Ticker

6/recent/ticker-posts

9th Class Biology Notes 6th Lesson జ్ఞానేంద్రియాలు

 



9th Class Biology Notes 6th Lesson జ్ఞానేంద్రియాలు

→ కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మంలు జ్ఞానేంద్రియాలు.


→ జ్ఞానేంద్రియాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. ఇంద్రియ జ్ఞానాన్ని అందిస్తాయి.


→ మన శరీరం బాహ్యప్రేరణలను జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తుంది.


→ ప్రకృతిలోని కొన్ని పరిస్థితులు, పదార్థాలు మన శరీరంలో ఇంద్రియ జ్ఞానం కలిగేలా ప్రేరేపిస్తాయి.


→ జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం మెదడు.


→ మన కంటిలో కంటి రెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, కంటిగ్రుడ్డు, అశ్రు గ్రంథులు ఉంటాయి.


→ దృఢస్తరం, రక్తపటలం, నేత్రపటలం అనేవి. కంటిలోని మూడు ముఖ్య పొరలు.


AP 9th Class Biology Notes 6th Lesson జ్ఞానేంద్రియాలు


→ తారకకు వెనుక ద్వికుంభాకార కటకం ఉంటుంది. దీనిని సరిచేయవచ్చు.


→ నేత్ర పటలం చిరుకాంతితో చూడడానికి దండాలు, కాంతివంతమైన వెలుతురులో చూడడానికి శంకువులు కలిగి ఉంటుంది.


→ దృక్ నాడి కంటిని దాటి బయటకు వచ్చేచోటు, దృష్టి జ్ఞానం అసలు లేని ప్రాంతమే అంధచుక్క.


→ దృష్టి జ్ఞానం బాగా ఉండే భాగమే ఫోవియా.


→ కన్ను నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.


→ కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, తలకిందులుగాను ఉంటుంది.


→ హ్రస్వదృష్టి (మయోపియా) నందు ప్రతిబింబం నేత్రపటలం ముందు ఏర్పడుతుంది.


→ దీర్ఘదృష్టి (హైపర్ మెట్రోపియా) నందు ప్రతిబింబం నేత్రపటలం వెనుకగా ఏర్పడుతుంది.


→ అవసరం లేని పదార్థం కంటిలో పడితే వెంటనే అశ్రుగ్రంథులు ప్రేరేపితమై ఆ పదార్థాన్ని బయటకు పంపిస్తాయి.


→ కంటిపాప ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.


→ కంటికి వచ్చే ముఖ్యమైన వ్యాధులు, లోపాలు : రేచీకటి, పొడిబారిన కళ్ళు, హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, గ్లూకోమా, కంటిశుక్లం, వర్ణాంధత మొదలైనవి.


→ చెవి వినడానికి, శరీర సమతుల్యతను కాపాడడానికి ఉపయోగపడుతుంది.


AP 9th Class Biology Notes 6th Lesson జ్ఞానేంద్రియాలు


→ వెలుపలి చెవి, మధ్య చెవి, అంతర చెవి అనేవి చెవియందలి మూడు భాగాలు.


→ సెరుమినస్ గ్రంథులు మరియు తైలగ్రంథులు వెలుపలి చెవి నందలి శ్రవణకుల్యను మృదువుగా ఉంచటానికి తోడ్పడతాయి.


→ శ్రవణకుల్య చివర కర్ణభేరి ఉంటుంది.


→ మధ్యచెవిలోని ఎముకల గొలుసునందలి కూటకము లేక సుత్తి, దాగలి లేక పట్టెడ, కర్ణాంతరాస్థి లేక అంకవన్నె ఉంటాయి. ఇవి ప్రకంపనాలను పెంచడంలో సహాయపడతాయి.


→ లోపలి చెవిలో త్వచాగహనంను ఆవరించి అస్థి గహనం ఉంటుంది.


→ నాసికా కుహరం నందలి శ్లేష్మసరంలో ఘోణ గ్రాహకాలు ఉంటాయి.


→ సుమారు పదివేల రుచికణికలు నాలుకలో ఉండే సూక్ష్మాంకురాల గోడల్లో ఉంటాయి.


→ సంప్రదాయ నాలుగు రుచులు తీపి, పులుపు, చేదు, ఉప్పునకు అదనముగా ఐదవ రుచి ఉమామిగా పరిగణించబడుతుంది.


→ మెదడులోని ప్రత్యేక భాగాలకు రుచులను తీసుకుపోయే నాడి ‘హాటలైన్’ నాడి.


→ చర్మం నందలి స్పర్శగ్రాహకాలు స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తాయి.


→ అన్ని అవయవాల కంటే చర్మం అతి పెద్దది.


AP 9th Class Biology Notes 6th Lesson జ్ఞానేంద్రియాలు


→ చర్మం నందలి అంతశ్చర్మం నందు స్వేదగ్రంథులు, తైలగ్రంథులు, రోమపుటికలు, రక్తనాళాలు, కొవ్వులు ఉంటాయి.


→ కంటిచూపులో బలహీనులైన ప్రత్యేకావసరాలు గల విద్యార్థులు స్పర్శ ద్వారా బ్రెయిలీ లిపిని చదువగలరు.


→ ఒక ప్రతిబింబం ముద్ర నేత్రపటలం మీద సుమారు 1/6 సెకన్లు మాత్రమే ఉంటుంది.


→ జ్ఞాన గ్రాహకాలు : జ్ఞాన అవయవములందు ఉండేవి. జీవి అంతర, బాహ్య వాతావరణములందు ప్రేరణలకు ప్రతిస్పందించేవి.


→ అశ్రు గ్రంథులు : అశ్రువులను విడుదల చేయు గ్రంథులు. కంటిలో ఉంటాయి.


→ ప్రేరణ : ఒక పనిని ప్రభావితం చేసే బాహ్యపదార్థాలు.


→ కంటిపొర : కంటి ముందరభాగంలో ఉండే ఉపకళా కణజాలంతో తయారైన పొర.


→ దృఢస్తరం : కంటిని ఆవరించి ఉండు పొర, దళసరిగా, గట్టిగా, తంతుయుతంగా, స్థితిస్థాపకత లేకుండా తెలుపురంగులో బాహ్యంగా ఉండే పొర.


→ శుక్లపటలం : దృఢస్తరం ఉబ్బుట వలన ఏర్పడే భాగం.

కంటిపాప ముందు ఏర్పడే కిటికి వంటి భాగం.


→ కంటిపాప : తారక చుట్టూ రక్తపటలంచే ఏర్పడిన భాగం.


→ తారక : కంటి మధ్యభాగములోనున్న చిన్న, గుండ్రని ప్రదేశము.


→ రక్తపటలం : కంటిని ఆవరించి ఉండు ఆరోపొర. ఈ పొర నలుపురంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది.


→ అవలంబిత స్నాయువులు : తారక వెనుక ఉండే ద్వికుంభాకార కటకమునకు కలుపబడి ఉండేవి.


→ నేత్రోదక కక్ష : కటకంచే రెండుగా విభజింపబడిన కంటిగుడు లోపలి ఒక భాగం. దీనిలో నీరు వంటి ద్రవం ఉంటుంది.


→ కాచావత్ కక్ష : కటకంచే రెండుగా విభజింపబడిన కంటిగుడ్డు లోపలి రెండవ భాగం. దీనిలో జెల్లీ వంటి ద్రవం ఉంటుంది.


→ నేత్రపటలం : కంటి లోపల ప్రతిబింబం ఏర్పడే భాగం. దీనిలో దండాలు. శంకువులు అనే కణాలు, దృష్టిజ్ఞానం లేని అంధచుక్క దృష్టిజ్ఞానం గల పచ్చచుక్క ఉంటాయి.


→ అంధచుక్క : నేత్రపటలంలో దృష్టి జ్ఞానం లేని ప్రదేశం.


→ ఫోవియా : నేత్రపటలంలో మంచి దృష్టి జ్ఞానం కలిగిన ప్రదేశం. దీనిని పచ్చచుక్క లేదా మాక్యులా అని కూడా అంటారు.


→ దృక్ నాడి (దృష్టినాడి) : నాడీకణాలన్నీ కట్టలాగా కలసి ఏర్పడిన నాడి కంటి లోపలికి వచ్చే కాంతి ప్రేరణలను లేదా ప్రచోదనాలను మెదడుకు పంపిస్తుంది.


→ రేచీకటి : ఇది ఒక కంటి వ్యాధి. చిమ్మచీకటి నందు. రాత్రి సమయాలలో వస్తువులను చూడలేకపోవటం.


→ హ్రస్వదృష్టి (మయోపియా) : ఒక రకమైన దృష్టి లోపం. ప్రతిబింబాలు నేత్రపటలానికి ముందుగా ఏర్పడతాయి. దూరపు వస్తువులను సరిగా చూడలేకపోవటం.


AP 9th Class Biology Notes 6th Lesson జ్ఞానేంద్రియాలు


→ దీర్ఘదృష్టి (హైపర్ మెట్రోపియా) : ఒక రకమైన కంటి లోపం (దృష్టి లోపం). ప్రతిబింబాలు నేత్రపటానికి వెనుకగా ఏర్పడతాయి. దూరపు వస్తువులు సక్రమముగా కనబడతాయి. దగ్గర వస్తువులు సరిగా కనబడవు.


→ శుక్లం : కంటి వ్యాధి. కంటిపొర పైభాగమున పలుచని పొర ఏర్పడుతుంది. కటకం తెల్లగా మారుతుంది.


→ వర్ణాంధత : ఒక రకమైన దృష్టి లోపం. వివిధ రంగుల మధ్యగల భేదములను గుర్తించలేకపోవటం.


→ పిన్నా : మన తలభాగాన ఇరువైపులా కంటికి కనిపించే చెవి భాగం. దీనిని వెలుపలి చెవి అంటారు.


→ సెరుమినస్ గ్రంథులు (మైనపు గ్రంథులు) : వెలుపలి చెవినందు ఉండే మైనాన్ని స్రవించే గ్రంథులు. శ్రవణ కుహరాన్ని మృదువుగా ఉంచుతుంది.


→ తైలగ్రంథులు : వెలుపలి చెవినందు ఉండే నూనెను స్రవించే గ్రంథులు, శ్రవణ కుహరాన్ని మృదువుగా ఉంచుతుంది.


→ శ్రవణకుల్య : వెలుపలి చెవినందలి కాలువ. దీనిని ‘ఆడిటరీ మీటస్’ అంటారు.


→ కూటకము (లేక) సుత్తి : మధ్య చెవినందుండు ఎముకల గొలుసునందలి మొదటి ఎముక.


→ దాగలి : మధ్య చెవినందుండు ఎముకల గొలుసునందలి రెండవ ఎముక.


→ కర్ణాంతరాస్థి : మధ్య చెవినందుండు ఎముకల గొలుసు నందలి మూడవ ఎముక.


→ కర్ణభేరి : వెలుపలి చెవినందలి శ్రవణకుల్య చివరిలో ఉండే పలుచని పొర. వెలుపలి, మధ్య చెవులకు మధ్యలో ఉంటుంది.


→ పేటిక : అంతర చెవిలో త్వచా గహనంలో ఉండే మొదటి భాగం.


→ అర్ధవర్తులాకార కుల్యలు : అంతర చెవిలో త్వచా గహనంలో ఉండే రెండవ భాగం (అర్ధ వర్తులాకార కుల్యలు)


→ కర్ణావర్తం : అంతర చెవిలో త్వచా గహనంలో ఉండే మూడవభాగం.


→ శ్రవణ నాడి : పేటికానాడి తంతువులు, కర్ణావర్తనాడీ తంతువులు కలసి ఏర్పరచే నాడి.


→ అంతరలసిక : అర్ధవర్తులాకార కుల్యలనందు ఉండే ద్రవం.


→ పరలసిక : కర్ణావర్తం నందలి నాళాలైన స్కాలా వెస్టిబ్యులై, స్కాలాటింపానిలందు ఉండు ద్రవం.


→ రసాయన గ్రాహకాలు : రసాయన పదార్థాలలో ఉండే రుచిని గుర్తించే గ్రాహకాలు.


→ ఘ్రాణ జ్ఞానం : పదార్థాల వాసనను తెలుసుకొనే శక్తి.


→ ఫంగింఫార్మ్ పాపిల్లే : నాలుకపైన గుండ్రంగా కనిపించే నిర్మాణాలు.


AP 9th Class Biology Notes 6th Lesson జ్ఞానేంద్రియాలు


→ ఫిలి ఫాం పాపిల్లో : నాలుకపైన పొలుసులు వంటి నిర్మాణాలు.


→ వేలేట్ పాపిల్లే : నాలుక వెనుకవైపు గుండ్రంగా ఉండే పెద్ద నిర్మాణాలు.


→ ఫోలియేట్ పాపిల్లే : నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలు.


→ మెలనిన్ : చర్మానికి రంగును కలిగించే వర్ణద్రవ్యం.


→ స్పర్శ గ్రాహకాలు : చర్మమునందు స్పర్శజ్ఞానమును కలిగించేవి.


→ ల్యూకోడెర్మా (బొల్లి) : మెలనిన్ లోపం వలన వచ్చే చర్మవ్యాధి.


→ ఉమామి : మాంసం, సముద్రం నుండి లభించే ఆహారం. జున్నువంటి మాంసకృత్తులు ఉండే ఆహారం నుండి వచ్చే వాసన.