Ticker

6/recent/ticker-posts

3వ తరగతి తెలుగు

1. తొలకరి చిరుజల్లులు 
"వాక్యం" అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది.
"అక్షరం" అంటే పలికే ధ్వనిని ఏర్పరుచుకున్న గుర్తు.
వర్ణమాలలో అ నుంచి ఔ వరకు గల అక్షరాలను "అచ్చులు" అని అంటారు. క నుంచి హ వరకు గల అక్షరాలను "హల్లులు" అంటారు.

2. బాలభీముడు
పాండురాజుకు ఐదుగురు కుమారులు. వీరిని పంచ పాండవులు అని అంటారు.
పంచ పాండవులు - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. భీముడు
రెండోవాడు.
పాండురాజు అన్న "ధృతరాష్ట్రుడు". హస్తినాపురానికి రాజు.
దృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు. వీరిని "కౌరవులు" అని అంటారు. పెద్దవాడు "దుర్యోధనుడు".
కౌరవ, పాండవుల గురువు "ద్రోణాచార్యుడు"

ఒక వస్తువు పేరు తెలిపేది - ఏకవచనం. ఒకటి కంటే ఎక్కువ వస్తువులుని తెలిపేది - బహువచనం.
అల్పప్రాణాక్షరాలు - తేలికగా పలికేవి. ఉదా : క, గ, జ, చ, ట, త, ద, ప, బ
మహాప్రాణాక్షరాలు - ఒత్తి పలికే అక్షరాలు. ఉదా : ఖ, ఘ, ఛ, ఝ, ధ, థ, ఫ, భ
సీసాభూతం
రాజావారి తోటలో రోజాపూలు. చూసేవారు కానీ కోసేవారు లేరు - నక్షత్రాలు
గోడ మీద బొమ్మ, గొలుసులు బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించు బొమ్మ - తేలు
మా అమ్మ చీర మడవలేరు - భూమి


3. దారి తప్పిన బాలు
"బాలు" అనగా ఎలుగుబంటి పిల్ల. 
బాలుకి బస్సు కింది భాగం నచ్చలేదు. బస్సులో చక్రం ఉన్న చోటుకి వెళ్లి కూర్చుంది.
పొట్టిగా పలికే వాటిని "హ్రస్వాలు" అని, దీర్ఘంగా పలికే వాటిని "దీర్ఘాలు" అని అంటారు

4. ఏమవుతుందో
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని "ద్విత్వాలు" లేదా "ద్విరుక్తాలు" అంటారు.
ఋతువులు
వసంత ఋతువు - వసుధకు అందం
గ్రీష్మ ఋతువు - ఎండలు మెండుగా 
వర్ష ఋతువు - వానలు, వరదలు
శరదృతువు - చల్లని వెన్నెల, కార్తీక దీపం
హేమంత ఋతువు - హిమబిందువులు, ముత్యపు ముగ్గులు
శిశిర ఋతువు - చెట్లు ఆకులను రాల్చింది


5. పారిపోయిన గిన్నెలు
ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని "సంయుక్తాక్షరం" అని అంటారు.
ఏకవచన పదం చివర "o" లేదా "ము" ఉంటే బహువచనంలో అవి లోపించి "లు" చేరుతుంది.
దయ 
కపిల వస్తు నగరానికి రాజు "శుద్ధోధనుడు" అతని కుమారుడు "గౌతముడు"
గౌతముని మరో పేరు "సిద్ధార్థుడు" అతని బాల్యమిత్రుడు దేవదత్తుడు


6. మహాత్ముడు
గాంధీజి పూర్తి పేరు "మోహన్ దాస్ కరంచంద్ గాంధీ". ఆయన 1869 అక్టోబర్ 02 న గుజరాత్ లోని పొరుబందర్ లో జన్మించారు.
తండ్రి కరంచంద్ గాంధీ, తల్లి పుత్లీభాయి. గాంధీజీ భార్య కస్తూరీబాయి 
గాంధీ "శ్రవణ కుమారుని నాటకం" ఆనే పుస్తకం చదివి శ్రవణునిలాగా తల్లిదండ్రులకు పెద్దలకు సేవ చేయాలనుకున్నారు.
గాంధీ "సత్య హరీశ్చంద్ర" నాటకం చూసి నాటి నుండి తాను కూడా సత్యమే పలకాలని నిర్ణయించుకున్నారు.
సబర్మతి ఆశ్రమ భోజనాలయంలో బోర్డ్ మీద రాసిన అంశాలు :
"ఆశ్రమ ఆస్తి అందరిది. ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్లు ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నాను"
అవసరానికి మించి ఉప్పయిన సరే వడ్డించుకోవద్దు. నీరు కూడా వృధా చేయకూడదు"
సత్యం. అహింస, ధైర్యం, పట్టుదల అన్నవి గాంధీ గారిని గొప్ప నాయకులని చేశాయి. అందుకే  ఆయన "మహాత్ముడు" అనే బిరుదు పొందారు.
అర్ధాలు :
ఆసక్తి - ఇష్టం.                             జన్మదినం - పుట్టిన రోజు 
వృధా - అనవసరంగా వాడడం    అహింస - హింస లేని  
మహనీయుడు - గొప్పవాడు
 ప్రతీ వాక్యం చివర ఉండేది - వాక్యంత బిందువు (.) దీనినే ఫుల్ స్టాప్ అంటారు.
తేదీలు ప్రాముఖ్యత 
ఆగస్ట్ 15 - స్వాతంత్ర్య దినోత్సవం           నవంబర్ 14 - బాలల దినోత్సవం   
సెప్టెంబర్ 05 - ఉపాధ్యాయ దినోత్సవం    జనవరి 26 - గణతంత్ర దినోత్సవం  
అక్టోబర్ 02 - గాంధీ జయంతి                  ఏప్రిల్ 14 - అంబెడ్కర్ జయంతి

పరుగో పరుగు
కుందేలు - జింక - పులి - ఏనుగు - సింహం (వరుస క్రమం)


7. సహకారం
గాయం ఎవరికి అయింది - కుందేలు
డాక్టర్ - ఎద్దు, సిస్టర్ - చిలకమ్మ 
8. ఆరోగ్యమే మహాభాగ్యం 
మనం మాట్లాడేటప్పుడు స్వల్పంగా విరామం ఇచ్చే చోట "స్వల్ప విరామ చిహ్నం ( , ) ఉంచుతాం. దీనిని "కామా" అంటారు.

9. మన పండుగలు 
"అజ్మీర్ దర్గా" రాజస్థాన్ లో ఉంది.
వలీలకు ముస్లీములు కట్టే సమాధులు "దర్గా" అని అంటారు. వలీలు చనిపోయిన రోజు జరిపే ఉత్సవాలను "ఉర్సు" అంటారు. అజ్మీర్ దర్గాలో ఇస్లాం కాలమానం ప్రకారం "రజ్జాబ్" నెల 1 వ తేదీ నుండి 6 వ తేదీ వరకు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి.
తమిళనాడులోని "వెలాంగిని" లో మేరీ మాత గుడి ఉంది. మన రాష్ట్రంలో విజయవాడ దగ్గర "గుణదల" లో మేరీమాత గుడి ఉంది.
బెంగాల్ లో పది రోజులు జరిగే దుర్గా పూజను "శారదోత్సవాలు" అంటారు. దసరాకు బొమ్మల కొలువు పెడతారు.
కొన్ని ప్రాంతాలలో నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. పదవ రోజు విజయదశమి గా జరుపుకుంటారు.
అమ్మవారి అలంకారాలు
1. బాలాత్రిపురసుందరి         6. లలితాదేవి 
2. అన్నపూర్ణ                        7. దుర్గాదేవి 
3. గాయత్రి                           8. మహిషాసురమర్ధిని     
4. లక్ష్మీదేవి                            9. రాజరాజేశ్వరి  
5. సరస్వతి 
మహిషుడిని చంపింది కాబట్టి అమ్మవారికి "మహిషాసురమర్ధిని" అనే పేరు వచ్చింది.
దసరా ముందు వచ్చే అమావాస్య - మహాలయ అమావాస్య / పితృ అమావాస్య / పెతరమాస
యుద్ధంలో అలసిపోయి గౌరీమాత నిద్రపోయింది. ఆమెను లేపడానికి ఆడవాళ్ళంతా పాటలు పాడి పూజ చేస్తే ఆమె విజయదశమి రోజు నిద్రలేచింది.
దసరా ఉత్సవాలు "శరదృతువు" లో వస్తాయి.
నవరాత్రులలో ఒకరోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరించి "శాకంబరీదేవి"గా పూజ చేస్తారు.
సిరిమాను ఉత్సవం - శ్రీకాకుళం, విజయనగరం
గౌరీదేవి పూజలు - రాయలసీమ
బ్రహ్మోత్సవాలు - తిరుమల వేంకటేశ్వర  స్వామి
బతుకమ్మ - తెలంగాణ
బతుకమ్మ పండుగలో రకరకాల పూలు తెచ్చి గోపురంలా పేరుస్తారు. పసుపుముద్ద చేసి తమలపాకులో ఉంచి గోపురం పై పెడతారు. పసుపుముద్దనే "గౌరమ్మ" అని అంటారు.
దసరా పండుగ రోజు ఆయుధ పూజ చేస్తారు. అలాగే పాలపిట్టను చూడడం మంచి శకునంగా భావిస్తారు.
గిలకలు అనగా "విల్లంబులు"


10. మా ఆటలు
పేర్లను తెలిపేవి "నామవాచకాలు"

11. లడ్డూ భాద 

శొంఠి - ఎండిన అల్లం 

12. గాలిపటం 

నింగిలో ఎగురుతాను కానీ పక్షిని కాదు, తోక ఉంది కాని జంతువును కాదు, రెక్కలు లేవు గాని పైకి ఎగరగలను నేనెవరిని ? - గాలిపటం 
చైనా దేశంలో గాలిపటాల పండగ ప్రత్యేకంగా జరుపుకుంటారు.
గాలిపటానికి కట్టే దారం - మాంజా. మాంజా తయారీలో కోడిగుడ్డు సొన, గాజుముక్కల పొడి, సన్న ఇసుక, జిగురు పదార్ధాలు కలిపి దారానికి పూస్తారు.
పొడుపు కధలు
1. పాకాల చెరువులో పది గుంజలు ఉపితే ఊగుతాయి పీకితే రావు - చేతివేళ్ళు 
2. కిట కిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు - కనురెప్పలు 
3. అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు - పెదవులు 
4. తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది - పోస్ట్ కార్డ్ 
5. తండ్రి గర గర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు - పనసపండు

నామవాచకాలు బదులు వాడివి - సర్వనామలు


13. కోతి పెన్సిల్
పనిని తెలిపే పదాలు - క్రియాపదాలు

14. పిల్లల మర్రి
పిల్లల మర్రి మహబూబ్ నగర్ నుండి నాలుగు కిలోమీటర్లు. ఇది మూడువేల మందికి పైగా నీడనిస్తుంది.
పిల్లల మర్రి వయసు సుమారు 700 సంవత్సరాలు. ఇది మూడు ఎకరాల స్థలంలో వ్యాపించి ఉంది.
ఈ చెట్టు పక్కనే పురావస్తు ప్రదర్శనశాల ఉంది. చెట్టుకు ముందు పిల్లల పార్కు ఉంది. పక్కనే జైన, శైవ, భౌద్ధ ఆలయాలు ఉన్నాయి.
నగిషీలు చెక్కి ఉన్న పెద్ద నంది ఆకర్షణీయంగా ఉంది. అలాగే ఇక్కడ జింకలు పార్క్, పక్షుల సంరక్షణ కేంద్రం, పూలు - పండ్లు నర్సరీ ఉంది.
అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలో "తిమ్మమ్మ మర్రిమాను", చెన్నై నగరంలో ఆడయార్ ప్రాంతంలో మర్రిచెట్టు ఎంతో పెద్దవని పేరు పొందాయి.
తిథులు
పాడ్యమి నుండి పౌర్ణమికి 15 రోజులు దీనిని "శుక్ల పక్షం" ఆంటారు. పాడ్యమి నుండి అమావాస్యకు 15 రోజులు దీనిని "కృష్ణ పక్షం" అంటారు

15 తిథులు ఒక "పక్షం" అంటారు.  
తిథులు - పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య.


16. ఆణిముత్యాలు
1. కనకపు సింహాసనమున --------------- వినరా సుమతీ! 
2. ఎప్పుడు సంపద కల్గిన ----------------- గదరా సుమతీ!
3. పసుల వన్నె వేరు ---------------------- వినుర వేమ!
4. తల్లిదండ్రి మీద ------------------------- వినురవేమ!
5. గడిచిపోయినట్టి ------------------------ తెలుగు బిడ్డ.
6. చదువురాని జనులు ------------------ తెలుగు బిడ్డ.
7. నరుడు మెచ్చెనేని --------------------- తెలుగుబాల!
8. పరుల కొరకే నదులు ప్రవహించు -------------------- తెలుగుబాల!
9. మల్లెపువ్వు కంటే మంచి గంధము కంటే ------------------ గీత భాష తెలుగుజాతి భాష
10. వీణ తీగ మీటి వినిపించినట్లుగా -------------------------- భవ్యసుగుణశీల భారతబాల

Prepared By A.B RAO