|
అంతర్జాతీయం & ఇండియా - వరల్డ్ |
ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన
●
ఆగ్నేయాసియా దేశాలతో (యాక్ట్ ఈస్ట్
పాలసీ) సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (మహాసాగర్
విజన్) మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ జూలై 6 నుండి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించారు.
●
మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేసియాలో ప్రధాని మోదీ.. జూలై
7న ఇండోనేషియా
దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
●
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 14ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. క్రిటికల్ మినరల్స్, టెక్నాలజీ, ఆహార
భద్రత, సముద్ర జలాల భద్రత, ఔషధాలు,
మిలిటరీ వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు
కుదిరాయి.
●
అత్యాధునిక ‘బ్రహ్మోస్’ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు, భారత్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు ఎయిర్
‘అస్త్ర’ క్షిపణులను ఇండోనేసియాకి ఎగుమతి చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ
ఒప్పందం విలువ సుమారు రూ.5,600 కోట్లు. ఆపరేషన్ సిందూర్‌లో ఈ రెండూ కీలక పాత్ర పోషించాయి.
●
కీలక ఖనిజాల సరఫరా గొలుసును మరింత బలోపేతం చేసేలా.. ఇండోనేసియాలోని స్టీల్, నికెల్, రేర్
ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీలో
భారత్ పెట్టుబడులు పెట్టనుంది.
●
ఇండోనేసియా లోని సబాంగ్ పోర్ట్‌ను సంయుక్తంగా నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఉండే ఈ పోర్ట్.. భారత్కు వ్యూహాత్మకంగా కీలకమైనది.
●
ఇండోనేసియా అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీకి
భారత్ సాంకేతిక సాయం అందించేందుకు అంగీకరించింది.
●
ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు అంగీకరించాయి. ఐఐఎం-బెంగళూరు క్యాంపస్ను ఇండోనేసియాలో ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు.
● మోదీకి అత్యున్నత పురస్కారం.. ప్రధాని మోదీని ఇండోనేసియా ప్రభుత్వం అత్యున్నత పౌర
పురస్కారంతో సత్కరించింది. ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ (స్టార్ ఆఫ్ ఇండోనేసియా)
పురస్కారంతో గౌరవించింది.. ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో.. ఈ మెడల్ను మోదీకి అందజేశారు. ఇది మోదీకి దక్కిన 35వ అంతర్జాతీయ పురస్కారం.
●
జూలై
7, 2026న
మోదీ ఇండోనేషియా పార్లమెంట్లో
ప్రసంగించారు.
భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 21 విదేశీ చట్టసభల్లో/పార్లమెంట్లలో ప్రసంగించిన దేశాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.
●
జకార్తాలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ మాట్లాడారు. రిఫార్మ్
(సంస్కరించు), పెర్ఫార్మ్ (పనితీరు
చూపించు),
ట్రాన్స్ఫార్మ్
(రూపాంతరీకరణ) అనేదే తమ మంత్రమని, దాని
ఆధారంగానే భారత్
ముందుకు వెళ్తోందన్నారు.
●
సుబియాంతోతో కలిసి యోగ్యాకార్టాలో ఉన్న 10వ శతాబ్ద కాలం నాటి అతిపెద్ద హిందూ ఆలయం- ప్రంబనన్ను జూలై 8న మోదీసందర్శించారు. ఇక్కడ
త్రిమూర్తులు
(బ్రహ్మ, విష్ణు,
మహేశ్వరులు) పూజలందుకుంటారు. ఇరువురు
దేశాధినేతలు కలిసి ప్రంబనన్ ఆలయ
పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించారు.
ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన
●
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 9న మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలోనూ పాల్గొన్నారు. ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
●
అణు విద్యుదుత్పత్తికి అవసరమైన యురేనియంను వాణిజ్య ప్రాతిపదికన భారత్కు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. భారత్లోని అణు విద్యుత్తు ప్రాజెక్టులకు ఈ ఇంధనాన్ని ఇవ్వాలని
12 ఏళ్ల క్రితమే చరిత్రాత్మక ‘పౌర అణు ఇంధన ఒప్పందం’ కుదిరినా అది ఇప్పుడు సాకారం కాబోతోంది.
●
అణు ఇంధనాన్ని, విలువైన
ఖనిజాలను సరఫరా చేయడం; పునరుత్పాదక
ఇంధనం, విద్య, నౌకాయాన భద్రత, ఓడల
నిర్మాణం/
మరమ్మతులు సహా 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
●
విద్యారంగం (భారత్లో
ఆస్ట్రేలియా వర్సిటీలు):
బెంగళూరులో 'ఫ్లిండర్స్ యూనివర్సిటీ' క్యాంపస్
ఏర్పాటు.
●
గురుగ్రామ్లో
'విక్టోరియా యూనివర్సిటీ' క్యాంపస్ ఏర్పాటు.
●
భువనేశ్వర్ లోని
నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మైనింగ్, మైనింగ్
పరికరాలపై 'మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్' ఏర్పాటు.
●
'ఆస్ట్రేలియన్
సూపర్'
సంస్థ
సీఈవో భారత్లో 50 కోట్ల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు ₹3,312 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
●
పాక్ట్స్ (PACTS) భాగస్వామ్యం:
సైబర్ సెక్యూరిటీ, కీలక ఖనిజాలు, సప్లై
చైన్స్ సాంకేతికత కోసం 'Partnership
for Cyber Critical Technologies and Supply Chains' (PACTS) అనే కొత్త భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు ప్రకటించాయి.
●
తమిళనాడు చోళుల కాలం నాటి 3 కళాఖండాల (Artifacts) పునరుద్ధరణ: ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీలో ఉన్న తమిళనాడు చోళుల కాలానికి చెందిన 3 హిందూ విగ్రహాలను భారత్కు
తిరిగి అప్పగించనున్నారు.
●
షణ్ముఖ కార్తికేయ విగ్రహం: 12వ శతాబ్దానికి చెందిన ఆరు తలల రాతి విగ్రహం (కుంభకోణం నాగనాథస్వామి ఆలయం నుండి దొంగిలించబడింది).
●
నంది విగ్రహం:
13-16 శతాబ్దాల నాటి
ఏకశిలా విగ్రహం
(తంజావూరు కైలాసనాథన్
ఆలయానికి చెందినది).
●
భద్రకాళి కాంస్య త్రిశూలం: చోళుల
కాలం నాటి లోహ త్రిశూలం.
●
మెల్బోర్న్
మీట్స్ మోదీ: ఆస్ట్రేలియాలోని
మెల్బోర్న్లో జరిగిన 3వ భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పీఎం మోదీ పాల్గొన్నారు.
●
మార్వెల్ స్టేడియంలో జరిగిన భారీ ప్రవాస భారతీయుల సదస్సులో (దాదాపు
30 వేల మంది పాల్గొన్నారు) మోదీ ప్రసంగిస్తూ.. చిప్ల నుండి షిప్ల
వరకు భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతోందని పేర్కొన్నారు.
●
మోదీ చమత్కారం: ఇరుదేశాల
బంధాన్ని క్రికెట్ భాషతో పోలుస్తూ.. "మన కార్యాచరణ వన్డే లాంటిది (స్పష్టమైన
లక్ష్యం),
నిర్ణయాలు టీ20 లాంటివి
(వేగం), భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ లాంటిది (స్థిరత్వం)" అని
వ్యాఖ్యానించారు.
●
NOTE
: 2047
కల్లా 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ
లక్ష్య సాధనకు వీలుగా ఆస్ట్రేలియాతో తాజా ఒప్పందం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారత్లో 7 చోట్ల 24 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వాటి
స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు.
ప్రధాని మోడీ న్యూజిలాండ్ పర్యటన
●
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2026 జూలై 10,11 తేదీలలో న్యూజిలాండ్లో
రెండు రోజుల పాటు చారిత్రాత్మక పర్యటన చేశారు. గత
40 ఏళ్లలో ఒక భారత
ప్రధాని న్యూజిలాండ్ సందర్శించడం ఇదే తొలిసారి.
●
న్యూజిలాండ్కు చెందిన 'మవోరి' (Maori)
గిరిజన
తెగ ప్రజలు ప్రధాని మోదీకి సాంప్రదాయ 'హాకా' (Haka) నృత్యంతో స్వాగతం పలికారు.
●
న్యూజిలాండ్ ప్రధాని
క్రిస్టోఫర్
లక్సాన్ తో జరిపిన చర్చల్లో రక్షణ (Defense), వాణిజ్యం
(Trade), సముద్రయాన
భద్రత (Maritime
Security) రంగాలలో
ఇరుదేశాల మధ్య
10 కీలక
ఒప్పందాలు
కుదిరాయి.
18 నిర్ణయాలు వెలువడ్డాయి.
●
వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రత్యేక భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో వ్యవసాయ ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కోసం రెండు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' సంస్థల్ని ఏర్పాటు చేయనున్నారు.
●
పశుసంవర్ధక, డెయిరీ
రంగాల్లో సాంకేతిక సహకారం కోసం ఒప్పందం కుదిరింది.
●
హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ మెడిసిన్ అభివృద్ధికి జాయింట్ యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు.
●
గుజరాత్
లోని లోథల్ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (NMHC), న్యూజిలాండ్ మారిటైమ్ మ్యూజియం సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.
●
భారత్-న్యూజిలాండ్
మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన
నేపథ్యంలో,
ఇరు దేశాల ప్రధానులు'ఇండియా-న్యూజిలాండ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ రోడ్మ్యాప్ 2030'ని ఆమోదించారు. దీని ప్రకారం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 2030 నాటికి 700 కోట్ల న్యూజిలాండ్ డాలర్లకు (సుమారు రూ.35,000 కోట్లకు) చేర్చాలని లక్ష్యంగా విధించుకున్నాయి.
●
భారత్కు న్యూజిలాండ్ ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో 57 శాతం ఉత్పత్తుల మీద
ఇకపై ఎలాంటి సుంకాలు
ఉండవు.
●
ఆక్లాండ్లో నిర్వహించిన 'కియా ఓరా మోదీ' (Kia Ora Modi) కార్యక్రమంలో దాదాపు 10,000 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 ఐరోపా దేశాల పర్యటన
●
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 19 నుంచి 25 వరకు తూర్పు యూరప్ లోని
మూడు దేశాలలో
— మోల్డోవా (Moldova), ఉత్తర మాసిడోనియా (North Macedonia), మరియు రొమేనియా
(Romania)
లలో చారిత్రాత్మక అధికారిక పర్యటన చేపట్టారు.
●
మోల్డోవా మరియు ఉత్తర మాసిడోనియా దేశాలను ఒక భారత రాష్ట్రపతి సందర్శించడం చరిత్రలో ఇదే
తొలిసారి.
అలాగే రొమేనియాలో
మూడు దశాబ్దాల
(30 ఏళ్ల) విరామం తర్వాత భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే ప్రథమం.
మోల్డోవా పర్యటన (జులై 20)
●
అధ్యక్షురాలు: మైయా
సందు
(Maia Sandu) ఆహ్వానం
మేరకు పర్యటించారు.
●
చర్చలు:
మోల్డోవా పార్లమెంట్ స్పీకర్ ఇగోర్ గ్రోసు (Igor Grosu) తో సమావేశమయ్యారు.
●
సహకార రంగాలు: వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్, ఐటీ
(IT) మరియు విద్యారంగాల్లో
ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడంపై చర్చలు జరిపారు. Note: మాల్డోవా రాజధాని చిసినౌ.
ఉత్తర మాసిడోనియా పర్యటన (జులై 21 - 22)
●
అధ్యక్షురాలు: గోర్దానా
సిల్జానోవ్స్కా-దావ్కోవా (Gordana Siljanovska-Davkova) ఆహ్వానం మేరకు సందర్శించారు.
●
స్కోప్జే
(Skopje) నగరంలో
ప్రధాని క్రిస్టిజన్ మిక్కోస్కీతో చర్చలు మరియు అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.
●
నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జె (Skopje) మ్యూజియంలో మహాత్మా గాంధీ
విగ్రహాన్ని ఆవిష్కరించారు. మదర్ తెరెసా స్మారక కేంద్రాన్ని సందర్శించారు. Note : నార్త్ మెసిడోనియా' రాజధాని స్కోప్జే
రొమేనియా పర్యటన (జులై 23 - 25)
●
అధ్యక్షుడు: నికుషోర్
దాన్
(Nicușor
Dan) ఆహ్వానం
మేరకు పర్యటించారు.
●
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రొమేనియా లోని బుచరెస్ట్ యూనివర్సిటీ ఆఫ్
ఎకనామిక్ స్టడీస్ 'డాక్టర్
ఆనర్ కాసా' (Honorary Doctorate) ప్రధానం చేసింది.
●
రాబోయే
3 ఏళ్లలో ద్వైపాక్షిక
వాణిజ్యాన్ని
(Bilateral Trade) రెట్టింపు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
●
3 కీలక
ఒప్పందాలు
(MoUs) కుదిరాయి: సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, విద్యా, సాంస్కృతిక సంబంధాలు.
●
Note: రొమేనియా
రాజధాని బుకా రెస్ట్.
భారత్, మాల్డోవాల ఒప్పందం
●
వాణిజ్యం,
పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్, మాల్డోవాల మధ్య ఒప్పందం కుదిరింది.
●
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తూర్పు ఐరోపా దేశమైన మాల్డోవా పర్యటన
సందర్భంగా ఇరుదేశాలు ఆర్థిక సహకారాన్ని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు అంగీకరించాయి.
●
తమ దేశ సందర్శనకు వచ్చిన తొలి భారత రాష్ట్రపతి అయిన ముర్ముతో మాల్డోవా అధ్యక్షురాలు
మయ్యా సందు ద్వైపాక్షిక సహకారానికి అవకాశం ఉన్న పలు విషయాలపై చర్చలు జరిపారు.
భారత్ & జపాన్ చర్చలు
●
జపాన్ చరిత్ర లోనే మొట్ట మొదటి మహిళా ప్రధానమంత్రి సనై తకైచి (Sanae Takaichi) జూలై 1 నుండి జూలై 3 వరకు
భారతదేశంలో పర్యటించారు.
●
భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు(న్యూ ఢిల్లీ) కోసం
భారత్కు వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకాయిచి జూలై 2 మోదీతో హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
●
ఈ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం మరియు సాంకేతిక రంగాలలో సుమారు 129 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.
●
కృత్రిమ మేధ, ఇంధన
సరఫరా వ్యవస్థ,
నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్లలోనూ పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి.
●
దేశంలో వెయ్యి బయోగ్యాస్, సేంద్రియ
ఎరువుల కర్మాగారాలు నెలకొల్పడంలో జపాన్ సహకరిస్తుంది. రాబోయే
పదేళ్లలో 10
లక్షల
కోట్ల యెన్ల (సుమారు
రూ.5.93 లక్షల కోట్ల) పెట్టుబడుల్ని జపాన్ నుంచి
రాబట్టి,
భారత్లో ఆ దేశ కంపెనీలు రెట్టింపయ్యేలా చూడాలనేది లక్ష్యం.
●
నేవల్ రేడియో యాంటెన్నా ప్రాజెక్టు రెండు దేశాల మధ్య తొలి రక్షణ భాగస్వామ్య అధ్యాయంగా
నిలవనుందని చెప్పారు. ఔషధ
రంగం, వైద్య పరికరాలు, బయోటెక్
రంగాల్లోనూ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
●
17 కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా సరఫరా వ్యవస్థను, సాంకేతిక సామర్థ్యాన్ని జపాన్ పెంచుకోనుందని తకాయిచి చెప్పారు. ఆమెను తన చెల్లెలుగా మోదీ అభివర్ణించారు.
●
హర్యానా లోని ఖార్ఖోడా (Kharkhoda) లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నిర్మించిన 4వ కార్ల తయారీ కేంద్రాన్ని ఇరు దేశాల ప్రధానులు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
●
భారత నౌకాదళం (Indian Navy) కోసం సరికొత్త 'యూనికార్న్
మాస్ట్' (NORA-50) డిఫెన్స్ సిస్టమ్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశం మరియు జపాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
●
Note: 15వ
ఇండియా-జపాన్ వార్షిక సదస్సు (2025) జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది.
ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్ (Year of Shared Horizons)
●
భారత్ మరియు జపాన్ దేశాలు 2027 వ సంవత్సరాన్ని "ఇయర్
ఆఫ్ షేర్డ్ హారిజన్స్" గా
జరుపుకోనున్నట్లు ప్రకటించాయి.
●
నేపథ్యం:
2027 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు (Diplomatic Relations) ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
●
ముఖ్య కార్యక్రమాలు: ఇందులో
భాగంగా ఇరు దేశాల మధ్య క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడానికి 'స్పోర్ట్ 75' (Sport 75) అనే కార్యక్రమాన్ని, అలాగే
బౌద్ధ టూరిజం
(Buddhist Tourism) ను కూడా ప్రమోట్ చేయనున్నారు.
●
Note
: భారత్ - ఫ్రాన్స్ దేశాలు 2026 సంవత్సరాన్ని "ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్" గా
ప్రకటించాయి).
International Current Affairs, India Current Affairs , Current Affairs 2026 , Latest Current Affairs ,Daily Current Affairs, Monthly Current Affairs, National and International Current Affairs, Current , Affairs Today, India and World Current Affairs, Current Affairs PD
‘మానస్ & మహాభారతం’ అంతర్జాతీయ అధ్యయన కేంద్రం ప్రారంభం
●
కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ (Bishkek) లో
'ఇంటర్నేషనల్ సెంటర్
ఫర్ సివిలైజేషనల్ స్టడీస్: మానస్
అండ్ మహాభారత్'
ప్రారంభమైంది.
●
దీనిని న్యూఢిల్లీ లోని 'సెంటర్
ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్' మరియు కిర్గిస్తాన్ 'మానస్
నేషనల్ అకాడమీ'
కలిసి ఏర్పాటు చేశాయి.
●
లక్ష్యం:
భారతదేశపు మహాకావ్యం 'మహా భారతం', కిర్గిజిస్తాన్ జాతీయ మహా కావ్యం 'మానస్' (Manas) లపై సంయుక్తంగా పరిశోధనలు చేయడం మరియు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం.
●
మానస్ మహాకావ్యం:
కిర్గిజిస్తాన్కు చెందిన వీరయోధుడు 'మానస్' జీవితం ఆధారంగా రూపొందింది. ఇది
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మౌఖిక మహాకావ్యం (Longest oral epic) గా గుర్తింపు పొందింది.
థాయ్లాండ్లో 2000 ఏళ్ల నాటి బ్రాహ్మీ లిపి బంగారు ఉంగరాలు
●
థాయ్లాండ్ పశ్చిమ ప్రాంతంలోని 'డాన్ యైథాంగ్' (Don Yai Thong) పురాతత్వ తవ్వకాల ప్రదేశంలో 2000 సంవత్సరాల క్రితం నాటి భారతీయ బ్రాహ్మీ లిపి (Brahmi Script) చెక్కబడిన బంగారు ఉంగరాలు లభ్యమయ్యాయి.
●
దీనిపై
"పుసరఖితాస" (Pusarakhitas) అని రాసి ఉంది, అనగా 'పుష్య నక్షత్రం లేదా పుష్యుడి ద్వారా రక్షించబడినది' అని అర్థం.
●
పూర్వకాలంలో భారతదేశం మరియు ఆగ్నేయాసియా దేశాల మధ్య జరిగిన వర్తక వాణిజ్యాలకు
ఇది బలమైన నిదర్శనం.
పాకిస్తాన్కు యునెస్కో (UNESCO) హెచ్చరిక
●
పాకిస్తాన్
లోని చారిత్రాత్మక వారసత్వ నగరమైన తక్షశిల (Taxila) లో పాత నిర్మాణాలను కూల్చివేసి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తుండటంపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
●
ఈ పనులను తక్షణమే ఆపకపోతే తక్షశిలను 'ప్రమాదంలో ఉన్న వారసత్వ కట్టడాల జాబితా' (Endangered/Red List) లో చేరుస్తామని హెచ్చరించింది.
●
Note: క్రీ.పూ 6వ
శతాబ్దం నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు గాంధార కాలంలో విద్యా, సాంస్కృతిక కేంద్రంగా వికసించిన తక్షశిలను 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది. ఇది పాకిస్తాన్లోని
పంజాబ్ ప్రావిన్స్ సింధు నది తీరాన ఉంది.
●
యునెస్కో స్థాపన: 16 నవంబర్, 1945. HQ: పారిస్, ఫ్రాన్స్.
●
ప్రస్తుత యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్ ఎనాని (Khalid el-Anany) (ఈజిప్ట్ - తొలి అరబ్ వ్యక్తి).
●
ప్రస్తుతం భారతదేశంలో 44 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఉన్నాయి (44వది: మరాఠా
మిలిటరీ ల్యాండ్స్కేప్స్).
●
అవ్యక్త సాంస్కృతిక వారసత్వ ఉత్సవాలు (Intangible Cultural Heritage List): మానవాళి సాంస్కృతిక సంరక్షణలో భాగంగా భారతదేశం నుండి
16 ఉత్సవాలకు/కళలకు
ఈ జాబితాలో చోటు దక్కింది. 16వ
ఉత్సవం: దీపావళి పండుగ.
●
భారతదేశం నుండి ఇప్పటివరకు 9 నగరాలను యునెస్కో సృజనాత్మక నగరాలుగా గుర్తించింది.
●
భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉండగా, వాటిలో
13 రిజర్వులను యునెస్కో తన జాబితాలో గుర్తించింది.
International Current Affairs, India Current Affairs , Current Affairs 2026 , Latest Current Affairs ,Daily Current Affairs, Monthly Current Affairs, National and International Current Affairs, Current , Affairs Today, India and World Current Affairs, Current Affairs PD
I 2 SEA ప్రాజెక్ట్ (I 2 SEA Project - India to South East Asia)
●
పశ్చిమాసియా సంక్షోభం (హోర్ముజ్
జలసంధి వివాదం)
కారణంగా అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ దెబ్బతింటున్న
నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా I2C సముద్రగర్భ
కేబుల్ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారు.
●
అర్థం:
India TO South East Asia (I2 SEA).
●
సింగపూర్కు చెందిన లైట్ స్టార్మ్ (Lightstorm) సంస్థ నేతృత్వంలో మైక్రోసాఫ్ట్, సింగ్టెల్, టాటా కమ్యూనికేషన్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి.
●
సింగపూర్, మలేషియా నుండి ఆంధ్రప్రదేశ్ లోని
మచిలీపట్నం,
తమిళనాడులోని తూర్పు చెన్నై తీరాలకు 3,600 కిలోమీటర్ల మేర సముద్రగర్భ కేబుల్ వేస్తారు. అక్కడి నుండి ముంబై, హైదరాబాద్
డేటా సెంటర్లకు అనుసంధానిస్తారు.
●
ఈ ప్రాజెక్టు 2029 చివరి
నాటికి (4వ త్రైమాసికం) పూర్తి కానుంది.
ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ (ACTI)
●
భారతదేశం, ఆస్ట్రేలియా మరియు కెనడా దేశాలు సంయుక్తంగా 'అసిటీ' (ACTI - Australia Canada India Technology
and Innovation Partnership) భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రారంభించాయి.
●
ఈ భాగస్వామ్యం ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్, క్రిటికల్ మినరల్స్ (నికెల్, లిథియం,
గ్రాఫైట్ వంటివి) సప్లై చైన్ను
బలోపేతం చేయడం మరియు డీప్ టెక్నాలజీ రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి
ఉద్దేశించబడింది.
వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (WAICO)
●
16 జూలై 2026 న చైనా ప్రారంభించింది.
●
ప్రధాన కార్యాలయం (Headquarters): షాంఘై, చైనా
●
ప్రారంభ వేదిక: షాంఘైలో
జరిగిన ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు (WAIC - 2026) లో ఈ ఒప్పందం జరిగింది.
●
స్థాపక సభ్యదేశాలు (Founding Members): 29 దేశాలు (చైనా,
రష్యా, పాకిస్తాన్, ఇండోనేషియా, బ్రెజిల్,
ఖజకిస్తాన్ వంటి ప్రధానంగా గ్లోబల్ సౌత్ మరియు అభివృద్ధి
చెందుతున్న దేశాలు సంతకం చేశాయి).
International Current Affairs, India Current Affairs , Current Affairs 2026 , Latest Current Affairs ,Daily Current Affairs, Monthly Current Affairs, National and International Current Affairs, Current , Affairs Today, India and World Current Affairs, Current Affairs PD
ప్రాజెక్ట్ యూనికార్న్ (Project UNICORN)
●
భారత నౌకాదళ యుద్ధనౌకల సామర్థ్యాన్ని మరియు 'స్టెల్త్'
(శత్రు రాడార్లకు
చిక్కకుండా ఉండే)
సాంకేతికతను పెంచడానికి భారత్ మరియు జపాన్ దేశాల
మధ్య రూపుదిద్దుకున్న చారిత్రాత్మక ఉమ్మడి రక్షణ ప్రాజెక్ట్.
●
ఇది భారత్ - జపాన్ దేశాల మధ్య జరిగిన తొలి రక్షణ సాంకేతిక ఒప్పందం (First Defense Cooperation).
●
UNICORN అనగా
Unified Complex Radio Antenna.
●
దీనిని యుద్ధనౌకల యొక్క పైభాగంలో (Integrated Mast) అమర్చుతారు. ఓడపై వేర్వేరు చోట్ల ఉండే రకరకాల కమ్యూనికేషన్ యాంటెన్నాలను ఒకే కాంపాక్ట్, సమీకృత నిర్మాణం (Single Integrated Mast Structure) కిందకి తీసుకువస్తుంది.
●
భాగస్వామ్యులు : భారత్
ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) & భారత్ కు చెందిన
NEC కార్పొరేషన్, యోకోహామా రబ్బర్, సాంపా
కొగ్యో KK
●
న్యూఢిల్లీలో జరిగిన 16వ
భారత్-జపాన్ వార్షిక సదస్సులో జపాన్ ప్రధాన మంత్రి సనాయి
తకైచి సమక్షంలో దీనిపై సంతకాలు జరిగాయి.
International Current Affairs, India Current Affairs , Current Affairs 2026 , Latest Current Affairs ,Daily Current Affairs, Monthly Current Affairs, National and International Current Affairs, Current , Affairs Today, India and World Current Affairs, Current Affairs PD
భారత్ - సౌదీ అరేబియా జలవనరుల ఒప్పందం
●
జలవనరుల రంగంలో (Water Resources Sector) సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
●
సౌదీ అరేబియాలోని జెడ్డా (Jeddah) నగరంలో జరిగిన "సౌదీ వాటర్ వీక్" అంతర్జాతీయ
సదస్సులో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
International Current Affairs, India Current Affairs , Current Affairs 2026 , Latest Current Affairs ,Daily Current Affairs, Monthly Current Affairs, National and International Current Affairs, Current , Affairs Today, India and World Current Affairs, Current Affairs PD
మొంగ్లా పోర్ట్ (Mongla Port) వివాదం - బంగ్లాదేశ్
●
బంగ్లాదేశ్లోని
వ్యూహాత్మక మొంగ్లా పోర్ట్ (Mongla Port) వద్ద ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (Economic Zone) ఏర్పాటు కోసం బంగ్లాదేశ్ మరియు చైనా దేశాల మధ్య ఒప్పందం
కుదిరింది
●
వాస్తవానికి ఈ ఎకనామిక్ జోన్ను
భారత్-బంగ్లాదేశ్ భాగస్వామ్యంతో నిర్మించాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్లో
షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, మొహమ్మద్
యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక, పాత ఒప్పందాన్ని రద్దు చేసి ఈ ప్రాజెక్టును చైనాకు అప్పగించారు.
●
ఇది పశ్చిమ బెంగాల్లోని
కోల్కతా రేవుకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల, ఇక్కడ చైనా ఆధిపత్యం పెరిగితే భవిష్యత్తులో బంగాళాఖాతంలో భారత్కు రక్షణ పరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
భారత్ - యూకే (UK) వాణిజ్య ఒప్పందం (CETA) అమలు
●
భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA -
Comprehensive Economic Trade Agreement) జూలై
15, 2026 నుండి
అధికారికంగా అమలులోకి వచ్చింది.
●
ఈ ఒప్పందంపై జూలై 25, 2025న సంతకాలు జరిగాయి. దీని
ప్రకారం భారతదేశం నుండి యూకేకి ఎగుమతి అయ్యే 99% వస్తువులపై ఎలాంటి సుంకాలు (Zero Tax) ఉండవు.
మిసైల్ డిఫెన్స్ కొయలిషన్
●
శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణుల దాడి నుండి రక్షణ కోసం ఉక్రెయిన్ సహా మొత్తం 10 ఐరోపా దేశాలు ఒక బలమైన రక్షణ కూటమిగా పారిస్ వేదికగా
ఏర్పడ్డాయి.
●
10 దేశాలు: ఉక్రెయిన్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్ మరియు బ్రిటన్.
●
దీనికి
"Integrated Anti-Ballistic
Missile Coalition" అని
పేరు పెట్టారు.
International Current Affairs, India Current Affairs , Current Affairs 2026 , Latest Current Affairs ,Daily Current Affairs, Monthly Current Affairs, National and International Current Affairs, Current , Affairs Today, India and World Current Affairs, Current Affairs PD
సంక్షిప్త సమాచారం
●
భారత్, ఇజ్రాయెల్
మధ్య సురక్షిత, స్థిరమైన పెట్టుబడి వాతావరణానికి వీలు కల్పించే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం
జూలై 4న అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది.
●
సరిహద్దు పెట్టుబడులను (Cross Border Investments) ప్రోత్సహించడానికి గుజరాత్లోని గిఫ్ట్ సిటీ, వియత్నాంకు
చెందిన దానంగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్' తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Note: గిఫ్ట్ సిటీ (GIFT City) అనేది గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఉన్న భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (IFSC).
●
తూర్పు చైనా సముద్ర (East China Sea) ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణమండల తుఫాను 'టైఫూన్ బావి' జపాన్
(సకిషిమా దీవులు) మరియు తైవాన్ దేశాలను వణికిస్తోంది. ఈ తుఫానుకు 'బావి' అనే పేరును వియత్నాం దేశం సూచించింది.
●
ఇటీవల తీవ్రంగా బద్దలై వార్తల్లో నిలిచిన 'టాల్ అగ్నిపర్వతం' ఫిలిప్పీన్స్ దేశంలో ఉంది.
●
118 సంవత్సరాల
తర్వాత జిబ్రాల్టర్ సరిహద్దుల్లో స్పెయిన్ మరియు ఇతర
యూరోపియన్ దేశాల మధ్య జూలై 15, 2026 నుండి ఎలాంటి ఇమ్మిగ్రేషన్ తనిఖీలు లేకుండా స్వేచ్ఛా
రాకపోకలకు అనుమతినిచ్చారు.
●
2028-29 సంవత్సరాలకు గాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నిక కావడం
కోసం న్యూయార్క్లో శాంతి క్యాంపెయిన్ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ప్రారంభించారు.
SHANTI అంటే: Securing Holistic Advancement through Norms,
Trust and Integrity. భారతదేశం ఇప్పటివరకు 8 సార్లు
UNSC తాత్కాలిక సభ్యదేశంగా
సేవలందించింది.
చివరిసారిగా 2021-22 లో పనిచేసింది.
UNSC లో 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి.
●
నయం చేయలేని రుగ్మతలతో సతమతమవుతున్న పెద్దలు అనాయాస మరణం(బాధలేని మరణాన్ని (Euthanasia / Assisted Dying) పొందేందుకు వీలు కల్పించే బిల్లుకు ఫ్రాన్స్ జాతీయ చట్టసభ 2026, జులై
15న తుది ఆమోదం తెలిపింది.
●
15 ఏళ్ల
లోపు వారు సామాజిక మాధ్యమాలను వాడటంపై నిషేధం విధించే బిల్లుకు 2026, జులై 21న ఫ్రాన్స్
ఆమోదం తెలిపింది. ఐరోపా సమాఖ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది.
●
పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం ఇచ్చేందుకు అమెరికా
ముందుకొచ్చింది.
ఈ క్రమంలో యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని సౌదీ అరేబియా
సమకూర్చుకునేందుకు ఆ దేశంతో 30 ఏళ్ల
పాటు అమల్లో ఉండే ఒప్పందానికి ట్రంప్ ఆమోదం
తెలిపారు.
●
లింపియాధుర, లిపులేఖ్, కాలాపానీలను నేపాల్లో భాగాలుగా చూపే మ్యాప్ను కొత్తగా రూపొందించిన రూపాయి నాణెంపై ముద్రించనున్నట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు
వెల్లడించింది.
ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తుండగా.. ఇవి
ఉత్తరాఖండ్లో భాగమని భారత్ చెబుతోంది.2020 మేలో
కె.పి.ఓలీ
నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం
ఈ ప్రాంతాలను తన అధికారిక మ్యాప్లో
చేర్చుకుంది.
●
తీవ్రమైన అటవీ కార్చిచ్చుల (Wildfires) కారణంగా స్పెయిన్ ప్రభుత్వం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని (National Emergency) ప్రకటించింది.
●
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న) దేశాల
పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ఆ సంస్థ నుండి నిష్క్రమిస్తున్నట్లు వెనిజులా
ఐక్యరాజ్యసమితికి తెలిపింది. Note : ICC : ఇది UN కింద
పనిచేసే సంస్థ కాదు; 1998 'రోమ్ స్టాట్యూట్'
ద్వారా ఏర్పడి, జులై 1, 2002 నుండి అమల్లోకి వచ్చింది. HQ ది
హేగ్
(నెదర్లాండ్స్). భారత్,
అమెరికా, చైనా,
రష్యా, ఇజ్రాయెల్ ఐసీసీలో సభ్యదేశాలు కావు.
