Ticker

6/recent/ticker-posts

July Current affairs on dates | Current affairs for DSC and APPSC

 

July Current affairs  on dates | Current affairs for DSC and APPSC

 

దినోత్సవాలు

      జూలై 1 : జాతీయ వైద్యుల దినోత్సవం (National Doctors' Day)(1991)

      2026 థీమ్: "Behind the Mask Who Heals the Healers”

      ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బి.సి. రాయ్ (బిధాన్ చంద్ర రాయ్) జయంతి మరియు వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

      బి.సి. రాయ్ గారికి 1961లో భారతదేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' లభించింది

      జూలై 1 : GST దినోత్సవం.

      జూలై 1 : జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే (National CA Day)

      1949లో 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' (ICAI) స్థాపించబడిన రోజు.

      జులై 2  : ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ దినోత్సవం

      జులై 3  :  అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం.

      జూలై మొదటి శనివారం: అంతర్జాతీయ సహకార దినోత్సవం (International Day of Cooperatives)

      2026 థీమ్: "Cooperatives for a Peaceful World”

      జులై 6 :  ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం (World Rural Development Day

      2025-26 ఆర్థిక సర్వే ప్రకారం, మన దేశంలో 65% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఉపాధి కల్పనలో గ్రామీణ రంగం వాటా 46 శాతంగా ఉంది.

      జూలై 6: ప్రపంచ జూనోసెస్ దినోత్సవం (World Zoonoses Day)

      2026 థీమ్ : "One World, One Health: Prevent Zoonoses" (ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం: జూనోటిక్ వ్యాధులను నివారిద్దాం)

      జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులపై అవగాహన కోసం.

      1885 జూలై 6 ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ (Louis Pasteur) జూనోటిక్ వ్యాధి అయిన 'రేబిస్' (Rabies) కు వ్యతిరేకంగా మొదటి వ్యాక్సిన్ను విజయవంతంగా అందించారు.  దానికి గుర్తుగా జరుపుతారు.

      జూలై 10 : జాతీయ మత్స్య రైతుల దినోత్సవం (National Fish Farmers Day).

      Note : జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్): డిసెంబర్ 23 (చౌదరి చరణ్ సింగ్ జయంతి)

      జూలై 11: ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day)

      2026 సంవత్సరం థీమ్ : "Realizing the hopes and aspirations of young people – today and for the future" (యువత యొక్క ఆశలు మరియు ఆకాంక్షలను నిజం చేయడంనేడు మరియు భవిష్యత్తు కోసం).

      జూలై 12 : ప్రపంచ మలాల దినోత్సవం. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్కు చెందిన విద్యా హక్కుల పోరాట యోధురాలు మలాలా యూసఫ్జాయ్ పుట్టినరోజు (జూలై 12, 1997) సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు.

      జూలై 15 : ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం (World Youth Skills Day).(2014 నుండి)

      2026 ఇతివృత్తం (Theme): "Skills for a Shared Future”

      జూలై 17 : అంతర్జాతీయ న్యాయ దినోత్సవం (International Justice Day).

      17 జూలై 1998 న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) స్థాపనకు పునాది వేసిన 'రోమ్ స్టాట్యూట్' (Rome Statute) ఒప్పందాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం 2010 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

 

      జూలై 18 : నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. (2010 నుండి)

      2026 థీమ్ (ఇతివృత్తం): "It's still in our hands to combat poverty and inequality" (పేదరికం మరియు అసమానతలను ఎదుర్కోవడం ఇప్పటికీ మన చేతుల్లోనే ఉంది).

      మండేలా దక్షిణాఫ్రికాకు మొదటి నల్లజాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు 1990లో భారతరత్న (ఈ అవార్డు పొందిన రెండవ విదేశీయుడు), 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించాయి.

 

  • July Current Affairs 2026
  • July Important Days 2026
  • July Current Affairs PDF
  • July Current Affairs MCQs
  • July GK Questions
  • Monthly Current Affairs July
  • July National and International Days
  • Current Affairs by Date
  • July 2026 Important Events
  • Daily Current Affairs July
  • July 2026 current affairs with dates
  • Important days in July for competitive exams
  • July current affairs for UPSC
  • July current affairs for SSC CGL
  • July current affairs for Banking exams
  • July current affairs for APPSC
  • July current affairs for TSPSC
  • July current affairs for Railway exams
  • July current affairs questions and answers
  • July current affairs PDF free download
  • July current affairs in English
  • July current affairs in Telugu
  • July monthly current affairs notes
  • July current affairs one-liners
  • July current affairs quiz

      జూలై 20 : ప్రపంచ చెస్ దినోత్సవం (World Chess Day)

      2026 Theme: "Celebrate, Create, and Make a Difference"

      Note: 1924 జూలై 20న ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) స్థాపించబడింది.

      FIDE HQ లౌసాన్ (స్విట్జర్లాండ్); డిప్యూటీ ప్రెసిడెంట్ - విశ్వనాథన్ ఆనంద్.

      జూలై 20 : అంతర్జాతీయ చంద్ర దినోత్సవం (International Moon Day)

      2026 ఇతివృత్తం (Theme): "One Moon, One Vision, One Future”

      1969 జూలై 20న నాసా పంపిన అపోలో-11 మిషన్ ద్వారా మానవుడు (నీల్ ఆమ్స్ట్రాంగ్) తొలిసారిగా చంద్రుడిపై కాలుమోపిన రోజు జ్ఞాపకార్థం జరుపుకుంటారు

      జూలై 22 : జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం (National Flag Adoption Day)

      1947 జూలై 22 రాజ్యాంగ పరిషత్ (Constituent Assembly) మన త్రివర్ణ పతాకాన్ని భారతదేశ అధికారిక జాతీయ జెండాగా ఆమోదించింది.

      పింగళి వెంకయ్య రూపొందించిన డిజైన్ ఆధారంగా మధ్య లోని చరఖా స్థానంలో అశోక చక్రం చేర్చి జాతీయ జెండాకు తుది రూపం ఇచ్చారు.

      జూలై 22 : ప్రపంచ మెదడు ఆరోగ్య దినోత్సవం (World Brain Health Day)

      జూలై 22 : జాతీయ మామిడి పండ్ల దినోత్సవం (National Mango Day).

      July 24 : ఆదాయపు పన్ను దినోత్సవం (Income Tax Day / ఆయకర్ దివస్)

      1860 జూలై 24న సర్ జేమ్స్ విల్సన్ (Sir James Wilson) భారతదేశంలో మొదటిసారిగా ఆదాయపు పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు.

      సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ దినోత్సవాన్ని 2010 నుండి నిర్వహిస్తోంది.

      జూలై 25 : ప్రపంచ భ్రూణ శాస్త్రవేత్తల దినోత్సవం / IVF దినోత్సవం (World Embryologist Day)

      1978 జూలై 25న ఇంగ్లాండ్లో ప్రపంచం లోనే మొదటి ఐవిఎఫ్ (IVF) పద్ధతి ద్వారా జన్మించిన పాప 'లూయిస్ బ్రౌన్' జన్మించడానికి గుర్తుగా జరుపుతున్నారు.

      జూలై 25 : ప్రపంచ మునిగిపోవడాన్ని నివారించే దినోత్సవం (World Drowning Prevention Day) (2021 నుండి UNO జరుపుతుంది).

      జూలై 26 : కార్గిల్ విజయ్ దివాస్.

      1999లో లడఖ్లోని కార్గిల్-డ్రాస్ సెక్టార్లో భారత భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ దళాలను మరియు ఉగ్రవాదులను తారమొట్టడానికి భారత సైన్యం "ఆపరేషన్ విజయ్" (Operation Vijay) ను చేపట్టింది.

      జూలై 26, 1999 భారత సైన్యం శత్రువుల నుండి కార్గిల్ శిఖరాలను పూర్తిగా స్వాధీనం చేసుకుని విజయం సాధించింది.

      జూలై 27 : CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) ఆవిర్భావ దినోత్సవం.

      జూలై 28 :  ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం (World Hepatitis Day)

      2026 థీమ్: "Let's Break It Down"

      హెపటైటిస్-B వైరస్ మరియు దాని వ్యాక్సిన్ను కనుగొన్న నోబెల్ గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లూమ్బెర్గ్ జయంతి సందర్భంగా ఈ రోజును నిర్వహిస్తారు.

      హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. కలుషితమైన ఆహారం/నీరు ద్వారా, పరిశుభ్రత లోపించడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.

      2018లో భారత ప్రభుత్వం నేషనల్ వైరల్ హెపటైటిస్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.

      2030 నాటికి హెపటైటిస్ను పూర్తిగా రూపుమాపాలని ఇండియా లక్ష్యం.

      జూలై 28 : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం (World Nature Conservation Day)

      2026 థీమ్ : "Protecting Nature for a Sustainable Future" (సుస్థిర భవిష్యత్తు కోసం ప్రకృతిని పరిరక్షించడం)

      జూలై 29 : అంతర్జాతీయ పులుల దినోత్సవం (International Tiger Day / Global Tiger Day).

      2026 థీమ్ : "Securing the future of Tigers with Indigenous Peoples and Local Communities at the heart.”(స్థానిక ప్రజలు మరియు గిరిజన/ఆదివాసీ సమాజాలను భాగస్వాములను చేస్తూ పులుల భవిష్యత్తును సురక్షితం చేయడం)

      2010లో రష్యా లోని సెయింట్ పీటర్స్బర్గ్ (St. Petersburg) లో జరిగిన 'టైగర్ సమ్మిట్'లో జూలై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా ప్రకటించారు.

      భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య: 3,682. Top 1. మధ్యప్రదేశ్ (785) ( 'Tiger State'). కర్ణాటక (563) ఉత్తరాఖండ్ (560).

      ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభం: 1973 ఏప్రిల్ 1 ఉత్తరాఖండ్లోని 'జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్' నుండి ప్రారంభించారు.

      భారతదేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. 58 - మాధవ్ టైగర్ రిజర్వ్ (మధ్యప్రదేశ్).57- రాతాపానీ టైగర్ రిజర్వ్ (MP) 56-గురు ఘాసీదాస్ - తామోర్ పింగ్లా(చతిస్గడ్)

      అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రం: మధ్యప్రదేశ్ (9)

      అత్యంత పెద్ద టైగర్ రిజర్వ్: నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ (AP &TS)

      అత్యంత చిన్న టైగర్ రిజర్వ్: బోర్ టైగర్ రిజర్వ్ (మహారాష్ట్ర)

      ప్రపంచంలోనే ఏకైక మ్యాంగ్రోవ్ (మడ అడవుల) టైగర్ రిజర్వ్: సుందర్బన్స్ (పశ్చిమ బెంగాల్).

      పులి శాస్త్రీయ నామం: పాంథెరా టైగ్రిస్ (Panthera tigris). 1973లో ప్రాజెక్ట్ టైగర్ తెచ్చినప్పుడు సింహం స్థానంలో పులిని జాతీయ జంతువుగా గుర్తించారు.

      జూలై 30 : ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (World Day Against Trafficking in Persons).

      2026 థీమ్ : "Trapped Behind the Scam”

  • July Current Affairs 2026
  • July Important Days 2026
  • July Current Affairs PDF
  • July Current Affairs MCQs
  • July GK Questions
  • Monthly Current Affairs July
  • July National and International Days
  • Current Affairs by Date
  • July 2026 Important Events
  • Daily Current Affairs July
  • July 2026 current affairs with dates
  • Important days in July for competitive exams
  • July current affairs for UPSC
  • July current affairs for SSC CGL
  • July current affairs for Banking exams
  • July current affairs for APPSC
  • July current affairs for TSPSC
  • July current affairs for Railway exams
  • July current affairs questions and answers
  • July current affairs PDF free download
  • July current affairs in English
  • July current affairs in Telugu
  • July monthly current affairs notes
  • July current affairs one-liners
  • July current affairs quiz