రహించడం
-
కొన్ని ఉద్దీపనలకు లేదా దృగ్విషయాలకు తగిన సునిశితత్వాన్ని ప్రదర్శించడం లేదా ఆయా ఉద్దీపనలను గ్రహించడానికి లేదా వాటిపై అవధానం చూపడానికి సంసిద్ధతను తెలియజేయటమే గ్రహించటం.
-
సాంఘిక శాస్త్రానికి సంబంధించిన సమాచారం లభించే వివిధ ప్రదేశాలను తెలుసుకోవటం, ఆయా విషయాలు తారసపడినపుడు వాటిని గుర్తించటం ఈ అక్ష్యానికి చెందినవి.
-
గ్రహించటం అంటే వివిధ ప్రేరణలకు తగిన ప్రతిస్పందనలు కలుగజేయటమే.
-
ఇచ్చిన ప్రేరణలకు మిగిలిన వాటి మధ్య బేధాలను ఉపసుస్తవస్థలో కూడా గుర్తించగలగడం ఉదా :- పర్యావరణ కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్ధం చేసుకోవటం.
-
విషయాన్ని తెలుసుకోవటం, గ్రహించటానికి ఇష్టపడటం, నిబంధిత అవధానం ఈ దశలోని సోపానాలు.
2. ప్రతిస్పందించడం
-
ఇది గ్రహించడం కంటే ఉన్నత క్రమానికి చెందింది.
-
ఈ దశలో విద్యార్ధి సాంఘిక శాస్త్ర విషయాలను గురించి చదవటం, వివిధ శాస్త్ర ప్రాజెక్టులలో, పాఠ్యేతర దృక్పధాలలో ఆసక్తిని కనబరచడం.
-
విద్యార్ధులలో ‘ఆసక్తులు' ఈ దశలోనే ఏర్పడతాయి.
ఉదా :- వివిధ రకాల నాగరికతలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రాచీన కట్టడాలను చూడాలనే ఆసక్తి.
-
ప్రతిస్పందించటం, ప్రతిస్పందించటానికి ఇష్టపడటం, ప్రతిస్పందనకు పూర్తి సంతృప్తిని పొందడంతో ఈ దశ పూర్వతుంది.
3. విలువ కట్టడం
-
ఈ దశ మూడవది, విద్యార్థిలో ఏర్పడిన భావాలు, విలువలు అందర్లీనత చెంది ఆయా భావాలకు, విలువలకు కట్టుబడి ఉండటం జరుగుతుంది.
-
మూఢనమ్మకాలను విస్మరించటం, శాస్త్రీయ వైఖరులను పెంపొందించుకోవటం జరుగుతుంది.
-
ఇతరులు చెప్పిన విషయాలను పరిశీలించి తగిన అభిప్రాయాలను ఏర్పరచుకోవటం జరుగుతుంది.
-
అభినందించే గుణం ఈ దశలోనే అభివృద్ధి చెందుతుంది. విలువలను అంగీకరించడం, ప్రాధానం ఇవ్వటం, విలువలకు అంకితం కావటం ఈ దశలో జరుగుతుంది.
4. వ్యవస్థాపన
-
ఈ స్థాయిలో విద్యార్ధులలో విలువలు అభివృద్ధి చెందుతాయి. విలువల మధ్య సంబంధాలు ఏర్పడతాయి
-
విలువ మధ్య పోలికల, సంశ్లేషణ జరుగుతుంది.
-
జీవిత తత్వం ఈ దశలోనే అభివృద్ధి చెందుతుంది.
5. శీలస్థాపనం :-
-
విలువలను ప్రవర్తనలో భాగంగా మార్చడం.
-
వైవిధ్యం కలిగిన వివిధ కృత్యాలను నేర్చుకోవటం.
-
వివిధ సర్దుబాట్లు జరుగుతాయి.
3) మానసిక చలనాత్మక రంగం :-
-
కండరాల నైపుణ్యాలకు సంబంధించిన లక్ష్యాలతో కూడుకున్న రంగమిది. ఈ రంగంలో విద్యా లక్ష్యాలను పూర్తిగా రూపొందించనందు వల్ల ఈ రంగానికి అంత ప్రాముఖ్యం ఇవ్వటం లేదు.
-
ఈ రంగంలో హస్తలాఘవ నైపుణ్యం, చిత్రలేఖనా నైపుణ్యం, చేర్చటం జరిగింది. దీనియందు 5 నైపుణ్యాలు ఉంటాయి.
1. అనుకరణ :-
-
ఇతరులు చేసే పనిని అనుకరణ ద్వారా చేయటం నేర్చుకొంటారు.
-
నైపుణ్యాలు సాధించటంలో అనుకరణ అత్యున్నత పాత్ర వహిస్తుంది.
-
అనుకరణలో విద్యార్ధికి తను చేసే కృత్యం మీద ఎటువంటి నియంత్రణ ఉండదు.
-
దీనియందు నిష్పాదనలు అసంపూర్ణంగా, అపరిపక్వంగాను ఉంటాయి.
-
ఇది అంతర్గత ప్రేరణతో ప్రారంభమవుతుంది.
-
అనుకరణ జ్ఞానేంద్రియాల వినియోగం ద్వారా జరుగుతుంది.
2. హస్తలాఘవం :-
-
మార్గదర్శక సూత్రాన్ననుసరించి సరియైన మార్గాన్ని ఎన్నుకొని కార్యాచరణతో పెట్టడమే హస్తలాఘవం.
-
విద్యార్ధి కృత్యాలను నైపుణ్యంతో నిష్పాదన చేయగల శక్తిని ఈ దశలోనే పొందుతాడు.
ఉదా:- దిశలను అనుసరించటం, కృత్యాలు సాధన చేయటం పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించుట మొ॥
3. సునిశితత్వం
-
పనిని వేగంగా పరిపక్వతతో చేయగలిగిననాడు విద్యార్థి తన అవసరాలకు అనుగుణంగా నియంత్రించే సామర్ధ్యాన్ని పొందగలడు.
-
ఈ దశలో సంక్లిష్ట ప్రక్రియలో ఇమిడియున్న అనేక పరికర్మలను నిష్పాదన చేసి, అన్నిటికీ తగిన సాధన చేయగల సామర్ధ్యమే సునిశితత్వం. ఉదా :- ప్రయోగాలు చేసేటప్పుడు, పరిశీలనలు జరిపేటప్పుడు కచ్చితంగా రీడింగులు తీసుకుంటాడు.
4. సమన్వయం / ఉచ్ఛారణ
-
వేర్వేరు పనులను సమన్వయపరచడమే ఈ లక్ష్యం ముఖ్యోద్దేశం.
-
వివిధ కృత్యాలను సంబంధానుగుణంగా ఒక వరుస క్రమంలో అమర్చి వాటి మధ్య సమన్వయాన్ని కలుగజేసే శక్తి సామర్ధ్యాలను పెంపొందించటం ఈ దశలో జరుగును. ఉదా :- కృత్యాలను వేగంగా, సకాలంలో, ఖచ్చితంగా తన ఆధీనంలో చేయగల నైపుణ్యం.
5. సహజీకరణం / సహజతత్వం
-
ఈ రంగంలో ఇదే అత్యున్నత లక్ష్యం. ఏ కృత్యాన్నైనా అప్రయత్నంగా, తనంతట తానుగా అతి సహజంగా, ఎటువంటి తడబాటు లేకుండా చేయటమే సహజీకరణం అంటారు.
-
కొంచెం కూడా మానసికశక్తిని, ఉపయోగించకుండా, తన పనిని యాంత్రికంగా, అనాలోచితంగా చేసుకుపోతాడు, ఉదా :- సులభంగా, సహజంగా, ఎటువంటి తడబాటు లేకుండా పటాలు గీయటం, పటంలో ప్రదేశాలను గుర్తించడం.
లోపాలు
-
మానసిక ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వలేదు. రాయడం మానసిక ప్రక్రియ.
-
జ్ఞానాత్మక రంగానికి ఇచ్చిన ప్రాముఖ్యం, స్పష్టత, భావావేశ రంగానికి లభించలేదు.
-
అన్ని ప్రవర్తనలను మాపనం చేయడానికి తగిన మూల్యాంకనా సాధనాలు అందుబాటులో లేవు.
-
లక్ష్యాల పరిజ్ఞానం లేని ఉపాధ్యాయుడు అనుకున్న ఫలితాలు సాధించలేడు.
-
సాంఘీకరణకు ఈ లక్ష్యాలు తోడ్పడవు.
-
వివరణాత్మక బోధన జరిగే అవకాశం తక్కువ.
-
విద్యార్ధులు పాలుపొంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి గాని లక్ష్యసాధనకు కాదని జాన్సన్ అభిప్రాయం.
-
ఆర్వెల్ ఉద్దేశ్యంలో విలువల వర్గీకరణలో స్పష్టత, సంతృప్తి లేదు.
అండర్సన్, క్రాత్ హాల్ వర్గీకరణ
-
బ్లూమ్స్ వర్గీకరణ ఇప్పుడున్న విద్యావ్యవస్థకు అనుకూలంగా లేదని భావించి 21వ శతాబ్ది అభ్యాసనకు అనుగుణంగా బోధనాభ్యాసనలో మార్పులు చోటుచేసుకుంటూ అండర్సన్ క్రాతల్, బ్లూమ్స్ రూపొందించిన వర్గీకరణను పునః సమీక్షించారు.
-
అండర్సన్ క్రాతాల్, బ్లూమ్స్ రూపొందించిన జ్ఞానాత్మక రంగాన్ని మార్చివేసి 2001లో “A Taxonomy for learning teaching and Assessing" అనే పుస్తకంలో A Revision of Bloom's Taxonomy అనే కొత్త వర్గీకరణను ప్రచురించాడు
.
-
అండర్సన్ క్రాత్ హాల్ వర్గీకరణలో కూడా ఆరు లక్ష్యాలు ఉన్నాయి. ఇవి ఒక సోపాన క్రమంలో తక్కువస్థాయి నుంచి ఎక్కువ స్థాయిలో అమర్చడం జరిగింది.
-
బ్లూమ్స్ టాక్సానమిలో ఒక పరిమాణం (one dimension) అయిన జ్ఞానాత్మక పరిమాణం మాత్రమే ఉంది.
-
అండర్సన్, క్రాతాల్ ద్విపరిమాణ (two dimension) ను సూచించారు అవి 24 స్థాయిలో వివరించడం జరిగింది.
-
జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం (Cogniative Process Dimension)
-
జ్ఞాన పరిమాణం (Knowledge Dimension)
జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం: ఇందులో 6 లక్ష్యాలు కలవు.
-
గుర్తుకు తెచ్చుకొనడం (Remembering)
-
అవగాహన పొందడం (Understanding)
-
అన్వయించడం (Applying)
-
విశ్లేషించడం (Analysing)
-
మూల్యాంకనం చేయడం (Evaluating)
-
సృష్టిండం (Creating)
అండర్సన్, క్రాత్ల్ వర్గీకరణ బ్లూమ్స్ యొక్క వర్గీకరణకు ఏ విధంగా భిన్నమైనదో ఈ క్రింది పటం ద్వారా తెలుసుకొందాం
1956
మూల్యాంకనం
సంశ్లేషణ
విశ్లేషణ
అనువర్తించుట
గ్రహించుట
జ్ఞానం
2001
సృజించుట
మూల్యాంకనం
విశ్లేషించుట
అనువర్తించుట
అవగాహన
గుర్తు తెచ్చుకొనుట
గణిత బోధనా లక్ష్యాలు- స్పష్టీకరణలు
1. జ్ఞానాత్మక రంగం :-
-
జ్ఞానం :- విద్యార్ధి గణిత పాఠ్యవిషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియామాలు, యదార్ధాలు సముపార్జించుకుంటాడు.
స్పష్టీకరణలు : జ్ఞప్తికి తెచ్చుకొనుట :-
విద్యార్ధి గణిత పాఠ్య విషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు, యదార్ధాలు జ్ఞప్తికి తెచ్చుకొంటారు.
గుర్తించుట :-
విద్యార్ధి గణిత పాఠ్యవిషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు, యధార్ధాలు జ్ఞానాన్ని ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు.
2. అవగాహన :- విద్యార్ధి గణిత పాఠ్య విషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు, యదార్ధాలు జ్ఞానాన్ని అవగాహన చేసుకొంటాడు.
స్పష్టీకరణలు :-
-
సొంత ఉదాహరణలిస్తాడు
-
దోషాలను గుర్తించి సరిచేస్తాడు
-
సన్నిహిత సంబంధమున్న భావనలను, సామ్యవిభేదాలు కనుక్కొంటాడు.
-
ప్రమాణానుగుణంగా వర్గీకరిస్తాడు.
-
శాబ్దిక ప్రవచనాలను సాంకేతిక ప్రవచనాలుగా, సాంకేతిక ప్రవచనాలను శాబ్దిక ప్రవచనాలుగా అనువాదిస్తారు.
-
దత్తాంశాల్లో గల సన్నిహిత సంబంధాలను గుర్తిస్తారు.
-
సన్నిహిత సంబంధమున్న భావనలను విచక్షణ చేస్తాడు.
-
ఫలితాలను అంచనా వేస్తాడు.
-
ఫలితాలను సరిచూస్తాడు.
-
రేఖాపటాలు, పట్టికలు, చిత్రపటాలను వ్యాఖ్యానిస్తాడు.
-
కావలసిన గుర్తును, సంఖ్యను, సూత్రాన్ని గణిత ప్రక్రియల్లో ప్రతిక్షేపిస్తాడు.
-
దత్త ప్రవచనాన్ని గానీ, సూత్రాన్ని గానీ వీలైనన్ని రూపాల్లో వ్యక్తీకరిస్తాడు వివరించగలుగుతాడు.
-
విద్యార్ధి సూత్రాలు మొదలైన వాటిని సూచిస్తాడు.
3. వినియోగం :- విద్యార్ధి గణిత పాఠ్య విషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు, యదార్ధాలు, జ్ఞానాన్ని అవగాహనను నూతన పరిస్థితుల్లో, నిజజీవితంలో వినియోగిస్తాడు.
స్పష్టీకరణలు :-
-
విశ్లేషణ చేస్తాడు
-
సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కొంటాడు.
-
సరస్పర సంబంధాలను స్థాపిస్తాడు.
-
ఫలితాలు తెలుపుతాడు.
-
దత్తాంశాలు సరిపోతాయో లేదో తెలుపుతాడు.
-
దత్త పద్ధతి అనుసరణీయమో కాదో తెలుపుతాడు
-
నూతన పద్ధతలను సూచిస్తాడు.
-
తగిన పద్ధతులను ఎంపిక చేస్తాడు.
-
నూతన దత్తాంశాలు ప్రతిపాధిస్తాడు.
-
దత్త వివరాల నుంచి ఊహలు చేస్తాడు.
-
అనుమతులను రాబడుతాడు.
II. భావావేశ రంగం :-
అభిరుచి :-
గణితం పట్ల అభిరుచిని పెంపొందించడం
స్పష్టీకరణలు
-
గణిత పజిళ్ళను సాధించగలుగుతాడు
-
గణిత క్లబ్ కృత్యాలలో పాల్గొంటాడు
-
గణితంలో అదనపు సామగ్రి / పుస్తకాలను చదువుతాడు
-
గణిత శాస్త్ర సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్ను తయారుచేసుకొంటాడు.
-
వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించటం, గణిత క్విజ్లో పాల్గొనటం.
వైఖరి :
-
వివిధ గణితశాస్త్ర పఠనం ద్వారా శాస్త్రీయ వైఖరిని హేతువాద దృక్పధాన్ని వృద్ధి చేసుకొంటాడు.
-
ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు.
-
విద్యార్ధి తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు.
-
తార్కికంగా ఆలోచించే అలవాటును అభివృద్ధి చేసుకొంటాడు.
-
కొత్త భావాలను, అంశాలను గ్రహించగల విశాల మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు.
-
విద్యార్ధి సాధనకు సంబంధించిన అన్ని అంశాలను పరీక్షించనిదే ఒక నిర్ణయానికి రాడు
అభినందన, ప్రశంసనీయం :-
-
విద్యార్ధి జ్ఞాన క్షేత్రంలోను, జీవితంలోను గణితశాస్త్ర సేవలను అభినందిస్తాడు.
-
విజ్ఞాన శాస్త్రం, వాణిజ్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రాల సమస్యలను సాధించడంలో గణిత శాస్త్ర పాత్రను అభినందిస్తాడు.
-
ప్రకృతిలోని సౌష్ఠవ, క్రమం అధ్యయనాలలో గణిత శాస్త్ర పాత్రను అభినందిస్తాడు.
-
నాగరికత అభివృద్ధిలో గణితశాస్త్ర పాత్రను అభినందిస్తాడు.
-
గణిత శాస్త్రజ్ఞుల అందించిన సేవలను అభినందిస్తాడు.
III. మానసిక - చలనాత్మక రంగం :-
నైపుణ్యం :-
-
మనోగణనలు త్వరితంగా ఖచ్చితంగా చేస్తాడు.
-
సరైన సంకేతాలను గుర్తులను ఉపయోగిస్తాడు.
-
వివిధ గణిత ఉపకరణాలను సక్రమంగా వినియోగిస్తాడు.
-
సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకొంటాడు.
-
ఖచ్చితంగా మాపనం చేస్తాడు.
-
గణిత నమూనాలను తయారు చేస్తాడు.
-
పటాలను, రేఖా చిత్రాలను వేగంగా కచ్చితంగా శుభ్రంగా గీస్తాడు.
-
గ్రాఫ్లను పట్టికలను వ్యాఖ్యానిస్తాడు. గ్రాఫ్ ను పట్టిక రూపంలో పిట్టికలను గ్రాఫ్ రూపంలోకి ఖచ్చితంగా మార్చగలడు.
విజ్ఞాన శాస్త్రం - లక్ష్యాలు - స్పష్టీకరణలు
జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు :-
1. జ్ఞానం :- విద్యార్ధి విజ్ఞానశాస్త్ర సంబంధమైన పదాలు, సత్యాలు, భావనలు, సూత్రాలు, నిర్వచనాలు, నియమాలు, పద్ధతులకు సంబంధించిన జ్ఞానం పొందుతారు.
స్పష్టీకరణలు :- జ్ఞానానికి సంబంధించి రెండు స్పష్టీకరణలున్నాయి.
-
జ్ఞప్తికి తెచ్చుకోవడం :- విద్యార్ధి విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పదాలు సత్యాలు, భావనలు, సూత్రాలు, నిర్వచనాలు, నియమాలు పద్ధతులు జ్ఞప్తికి తెచ్చుకొంటాడు.
-
గుర్తించుట :- విద్యార్ధి విజ్ఞానశాస్త్ర సంబంధమైన సత్యాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, పద్ధతులు గుర్తిస్తాడు.
2. అవగాహన :- విద్యార్ధి విజ్ఞానశాస్త్ర సంబంధనమైన పదాలు, సత్యాలు, భావనలు మొదలయిన వాటి జ్ఞానాన్ని అవగాహన చేసుకొంటాడు.
స్పష్టీకరణలు :-
-
విద్యార్ధి భావనలు, నియమాలు, సూత్రాలకు ఉదాహరణలిస్తాడు.
-
వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను వివరిస్తాడు.
-
ఇచ్చిన వాక్యంలోని దోషాన్ని సవరించి సరిచేస్తాడు
-
వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను సరిచూస్తాడు.
-
వివిధ శాస్త్రీయ పదాలు, సమీకరణాలు, గుర్తులు, పట్టికలు అనువదిస్తాడు.
-
విద్యార్ది చిత్రపటాలను, రేఖా పటాలను, దత్తాంశాలను వ్యాఖ్యానం చేస్తాడు.
-
వివిధ భావనలు ప్రక్రియలను సరివీల్చుతాడు.
-
విద్యార్ధి సమీప సబంధంగల భావనలు, సూత్రాలు, ప్రక్రియలను సరివీల్చుతాడు.
-
విద్యార్ధి భౌతికశాస్త్ర సత్యాలకు, భావనలకు, ప్రక్రియలకు, సూత్రాలకు మధ్యగల భేదాలను తెలుపుతాడు.
-
విద్యార్థి వివిధ భావనలను, సత్యాలు మధ్య గల సంబంధాలను గుర్తిస్తాడు
-
విద్యార్ధి సమస్యలను సాధిస్తాడు
-
విద్యార్ధి భౌతికరాసులకు సరియైన ప్రమాణాలు తెలుపుతాడు.
-
విద్యార్ధి వివిధ భౌతికశాస్త్ర పరికరాలు - సిద్ధాంతాలు పద్ధతులు వర్గీకరిస్తాడు
వినియోగం :- విద్యార్ధి నేర్చుకున్న విజ్ఞానశాస్త్ర నూతన పరిస్థితులలో వినియోగిస్తాడు. ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు
స్పష్టీకరణలు :-
(1) భావనలు, సూత్రాలు, నియామాలు మొదలయిన వాటిని విశ్లేషణ చేస్తాడు.
(2) విద్యార్ధి నేర్చుకున్న జ్ఞానాన్ని నేరుగా వినియోగిస్తాడు.
(3) విద్యార్ధి వివిధ భౌతికశాస్త్ర ప్రక్రియలకు దృగ్విషయాలకు కారణాలు తెలుపుతాడు
(4) కారణానికి - ఫలితానికి మధ్య గల సంబంధాన్ని ఏర్పరుస్తాడు.
(5) శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు.
(6) విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలలో అనుమతిని రాబడుతాడు.
(7) సామాన్యీకరణలను ప్రతిపాదిస్తాడు.
(8) సరియైన ప్రయోగ విధానాలు, పరికరాలను సూచిస్తాడు.
(9) ప్రాగుకీకరించడం
(10) దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తాడు.
(11) దత్తాంశాల నుంచి సంభవించనున్న ద్విగ్విషయాలను సంఘటనలను ఊహిస్తాడు.
2. భావావేశ రంగం :- భావావేశ రంగానికి సంబంధించిన శాస్త్రీయ వైఖరులు, అభివృద్ధి, అభిరుచి, అభినందన లక్ష్యాలు - స్పష్టీకరణలు పరిశీలిద్దాము
అభిరుచి :
విద్యార్ధి శాస్త్ర ప్రపంచంపై అభిరుచిని పెంపొందించుకొంటాడు.
స్పష్టీకరణలు :
-
ప్రదేశాల సందర్శన
-
నమూనాలు, చిత్రాలు, మ్యాప్లలు సేకరణ
-
వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం
-
జ్ఞానాన్వేషణ చేయడం
-
పరికరాల తయారీ
వైఖరి :- జ్ఞానం పొందే విధానంలో నమ్మకం ఉండడం. నిష్పాక్షిక దృష్టిని ప్రదర్శించడం
స్పష్టీకరణలు :-
.
-
నిజాయితీని పెంపొందించుకొంటారు.
-
అభిప్రాయాలను ఏర్పరచుకోవడం
-
నమ్మికను కల్గి ఉండటం
-
ఆలోచనా సరళి
-
కుతూహలం
-
అభినందన :- విజ్ఞాన శాస్త్ర క్రమాన్ని, అభివృద్ధిని, విద్యార్థులు అభినందిస్తారు
స్పష్టీకరణలు :-
-
ప్రకృతిని అభినందించటం
-
శాస్త్రజ్ఞులను అభినందించటం
-
మానవ ప్రయత్నం అభినందిస్తాడు
-
ప్రకృతిలోని దృగ్విషయాలు, సమతుల్యత మొదలయిన అంశాలను గురించి ఆశ్చర్యం పొందుతాడు.
3. మానసిక చలనాత్మక రంగం :- ఆలోచనలకు, ఆచరణకు మధ్య సమన్వయమే ఈ రంగం ఈ రంగంలో అనేక నైపుణ్యాలు ఉంటాయి.
-
చిత్రలేఖనా నైపుణ్యం :- వివిధ రకాల చిత్రాలు, పటాలు, గీయటం భాగాలను గుర్తించటం
-
హస్త నైపుణ్యం :- వివిధ వస్తువులు చేతుల మధ్య సమన్వయంతో జరిగే నైపుణ్యాలను హస్త నైపుణ్యాలంటారు.
-
నమూనాలను తయాచు చేయటం
-
ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయటం
-
పరికరాలను పట్టుకోవటం
-
పరికరాలను వాడటం, పరికరాల భద్రత
పరిశీలనా నైపుణ్యం :- ధర్మామీటర్, భానుమతిలోని వివిధ రీడింగులను ఖచ్చితంగా కొలవగలడడం
నివేదనా నైపుణ్యం :- పరిశీలనను నివేదించటయే నివేదనా నైపుణ్యం
-
నివేదిక భాషలో స్పష్టత
-
వివిధ విషయాలను సూక్ష్మీకరించటం
-
పట్టిలో అమర్చటం
-
కచ్చితంగా నమోదు చేయటం.
3. ఉపాధ్యాయుని బోధనా విజయం అతడి అభివ్యంజన నైపుణ్యం పై ఆధారపటి ఉంటుంది.
-
ఉపాధ్యాయుడు మూర్తిమత్వంనకు ప్రతీక ఇది
-
వివిధ శాస్త్ర సాంకేతిక పదాలను సందర్భంగా ఉపయోగించడం
సాంఘిక అధ్యయనాల బోధనా లక్ష్యాల వర్గీకరణ
-
లక్ష్యాలు - సృష్టీకరణలు సాంఘిక అధ్యయనాల బోధన - అభ్యసనకు మూలం.
-
బోధన - అభ్యసన లక్ష్యాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అవి...
1. జ్ఞాన లక్ష్యాలు (Cognitive) - సాధారణ జ్ఞానం, విషయ జ్ఞానం, వివేచనా జ్ఞానం జ్ఞాన లక్ష్యాలకు మూలం.
2. భావావేశ లక్ష్యాలు (Affective) - ఆసక్తి, అభిమతం, అభినందన వంటి భావాలు భావావేశ లక్ష్యానికి మూలం.
3. మనో చలనాత్మక లక్ష్యాలు (Psychomotor) - జ్ఞాన లక్ష్యాలను, భావావేశ లక్ష్యాలను ఆచరణలోకి తేవడమే మనో చలనాత్మక లక్ష్యానికి మూలం.
పై లక్ష్యాల మూల భావాల ప్రాతిపదికగా పై మూడింటిని మనం ఏడు రకాలుగా వర్గీకరించవచ్చు.
-
జ్ఞానం (Knowldge)
-
అవగాహన (Understanding)
-
వినియోగం (Application)
-
నైపుణ్యం (Skill)
-
అభిరుచి (Interest)
-
వైఖరి (Attitude)
-
ప్రశంస (Appreciation)
-
సృష్టీకరణల ద్వారానే లక్ష్యాలను సాధించడం జరుగుతుంది.
జ్ఞానాత్మక రంగం
-
జ్ఞానం (లక్ష్యం)
-
విద్యార్ధులు సాంఘిక అధ్యయనాలకు సంబంధించిన వాస్తవాలను వాటికి సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జిస్తారు. ఆ వాస్తవాలు సాధారణంగా 1) నూతన పదాలు 2) వాస్తవాలు 3) సూత్రాలు 4) సాధారణీకరణాలు 5) ధోరణులు 6) భావనలుగా ఉంటాయి. అంటే ఏమిటి? ఎక్కడ? ఎప్పుడు? ఎవరు? అనే ప్రశ్నలకు వచ్చే సమాధానాలను 'జ్ఞానం' సంబంధమైన అంశాలుగా మనం గ్రహించాలి. వాటి స్పష్టీకరణలు ఈ విధంగా ఉంటాయని గుర్తించాలి.
స్పష్టీకరణలు
-
జ్ఞప్తికి తెచ్చుకోడం (Recall)
-
గుర్తించటం (Reognise) ఉదా :- పేర్లు, పదాలు, తేదీలు
2. అవగాహన
-
అవగాహనకు జ్ఞానం సోపానం. నేర్చుకున్న జ్ఞానాన్ని సొంత మాటలలో వ్యక్తపరిచితే అది అవగాహన.
-
అవగాహన వల్ల విద్యార్ధి ప్రవర్తనలో ఆశించిన మార్పు వస్తుంది.
ఉదాహరణ ...
-
కుటుంబం, రాష్ట్రం, సమాజం వంటి పదాల భావం - అవగాహన
-
పూర్వం నుంచి నేటి వరకు సమాజం పరిణామం చెందిన విధానం - అవగాహన
-
వివిధ శీతోష్ణస్థితులతో గల ప్రాంతాలు - ఆయా ప్రాంతాల ప్రజలపై శీతోష్ణస్థితుల ప్రభావం - అవగాహన.
-
సామాజిక సంస్థలు, వాటితో ప్రజలకు గల సంబంధం - అవగాహన.
స్పష్టీకరణలు
పై లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విద్యార్ధిలో మనం ఈ క్రింది స్పష్టీకరణలను గమనించవచ్చు
-
విచక్షణ చేస్తారు.
-
దోషాలను కనుక్కుంటాడు
-
దోషాలను సరిదిద్దుతాడు
-
వర్గీకరిస్తాడు
-
పోలికలు, భేదాలు తెలుపుతాడు
-
సంబంధాలను గుర్తిస్తాడు
-
ఉదాహరణలిస్తాడు
-
దత్తాంశాలను వ్యాఖ్యానిస్తాడు
-
నూతన పోకడలను, ఆచరణలను గురించి వివరిస్తాడు.
అవగాహన - స్పష్టీకరణలు
-
వివరించుట : విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన భావనలను, సూత్రాలను, సిద్ధాంతాలను వివరిస్తాడు.
ఉదా :- అడవులకు సంబంధించిన వివిధ విషయాలను వివరిస్తాడు.
-
బేధాలు చెప్పడం : విద్యార్థులు సాంఘిక శాస్త్రంలోని వివిధ విషయాల భేదాలను గుర్తిస్తారు.
ఉదా :- విద్యార్ధులు ఆకురాల్చు అడవులకు, చిట్టడవులకు, సతత హరితారణ్యాలకు మధ్యగల తేడాలను గుర్తిస్తారు.
-
సరిపోల్చడం : విద్యార్ధులు తాము నేర్చుకొన్న విషయాలను ఒకదానితో మరోదాన్ని సరిపోల్చగలరు.
ఉదా :- ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలోని అడవుల విస్తీర్ణతను దేశమందలి ఇతర ప్రాంతాలలోని అడవుల విస్తీర్ణతతో సరిపోల్చుతాడు.
-
వర్గీకరించుట :- విద్యార్ధులు సాంఘికశాస్త్రంలోని పాఠ్యాంశానికి సంబంధించిన వివిధ భావనలను, విషయాలను వర్గీకరిస్తాడు.
ఉదా :- విద్యార్ధి అడవులలో గల వివిధ రకాలను వర్గీకరిస్తాడు.
-
సంబంధాలను గుర్తించుట :- విద్యార్ధులు తాము తెలుసుకున్న విషయాల పరస్పర సంబంధాలను గుర్తించగలడు.
ఉదా :- విద్యార్ధి వర్షపాత విస్తరణను అడవుల పెరుగుదలకు గల సంబంధాన్ని గుర్తిస్తారు.
-
ఉదాహరణలు ఇవ్వటం :- విద్యార్థులు తాము తెలుసుకున్న భావనలను, సూత్రాలను ఉదాహరణలు ఇస్తారు.
ఉదా :- ఆకురాల్చు అడవులకు, చిట్టడవులకు ఉదాహరణ ఇస్తాడు.
-
వ్యాఖ్యానించుట :- విద్యార్ధులు సేకరించిన వివిధ దత్తాంశాలను వివిధ రకాలుగా వ్యాఖ్యానించుట.
ఉదా :- అడవుల విస్తీర్ణతకు సంబంధించిన దాత్తాంశాలను విద్యార్థులు వ్యాఖ్యానించగలరు.
-
తప్పులను గుర్తించటం :- విద్యార్థులు ప్రకటించిన విషయాలను తమకున్న జ్ఞానంతో సమన్వయపరచి తప్పులను గుర్తిస్తారు.
ఉదా :- సంవత్సరంలో తక్కువ భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంథాలలో ఆకురాల్చు అడవులు పెరుగుతాయి.
-
తప్పులను సవరించుట :- విద్యార్ధులు తమకున్న జ్ఞానం ఆధారంగా తప్పులను సవరిస్తారు.
ఉదా :- సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఆకురాల్చు అడవులు పెరుగుతాయి.
3. వినియోగం
విద్యార్ధి పొందిన జ్ఞానాన్ని నిజ జీవితంలో అవసరాన్ని బట్టి వినియోగిస్తాడు. జీవితంలో సుఖశాంతులు పొందుతాడు. ఉదాహరణకు జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాను పొందిన జ్ఞానాన్ని వినియోగించం.
ఉదా : - (1) అధిక జనాభా సామాజిక సమస్యలకు మధ్య గల సంబంధనాఇష్టు జతపరచడం.
(2) మత సామరస్యం జాతి అభివృద్ధికి తోడ్పడుతుందని జోస్యం చెప్పటం.
స్పష్టీకరణలు
పై లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విద్యార్ధిలో మనం ఈ క్రింది స్పష్టీకరణలను గమనించవచ్చు.
(1) సమస్యను విశ్లేషించి దాని కీలకమైన అంశాలను గుర్తిస్తారు.
(2) సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకుంటాడు.
(3) తనకు తెలిసిన దానితో సమస్య పరిష్కారానికి సంబంధం స్థాపిస్తాడు.
(4) ఫలితాలను ఊహిస్తాడు.
(5) జరగబోయే ఫలితాలను చెపుతాడు
(6) నూతన పరికల్పనను రూపొందిస్తాడు.
(7) సేకరించిన సమాచారం సమస్య పరిష్కారానికి సరిపోతుందా? లేదా అనే వివేచన చేస్తాడు.
వినియోగము - స్పష్టీకరణలు
-
విశ్లేషించుట :- విద్యార్ధులు సమస్యను విశ్లేషించి అందులోని కీలకాంశాలను గుర్తించగలరు.
ఉదా :- విద్యార్థులు అడవుల క్రమక్షయం వల్ల ఏర్పడే సమస్యలను విశ్లేషిస్తారు.
-
కారణాలను తెలపటం :- విద్యర్థి వివిధ సాంఘిక శాస్త్ర ప్రక్రియలను దృగ్విషయాల కారణాలను తెలుపుతారు.
ఉదా :- లేటరైట్ మృత్తికలలో అడవులు పెరగకపోవడానికి గల కారణాలు తెలుపుతాడు.
-
కారణానికి, ఫలితానికి మధ్య సంబంధం ఏర్పరచడం: విద్యార్థులు ఫలితాన్ని గమనించి కారణాల్ని పరిశీలించి వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తారు.
ఉదా :- విద్యార్ధులు అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలలోనే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలుపుతాడు.
-
సామాన్యీకరణను ప్రతిపాదించటం :- విద్యార్ధి దృష్టాంతాలను పరిశీలించి వాటి నుండి సాధారణీకరణం చేస్తాడు.
ఉదా :- అడవుల విస్తీర్ణం తగ్గిపోతే భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అని తెలుపుతాడు.
:
-
నూతన పరికల్పనలను రూపొందించటం :- విద్యార్థులు రూపొందించిన పరికల్పనలను సరైనవా కాదా అని ధృవీకరిస్తారు.
ఉదా :- అడవులను పెంచటం వల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తాయి.
-
పరికల్పనలను ధృవీకరించటం :- విద్యార్ధులు రూపొందించిన పరికల్పనలను సరైనవా కాదా అని ధృవీకరిస్తారు.
ఉదా :- ముందు చేసిన పరికల్పన సరైందా! కాదా! అని సరిచూసుకొంటారు.
-
సూచనలు చేయటం :- విద్యార్ధి తాను నేర్చుకున్న జ్ఞానంతో వివిధ సూచనలు చేయటం.
ఉదా :- విద్యార్ధి అడవుల పెరుగుదలకు తగిన సూచనలు చేయటం.
-
సమస్యా పరిష్కారానికి తాను సేకరించిన సమాచారం తగినదా! కాదా! అని గ్రహించుట:- విద్యార్థి నూతన పరిస్థితితో సమస్యా పరిష్కారానికి మనవద్ద ఉన్న సమాచారం తగిందో లేదో అని గ్రహించటం.
-
విద్యార్ధి భావనలను ఊహించి నిర్ణయాలు తీసుకోగలగడం: విద్యార్ధి భావనలను ఊహించుకొని, తగిన నిర్ణయాలు చేయగల సామర్ధ్యం పొందుతాడు.
మానసిక చలనాత్మక రంగం
4. నైపుణ్యం
వేగంగా, స్పష్టంగా, ఖచ్చితంగా ఒక పనిని చేయడాన్ని నైపుణ్యంగా మనం గుర్తించాలి. సాంఘిక అధ్యయనం ఆధారంగా ఈ క్రింది నైపుణ్యాలను పెంపొందించవలసి ఉంటుంది.
ఉదాహరణ …
1. సాంఘిక అధ్యన విషయానికి సంబంధించిన ముద్రితమైన, ముద్రితంకాని సమాచారాన్ని సేకరించటంలో నైపుణ్యం పొందటం.
2. సాంఘిక, సాంస్కృతిక, ఆర్ధిక అంశాల పారిభాసిక పదాలను సరిగా ఉపయోగించే నైపుణ్యం పొందటం.
3. పరికరాలు, పటాలు, గ్లోబు, పట్టికలు, గ్రాఫు ఉపయోగించంలో నైపుణ్యం పొందటం.
స్పష్టీకరణలు
-
పటాలు, చార్టులు, కాలపట్టికలు మొదలైనవి చదవగలుగుతారు.
-
కోటలు, పిరమిడ్లు, పనిముట్ల నమూనాలు చక్కగా తయారు చేయగలుగుతాడు.
-
పటాలు, చార్టులు, డయాగ్రమ్లు, గ్రాఫ్లు ఖచ్చితంగా గీయగలుగుతాడు.
-
వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలు నైపుణ్యంతో వినియోగించగలుగుతాడు.
-
సమస్యకు సంబంధించిన సర్వే చేసి ఖచ్చితమైన సమాచారం సేకరిస్తాడు.
-
సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారుచేసి చక్కగా దర్శిస్తాడు.
నైపుణ్యం - రకాలు
ఎ. పటాలు గీయంలో నైపుణ్యం / పట నైపుణ్యం
-
వివిధ రకాల చిత్రాలను, పటాలను, మ్యాపులను గీచి భాగాలను గుర్తించటం, పటాలను వేగంగా గీయటం.
ఉదా :- ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ జిల్లాలో అడవులు విస్తరించి ఉండే ప్రాంతాలను గుర్తించుట.
బి. హస్తలాఘన నైపుణ్యం
-
ఒక వస్తువు నమూనాను తయారు చేయటం. పరికరాలను జాగ్రత్తగా వాడటాన్ని నిర్వహణా నైపుణ్యం లేదా హస్త నైపుణ్యం అంటారు.
సి. పరిశీలనా నైపుణ్యం
-
విద్యార్ధి తనకిచ్చిన పాటంలో, నమూనాలో, వివిధ భాగాల స్థానాలను కచ్చితంగా సూచిస్తాడు.
-
విద్యార్ధి వివిధ పటాలలోని గుణదోషాలను పరిశీలిస్తారు.
-
పటాల క్రమాలను అమర్చటం మొదలైనవి.
డి. అభ్యింజన నైపుణ్యం
-
ఉపాధ్యాయులు బోధనలో ఎంత వరకు సఫలీకృతులయ్యారనేది అతని అభివ్యంజన నైపుణ్యం పై ఆధారపడుతుంది. ఈ నైపుణ్యం బోధనాభ్యసన ప్రక్రియలో ముఖ్య స్థానం ఆక్రమిస్తుంది.
ఉదా :- కచ్చితమైన సాంకేతిక పదాలను వినియోగించటం.
-
విషయాన్ని వ్యాఖ్యానించేటప్పుడు ఎలాంటి భావననైనా వ్యక్తీకరించగల నైపుణ్యం
ఇ. నివేదనా నైపుణ్యం
-
సారాంశాన్ని సూక్ష్మీకరించి నివేదికను సమర్పిస్తారు.
-
అనేక విషయాలను సులభంగా అర్ధం చేసుకోవటానికి పట్టిక రూపంలో పొందుపర్చటం.
-
వివిధ విషయాలను క్రమపద్ధతిలో అమర్చటం.
భావావేశ రంగం
5. అభిరుచి
ఒక అంశం పట్ల విద్యార్ధి ఆచరణలో కనబరిచే ఆతృతను 'అభిరుచి'గా మనం గుర్తించాలి. ఉదాహరణ...
1. తరగతి నాయకుడుగా ఉండడానికి ఆసక్తి చూపడం
2. తోటివారికి సేవ చేయడానికి ఆతృత పడడం
3. తరగతి అలంకరణ పట్ల అత్యంత ఆసక్తి చూపడం
స్పష్టీకరణలు
-
రకరకాల నాణేలు సకరించి 'ఆల్బమ్'గా తయారు చేస్తారు.
-
పాఠశాలలో జరిగే వస్తు ప్రదర్శనశాలలను శ్రద్ధగా నిర్వహిస్తాడు
-
తనకు ఆసక్తి ఉన్న సాంఘిక సమస్యలకు సంబంధించిన రచనలు, పుస్తకాలు, సంచికలు, వార్తా పత్రికలు చదువుతాడు.
-
అభిరుచికి అనుగుణంగా ఉన్న చారిత్రక, భౌగోళిక స్థలాలను దర్శిస్తాడు.
-
ఆసక్తి గల అంశాలపై రచనలు చేస్తాడు
-
వివిధ కళలు, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు.
6. వైఖరి
వ్యక్తిలో దాగివున్న మహత్తరమైన శక్తులను వెలికితీసే సాధనమే విద్య.
విద్యార్ధులలో 'ఉత్తమ లక్షణం వ్యక్తపరిచే స్థితిని వైఖరి’గా మనం గ్రహించాలి.
ఉదాహరణ ...
1. దేశభక్తిని కలిగి ఉంటాడు.
2. నూతన విషయాలను వాటి ప్రాముఖ్యాన్ని బట్టి ఆమోదిస్తాడు.
3. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు.
4. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయాన్యాయాలు నిర్ణయిస్తాడు
5. ప్రజల సమస్యలను సానుభూతితో పరిశీలిస్తాడు.
6. చట్టాలను గౌరవిస్తాడు.
7. వివిధ జాతుల ప్రజల జీవనం పట్ల గౌరవం చూపుతాడు.
8. సాంఘిక పౌర సంబంధమైన పనులలో ఇతరులకు సహకరిస్తాడు.
7. ప్రశంస :-
తోటివారిలోని ఉత్తమ లక్షణాలను గుర్తించి అభినందించడాన్ని ప్రశంస అంటారు.
ఉదా :- గొప్పతనం, పరాక్రమం, శౌర్యం, ఔదార్యం, త్యాగం, దానం వంటి ఉత్తమ లక్షణాలు.
ఉదాహరణ….
1. దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగం.
2. శత్రువును ఎదిరించటంలో శివాజీ చూపిన పరాక్రమం.
3. మదర్ థెరిస్సా సేవానిరతికి ప్రశంసనీయుట.
స్పష్టీకరణలు :-
-
మన రాష్ట్ర, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసిస్తాడు.
-
మహనీయులు ఆదరించిన సిద్ధాంతాలను, సూత్రాలను ప్రశంసిస్తాడు.
-
శాస్త్రజ్ఞుల, పరిశోధకుల గొప్పతనాన్ని ప్రశంసిస్తాడు.
-
గొప్పవారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు వారిలోని ఉన్నత వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ, బలహీనతను విమర్శిస్తాడు.
-
వివిధ జాతులు ప్రజల పట్ల పరస్పర సంబంధాన్ని ప్రశంసిస్తాడు.
విద్యా ప్రమాణాలు
-
సామర్ధ్యం అంటే చేయగలగడం అని అర్ధం సమర్ధత కల్గి ఉండటం అని అర్ధం
“మాట్లాడటం” అందరికి వస్తుంది. ఐతే ఒక సమాచారాన్ని ఇతరులను అడిగి తెలుసుకోవటం సమర్ధత. రాయటం అందరికి వస్తుంది. ఐతే తన అవసరం కోసం ఒక దరఖాస్తు రాయగలగడం సమర్ధత. అంటే నైపుణ్యం చెందిన జ్ఞానాన్ని మనం సామర్ధ్యంగా భావించాలి.
సామర్ధ్యాలు సబ్జెక్టు స్వభావం బట్టి వేరు వేరుగా ఉంటాయి. APSCF - 2011 గణిత సామర్ధ్యాలును ఈ క్రింది విధంగా పేర్నొనండి.
-
సమస్య సాధన Problem Solving
-
కారణాలు తెలియజేయుట - నిరూపణ చేయట Reasoning proof
-
వ్యక్త పర్చుట - Communication
-
అనుసంధానం చేయుట - Connection
-
ప్రాతినిద్యపర్చుట - దృశ్యీకరణ Representation
-
(1) సమస్యా సాధన :- Visulisation ని
-
పిల్లలు సమస్యను చదివి అర్ధం చేసుకోవటం
-
ఇచ్చిన సమాచారం ఆధారంగా విశ్లేషించటం
-
అవసరమైన తార్కిక పద్ధతిని ఎన్నుకోవటం