Ticker

6/recent/ticker-posts

*అమ్మో ఇన్నివానలా !?*

_*ఎన్ని రకాల వానలు తెలుగు వారికి ఉన్నాయో తెలుసుకోండి..*_

1. *గాంధారివాన* = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన
2. *మాపుసారివాన* = సాయంత్రం కురిసే వాన
3. *మీసరవాన* = మృగశిరకార్తెలో కురిసే వాన
4. *దుబ్బురువాన* = తుప్పర/తుంపర వాన
5. *సానిపివాన* = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
6. *సూరునీల్లవాన* = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
7. *బట్టదడుపువాన* = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
8. *తెప్పెవాన* = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
8. *సాలువాన* = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
10. *ఇరువాలువాన* = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
11. *మడికట్టువాన* = బురదపొలం దున్నేటంత వాన
12. *ముంతపోతవాన* = ముంతతోటి పోసినంత వాన
13. *కుండపోతవాన* = కుండతో కుమ్మరించినంత వాన
14. *ముసురువాన* = విడువకుండా కురిసే వాన
15. *దరోదరివాన* = ఎడతెగకుండా కురిసే వాన
16. *బొయ్యబొయ్యగొట్టేవాన* = హోరుగాలితో కూడిన వాన
17. *రాళ్లవాన* = వడగండ్ల వాన
18. *కప్పదాటువాన* =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన
19. *తప్పడతప్పడవాన* = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
20. *దొంగవాన* = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
21. *కోపులునిండేవాన* = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన
22. *ఏక్దారవాన* = ఏకధారగా కురిసే వాన
23. *మొదటివాన* = విత్తనాలకు బలమిచ్చే వాన
24. *సాలేటివాన* = భూమి తడిసేంత భారీ వాన
25. *సాలుపెట్టువాన* = దున్నేందుకు సరిపోయేంత వాన

*అమ్మో ఇన్నివానలా !?*

🌞