|
జాతీయం & రాష్ట్రీయం |
విబిజి రాంజీ (VBG RAMJI) యాక్ట్ అమలు మరియు వేతనాల పెంపు
●
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (VBG RAMJI) చట్టం జూలై 1, 2026 నుండి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
●
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు సమక్షంలో దీనిని ఏపీలోని తిరుపతి
జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం లోని ముక్కావారిపల్లె గ్రామ పంచాయతీలో జూలై 2న ప్రారంభించారు.
●
రోజువారీ వేతనాన్ని కనిష్ఠంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.409 చెల్లించేలా నిర్ణయించింది. సిక్కిం లోని కొన్ని పంచాయతీల్లో మాత్రం అత్యధికంగా రూ.450 వేతనం చెల్లించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ
శాఖ తెలిపింది.
●
జాతీయ సగటు వేతనం: ₹298.8 నుండి ₹327.4 కి పెరిగింది.
●
ఆంధ్రప్రదేశ్: ₹312 (₹5 పెరిగింది)
●
అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రాలు: హర్యానా (₹409), గోవా (₹406), కేరళ (₹401).
●
Note: ఇది
పాత ఎంజి నరేగా (MGNREGA) యాక్ట్ 2005 స్థానంలో
వచ్చింది.
పాత చట్టంలో 100 రోజుల పని కల్పిస్తే, ఈ కొత్త చట్టం కింద 125 రోజుల అన్స్కిల్డ్ పని కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధుల వాటాను భరిస్తాయి.
భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ (భవ్య- రసాయన్)
●
దేశంలో 3 భారీ రసాయన పార్కులను రూ.3,030 కోట్లతో
ఏర్పాటు చేసేందుకు,
భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ (భవ్య- రసాయన్) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
●
ఇందులో రూ.3,000 కోట్లను
ఆయా పార్కుల్లో ఉమ్మడి మౌలిక సదుపాయాలు - ప్రాథమిక వసతుల కల్పన కోసం వెచ్చిస్తారు. మిగతా రూ.30
కోట్లను పాలనాపరమైన వ్యయాల కోసం ఉపయోగిస్తారు.
●
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి 2030-31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.
●
ఒక్కో పార్కుకు రూ.1000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ లభిస్తుంది. సంబంధిత
రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.500 కోట్లు
కేటాయించాలి
●
రసాయనాల తయారీలో మనదేశం స్వయంసమృద్ధి సాధించడమే ఈ పథక లక్ష్యం.
●
వ్యవసాయం, ఔషధ రంగాలు, జౌళి, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, వాహన
వంటి పలు రంగాలకు అవసరమైన ప్రాథమిక ముడి సరకులను అందించేందుకు ఈ పార్క్లు ఉపయోగపడతాయి.
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 'సార్నాథ్’
●
ఉత్తరప్రదేశ్
లోని ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన సార్నాథ్ యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
●
దక్షిణ కొరియా లోని బూసన్ (Busan) నగరంలో జరిగిన 48వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
●
భారతదేశ గణాంకాలు: సార్నాథ్తో కలిపి ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 45 యునెస్కో వారసత్వ సైట్లు ఉన్నాయి. వీటిలో
●
37 – సాంస్కృతిక ప్రదేశాలు (Cultural Sites)
●
7 – సహజసిద్ధ ప్రదేశాలు (Natural Sites)
●
1 – మిశ్రమ ప్రదేశం (Mixed Site: కాంచన్జంగా నేషనల్ పార్క్, సిక్కిం).
●
45వది: సార్నాథ్ బౌద్ధ క్షేత్రం (ఉత్తరప్రదేశ్). 44వది:
మరాఠా మిలిటరీ
ల్యాండ్స్కేప్స్
●
Note: గౌతమ బుద్ధుడు తన తొలి ధర్మోపదేశాన్ని (First Sermon) సార్నాథ్లోనే ఇచ్చారు. ఇక్కడే
ప్రముఖ దమ్మెక్ స్తూపం, చౌకండి
స్తూపం ఉన్నాయి.
●
ఉత్తరప్రదేశ్లో
తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీల తర్వాత ఉత్తరప్రదేశ్లో ఇది
4వ యునెస్కో సైట్.
●
UNESCO - United Nations Educational, Scientific and Cultural
Organization: స్థాపన: 1945 నవంబర్ 16. హెడ్క్వార్టర్స్: పారిస్ (ఫ్రాన్స్). డైరెక్టర్ జనరల్: ఖలీద్
ఎల్ ఎనాన్
(ఈజిప్ట్)
●
యునెస్కో
(UNESCO) 1983లో
భారతదేశం నుండి మొదటిసారిగా 4 ప్రదేశాలను
ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా (World Heritage Sites) గుర్తించింది. అవి 1.అజంతా గుహలు 2. ఎల్లోరా
గుహలు 3.ఆగ్రా కోట 4. తాజ్ మహల్.
దేశంలో తొలి 'టెలికాం మాన్యుఫ్యాక్చరింగ్ జోన్'
●
ప్రదేశం:
గ్వాలియర్, మధ్యప్రదేశ్.
●
నిర్వాహకులు: కేంద్ర
టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ (Department of
Telecommunications - DoT).
●
లక్ష్యం:
'మేక్ ఇన్ ఇండియా' (Make in India) మరియు 'ఆత్మనిర్భర్ భారత్' లో
భాగంగా దేశీయంగా టెలికాం పరికరాలు, మైక్రో
ప్రాసెసర్లు,
చిప్సెట్లు మరియు ఇతర సాంకేతిక పరికరాల తయారీని ప్రోత్సహించడం.
‘‘దాన్వీర్’’ కార్యక్రమం
●
గ్రామ స్థాయిలో డిజిటల్ మౌలిక
సదుపాయాల బలోపేతానికై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జూలై
29న ‘‘దాన్వీర్’’ కార్యక్రమం ప్రారంభించింది.
●
దీని కింద వ్యక్తులు, సంస్థలు
‘‘మేరీ పంచాయత్’’ మొబైల్
యాప్ సాయంతో స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు విరాళం రూపంలో అందజేయవచ్చు.
●
ప్రతి గ్రామ పంచాయతీకి డిజిటల్ సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం.
●
నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC), 'డిజిహాత్' (DigiHaat) అనే డిజిటల్ మార్కెటింగ్ యాప్ సహకారంతో దీనిని అభివృద్ధి
చేసింది.
●
Note : 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ 'పంచం' (PANCHAM
- Panchayat Assistance and Messaging) చాట్బాట్ను కూడా లాంచ్ చేసింది.
ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం
●
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (మంత్రి రాజీవ్ రంజన్ సింగ్) న్యూఢిల్లీలో
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
●
ముఖ్య ఉద్దేశం: పంచాయతీలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపై ఆధారపడటం తగ్గించి, సొంత రాబడి మార్గాలు (Own Sources of Revenue) పెంచుకోవడం ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం.
●
సమర్థ్ (Samarth) పోర్టల్: పంచాయతీల
ఆర్థిక స్వయం సమృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సమర్థ్ పంచాయతీ పోర్టల్ ప్రవేశపెట్టారు.
●
లక్ష్యం:
4 ఏళ్ల కాలంలో 350 ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం (మొదటి ఏడాది 50 ప్రాజెక్టులు, తరువాతి
3 ఏళ్లలో ఏటా 100 చొప్పున 300 ప్రాజెక్టులు).
●
అర్హత నిబంధనలు: గ్రామ పంచాయతీకి వార్షిక సొంత ఆదాయం కనీసం ₹50 లక్షలు ఉండాలి. బ్లాక్ పంచాయతీకి వార్షిక సొంత ఆదాయం
కనీసం
₹1 కోటి
ఉండాలి.
●
ఈ-గవర్నెన్స్ అవార్డు: పంచాయతీ అడ్వాన్స్మెంట్
ఇండెక్స్
(PAI) కు గాను పంచాయతీరాజ్
మంత్రిత్వ శాఖకు 2026 నేషనల్ ఈ-గవర్నెన్స్
గోల్డ్
అవార్డు దక్కింది.
కల్పసార్ ప్రాజెక్ట్
●
గుజరాత్
లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ ఖంబత్ (Gulf of Khambhat) వద్ద అభివృద్ధి చేస్తున్న భారీ వాటర్ రిజర్వాయర్/డ్యామ్ ప్రాజెక్ట్.
●
సాంకేతిక భాగస్వామి: నెదర్లాండ్స్ దేశం అవసరమైన టెక్నికల్ సపోర్ట్ అందిస్తోంది.
●
లక్ష్యం:
సౌరాష్ట్ర ప్రాంతానికి
సాగునీరు,
తాగునీరు అందించడంతో పాటు 2,470 మెగావాట్ల పునరుత్పాదక/జల విద్యుత్ను ఉత్పత్తి చేయడం.
●
ప్రధాన నదులు: సబర్మతి, మహీ, దాదర్, నర్మద నదుల నీటిని ఈ రిజర్వాయర్లోకి మళ్లిస్తారు.
ఉన్నతి AI 2.0
●
మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు IIT ఢిల్లీకి చెందిన FITT (Foundation for Innovation and Technology
Transfer) కలిసి
ప్రారంభించాయి.
●
లక్ష్యం: ద్వితీయ, తృతీయ శ్రేణి (Tier-2 & Tier-3) నగరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు, స్టార్టప్లు
మరియు AI ఇన్నోవేషన్ పార్కులను విస్తరించడం.
గుజరాత్లో భారత్ మొట్టమొదటి 'ఎయిర్ ఫీల్డ్ రబ్బర్ డ్యామ్స్’
●
నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ మరియు వరద నియంత్రణ కోసం భారతదేశం లోనే మొదటిసారిగా ఎయిర్ ఫీల్డ్
రబ్బర్ డ్యామ్లను (Air-filled Rubber Dams) నిర్మిస్తున్నారు.
●
గుజరాత్ లోని హరణ్ మరియు అంబికా నదులపై రెండు డ్యామ్లు నిర్మిస్తున్నారు.
●
సౌత్ కొరియాకు చెందిన 'రబ్బర్
బ్లాడర్' సాంకేతికతతో ఇవి రూపొందుతున్నాయి. నీటిని ఆపాలనుకున్నప్పుడు గాలి నింపడం, వదలాలనుకున్నప్పుడు గాలిని తీసేయడం ఈ డ్యామ్ ప్రత్యేకత.
దేశంలోనే మొదటి ‘హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ & పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్’
●
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశంలోనే అత్యధిక ఎత్తులో పనిచేసే మొదటి పబ్లిక్
హెల్త్ రీసెర్చ్ సెంటర్ను
హిమాచల్ ప్రదేశ్
లోని కిలాంగ్ (Keylong) లో స్థాపించనుంది.
●
హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం, అధిక ఎత్తులో వచ్చే వాతావరణ మార్పుల వల్ల సంభవించే వ్యాధులపై పరిశోధన చేయడం.
●
ICMR:
1911లో ఏర్పాటయింది (1949లో పేరు మార్చారు). ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
హైదరాబాద్లో భూ అయస్కాంతాల తయారీ కేంద్రం
●
భారతదేశం లోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పర్మనెంట్ మ్యాగ్నెట్
తయారీ కేంద్రం (Country's first integrated permanent magnet
facility) తెలంగాణ
లోని హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతోంది.
●
హైదరాబాద్కు
చెందిన నక్సన్ జియోకెమ్ (Nexon Geochem) సంస్థ మరియు రష్యా ప్రభుత్వ రంగ అణుశక్తి సంస్థ అయిన 'రోసోటోమ్' (Rosatom) అనుబంధ సంస్థ గిరెడ్మెట్ (Giredmet) కలిసి దీని ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
●
అరుదైన భూమూలకం అయిన నియోడైమియం (Neodymium), ఐరన్ మరియు బోరాన్ కలయికతో తయారుచేసే 'రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్'ను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. 2033 నాటికి
ఏటా 1200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని
లక్ష్యంగా పెట్టుకున్నారు.
●
ఈ అయస్కాంతాలను విండ్ టర్బైన్స్ (పవన విద్యుత్), ఎలక్ట్రిక్
వాహనాలు
(EVs), స్మార్ట్ఫోన్లు మరియు MRI స్కాన్
మెషిన్లలో ఉపయోగిస్తారు.
●
Note: మార్చి
2026 లో కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్లోని ARCI సెంటర్లో ఇలాంటి ఒక పైలట్ ప్లాంట్ను
స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
గుజరాత్లో సెమీకండక్టర్ 'ఓసాట్' (OSAT) కేంద్రం
●
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సనంద్ (Sanand) పట్టణంలో ₹7,500 కోట్ల విలువైన సెమీకండక్టర్ ఓసాట్ కేంద్రాన్ని ప్రారంభించారు.
●
ఓసాట్
(OSAT) అంటే: Outsourced Semiconductor Assembly and
Test ఫెసిలిటీ.
●
ప్రాజెక్ట్ పేరు & సామర్థ్యం: దీనిని 'సిజి
సెమి'
(CG Semi) ఓసాట్
ప్లాంట్ అని పిలుస్తారు. ఇది
పూర్తి స్థాయిలో అందుబాటు లోకి వస్తే ఏడాదికి 5 బిలియన్ల
సెమీకండక్టర్
చిప్స్ను ఉత్పత్తి చేస్తుంది.
●
భారత సెమీకండక్టర్ మిషన్ (ISM): ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ
దీనిని
2021లో
ప్రారంభించింది.
తొలి దశలో ₹76,000 కోట్లు కేటాయించగా, ఇటీవలే ISM 2.0 కింద ₹1.25 లక్షల కోట్ల బడ్జెట్కు ఫైనాన్స్ మినిస్ట్రీ ప్యానెల్ ఆమోదం
తెలిపింది.
●
Note: భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ ప్లాంట్ను గుజరాత్ లోని
దొలేరాలో ఏర్పాటు చేస్తున్నారు.
77వ వనమహోత్సవం 2026
●
దేశవ్యాప్తంగా 77వ
వనమహోత్సవ వేడుకలు 2026 జూలై 1 నుండి జూలై 7 వరకు
నిర్వహిస్తున్నారు.
●
వనమహోత్సవ కార్యక్రమాన్ని 1950లో అప్పటి కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి కే.ఎమ్. మున్షి ప్రారంభించారు.
●
Note: తాజా
గణాంకాల ప్రకారం భారత దేశంలో మొత్తం అటవీ, వృక్ష విస్తీర్ణం (Forest & Tree Cover)
8,27,357
చదరపు కిలోమీటర్లు (దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17%) గా ఉంది.
సమగ్ర శిశు బాల స్వస్థ్య కార్యక్రమం
●
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా
(JP Nadda) ఈ
కార్యక్రమాన్ని ప్రారంభించారు.
●
పుట్టిన పిల్లల నుండి 3 సంవత్సరాల (36 నెలలు) వయస్సు వరకు అంగన్వాడీ
కార్యకర్తలు,
ANMలు మరియు కమ్యూనిటీ
హెల్త్ ఆఫీసర్ల ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్ అందించడం దీని ముఖ్య
ఉద్దేశం.
'డ్రగ్స్ రూల్స్, 1945’సవరణ
●
అడ్వాన్స్డ్
సెల్ థెరపీ,
జీన్
థెరపీ
(Gene Therapy) మరియు
జెనోగ్రాఫ్ట్స్
(Xenografts) వంటి
అత్యాధునిక వైద్య విధానాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం 'డ్రగ్స్ రూల్స్, 1945' ను సవరించింది.
●
ఇకపై వీటి తయారీ, నాణ్యత
పరీక్షలు మరియు విక్రయాలకు 'సెంట్రల్
లైసెన్స్ అప్రూవింగ్ అథారిటీ' (CLAA) అనుమతి తప్పనిసరి.
●
జెనోగ్రాఫ్ట్: జంతువుల
కణజాలాలు లేదా అవయవాలను మానవ వైద్యంలో ఉపయోగించే ప్రక్రియ (ఉదాహరణకు పంది గుండె వాల్వ్లను
మానవులకు అమర్చడం).
మోడిఫైడ్ ఉడాన్ (Modified UDAN) స్కీమ్ ప్రారంభం
●
జూలై
4, 2026న
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని
జోధ్పూర్ ఎయిర్పోర్ట్ వేదికగా 'మోడిఫైడ్
ఉడాన్'
(ఉడే
దేశ్ కా ఆమ్ నాగరిక్)
పథకాన్ని ప్రారంభించారు.
●
బడ్జెట్
& కాలపరిమితి: రాబోయే 10 సంవత్సరాల కాలానికి గాను కేంద్రం రూ. 28,840 కోట్లను కేటాయించింది.
●
కొత్తగా సవరించిన పథకం కింద, టైర్-2, టైర్-3 నగరాల్లో
100 ఏరోడ్రోమ్లను రూ.12,000 కోట్లతో
అభివృద్ధి చేస్తారు. 200 హెలిప్యాడ్లను నిర్మించడం, ప్రాంతీయ విమానయాన సంస్థల కార్యకలాపాల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్
(వీజీఎఫ్) కొనసాగించడంతో పాటు చిన్న విమానాశ్రయాల నిర్వహణకూ మద్దతు అందిస్తారు.
●
Note: దేశం లోని చిన్న నగరాలకూ విమాన సర్వీసులు అందించేందుకు 2016లో ప్రారంభమైన ఉడాన్ పథకం ఇప్పటివరకు 669 మార్గాలను కార్య రూపం లోకి తెచ్చింది.
సెమికాన్ మిషన్ 2.0
●
భారతదేశాన్ని సెమీకండక్టర్లు మరియు మొబైల్ తయారీలో గ్లోబల్ హబ్గా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ 'సెమికాన్ మిషన్ 2.0' కు ఆమోదం తెలిపింది.
●
బడ్జెట్:
ఈ మిషన్ కోసం రూ. 1,27,000 కోట్లు (1.27 లక్షల కోట్లు) బడ్జెట్ కేటాయించారు. దీనితో
పాటు మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ కోసం రూ. 62,500 కోట్లు కేటాయించారు.
దేశం లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించిన ప్రధాని
మోడీ
●
హరియాణా లోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు (Hydrogen Train)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూలై 17న ప్రారంభించారు.
●
ఈ రైలు ఉత్తర రైల్వే పరిధి లో హర్యానా రాష్ట్రం లోని జింద్ (Jind) రైల్వే స్టేషన్ నుండి సోనిపట్ (Sonipat) వరకు 89
కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది.
●
10 కోచ్లతో ఉండే ఈ రైలు లో 2600 మంది ప్రయాణించొచ్చు.
●
ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 75 కి.మీ. (గరిష్ట వేగం 110 కి.మీ.
వరకు వెళ్లేలా డిజైన్ చేశారు).
●
చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) దీనిని అభివృద్ధి చేసింది . ఇది
'ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్' (Proton Exchange Membrance Fuel Cell) సాంకేతికతతో, 3200 హార్స్ పవర్ సామర్థ్యంతో నడుస్తుంది.
●
1,200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఫ్యూయెల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్
మధ్య రసాయన చర్య జరుగుతుంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తవుతుంది. హైడ్రోజన్ను
ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళుతుంది. ఆక్సిజన్ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది.
●
ఇది శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహనచర్య జరగదు. అందువల్ల
హానికారక పొగ, కర్బనఉద్గారాలు వెలువడవు. ధ్వని
కూడా తక్కువే.
పర్యావరణానికి మేలు జరుగుతుంది.
●
Note : ప్రపంచం
లోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును 2018 లో జర్మనీ ప్రారంభించింది. అయితే
ప్రపంచంలోనే అత్యధిక భోగీలు (10 కోచ్లు)
కలిగిన హైడ్రోజన్ ట్రైన్గా భారత్
నిలిచింది.
●
దేశం లోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ స్టోరేజ్ మరియు రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని హర్యానా
లోని జింద్ లో ఏర్పాటు చేశారు.
భారతదేశంలోనే మొట్టమొదటి అర్బన్ నైట్ సఫారీ ప్రాజెక్ట్
●
భారతదేశం లోనే మొట్టమొదటి అర్బన్ నైట్ సఫారీ (Night Safari) మరియు డే జూ (Day Zoo) ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు తుది అనుమతులు మంజూరు
చేసింది.
●
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివార్లలోని కుక్రైల్ రక్షిత అటవీ ప్రాంతంలో (Kukrail Reserve Forest) ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
●
సాధారణ జూ పార్కుల్లా కాకుండా, రాత్రి వేళల్లో మాత్రమే యాక్టివ్గా ఉండే వన్యప్రాణులను (Nocturnal Animals) పర్యాటకులు వీక్షించేందుకు వీలుగా.. సహజమైన వెన్నెలను పోలిన ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
●
సింగపూర్, థాయిలాండ్, చైనా, ఇండోనేషియా దేశాల తర్వాత ప్రపంచం లోనే 5వ నైట్ సఫారీగా, భారతదేశం లోనే మొట్టమొదటి సఫారీగా ఇది రికార్డు సృష్టించబోతోంది.
భారతదేశపు మొట్టమొదటి ఇమ్మర్సివ్ భాషా మ్యూజియం 'శబ్దలోక్’
●
"భారతదేశపు
మొట్టమొదటి ఇమ్మర్సివ్ లాంగ్వేజ్ మ్యూజియం కోల్కతా (పశ్చిమ బెంగాల్) లోని
చారిత్రాత్మక నేషనల్ లైబ్రరీ (National Library) క్యాంపస్ లో ఏర్పాటు చేశారు.
●
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను ప్రారంభించారు.
●
పేరు:
శబ్దలోక్ (Shabdlok - Museum of Word).
●
Augmented Reality (AR) మరియు
Virtual Reality (VR) వంటి అధునాతన సాంకేతికతలతో 3D వాతావరణాన్ని
సృష్టించి,
భాషల ఆవిర్భావం, చరిత్ర మరియు పదాల ప్రాముఖ్యతను సందర్శకులకు అనుభూతి చెందేలా రూపొందించారు.
ప్రపంచం లోనే అతిపెద్ద పెరుగు ఉత్పత్తి ప్లాంట్
●
పశ్చిమ బెంగాల్ లోని
కోల్కతా (హౌరా ఫుడ్ పార్క్) వద్ద ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్
షా శంకుస్థాపన చేశారు.
●
దీనిని అముల్ (Amul) కంపెనీ సుమారు ₹600 - ₹700 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తోంది. దీని ద్వారా రోజుకు 30 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసి, 10 లక్షల కేజీల (1000 టన్నులు) పెరుగును ఉత్పత్తి చేస్తారు.
●
Note: భారతదేశంలో
శ్వేత విప్లవ పితామహుడు (Father of White Revolution) - వర్గీస్ కురియన్. ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు అయిన నవంబర్ 26ను 'జాతీయ పాల దినోత్సవం' (National Milk Day)గా జరుపుకుంటారు.
●
పాల ఉత్పత్తిలో ప్రపంచం లోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది (భారత్లో ఉత్తరప్రదేశ్ టాప్).
ఒడిశా పూరీలో జగన్నాథ రథయాత్ర
●
ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర జూలై 16న ప్రారంభమై జూలై 24న
ముగిసింది.
●
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ఆలయం నుండి బయలుదేరి వారి మేనమామ ఇల్లుగా భావించే "గుండీచా ఆలయానికి" (Gundicha Temple) రథాలపై వెళ్తారు.
రథాల పేర్లు & రంగులు (Art & Culture)
●
జగన్నాథుడి రథం: నందిఘోష్ / గరుడధ్వజ (పసుపు,
ఎరుపు రంగు)
●
బలభద్రుడి రథం: తాళధ్వజ (ఆకుపచ్చ,
ఎరుపు రంగు)
●
సుభద్ర దేవి రథం: దర్పదలన్ / పద్మరథ్ (నలుపు,
నీలం రంగు)
●
తిరిగి వచ్చే యాత్రను "బహుదా యాత్ర" (Bahuda Yatra) అని పిలుస్తారు.తిరిగి
గర్భగుడిలో ప్రతిష్టించడాన్ని 'నీలాద్రి
బిజే' అని పిలుస్తారు.
సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ వివాద పరిష్కారం
●
సర్దార్ సరోవర్ డ్యామ్ నీటి పంపిణీ, ఖర్చుల భాగస్వామ్యం మరియు పునరావాస సమస్యలపై చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కరిస్తూ
నాలుగు రాష్ట్రాలు చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి
●
ఆ
4 రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు రాజస్థాన్.
●
మధ్యవర్తిత్వం: కేంద్ర
హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ వన్-టైమ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఒప్పందం కుదిరింది.
●
నర్మదా నది: ఈ ప్రాజెక్టు గుజరాత్ లోని కెవాడియా వద్ద నర్మదా నదిపై నిర్మించబడింది. నర్మదా నది మధ్యప్రదేశ్ లోని
అమర్కంటక్ వద్ద జన్మించి పశ్చిమ వైపు ప్రవహిస్తుంది.
ప్రగతి (PRAGATI) కార్యక్రమం
●
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో రైతుల
కోసం
'ప్రగతి'
అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
●
పూర్తి పేరు: Promoting Regenerative
Agriculture through Agri-Entrepreneurship Initiative.
●
ముఖ్య ఉద్దేశం: భూసారాన్ని
పెంచే పునరుత్పాదక వ్యవసాయాన్ని (Regenerative Agriculture) మరియు గ్రామీణ యువతలో వ్యవసాయ పారిశ్రామికవేత్తలను (Agri-Entrepreneurship) ప్రోత్సహించడం.
●
లక్ష్యం:
ఈ పథకం కింద
20,000
మంది గ్రామీణ యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చి అగ్రీ-ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతారు. వీరు
దాదాపు 20 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తారు. దీని ద్వారా రైతుల ఆదాయాన్ని 30%, పంట
దిగుబడిని 15
నుండి 20% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
●
అమలు చేసే రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్.
ఎఫ్సిఆర్ఏ (FCRA 2.0) పోర్టల్ మరియు ఎలక్ట్రానిక్ ఓసిఐ కార్డ్
●
కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో FCRA 2.0 పోర్టల్ మరియు ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్
ఇండియా (e-OCI) కార్డ్ను ప్రారంభించారు.
●
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (Foreign Contribution Regulation Act - 2010) కింద ఎన్జీఓలు పొందే నిధుల్లో పారదర్శకత కోసం ఈ 2.0 పోర్టల్ను మేఘరాజ్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెచ్చారు
మధ్యప్రదేశ్కు చెందిన 4 సంప్రదాయ పంటలకు GI ట్యాగ్
●
సితాహి కుట్కి (Sitahi Kutki): డిండోరి జిల్లాలో బైగా మరియు గోండ్ తెగలు పండించే చిన్న తృణధాన్యం (Little Millet).
●
నాగదమన్ కుట్కి (Nagdaman Kutki): పోషకాలు అధికంగా ఉండే మరొక రకమైన సూపర్ ఫుడ్ తృణధాన్యం.
●
బేగ్ని అర్హర్ (Begni Arhar): ఎంపీ తూర్పు ప్రాంతంలో పండే ఊదా రంగు కందిపప్పు (తొగరి పప్పు).
●
మహాకౌశల్ ఛత్రి రైస్ (Mahakoshal Chhatri Rice): సాంప్రదాయ బియ్యం రకం.
'షీ లిప్స్' (She Leaps) ప్లాట్ఫామ్
●
న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణ అభివృద్ధి సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్
సింగ్ చౌహాన్ దీనిని ప్రారంభించారు.
●
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నేతృత్వంలో నడిచే స్వయం సహాయక బృందాలు (Self-Help Groups - SHGs) మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ మేనేజ్మెంట్,
ఆర్థిక సహాయం మరియు వ్యాపార వృద్ధిలో తోడ్పాటు అందించడానికి
ఈ వేదికను రూపొందించారు
●
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (Digital India Corporation - MeitY కింద పనిచేస్తుంది) దీనిని అభివృద్ధి చేసింది. .
●
SHE LEAPS అబ్రివేషన్: Self Help Entrepreneur
Lifelivoods and Enterprise Application for Prosperity and Sustainability.
"సుమన్ రోడ్ మ్యాప్ 2030”
●
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో జరిగిన సెంట్రల్
కౌన్సిల్ మీటింగ్లో "సుమన్
రోడ్ మ్యాప్
2030" ను
ప్రారంభించింది.
●
ప్రారంభించిన వారు: కేంద్ర
ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.
●
సుమన్
(SUMAN) పూర్తి
పేరు: సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ (Surakshit Matritva Aashwasan).
●
ముఖ్య ఉద్దేశం: భారతదేశంలో
మాతృమరణాల రేటును (Matritval Mortality Rate - MMR) తగ్గించడం మరియు మాతృ ఆరోగ్యాన్ని సంరక్షించడం.
●
టార్గెట్:
2030 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం.
అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం
●
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా జలంధర్లో రూ.
5,470 కోట్ల విలువైన
రైల్వే మరియు రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు.
●
అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrut Bharat Station Scheme) కింద దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు.
●
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని డిసెంబర్ 2022లో ప్రారంభించింది. దీని కింద మొత్తం 1309 స్టేషన్లను అత్యాధునిక వసతులతో (వైఫై, సోలార్ సిస్టమ్, గ్రీన్
స్పేసెస్)
ఆధునీకరిస్తున్నారు.
"జల, చితి సత్యాగ్రహం”
●
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
సరిహద్దుల్లోని కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'కెన్-బెత్వా లింక్ ప్రాజెక్టు వల్ల పన్నా టైగర్ రిజర్వ్, స్థానిక అటవీ ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
●
ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ లోని ఛతర్పుర్ జిల్లా కుపి గ్రామ ప్రజలు నిరవధిక నిరసనలు చేపట్టారు.
●
పునరావాస చర్యలపై అసంతృప్తితో గిరిజన మహిళలు బరానా నదిలో నిలబడి "జల, చితి సత్యాగ్రహం" నిర్వహిస్తున్నారు.
●
ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న అమిత్ భట్నాగర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
సంక్షిప్త సమాచారం
●
మహిళలకు చట్టబద్ధంగా "రైతు"
(Farmer) హోదాను
కల్పిస్తూ అధికారికంగా చట్టాన్ని (Maharashtra Women Farmer Empowerment Act 2026) అమలు చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర
నిలిచింది.
Note: ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని "అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం”గా ప్రకటించింది.
●
కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా
కార్యక్రమానికి అనుగుణంగా ఉన్నతీకరించిన నోటరీల పోర్టల్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు.
●
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి మరియు సముద్ర ఆహార ఎగుమతులను (Sea Food Exports) పెంచడానికి ఒడిశా ప్రభుత్వం 10 ఏళ్ల కాలపరిమితితో (2026 నుండి 2036 వరకు) "డీప్ సీ ఫిషింగ్ మిషన్" కు ఆమోదం తెలిపింది.
●
భారతదేశంలోనే మొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం "మహిళా
రైతు సాధికారత బిల్లు"ను
అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
●
రాష్ట్రం లోని మద్రసా విద్యామండలి (Madrasa Board) ని రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక
నిర్ణయం తీసుకుంది.
జూలై 1, 2026 నుండి ఇది అమల్లోకి వచ్చింది. దేశం లోనే మద్రసా బోర్డును రద్దు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.
●
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పాకిస్థాన్ (Pakistan) కేంద్రంగా నడుస్తోన్న జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా, అనుబంధ
ఉగ్రసంస్థలకు చెందిన 23 మంది
ఆపరేటివ్స్ను ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. ఈ
23 మందితో కలిపి
ప్రకటిత ఉగ్రవాదుల సంఖ్య 80కి
చేరింది.
●
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల
మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్కు చెందిన 23 సాంప్రదాయ వస్తువులు, వంటకాలకు
భౌగోళిక గుర్తింపు (GI Tag) ఇచ్చింది. (ఉదాహరణకు:
చాంద్నగర్కు చెందిన ప్రసిద్ధ స్వీట్ 'జోల్బోరా సందేష్' ఇందులో ఉంది). అత్యధిక GI ట్యాగ్లు గల రాష్ట్రాలు 1. ఉత్తర
ప్రదేశ్
(83 ట్యాగ్లు)
2.తమిళనాడు
(76 ట్యాగ్లు)
3.పశ్చిమ బెంగాల్ (59 ట్యాగ్లు)
●
సైంటిఫిక్గా
వయస్సు నిర్ధారించిన ప్రపంచం లోనే అత్యంత పురాతన మర్రిచెట్టు
(Banyan Tree) బీహార్ లోని ముంగేర్ లో కనుగొనబడింది. రేడియో కార్బన్ డేటింగ్ (Carbon-14) సాంకేతికత ద్వారా దీని వయస్సు దాదాపు 700 సంవత్సరాలు గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
●
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోని 'ఉల్లాస్'
(ULLAS - Understanding of Lifelong
Learning for All in Society) కార్యక్రమం
కింద ఉత్తరాఖండ్ దేశంలోనే పూర్తి అక్షరాస్యత సాధించిన 6వ రాష్ట్రంగా నిలిచింది.(1st మిజోరాం)
Note: 'ఉల్లాస్'
నిబంధనల ప్రకారం ఏదైనా రాష్ట్రం/యూటీ
95% లేదా అంతకంటే
ఎక్కువ అక్షరాస్యత సాధిస్తే దాన్ని పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తిస్తారు (15 ఏళ్లు పైబడిన చదువురాని యువత కోసం ఈ పథకం ఉద్దేశించబడింది).
●
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) కర్ణాటక లోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట (Gundlupet) పరిధిలో సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో భారీ థోరియం కలిగిన 'మోనాజైట్' (Monazite) నిల్వలను కనుగొంది. ప్రపంచంలోనే అత్యధికంగా తోరియం నిల్వలు కలిగిన దేశం భారతదేశం. ఇవి సాధారణంగా సముద్ర తీరాల్లోని మోనజైట్ ఇసుక (Monazite sands) లో లభిస్తాయి. తోరియం
(Thorium) అటామిక్
నంబర్: 90.
GSI ఏర్పాటు 1851. HQ కోల్కతా.
●
వాణిజ్యపరంగా 'మాచా
టీ'ని ఉత్పత్తి చేసిన దేశం లోనే మొదటి రాష్ట్రంగా అసోం
నిలిచింది.
ఇండో-జపాన్ 10 ఏళ్ల సహకారంతో ఈ విజయం సాధించారు. దీని తొలి విడతను గువాహటి టీ అప్షన్ సెంటర్లో విక్రయించారు.
Note: మాచా అనేది జపాన్ దేశపు సాంప్రదాయ పౌడర్ గ్రీన్
టీ.
●
జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్, పుల్వామా జిల్లాల రైతుల నుండి సేకరించిన సుమారు 1 మెట్రిక్ టన్ను 'అరికో
చెర్రీస్' (Areko Cherries) మరియు 'సెంట్రోజ్ ప్లమ్స్' (Centrose Plums) పండ్లను తొలిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు ఎగుమతి చేశారు. ఈ అగ్రి ఎక్స్పోర్ట్స్ను అపెడా
(APEDA) ప్రోత్సహించింది. అపెడా అనేది 1986 లో ఏర్పడి, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.
●
మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాలు, మార్ఫింగ్, డిజిటల్
అరెస్టులపై అవగాహన కల్పించేందుకు గుజరాత్ పోలీసులు 28 రోజుల పాటు ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ కార్యక్రమాన్ని చేపట్టారు.
●
ఉత్తర ప్రదేశ్
లోని షాజహాన్పూర్ జిల్లాలో గల 'జలాలాబాద్' పట్టణం పేరును "పరశురాంపురి”గా
మార్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భగవాన్ పరశురాముడి జన్మస్థలం అనే నమ్మకం ఆధారంగా ఈ పేరు మార్చారు.
●
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Tribal Affairs) గిరిజన సంస్కృతి, కళలు,
మరియు భాషల పరిరక్షణ కోసం 'TribEx' అనే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్
ఓరమ్ ఒడిశా లోని భువనేశ్వర్లో దీనిని లాంచ్ చేశారు.
●
జైపూర్లో జరిగిన 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో 'ఇన్నోవేషన్ బై యూజ్ ఆఫ్ AI మరియు
న్యూ ఏజ్ టెక్నాలజీస్' విభాగంలో
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు నేషనల్ అవార్డ్ ఫర్ ఈ-గవర్నెన్స్ 2026 లభించింది. మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ మరియు నిర్వహణలో AI సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించినందుకు ఈ అవార్డు
దక్కింది.
●
యుక్తధారా ప్లానింగ్ పోర్టల్ (Yuktdhara Portal): "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ - గ్రామీణ్" (VBGM-R) పథకంలో లోపాలను, అభివృద్ధి వ్యత్యాసాలను GIS (Geographical Information System) శాటిలైట్ అసెస్మెంట్ ద్వారా గుర్తించడానికి ఈ పోర్టల్ను ఉపయోగిస్తున్నారు.
●
ప్రధానమంత్రి చాశ్రామిక్ ప్రోత్సాహన్ యోజన : అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లోని
టీ గార్డెన్స్
(తేయాకు తోటలు) లో పనిచేస్తున్న టీ కార్మికుల (Tea Workers) సంక్షేమం కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం.
●
హర్యానా లోని సిర్సా జిల్లాలో పండించే కిన్నో నారింజ కు GI TAG లభించింది. హర్యానా నుంచి జీఐ ట్యాగ్ పొందిన తొలి పండు ఇదే. ఇది ఒక హైబ్రిడ్ పండు, దీని
పుట్టినిల్లు అమెరికా లోని కాలిఫోర్నియా.
●
హిమాలయ ఓక్ అడవుల సంరక్షణ కోసం సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ 'Mission
Million of Trees by 2047' (లేదా
మిషన్ మిలియన్ ఓక్ ట్రీస్) ను
ప్రారంభించారు.
●
భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయంగా డిజిటల్ పద్ధతిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో
ప్రమోట్ చేయడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గూగుల్ ఇండియాతో ఒప్పందం
కుదుర్చుకుంది.
●
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 8 రకాల
వ్యవసాయ మరియు హస్తకళల ఉత్పత్తులకు ఒకేసారి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) లభించింది. ఇందులో
సెబుక్తార్
(Sebuckthorn), సెలోని
సఫేద్ మక్కా
(తెల్ల జొన్న), చంబా మెటల్ ఆర్ట్, కిన్నౌరి
జువెలరీ వంటివి ఉన్నాయి. దీనితో
హిమాచల్ ప్రదేశ్ మొత్తం జిఐ ట్యాగ్ల
సంఖ్య 17 కి చేరింది.
Note: భారతదేశంలో జిఐ ట్యాగ్లను 'జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్,
1999'
ప్రకారం ఇస్తారు. ఇది 10
సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.
●
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 125 కొత్త
GI ట్యాగులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 822 కు చేరింది. దేశంలో
అత్యధిక
GI ట్యాగ్లు కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్.
2nd తమిళనాడు.
●
సెంట్రల్
విస్టాను ఇకపై కర్తవ్య భవన్ ప్రాంగణం లేదా ప్రాంతంగా పిలవాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌లాల్
ఖట్టర్ తెలిపారు.
●
జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, న్యూ ఢిల్లీలో ప్రారంభించారు.ఇందులో
సుమారు 32,000 ఫిజికల్ పుస్తకాలతో పాటు ఈ-బుక్స్
(e-books) కూడా
అందుబాటులో ఉంటాయి.
●
జార్ఖండ్ ప్రభుత్వం 2026 నుండి 2031 కాలానికి గాను నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీని లాంచ్ చేసింది.
●
21 నుండి 60 సంవత్సరాల వయసు గల మహిళలకు ఏడాదికి రూ. 10,000 ఆర్థిక సాయం అందించే సుభద్ర యోజన' ను ఒడిస్సా ప్రభుత్వం అమలు చేస్తుంది.
●
న్యూఢిల్లీలో ప్రసిద్ధ కేరళ సామాజిక సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు మన్నత్
పద్మనాభన్ విగ్రహాన్ని భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించారు.
●
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మియవాకీ పద్ధతిలో ఒకే గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. మియవాకీ పద్ధతి : ఇది పట్టణ ప్రాంతాలలో (Urban areas) తక్కువ స్థలంలో సహజ సిద్ధమైన చిన్న అడవులను (Mini Forests) వేగంగా పెంచే జపాన్ దేశపు పద్ధతి. రూపకర్త:
జపాన్ కు చెందిన ప్రముఖ వృక్షశాస్త్రవేత్త (Botanist) అకీరా మియవాకి.
●
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఏక్
పెడ్ మాకే నామ్"
(Ek Ped Maa Ke Naam) క్యాంపెయిన్ లో భాగం లో జులై 12 ఒకే రోజులో 35 కోట్లకు పైగా (35.2 Crore) మొక్కలను నాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రికార్డు
సృష్టించింది.
●
దేశవ్యాప్తంగా 50 నగరాలలో
సురక్షితమైన
50 స్ట్రీట్
ఫుడ్ హబ్స్ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ (మంత్రి:
మనోహర్ లాల్ ఖట్టర్), పర్యాటక
శాఖ (మంత్రి:
గజేంద్ర సింగ్ షెకావత్) మరియు FSSAI సంయుక్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా దేశం లోనే మొట్టమొదటి అధీకృత స్ట్రీట్ ఫుడ్ హబ్/ఫుడ్ కోర్ట్ను
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా లఖన్పూర్ లో ప్రారంభించారు.
●
రాజస్థాన్
లోని జోద్పూర్కు చెందిన సుమారు 200 సంవత్సరాల
నాటి ప్రసిద్ధ తోలు తో తయారు చేసే మోజరీ హస్తకలకు
(Mojari craft), గుజరాత్కు చెందిన "ఉంజా క్యూమిన్" (Unjha Cumin - జీలకర్ర) మరియు
"ఉంజా
ఫెన్నెల్" (Unjha Fennel - సోంపు) లకు భౌగోళిక గుర్తింపు లభించింది.
భారత దేశంలో జిఐ ట్యాగ్లను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని DPIIT విభాగం పర్యవేక్షిస్తుంది. GI TAG రిజిస్ట్రీ HQ చెన్నై. 'జిఐ
గూడ్స్ రిజిస్ట్రేషన్ మరియు ప్రొటెక్షన్ చట్టం 1999' ప్రకారం ఒకసారి జిఐ ట్యాగ్ లభిస్తే అది 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాలి.
●
ఉత్తరప్రదేశ్, అయోధ్య
జిల్లా లోని 'బదర్సా' పట్టణం పేరును 'భారత్
నగర్'గా మార్చారు.
●
పొలాల్లో కలుపు నివారణకు వాడే అత్యంత విషపూరితమైన "పారాక్వాట్ డైక్లోరైడ్" గడ్డిమందును కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా పూర్తిగా
నిషేధించింది.
●
రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎకోసిస్టమ్ను మరియు డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం కోసం త్రిపుర ప్రభుత్వం
'గూగుల్ ఇండియా' (Google India) తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
●
స్పెయిన్ దేశానికి చెందిన 'సబ్మర్ గ్రూప్' (Submer
Group) మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకై 2 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
●
యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి
అవకాశాలు మరియు కెరీర్ గైడెన్స్ అందించడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ
యువ నైపుణ్యాల దినోత్సవం (జూలై 15) సందర్భంగా కౌశల్ సేతు & కౌశల్ సారథి పోర్టల్స్ను ప్రారంభించింది.
●
మహారాష్ట్ర శాసనసభ పూర్తిగా పేపర్లెస్ డిజిటల్ విధానంలోకి మారేందుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ
శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.
Note : భారతదేశంలో నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (NeVA) అప్లికేషన్ను
అమలు చేసిన మొదటి రాష్ట్రం నాగాలాండ్ (2022).
●
అగ్రికల్చర్ టుడే గ్రూప్ ఇచ్చే అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు 2026 తోటపని / హార్టికల్చర్ విభాగంలో గుజరాత్ రాష్ట్రానికి లభించింది.
●
బిహార్
రాష్ట్రం, భాగల్పుర్ జిల్లాలోని రామాసి గ్రామంను
భారత్లో తొలి
'సిందూర్ విలేజ్' గా బిహార్ వ్యవసాయ
విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇక్కడ
అన్ని కుటుంబాల చేత సింధూరం సాగు చేస్తున్నారు.
●
జమ్మూ కాశ్మీర్ లోని
కథువా
(Kathua) రైల్వే
స్టేషన్ పేరు ను శహీద్ కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్ గా మార్చారు.
●
రాష్ట్రాల మధ్య జరుగుతున్న మత్తుపదార్థాల (డ్రగ్స్)
అక్రమ రవాణాను అరికట్టడం కోసం కేరళ ప్రభుత్వం ఆపరేషన్
తుఫాన్ ప్రారంభించింది. భాగస్వామ్య
రాష్ట్రాలు:
కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
●
వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడానికి (Ease of Doing Business), తక్కువ ప్రమాదం ఉండే ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు
మంజూరు చేసేందుకు రిస్క్ బేస్డ్ బిజినెస్ అప్రూవల్ సిస్టమ్ (Risk-Based & Trust-Based Business
Approval System) ను
ప్రవేశపెట్టిన దేశం లోనే తొలి రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది.
●
ఉత్తరాఖండ్లోని
కాశీపూర్ నుండి తొలిసారిగా 24 మెట్రిక్
టన్నుల ఫ్రోజెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇరాక్కు ఎగుమతి కాబడ్డాయి.
●
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జాతీయ రహదారుల వినియోగదారుల సౌకర్యార్థం రాజ్
మార్గ్ యాత్ర యాప్ను
కొత్త డిజిటల్ ఫీచర్లతో అప్డేట్
చేసింది.
ఈ యాప్ను మొదట
NHAI 2023లో
లాంచ్ చేసింది.
●
మేఘాలయ ప్రభుత్వం లకడాంగ్ పసుపు ఉత్పత్తి, ప్రాసెసింగ్
మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికి 'మిషన్ గోల్డెన్ స్పైస్' (Mission Golden Spice) ను ప్రారంభించింది.
●
భారత భూభాగం లోని హిమాలయ పర్వతాల్లోంచి ఉద్భవిస్తున్న నదుల పరీవాహక ప్రాంతాల్లో 10 హెక్టార్ల కన్నా ఎక్కువ వైశాల్యం కలిగిన 2,485 హిమానీనద సరస్సులను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2026, జులై 23న వెల్లడించింది. తన
భూభాగంలో ఉన్న 56
హిమానీనద
సరస్సులు
ప్రమాదకరమైన వరదలకు దారితీసే అవకాశం ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్
చౌధరి లోక్సభలో తెలిపారు.
●
మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన
ప్రయాణం కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా కేఎస్ఆర్టీసీ పింక్ బస్ సర్వీసులను 2026, జులై 23న ప్రారంభించింది.
●
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉన్నత చదువుల కోసం ఉచితంగా స్కూటీల అందించేందుకు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన పథకం ప్రారంభించింది.
●
ఖర్చీ పూజ (Kharchi Puja) అనేది ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలో అత్యంత ఘనంగా నిర్వహించే అత్యంత
పురాతనమైన మరియు సాంప్రదాయక గిరిజన పండుగ. ఇది ఏటా ఆషాఢ మాసంలో (జూలై
నెలలో) 7 రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతుంది.
●
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి 'ఆరోహణ' పేరుతో గనుల మూసివేతపై వార్షిక నివేదిక (Annual Report on Mine Closure) ను విడుదల చేశారు. దీని ప్రకారం దేశంలో 42 గనులను పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు అనుగుణంగా శాస్త్రీయబద్ధంగా (Scientifically closed mines) క్లోజ్ చేశారు.
●
కేంద్ర సమాచార ప్రసార శాఖ 'ఆరెంజ్ ఎకానమీ' (సృజనాత్మక
రంగం) కింద డిజిటల్ క్రియేటర్స్, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను
ప్రోత్సహించడానికి
Gems of India కార్యక్రమంలో
భాగంగా 'My Waves' ప్లాట్ఫామ్ను అందుబాటు లోకి తెచ్చింది.
●
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (మంత్రి-
అన్నపూర్ణాదేవి) ద్వారా అమలు చేయబడుతున్న 'మిషన్
సక్షం అంగన్వాడీ మరియు పోషణ్ 2.0' (Saksham Anganwadi & Poshan 2.0) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను
సక్షం అంగన్వాడీలుగా (ఆధునిక
మరియు స్మార్ట్ అంగన్వాడీలు) బలోపేతం
చేస్తున్నారు.
●
1వ
తరగతి నుంచి 12వ తరగతి వరకు AI ని ప్రధాన సబ్జెక్ట్గా (Mainstream Subject) ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా పంజాబ్
నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని 'సర్బత్.AI'
(Sarbat.AI) ఇనిషియేటివ్లో భాగంగా చేపట్టారు.
●
వ్యవసాయరంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు గానూ కార్గిల్ లోని లోయర్ కుర్బథాంగ్లో రైతుల వసతి గృహాన్ని లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్
వినయ్‌కుమార్ సక్సేనా జూలై 26న ప్రారంభించారు.
●
నీట్
పేపర్ లీక్‌పై నిరసనలు చేపట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కాక్రోచ్ జనతా
పార్టీలాగే సోషల్
మీడియాలో వ్యంగ్యంగా మరో పార్టీ ప్రారంభమైంది. దాని పేరు E20 జనతా
పార్టీ. పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిసిన ఇంధనంతో పాటు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉండాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండుగా ఉంది. E 20 జనతాపార్టీ ‘ఎక్స్’
ఖాతా 2024 మే నెలలోనే రిజిస్టరై ఉంది. ఇది మలేసియా కేంద్రంగా పని చేస్తోంది.
●
కడలూర్ జిల్లాలోని కిల్లై గ్రామం తమిళనాడు రాష్ట్రంలో మొట్టమొదటి వాతావరణ-అనుకూల
(Climate-Resilient) గ్రామంగా గుర్తింపు పొందింది.
●
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఫండ్స్ను సమర్థవంతంగా ఉపయోగించి, రెండో
విడత నిధులకు అర్హత సాధించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది
●
సౌర శక్తి రంగంలో మహిళలను 'సోలార్ దీదీ'లుగా ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారిగా మహిళల నేతృత్వంలోని
సౌర విధానం
'ద్వీప్తి యోజన'ను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
●
రిజర్వాయర్లలో చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.3,500 ఆర్థిక
సాయాన్ని అందించే ముఖ్యమంత్రి మచ్ఛుర సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది.
●
భారతదేశం లోనే తొలిసారిగా 'మిలిటరీ
మెడిసిన్ విభాగం'
(Department of Military Medicine) ను లక్నో (ఉత్తరప్రదేశ్)కమాండ్
ఆసుపత్రిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జూలై 29, 2026న ప్రారంభించారు. సైనిక దళాల వైద్య సేవల విభాగం (Armed Forces Medical Services - AFMS) పరిధిలో దీనిని ఏర్పాటు చేశారు.
●
గుజరాత్కు చెందిన సాంప్రదాయ గిరిజన (రథ్వా, భిల్, బిలాల తెగలు) చిత్రకళ అయిన పితోరా పెయింటింగ్ (Pithora Painting) కు భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించింది.
