Ticker

6/recent/ticker-posts

💥💥Batuku Gampa | బతుకు గంప | Class 10 New Telugu | 2024 Syllabus 💥💥

 💥💥Batuku Gampa | బతుకు గంప | Class 10 New Telugu | 2024  Syllabus 💥💥


బతుకు గంప

బతుకు గంప

అవగాహన - ప్రతిస్పందిన

అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయంది.

1. పాఠంలో మీకు నచ్చిన సన్నీవేశాన్ని గురించి మాట్లాడండి.

'.పాఠంలో నాకు నచ్చిన సన్బివేశం పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ చెప్పిన సమాధానం. ఎల్లమ్మ ఒక త్యాగమూర్తి,

తల్లిగా తన బాధ్యతను విస్మరించక చాలా చక్కగా నిర్వర్తించింది. మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా ?

కష్టంతోనే మనం తింటున్నాం. మన పిల్లలకి పెడుతున్నాం. మనల్ని ఆశ్రయించినోళ్ళకి ఇంత పెడుతున్నాం. ఇంత కంటే

తృప్తి ఎక్కడుంటుంది.” అని అన్న మాటల్లో మనిషి యొక్స కరవ్వాని. బాధ్యతను వివరించింది.

2. పొళఠనికీ 'బతుకు గంప' శీర్షిక సరిపోతుందా ? ఎందుకు ?

'. పాఠానికి “బతుకు గంప” శీర్షిక సరిపోతుంది. ఎందుకంటే ఎల్లమ్మ జీవితమే దీనికి ఉదాహరణ. మనిషి యొక్క కర్తవ్యాన్ని.

బాధ్యతను విశ్లేషించి తన అనుభవం ద్వారా చూపింది. కుటుంబ బాధ్యతకై ఎలాగైనా కష్టపడి సంపాదించి తనపై

'అధారపథవారిని పోషించడం తన కరమమని ఎలము చెపింది.

 

ఆ) కింది అపరిచిత పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చం.  గనిమల తుంగకున్‌ గరిక కాడలకల్లిన సాలెగూళ్ళన

న్నని పటికంపుమంచుపడి నాణెపు ముత్తెసరాల పోలికం

'గనుగొన రమ్యమయ్యె రవికాంశులం దేలుచు నిట్టి భావమో.

హనపు నిసర్గ శిల్పముల హోలిక ! క్రొక్కక దాటి పొమ్మికన్‌

 

ప్రశ్నలు - జవాబులు:

1.        ముత్యాల సరంలా ఏం కనబడింది ?

జ . సాలెపురుగు కట్టిన గూఢులోని సన్నని దారాలపై మంచు పడి ముత్యాల సరంలా కనబడుతోంది.

2.        కవి రైతుకి ఏమని చెప్పాడు ?

జ .సూర్య కిరణాలతో ప్రకాశించే నిసర్గ శిల్పాల వంటి మంచు బిందువులను తొక్కకుండా వెళ్ళమని కవి రైతుకి చెప్పాడు.

3.        సాలెగూడు వేటికి అల్లింది ?

జ . తుంగ, గరిక కాడలకు సాలెగూడు అల్లింది.

4.        పద్యం అధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.

జ . 'పై పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు ?

 

ఇ) కింది అపరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయంది..

. క్ళడో పరాయి దేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు మనపై అధికారం చెలాయిస్తూ మన దేశ సంపదను ఎందుకు

కొల్లగొట్టాలి ? సమాజంలో కొంత మంది పెద్ద భవంతుల్లో మరికొందరు మురికి కూపాల్లాంటి గుడిసెల్లోనే ఎందుకుండాలి?

 అని అతిచిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బతుకుల్ని ప్రజల మధ్య వున్న అంతరాల గురించి

ఆలోచించేవాడు. తాను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల అనాడు విద్యార్థులకు ఇచ్చే

 ఉపకార వేతనాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం నిలిపేసింది. తన చదువుకు, జీవనానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధైర్య

 పదలేదు. భాలీ సమయాల్లో బట్టల షాపుల్లో పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి దబ్బు సంపాదించేవారు. అ దబ్బతో

 తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి సహాయపదేవారు. అనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను

 అభ్యసించడం సాధ్యం కాదని భావించాడు. అందుకోసం అమెరికా వెళ్ళి అర్ధిక శాస్త్రంలో యం.ఎ. పూర్తిచేశాడు. ఈ

 ఉన్నత విద్యకు మన దేశీయులు ఎందరో అర్థిక సహాయం చేశారు. తరువాతి కాలంలో ఆర్థిక శాస్త్రంలో ఎనలేని కీర్తి

 

ప్రశ్నలు - జవాబులు:

1. జయప్రకాష్‌ నారాయణ చిన్నతనంలో ఏయే విషయాలు-గురించి ఆలోచించేవారు?

జ. జయప్రకాష్‌ నారాయణ చిన్నతనంలో ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్సి, (ప్రజల మధ్య ఉన్న అంతరాల గరించి ఆలోచించేవారు.

2. తన ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణమేంటి?

జ. తాను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఉపకార వేతనం ఆగిపోయింది.

3.నారాయణగారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు ?

జ. నారాయణగారు ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఈ విధంగా తన ఆర్థిక ఇబ్బందులను దాటాడు.

4.ఓ పేరా అధారంగా అర్ధవంతమైన ప్రశ్న తయారు చేయండి.

జ. సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత ముద్గుబిద్దగా, లోక్‌నాయక్‌గా పేరు గాంచిన వ్యక్తి ఎవరు ?

 

ఈ) కింది వాటికి 'రాయంది.

1. అయితే నీవిట్లా వచ్చావేమే

జ. పరిచయము : ఈ వాక్యము మూలింటి చంద్రకళ రచించిన ఆమె కథల నుండి స్వీకరించబడిన 'బతుకు గంప" అను

పాఠంలోనిది.

సందర్భము : తన భర్తకు యాక్సిడెంట్‌ జరిగిందని చెప్తూ ఏదుస్తూ ఉన్న ఎల్లమ్మతో రచయిత పల్కిన సందర్భము.

భావము : నువ్వు ఎందుకు ఇక్కడకు వచ్చావు ? అని భావం.

2. వారితో ఎప్పుడు కలిసినా | వెలితిగానే మాట్లాడుతారు.

జ పరిచయము : ఈ వాక్యము మూలింటి చంద్రకళ రచించిన ఆమె కథల నుండి స్వీకరించబడిన 'ఐతుకు గంప అను పాఠంలోనిది.

సందర్భము : తన చుట్టూ ఉన్న వారిని గురించి మాట్లాడుతూ, రచయిత చెప్పిన సందర్భము.

భావము : తన చుట్టూ ఉన్న వారితో ఎప్పుడు కలసి మాట్లాడినా ఏదో లోపం ఉన్నట్లుగా మాట్లాడతారని భావము.

 

ఉ) పాఠం అధారంగా కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయంది.

1. 'సాయిలు' ఎవరు?

జ. ఎల్లమ్మకు దొరికిన బిద్ద పేరు సాయిలు.

'2. ఎల్లమ్మ లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది ?

'జ. ఏనాడు సుఖమన్నమాట, ఆనందమన్నమాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లుగాని, వాటి

గురించి ఆలోచించినట్లుగాని ఎల్లమ్మ కనిపించలేదు అని రచయిత్రి అన్నది.

౩ రచయిత్రికి ఎల్లమ్మతో పరిచయం ఎలా ఫర్పడింది ?

జ. పండ్లు అమ్ముకుంటూ ఉన్న ఎల్లమ్మ దగ్గర రచయిత్రి పంద్లు కొనేది. ప్రతిరోజూ కొనేది. క్రమంగా వారిరువురి పరిచయం.

 

వ్యక్తీకరణ-సృజనాత్యకత

 

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయంది.

1. ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది ?

జ ఎల్లమ్మ భర్తకు యాక్సిడెంట్‌ జరిగింది. ఇల్లు గడవాలంటే భర్త గాని, భార్య గాని పని చేయాలి. కూలిపని చేద్దామంటే

ఎల్లమ్మకు కడుపులో బిడ్డ, సంకలో బిడ్డ. ఆమెకు వంగి లేవడం కష్టంగా ఉండేది. అందుచేత ఎల్లమ్మ పండ్ల గంపను

నెత్తిన పెట్టుకుని వీధీధి తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగించేది.

 

2. రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్పలక్షణాలు ఏవి?

జ ఎల్లమ్మ కష్టజీవి. ఓర్చు కలది. తెలివి తేటలతో పండ్ల వ్యాపారం చేస్తూ, జీవనం సాగించేది. ఒక పిల్లవాడు దొరికితే

వాద్నీ పెంచి పెద్ద చేసింది. కుటుంబం కోసం కష్టపడింది. కలుపుగోలుతనం కలది. అభిమానవంతురాలు. ఎవరైనా

అకారణంగా డబ్బులిస్తే తీసుకోదు. బాధ్యత కలది.

 

౩. బాల్య వివాహాల వలన నష్టాలు తెలపండి.

'జ . బాల్య వివాహాల వలన అన్నీ నష్టాలే. చదువు దెబ్బతింటుంది. అనవసరమైన బాధ్యతలు నెత్తి మీద పడతాయి. అభివృద్ధి

ఉండదు. శక్తికి మించిన చాకిరీ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. తెలివితేటలు

కూదా వృద్ధి చెందవు. పిల్లలు కూడా పుడితే ఇంక చెప్పనక్కల్లేదు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. చట్ట ప్రకారం కూదా.

'బాల్య వివాహం నేరం. బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులను, బంధువులను, చేయించిన పురోహితుని కూదా అరెస్ట్‌

చేస్తారు. కఠిన కారాగార జైలు శిక్షను విధిస్తారు. అంత ప్రమాదకరమెంది బాల్వు వివాహం.

 

అ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయంది.

1. 'బతుకు గంప' పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంతమాటల్లో రాయండి.

జ. ఎల్లమ్మ కష్టజీవి. తన కుటుంబ భారాన్నంతా ఎల్లమ్మే మోసేది. తన మంచితనంతో ఊళ్ళోవాళ్ళందర్ని ఆకట్టుకునేది. ఆ

విధంగా రచయిత్రి యింటికి వస్తూందేది. ఎల్లమ్మ పండ్ల వ్యాపారం చేసేది. అవసరం ఉన్నా లేకపోయినా రచయిత్రి

పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అపుడపుడు ఎలము పని చేసూండేది. అహుడహుడు రచయితి ముటో బోజన

 

చేస్తూందేది. రచయిత్రితో తన కష్టసుఖాలను చెప్పుకునేది. ఆ విధంగా రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ కుటుంబ సభ్యురాలైంది.

వటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే, ఆ బిడ్డను ఎల్లమ్మ సాకింది. దయార్ధ హృదయురాలు ఎల్లమ్మ. ఏనాడు

'నుఖమన్న మాట, అనందమన్న మాట తన దరిదావులకు రానివ్వని ఎల్లమ్మ బాధపడినట్లుగాని, వాటి గురించి

 అలోచించినట్లుగాని కనిపించలేదు. బ్రతుకు కొకు గంపనెత్తుకుని వీథి వీథి తిరుగుతూ పండ్లను అమ్ముకుంటూ జీవనం

సాగించింది. యాక్సిడెంట్‌ జరిగిన భర్తను, పిల్లలను పోషించుకొంటూ జీవిస్తున్న ఎల్లమ్మ ధన్యురాలైంది.

 

2. పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.

జ ఎల్లమ్మ వ్యక్తిత్వం చాలా గొప్పది. తన కుటుంబ బ్రతుకుల కొజకు గంపను నెత్తిన పెట్టుకొని పండ్ల వ్యాపారం చేస్తూ,

జీవనం సాగిస్తున్న స్వశక్తిపరురాలు, తన కుటుంబాన్ని పోషించడం తన బాధ్యతగా గుర్తించిన నిస్సార్థపరురాలు. భర్తకు

ఆపద వస్తే ఆదుకున్న అర్ధాంగి. ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే కాపాడి చేయూత నిచ్చి పోషించిన దయార్ధ

'హృదయురాలు. రచయితకు తన కష్టసుఖాలను చెప్పి గుండె బరువును దించుకునేది. రచయితతో పరిచయం ఏర్పడ్డాక

పరి కుటుంబ సళ్నురాలెంది. అంత మంచి మనసును అనురాగమాూరి

 

౩.  ఎల్లమ్మకు, రచయిత్రికి గల అనుబంధం గురించి రాయండి.

జ ఎల్లమ్మ గంప నెత్తిన పెట్టుకుని పండ్ల వ్యాపారం చేస్తూందేది. ఆ విధంగా తరచూ రచయిత్రి ఇంటికి వెళ్తూ ఉండేది.

'తనకు అవసరం ఉన్నా లేకున్నా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పనులు చేస్తూందేది.

(రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ భోజనం చేస్తూండేది. తనకు వచ్చిన కష్ట సుఖాలను ఎల్లమ్మ రచయిత్రీతో చెప్పుకునేది.

క్రమంగా రచయిత్రి కుటుంబసభ్యురాలైంది. రచయిత్రి అభిమానాన్ని, ఆప్యాయతను పొందింది ఎల్లమ్మ. నిస్సార్ధ పరురాలైన

ఎల్లమ్మకు, రచయిత్రికి విడదీయరాని బంధం కల్గింది. అనురాగమూర్తి అయిన రచయిత్రి, ఎల్లమ్మకు మమతానురాగాలను

పంచింది.

 

ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయంది.

1. పాఠం ఆధారంగా ఎల్లమ్మ, రచయిత్రిల మధ్య చర్చను సంభోషణ రూపంలో రాయండి.

జ ఎల్లమ్మ: పండ్లమ్మో ..... పండ్లు పండ్లమ్మో .....పండ్లు

 

రచయిత్రి. : హే..అమ్మీ. పండ్లమ్మి

ఎల్లమ్మ : అమ్మగారూ .......... దండాలమ్మా

రచయిత్రి : ఏమే ఎల్లమ్మా ఎక్కడకు వెళ్ళావే! ఇంతకాలం కనబడటం లేదు. అదేమిటే అలా ఉన్నాన ?

ఎల్లమ్మ : అవునమ్మా ! ఏం చెప్పనమ్మా ! మా ఆయనకు యాక్సిడెంట్‌ జరిగింది.

రచయిత్రి: 'ఎప్పుడయింది ? ఏం జరిగింది ?

ఎల్లమ్మ: ఏమోనమ్మా నాక్కూడా సరిగ్గా తెల్వదు. లారీ డైవర్‌గా పనిచేస్తా వుండె. నాలుగురోజులకు ముందు ఏదో

లోడుతో పోయాడంట. హైదరాబాద్‌ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్‌ గుద్దిందంట. మా ఆయనకు

కాలిరిగిపోయిందంట.

రచయిత్రి: అయితే నువ్విట్లా వచ్చావేమే ?

ఎల్లమ్మ : రాక సేసేదేముందమ్మా...... లెక్కకావద్దూ......... నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళ

ఇల్లు చూసి పోదామని వస్తినమ్మా !

రచయిత్రి : జాగ్రత్త ! ఎల్లమ్మా ! ఏదైనా అవసరం వస్తే వచ్చి అడుగు.

ఎల్లమ్మ : అలాగే నమ్మా ! వెళ్ళొస్తా 1

2. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.

తిరుపతి,

                                                                                                                                  X X X X X.

ప్రియమైన మిత్రునకు నమస్కారాలు !

నేను క్షేమం. నీవు క్షేమమని తలుస్తాను. మా తాతగారు “మానవ జీవితం ఎలా సార్ధక్యం పొందాలని" చాలా బాగా

వివరించి చెప్పారు. మానవుడు ఎప్పుడూ దైర్యంగా ఉండాలని విశ్లేషించాడు. ఎందుకంటే “ధైర్యే సాహసే లక్ష్మీ” అని

ఆర్యోక్తి. కష్టాలైనా, సుఖాలైనా మానవులకే కల్గుతాయి. అంతేకాని మిగిలిన వాటికి కలుగవు కదా ! “ఫలించిన వృక్షమునకే

జాతి దెబ్బలు” - అన్నట్లు మానవులకే బాధలు. వాటిని తట్టుకుని దైర్యంగా నిలబడ్డవాడే మనిషి అందువల్ల మానవుడు

కష్టాలకు కుంగకూడదు. సుఖాలకు పొంగకూడదు. స్థిత ప్రజ్ఞతతో ప్రవర్తించినపుడు నిజమైన మనిషిగా కీర్తిని పొందుతాడని

'మా తాతగారు చెప్పారు. నిజంగా నాకు చాలా ఆశ్యర్యం కల్గింది. నేను కూడా అలాగే ప్రవర్తిస్తానని మా తాతకు మాట

'ఇచ్చాను. నీవు కూడా ఈ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకుని నీ స్పందనను తెలియజేయగలవని ఆశిస్తున్నాను.

వెంటనే ఉత్తరం వ్రాయి.

ఉంటా.

                                                                                               ఇట్లు                                                                                                                           నీ మిత్రుడు,

                                                                                             కె శ్రీవత్స.

చిరునామా. 

టి.పి. శ్రీనాథ్‌, 10వ తరగతి,                                                                                                     

జిల్లా పరిషత్‌ హైస్కూలు,                                                                                                       

'పెనమకూరు (పోస్ట్‌),

(వయా) ఉయ్యూరు,

521165.

 

భాషాంశాలు

పదజాలం

అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధాలు రాసి, సొంతవాక్యాలు రాయంది.

1. అతిధికి ఏ వెలితి లేకుందా చూసుకోవాలి.

వెలితి = తక్కువ

సొంతవాక్యం  : మహాత్నులను ఎపుడూ తకుువ అంచనా వేయరాదు.

2 నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం.

'అశ్రయం = అధారం

'సొంతవాక్యం : జీవులకు నీరే ప్రాణాధారం.

3. రవి పొద్దస్తమానం క్రికెట్‌ ఆడుతున్నాడు.

పొద్దస్తమానం = ఎప్పుడూ

సొంతవాక్యం : విద్యార్థులు ఎప్పుడూ అబద్ధం అడరాదు.

4. తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్తిమితపదుతున్నారు.

స్తిమితపడు = కుదుటపదు

సొంతవాకుం : రాముకు ఉద్యోగం రావడంతో కుడుటపడ్డాడు.

5. మదర్‌ థెరిస్సా దిక్కులేని వారెందరికో సేవలు చేసింది.

దిక్కు = దెస

'సొంతవాక్యం : తూర్పు దెనన సూర్యుడు ఉదయిస్తాడు.

 

ఆ) కింది వాక్యాలు చదివి, పర్యాయపదాలను గుర్తించి రాయంది.

1. సంపాదించిన సొమ్మును కొంత దాచి పెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో

ఎన్ని మంచి వనులైనా చేయవచ్చు.

జ. సొమ్ము ,ధనం ,డబ్బు

2.  రుషం నిటిలో జీవిస్తుంది. చెప మొప్పలతో గాలీ పల్చుకుంటుంది. మత్స్యం బోకాధించి దిశను మార్పుకుంటుంది.

జ . ఝషం ,చేప ,మత్స్యం

3 . దేహం అలసిపోయేలా కష్టిస్తే, ఒళ్ళంతా చెమట పట్టి, శరీర మలినం పోతుంది.

జ. దేహం, ఒళ్ళు, శరీరం.

4. ప్రభాతవెళ పల్లె మెల్కొంటోంది. ఉదయాన్నె రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుటపూట పొలాలకు వెళ్ళి, పనులు చేయసాగారు.

జ. ట్రభాతం, ఉదయం, ప్రొదుటపూట.

ఇ) కింది పదాలు చదివి వాటికి సరిపోయ నానార్థాలతో జతపరచండి.

 

1. బతుకు           (ఆ)          అ ) కాపురం, కుటుంబం, పుట్టుక

2, సంతానం         (ఇ )          ఆ ) జీవనం, స్థితి జరుగుబాటు

3. సంసారం         (అ )         ఇ ) బిడ్డ, ఒక కల్పవృక్షం ,కులం

ఈ) కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి.

(బంతి, కస్తి, మొరకు, సుగము, మోము, రాతిరి)

1. ముఖం = మోము            2. పంక్తి = బంతి               3 . కష్టం = కస్తి

4. మూర్చుడు = మొరకు       5, సుఖము = సుగము      6. రాత్రి = రాతిరి

 

ఉ) కింది జాతీయాలను వివరించి రాయండి.

1. వీధిపాలు చేయు.: నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు.

2. ఊపిరి పీల్చుకొను : నిశ్చింతగా ఉన్నాడని చెప్తూ వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు.

 

                                              వ్యాకరణాoసాలు

 

అ) కింది పదాలను విదబీసి, సంధి పేరు రాయండి.

1. పుణ్యాత్ముడు  : పుణ్య          +    త్ముడు                                   (సవర్ణదీర్ఘ  సంధి )

2. విషయమంతా : విషయము     +    అంతా                                       (ఉత్వసంధి)

3.ఇంకెవరికీ       : ఇంక           +    ఎవరికి                                                   (అత్వసంధి)

4. ఉన్నదేదో       ; ఉన్నది        +    ఏదో                                           (త్వసంధి) 

 

అ) కింది పదాలు కలిపి, సంధి వీరు రాయంద్సి

1. పోదాము  + అనుకుంటే           : పోదామనుకుంటే       (ఉత్వసంధి)  

2. స్నానము + లు                  : స్నానాలు             (లు,,,, సంధి)

3.ఏమి + ఐనది                     : ఏమైనది              (ఇత్వసంధి)

4.అక్కడ + అక్కడ                  : అక్కడక్కడ            (ఆమేడితసంధి)

5.జీవితము + అంత                 : జీవితమంతా           (ఉత్వసంధి)

ఇ) కింది పదాలకు లిగ్రహనాక్యాలు రాసి, సమాసం వేర్లు రాయంది.

1. పదిరోజులు     : పదైన రోజులు                    (ద్విగు సమాసం)

2. కాళ్ళుసేతులు   : కాళ్ళును, చేతులును.            (ద్వంద్వ సమాసం)

3.తెల్లముఖం      : అసాధారణం                    (విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం)

4.అసాధారణం     : సాధారణం కానిది                (నజ్‌ తత్పురుష సమాసం)

5.చిన్నబిద్ధ        : చిన్నదైన బిడ్డ                  (విశేషణ పూర్వపద కర్షధారయ సమాసం)

 

అవ్యయీభావ సమాసం

కింది సమాన పదాలను, వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.

అ) యథావిధి విధి యెట్లో అట్లు

అ) ఆబాలగోపాలం 'బాలుర నుండి గోపాలుర వరకు

ఇ) అనువర్నం వర్షముననుసరించి

వీటి అన్నిటిలోను పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయాలు అని గ్రహించవచ్చు.

ఇవి సాధారణంగా.

అను, యథా, , ప్రతి, , పరి, అప, సహ, ఉప మొదలైనవి. ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది. లింగ,

వచన, విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. ఈ సమాసంను అవ్వయీభావ సమాసం అంటారు.

 

ఈ) క్రింది పదాలకు విగ్రహవాక్యాలను రాయంది.

 

1 అనుకూలం   :   కూలాన్ని అనుసరించి - అవ్యయీభావ సమాసం.

2 యథాశక్తి      :    శక్తిని అతిక్రమించక  - అవ్యయీభావ సమాసం

3.ప్రతిమాసం    :    మాసము, మాసము... - అవ్యయభావ సమానం

4.ప్రతి దినం    :    దినము, దినము... - అవ్యయీభావ సమాసం

5.ఉపవనం      :    వనానికి సమీపం... - అవ్యయీభావ సమాసం

6.సకుటుంబం.  :    కుటుంబంతో సహా - అవ్యయీభావ సమాసం

 

 

అలంకారం - ఛేకానుప్రాసాలంకారం

 

1. నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది.

2 ఈ ఏదు ఏడు రోజులపాటు వ్రతం చేయాలి,

పై రెండు వాక్యాలలో దర. దర, ఏదు. ఏదు అనే సమాన వర్జాలుగల పదాలు పక్కపక్కనే ఉన్నాయి. కనుక,

పై వాక్యాలలో ఉన్నది ఛేకానుప్రాసాలంకారం.

లక్షణం : సమాన వర్దాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటవెంటనే (అవ్యవధానంగా) ప్రయోగించబడితే దానిని

ఛేకానుప్రాసాలంకారం అంటారు.

 

ఉ) కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయంది.

1. గోరువంక వంక చూసెను.

జ.ఈ వాక్యంలో వంక, వంక అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్ధభేదంతో ఉన్నాయి. కనుక ఇదిఛేకానుప్రాస.

 

2.సమన్యల సాధనకు నారి నారి బిగించింది.

జ. ఈ వాక్యంలో నారి, నారి అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్ధ భేదంతో ఉన్నాయి. కనుక ఇది

'ఛేకానుప్రాస.

 

 

3.సుందర దరహాస రుచులు.

జ. ఈ వాక్యంలో దర - దర అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్ధ భేదంతో ఉన్నాయి. కనుక ఇది ఛేకానుప్రాస

 

4.రాజా ! నీది శుభంకర కరం.

జ.ఈ వాక్యంలో కర - కరం అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్ధ భేదంతో ఉన్నాయి. కనుక ఇది ఛేకానుప్రాస

 

5.ఆ కొమ్మ కొమ్మవంచి పూలు కోసెను,

జ. ఈ వాక్యంలో కొమ్మ, కొమ్మ అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక ఇది 'ఛేకానుప్రాస.

 

ఈ) కింది కర్తరి వాక్యాలను, కర్మణి వాక్యాలుగా మార్చి రాయంది..

1. ఎల్లమ్మ పండ్లను అమ్మింది.                                      జ. పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబదినవి.

2. ఆమె వీద్దను చదివించింది.                                       జ బిడ్డ ఆమె చేత చదివించబిడింది

3. వైద్యుడు వైద్యం చేశాడు.                                         జ. వైద్యం వైద్యుడి చేత చేయబడింది.

4. అతదు కండక్టర్‌ ఉద్యోగం చేశాడు.                               జ. కండక్టర్‌ ఉద్యోగం అతని చేత చేయబడింది.

5.వారు పిల్లవాదిని కాపాడారు.                                     జ. పిల్లవాడు వారిచేత కాపాడబడ్డాడు

 

బు) కెంది వాక్యాలు చదివి,అవి ఏ రకమైన వాజ్యాలా రారుంలం.

1. అతడికి మంచి జరుగుగాక !                జ. ఆశీర్వార్థక వాక్యం

2 ఇటువైపు నీవు రావద్దు.                     జ. వ్యతిరేకార్థక వాక్యం

3. ఎల్లమ్మ అ పని చేయగలదు.               జ. సామర్భార్థక వాక్యం

4. మీరు మా ఇంటికి రావచ్చు.                జ. అనుమత్యర్థక వాక్యం.

5. పదిరోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ?        జ. ప్రశ్నార్ధక వాక్యం

6.అందరూ బడికి వెళ్ళండి .                  జ. విధ్యర్ధక  వాక్యం