Ticker

6/recent/ticker-posts

Telugu varnamala vivarana


*1. అక్షర విభాగం * 
*వర్ణము*
*వర్ణము అనగా అక్షరము, రూపము, రంగు, బంగారు, పూత, జాతి, కులము అని అర్థం.* 
*"అక్షరములన్నింటినీ కలిపి అక్షరమాల లేక వర్ణమాల అని చెబుతారు".*
*“భాషలోని అతి కనిష్టాంశాన్ని ధ్వని అంటారు. ముఖ్యమైన ధ్వనుల్ని వర్ణాలంటారు.* *స్వాతంత్రోచ్చారణ కలిగిన స్వరాన్ని వర్ణమని అనవచ్చు. రెండుగాని అంతకు ఎక్కువగాని వర్ణాల సమ్మేళనం అక్షరం. కేవలం హల్లులు వర్ణాలేగాని అక్షరాలు కావు". అనే వివరణ కుడా వుంది. అంటే వర్ణాలన్నీ అక్షరాలు కావు. అక్షరాలన్నీ వర్ణాలే.*
త్రి వర్ణములు: 1.శ్యామము, 2.రక్తము, 3.పీతము.
చాతుర్వర్ణములు: నాలుగు వర్ణములు:
మాల: పూదండ, గర్వకారణ మగునది
అక్షరమాల: *అక్షరముల సముదాయము.* 
వర్ణమాల: *1.అక్షర సమామ్నాయము (అక్షర సమూహము / వర్ణ సమామ్నాయము),*

 2.*కాంతి పృథక్కరణము వలన ఏర్పడిన ఏడు రంగుల సముదాయము. తెల్లని వెలుతురును పట్టకముచే విరిచి ఒక నిలువు చీలిక ద్వారా చిన్న దూరదర్శినితో చూచినప్పుడు అగపడు రేఖల పరంపర.*
*“మనం పలికే ధ్వనులకు మనం ఏర్పరచుకున్న గుర్తులనే అక్షారాలు అంటాం. ఆ అక్షరాలన్నిటినీ కలిపి వర్ణమాల అంటున్నాం”.* -(3వ తరగతి)
*చిన్నయ సూరి బాలవ్యాకరణం ప్రకారం వర్ణములు.*
••••••••••••
*సంస్కృతమునకు వర్ణము లేఁబది:*
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం అః*
*క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ.* 
*ఇందకారాదు లచ్చులు, కకారాదులు హల్లులు.*
••••••••••••
*ప్రాకృతమునకు వర్ణములు నలువది:*
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అః*
*క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స హ ళ.*
••••••••••••
*కొందఱు మతంబున హ్రస్వవక్రంబులును బ్రాకృతంబునందుఁ గలవు.* 
*కొందఱ మతంబున వక్రతమంబులుం గలవు.* 
*ఎ ఏ ఒ ఓ లు వక్రములని, ఐ ఔ లు వక్రతమములని ప్రాచీనులు వ్యవహరింతురు.*
••••••••••••
*తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు*
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః*
*క గ చ ౘ జ ౙ ట డ ణ త ద న ప బ మ య ర ల వ స హ ళ.*
*ఋ ౠ ఌ ౡ ః (విసర్గ) ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శ ష లు* *సంస్కృతసమంబులను గూడి తెలుఁగున వ్యవహరింపఁబడు.*
*ఋతువు, పితౄణము, కౢప్తము, ౡకారము, దుఃఖము, ఖడ్గము, ఘటము, ఛత్రము, ఝరము, కంఠము, ఢక్క, రథము, ధరణి, ఫణము, భయము, పఙ్క్తి, ఆజ్ఞ, శరము, షండము.*
••••••••••••
*ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలు:*
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ*
*క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష*
*ం ః*
*“ఙ ఞ క్షః”ఈ నాలుగు అక్షరాలు సంస్కృత పదాలకు వాడబడతాయి. ‘క్ష’ ను సంయుక్తాక్షరంగా చెప్పినప్పటికీ కొన్ని పదాలలో వాడక తప్పడం లేదు.*
ఉదా: వాఙ్మయము, జ్ఞానము, క్షమించు, దుఃఖము మొII.
*‘ఋ, ౠ, ఌ, ౡ, ౘ, ౙ, ఱ ఁ’ ల ఉపయోగం దాదాపుగా ప్రస్తుతం లేదనే చెప్పాలి.* ౘ, ౙ, ఱ లకు బదులు చ, జ, ర లను వాడుతున్నారు. 'ఋ' కారానికి కుడా 'ర' ను వాడడం జరుగుతుంది. *ఁ వాడకంలో లేదు.* *కాని ప్రాచీన కావ్యాలు, మరియు తెలుగు సాహిత్య విస్తృత అధ్యయనం కొరకు అక్షరాలు అన్ని కావాల్సిందే. అప్పుడు ‘అక్షరాలు మొత్తం 57 అని చెప్పొచ్చు’*
*అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ, ఐ,  ఒ, ఓ, ఔ.*
*క ఖ గ ఘ ఙ*
*చ ౘ ఛ జ ౙ ఝ ఞ*
*ట ఠ డ ఢ ణ*
*త థ ద ధ న*
*ప ఫ బ భ మ*
*య ర ల వ శ ష స హ ళ క్ష ఱ*
*ఁ ం ః (అరసున్న, సున్న, విసర్గ)* 
*“క్+ష్+అ=క్ష” అప్పుడు ‘క్ష’ ను ప్రత్యేక అక్షరంగా చెప్పలేము. కాబట్టి “వర్ణమాలలోని అక్షరాలు 56 అనడమే సమంజసం”.*