Ticker

6/recent/ticker-posts

4 class Telugu


1. వర్షాలు.                             
 • వసుధ - భూమి                                 
 • దివి - ఆకాశం
 • గాడుపు - గాలి
 • మయూరం - నెమలి
 • గండశిల - పెద్దరాయి
 • భూపాలుడు - రాజు
 • పశుపతి - శివుడు
 • వృషభాలు - ఎద్దులు

 • 1. వానలో స్నానమాడింది ఎవరు ? - భూమి
 • 2. మట్టిని జిమ్మి రంకె వేసింది - ఎద్దు
 • 3. తూర్పు గట్లలో మేసింది - ఆవులు
 • 4. కరువులు పాలిట కాలుడు - రైతు
 • 5. ముద్దుగా నాట్యం సలిపింది - నెమలి
 • 6. పడమటి గట్లను మేసింది - గేదెలు
 • 7. వరికర్రల నోళ్ళకు చనుబాలైంది - వర్షాలు
 • అరసున్నా, సున్నా, విసర్గ లను "ఉభయాక్షరాలు" అంటారు. "అరసున్నా" ప్రాచీన గ్రంధాలలో కనిపిస్తుంది.
2. సూది కధ
 • రెండు పదాలు కలసి ఒక పదంగా ఏర్పడితే దానిని "జంటపదం" అంటారు.
 • ఎవరైనా పనిని మరొకరికి అప్పగించడం - పురమాయించడం
3. బాలతిమ్మరుసు • తిమ్మరసు "వీరనరసింహారాయలు" యొక్క మంత్రి.
 • అనన్యసామాన్యం - ఇతరులెవ్వరు చెయ్యలేనిది
 • నామవాచకం యొక్క గుణాలు తెలిపే పదాలను "విశేషణాలు" అంటారు.
4. చిన్నారి కల
 • ఈ పాఠంలో చిన్నారి పేరు - ప్రజ్ఞ
కవికోకిల సరోజినీ నాయుడు
 • ఈమె 1879 సంవత్సరం ఫిబ్రవరి13న హైద్రాబాద్ లో జన్మించింది. తండ్రి అఘోరనాధ చాటోపాధ్యాయ. తల్లి వరదసుందరీ దేవి.
 • భర్త - ముత్యాల గోవింద రాజులనాయుడు. పెద్ద కొడుకు పేరు జయసూర్య
 • 1915 లో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం. 1930 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది.
 • రచనలు 
 • బంగారు వాకిలి (the golden threshold)
 • కాలవిహంగం (the bird of time)
 • భగ్నపక్షం (the broken wing)
 • సరోవరపు సారసాక్షి (lady of the lake) - 13వ ఏట రాసిన కావ్యం
 • 1947 లో ఢిల్లీలో జరిగిన "ఏషియన్ రిలేషన్స్" సభకు ఆమె అధ్యక్షత వహించింది.
 • స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి మహిళా గవర్నర్
 • 1950 సంవత్సరంలో మార్చి 02 న ఆమె కన్నుమూశారు. లక్నోలో గోమతీ నదీ తీరంలో దహన సంస్కారాలు జరిపి అక్కడ ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు.
 • "ఆమెను గవర్నర్ గా నియమించడం వల్ల గవర్నర్ పదవికి ముందు ఎన్నడూ లేని గౌరవం లభించింది - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
5. జాతీయ జెండా • అర్ధాలు
 • వినువీధి - ఆకాశం
 • విశ్వవిఖ్యాతి - ప్రపంచ ప్రసిద్ధి
 • ధారవోసి - త్యాగం చేసి
 • ఖ్యాతి - పేరు ప్రఖ్యాతులు
 • ఆత్మవిశ్వాసం - తనపై తనకుండే నమ్మకం
 • "?" గుర్తు గల వాక్యాలను "ప్రశ్నార్థక వాక్యాలు" అని అంటాం.
6. వినాయక చవితి
 • వినాయక చతుర్థి (గణేశ చతుర్థి) భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది.
 • గణేశుడి వాహనం అయిన ఎలుక పేరు - అనింద్యుడు
 • కుమారస్వామి వాహనం - నెమలి
 • "ముద్గల పురాణం" ప్రకారం వినాయకుడిని 32 రూపాల్లో పూజిస్తారు. 21 రకాల ఆకులతో పూజిస్తారు.
 • వినాయక చవితి జాతీయ సమైక్యత కోసం వినియోగించిన ఘనత బాలగంగాధర తిలక్ కు చెందును (1892 లో సాంఘిక సంబరంగా నిర్వహించారు)
 • గణాలకు అధిపతి - గణపతి
 • విశిష్టమైన నాయకుడు - వినాయకుడు
 • విఘ్నాలకు అధిపతి - విఘ్నేశ్వరుడు
 • బాన వంటి పెద్ద పొట్ట - లంబోదరుడు
రంజాన్
 • రంజాన్ ను ఈద్, ఈద్-ఉల్-ఫితర్ అని అంటారు.
 • ఈ పండుగ "ఫసలీ కాలమానం" ప్రకారం రంజాన్ నెల మొదటిరోజు నుండి ప్రారంభం అవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుడు దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజులు ఈ పండగ జరుపుకుంటారు.
 • సంవత్సరానికి ఒక్కసారి ఒక లెక్క ప్రకారం చేసే దానాధర్మాలనే "జకాత్" అని అంటారు.
 • మసీదుకు వెళ్లి కనీసం 5 పర్యాయాలు నమాజు చేస్తారు. ప్రత్యేక నమాజుని "తరావిష్" అంటారు.
 • రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరించింది అని మహమ్మదీయుల నమ్మకం.
 • ఉపవాస ప్రారంభాన్ని "సహెరి" అంటారు. ఉపవాసం విడవడాన్ని "ఇఫ్తార్" అంటారు.
 • రంజాన్ తర్వాత నెల "షవ్వాల్".
 • సామూహిక ప్రార్ధనలు - ఈద్ గాహ్.7. ఆణిముత్యాలు
 • 1. కోపమునను ఘనత ------------------------------వినుర వేమ !
 • 2. అనగనగ రాగ -------------------------------------వినుర వేమ!
 • 3. ఇమ్ముగా జదువని నోరును -------------------సుమతీ!
 • 4. కూరిమి గల దినములలో ---------------------- సుమతీ!
 • 5. వీడు పరులవాడు వాడు నావాడాని ---------------- లలిత సుగుణజాల తెలుగుబాల!
 • 6. సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు --------------------------- లలిత సుగుణజాల తెలుగుబాల!
 • 7. ఎంత చెలిమి యున్న  ----------------------------------తెలుగు బిడ్డ!
 • 8. నల్లనిదని విడువజల్లెనే కస్తూరి ---------------------------తెలుగు బిడ్డ !
 • 9. నిలిచి నీరు త్రాగ ---------------------------------నార్ల వారి మాట !
 • 101. చెప్పకు చేసిన మేలనొ ------------------------------ కుమారీ !
 • అర్ధాలు 
 • సత్ప్రవర్తన - మంచి ప్రవర్తన
 • ఎగతాళి - హేళన
 • వాస్తవం - నిజం
 • ఘనత - పేరు పొందిన
 • హర్షం - సంతోషం
 • చిత్తం - మనస్సు
 • "!" గుర్తు గల వాక్యాలను "ఆశర్యార్థక వాక్యాలు" అని అంటారు.
8. ఎలుక విందు
 • కొల్లలుగా - ఎక్కువగా
 • ఏగుచున్నవి - వెళుతున్నాయి
 • తుదకు - చివరకు
తెలుగు సంవత్సరాలు
 • తెలుగులో అరవై సంవత్సరాలు ఉన్నాయి. • ఈ వరుస పూర్తి అయిన తరువాత మళ్ళీ మొదలవుతుంది. దీనిని "షష్టి వర్ష చక్రం" అని అంటారు.
 • తెలుగు సంవత్సరాలు :
 • ప్రభవ             చిత్రభాను     హెవీలంబి పరీధావి 
 • విభవ             స్వభాను     విలంబి   ప్రమాదీచ 
 • శుక్ల                తారన వికారి                    ఆనంద 
 • ప్రమోదుత      పార్థివ           శార్వారి రాక్షస 
 • ప్రజోత్పత్తి         వ్యయ ప్లవ                   నల 
 • అంగీరస           సర్వజిత్తు   శుభకృతు పింగళ  
 • శ్రీముఖ             సర్వదారి శోభాకృతు         కాలయుక్తి 
 • భావ                 విరోధీ క్రోది                  సిద్ధార్ధి 
 • యువ               వికృతి   విశ్వావాసు రౌద్రి 
 • దాత                 ఖర పరాభవ            దుర్మతి 
 • ఈశ్వర              నందన ప్లవంగ              దుందుభి 
 • బహుధాన్య       విజయ కీలక                 రూధిరోద్ఘారి 
 • ప్రమాది             జయ సౌమ్య               రక్తాక్షి 
 • విక్రమ               మన్మధ సాధారణ           క్రోధన 
 • వృష                 దుర్ముఖి విరోధీకృతు        అక్షయ
9. చిలుక సందేశం
 • జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలు - భూతకాల వాక్యాలు
 • జరుగుతూ ఉన్న పనిని గురించి తెలిపే పదాలు - వర్తమాన కాలపు వాక్యాలు
 • జరగబోయే పనిని గురించి తెలిపే పదాలు - భవిష్యత్తు కాలపు వాక్యాలు
చిన్ని కృష్ణుడు
 • కంసుడు చెల్లెలు దేవకి. ఆమెకి వసుదేవునితో వివాహం జరిగింది. 
 • దేవకీ, వసుదేవుల ఎనిమిదవ సంతానం - కృష్ణుడు • కృష్ణుడిని పెంచిన తల్లిదండ్రులు - నందగోపుడు, యశోద
 • వసుదేవుని మరో భార్య - రోహిణి. రోహిణి కుమారుడు బలరాముడు
 • కృష్ణుని చంపడానికి మొదట వచ్చిన రాక్షసి - పూతన. కాకి రూపంలో వచ్చింది కాకాసురుడు
 • రాక్షసుల అరాచకాలు భరించలేక యశోద, నందగోప దంపతులు గోకులం నుండి యమునా తీరంలో "బృందావనం" లోకి వెళ్లారు.
10. రైతు తెలివి
 • జాతీయాలు :
 • రెక్కాడితే గాని డొక్కాడదు
 • గొర్రెతోక లాంటి ఆదాయం
 • కష్టాలు కలకాలం కాపురం ఉండవు
 • పులిమీద పుట్ర
 • కీలెరిగి వాత
 • కడుపులో చల్ల కదలకుండా బతకడం
 • కాళ్ళ బేరానికి రావడం
 • కడుపే కైలాసం - ఇల్లే వైకుంఠం
 • కాలుగాలిన పిల్లిలా
 • కళ్ళల్లో దుమ్ము కొట్టడం
 • కాలికి బలపం కట్టుకుని
 • గోతికాడ నక్కలా
 • ఒంటికాలి మీద లేవడం
 • అరికాలిమంట నెత్తికెక్కింది
 • నిప్పు తొక్కిన కోతిలా
 • అన్నం అడిగితే సున్నం పెట్టినట్లు
 • పొమ్మనలేక పొగ పెట్టడం
 • కళ్ళలో కారం కొట్టడం
 • కొరివితో తల గోక్కోవడం
12. ఎవరు భాద్యులు
 • వాక్య భావాన్ని పూర్తిగా తెలిపేవి - సమాపక క్రియలు
 • వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపేవి - అసమాపక క్రియలు
13. చక్రాల కుర్చీ - కధలో పాప పేరు "సునీత
14. బొమ్మగుర్రం - కధలో పాప పేరు "రామి" బంజారా బాలిక. రామి అమ్మ, నాన్న బొమ్మలు అమ్మేవారు
15. పల్లె చిత్రం
 • కధలో బాబు పేరు "సక్రూ". సక్రూ టీచర్ పేరు "వనజ"
 • చిత్రాలు గీసేవారు - చిత్రకారులు
 • నాట్యం చేసేవారు - నర్తకులు
 • పాటలు పాడేవారు - గాయకులు • పుస్తకాలు చదివేవారు - పాఠకులు
 • ఆటలు ఆడేవారు - క్రీడాకారులు
 • కధలు చెప్పేవారు - కథకులు
 • రచనలు చేసేవారు - రచయితలు
చిత్రకళ
 • గోడలపై చిత్రించడాన్ని "కుడ్య చిత్రణం" అంటారు. వీటినే "బిత్తి చిత్రాలు" అని కూడా అంటారు.
 • పూర్వం చరిత్ర యుగపు రాతి గుహలలో మానవుడు తాను వెంటాడే జంతువులను అతనికి అందుబాటులో రంగురాళ్లతో, నలుపు రంగుతో గీసేవారు. ఇలాంటి చిత్రాలు ఫ్రాన్స్, స్పెయిన్ లో "అల్టిమీరా" గుహలలో, భారతదేశములో రాయచూరు జిల్లాలో ఉన్నాయి.
 • మహారాష్ట్రలో అజంతా గుహలలో ప్రాచీన చిత్రకళ కనిపిస్తుంది.
 • శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు తైలవర్ణ చిత్రాలు, నీటి రంగు చిత్రాలు, పొట్రైట్స్ వంటివి వేయడంలో సిద్ధహస్తులు.
 • ఈయన 27.01.1924 న వరంగల్ జిల్లా పెనుగొండ లో జన్మించారు. 26.07.2012 న పరమపదించారు. 
 • ఈయన వేసిన చిత్రాలలో పేరు పొందినవి - బెస్తావారి చిత్రం, గుహుడు రాములవారిని నది దాటించే చిత్రం, కలువకొలను లచ్చి (జానపద చిత్రం), గోదాదేవి చిత్రం, శకుంతల దృశ్య కావ్య చిత్రాలు, గ్రామీణులు చిత్రం, ప్రకృతి దృశ్యాలు, తెలుగుతల్లి చిత్రం.
16. మాటల ప్రయాణం
 • PIN - POSTAL INDEX NUMBER
 • పిన్ ఆరంకెల సంఖ్య. ఈ ఆరంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె "రాష్ట్రం", రెండో మూడో అంకెలు "జిల్లా", చివరి మూడంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి.
 • పూర్వం ఉత్తరాలు పావురాల ద్వారా, రౌతుల ద్వారా పంపేవారు.
 • పోస్ట్ ఆఫీస్ సేవలు - సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్, ఫిక్సడ్ డిపాజిట్, సంచాయక నిధుల ద్వారా డబ్బు పొదుపు
 • మన తపాలా వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది. దాదాపు లక్షాయాభైవేల పైచిలుకు పోస్టాపీసులు తో సేవలందిస్తోంది..


Prepared by: A .B .Rao