Ticker

6/recent/ticker-posts

5వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం - 2)

5వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం - 2)
9. వాతావరణం - గాలి
 • గాలికి ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలాన్ని ఆక్రమించడం వంటి ధర్మాలు ఉంటాయి.
 • భూమి చుట్టూ దుప్పటిలా ఆవరించి ఉన్న గాలి పొర - వాతావరణం+
భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల, భూమి అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు ఏర్పడతాయి.

 • కాలాలు - చలికాలం. ఎండాకాలం, వర్షాకాలం • ఏప్రిల్, జూన్ మాసాల్లో అధిక వేడి ఉంటుంది. శరీరానికి గాలి బాగా తగిలేలా నూలు బట్టలు వేసుకోవాలనిపిస్తుంది.
 • జులై, ఆగస్ట్ మాసాల్లో వర్షాలు ఎక్కువ కురుస్తాయి.

 • భూ వాతావరణం ఐదు పొరలుగా విభజించారు. అవి
 • 1. ట్రోపో ఆవరణం, 2. స్ట్రాటో ఆవరణం, 3. ఆయనో ఆవరణం, 4. థెర్మో ఆవరణం, 5. ఎక్సో ఆవరణం
 • భూమికి అతి దగ్గరగా ఉన్న పొర - ట్రోపో ఆవరణం. ఈ ఆవరణంలో భూమి నుండి పైకి పోవు కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
 • దృవాల కన్నా భూమధ్యరేఖా ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది. • సూర్యకిరణాలు, గాలి, సముద్రాలు, నదులు, చెట్లు, భూమిపై ప్రదేశం యొక్క ఎత్తు మొదలైనవి వాతావరణం లో మార్పులకు కారణం.
 • గాలి శబ్దం చేస్తుంది. మౌత్ ఆర్గాన్, సన్నాయి వంటి వాయిద్యాలతో నోటి ద్వారా గాలి ఊదడం వల్ల శబ్దం వస్తుంది.
 • కాగితం చేప - 12 సెం. మీ పొడవు, 1 సెం. మీ వెడల్పు
 • కాగితం బంతి - కాగితం తేలికగా చుట్టినపుడు మడతలలో గాలి ఉన్నందున ఎక్కువ దూరం పడలేదు.గట్టిగా చుట్టినపుడు ఎక్కువ దూరంగా పడుతుంది.
 • గాలి కాగితంపై, కాగితం బంతి గాలిపై చూపే ఒత్తిడి మీద కాగితం పడే దూరం ఆధారపడి ఉంటుంది.
 • గాలికి గల శక్తి ఆధారంగా పెద్ద పెద్ద చక్రాలను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేయడం - పవన విద్యుత్
 • గాలిలో నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, నీటిఆవిరి వంటివి ఉంటాయి. వీటికి రంగు, రుచి, వాసన ఉండదు.
 • గాలిలో ఎక్కువ ఉండే వాయువు నత్రజని, తర్వాత ఆక్సిజన్. ఈ వాయువులు కంటికి కనపడని చిన్న రేణువుల రూపంలో ఉంటాయి.
 • మొక్కలు ఆహారం తయారుచేయడానికి గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి. జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతాయి. • ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. నీటిలో నివసించే జంతువులు నీటిలో కరిగే ఆక్సిజన్ తీసుకుంటాయి.
 • పొగ తాగిన వారితో పాటు, వారు వదిలిన గాలిని పీల్చిన వారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, టి.బి., క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.
10. సూర్యుడు - గ్రహాలు
 • సౌర వ్యవస్థలో అన్నింటికన్నా పెద్దది సూర్యుడు.
 • సూర్యుడు, దాని చుట్టూ గ్రహాలు కలిపి "సౌరకుటుంబం" అంటారు.
 • బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు.
 • ఫ్లూటో ను ప్రస్తుతం గ్రహం కింద పరిగణించుట లేదు. • గ్రహం సూర్యుని చుట్టూ తిరిగే ఒక నిర్ణీత మార్గం - కక్ష్య
 • భూభ్రమణం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం - 24 గంటలు
 • భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి చంద్రుడికి పట్టే సమయం 28 రోజులు. చంద్రుడికి స్వయం ప్రకాశక శక్తి లేదు.
 • చంద్రుని వివిధ కళలు ఏర్పడడానికి దాదాపు 28 రోజులు పడుతుంది.
 • ఆంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థం - ఉపగ్రహం
 • చంద్రునిపై ఉండే ప్రదేశాలు గ్రహించే సూర్యకాంతిలో మార్పు వల్ల చంద్రుని పరిమాణంలో తేడాలున్నట్లు కనపడుతుంది.
 • సూర్యుడికి దగ్గరగా గల గ్రహం - బుధుడు • సూర్యుని నుండి భూమి 3వ గ్రహం
 • శుక్రుడు సూర్యుని నుండి 2వ స్థానంలో ఉన్నాడు.
 • అన్నింటికన్నా పెద్ద గ్రహం - గురుడు
 • భూమికి దగ్గరగా అటు ఇటు ఉన్న గ్రహాలు - శుక్రుడు, అంగారకుడు
 • వలయాలున్న గ్రహం - శని
 • సూర్యుని నుండి అన్నింటికన్నా దూరంగా ఉన్న గ్రహం - నెప్ట్యూన్, ఫ్లూటో
 • బుధగ్రహం మీద భూమి మీద కన్నా వేడి ఎక్కువ ఉండడానికి కారణం - సూర్యునికి దగ్గరగా ఉండడం
 • ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పడుతుంది - నెప్ట్యూన్, ఫ్లూటో
 • ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ సమయం పడుతుంది - బుధుడు
 • భూమి శని గ్రహాలలో దేని కక్ష్య పెద్దది - శని
11. భద్రత చర్యలు
 • ప్రమాదాలు జరగకుండా మనం తీసుకునే చర్యలు - భద్రతా చర్యలు • తమిళనాడులో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుండి ప్రభుత్వం తప్పనిసరిగా పాఠశాలల్లో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి భద్రతా చర్యలు పాటించాలని సూచించింది.
 • ఆగ్ని ప్రమాద సమయంలో లిఫ్ట్ వాడరాదు. అగ్ని ప్రమాదం సమయంలో ఫైర్ ఇంజిన్ ( అగ్నిమాపక యంత్రం ) ద్వారా ప్రమాదాన్నీ ఆదుపులోకి తెస్తారు.
 • జాతరలో చేపట్టే భద్రతా చర్యలు - సురక్షిత మంచినీరు, పార్కింగ్ స్థలం, శుభ్రమైన ఆహార పదార్ధాలు, ఆరోగ్య శిబిరం, టాయిలెట్లు, ఫైరింజిన్లు, పోలీస్ సహాయ కేంద్రం, తొక్కిసలాట లేకుండా ఏర్పాట్లు, బారికేడ్లు
 • భూకంపాన్ని రిక్టర్ స్కేల్ పై గుర్తిస్తారు. దీని తీవ్రత ఆరు నుండి ఏడు పాయింట్లు దాటితే ప్రమాదాలు సంభవిస్తాయి.
 • మహారాష్ట్రలో లాథూల్ జిల్లాలో 1993 లో తీవ్ర భూకంపం వచ్చింది.2001 లో గుజరాత్ లోని కచ్ లో అతిపెద్ద భూకంపం వచ్చింది. • భూకంపం వచ్చినపుడు కూడా లిఫ్ట్ ఉపయోగించరాదు.
 • మన రాష్ట్రంలో 1977 లో దివిసీమ ఉప్పెన, 2009 లో కర్నూల్ జిల్లాలో తీవ్ర వరదలు వచ్చాయి.
 • వైద్యుని వద్దకి వెళ్ళడానికి ముందు భాదితునికి వెంటనే అందించే చికిత్స - ప్రధమ చికిత్స. సరైన చికిత్స అందించడంతో పాటు, భయాన్ని పోగొట్టడం, ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రధమ చికిత్సలో భాగమే.
 • 104 వాహనంలో వైద్య సిబ్బంది ప్రతి రోజు ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.
 • ప్రాణ రక్షణ సూత్రాలు :
 • 1. రోగిని వెల్లకిలా పడుకోబెట్టాలి. బట్టలు వదులు చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డంకులుంటే తొలిగించాలి. పరిస్థితిని బట్టి తలని పక్కకి వంచాలి.
 • 2. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు విషం, ఆసిడ్, వాంతులు సందర్భంలో మినహా మిగిలిన సందర్భంలో కృత్రిమ శ్వాస అందించాలి. • 3. గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించి స్పందన లేకపోతే ఎద రొమ్ముపై అరచేతులు ఒక దానిపై ఒకటి ఉంచి అనిగెటట్లు నొక్కాలి.

 • ప్రమాదం జరిగిన మొదటి గంటను "గోల్డెన్ అవర్" అని అంటారు.
 • వేగంగా అర్ధ అడుగు లోతు వచ్చే వరద కూడా మనిషిని పడవేయగలదు.
 • ఒక అడుగు లోతు వరద వల్ల కారు వంటి వాహనాలు పడిపోగలవు.
 • రెండు అడుగుల లోతులో వేగంగా వచ్చే వరద కార్ల వంటి వాహనాలని మోసుకెళ్లగలదు.
 • బెణికిన గాయంపై అయింటిమెంట్ తో గట్టిగా రుద్దకూడదు. "క్రేప్ బ్యాండేజ్" అనే బ్యాండేజ్ తో కట్టు కట్టాలి.
 • కాలిన గాయం అయితే కాలిన ప్రాంతాన్ని ధారగా వచ్చే చల్లని నీటి కింద 15 - 20 నిమిషాలు పెట్టాలి. • కాలిన గాయం బ్యాండేజ్ తో కట్టరాదు. ఐస్ పెట్టరాదు.
 • SDR నియమం పాటించాలి. 
 • SDR - STOP(ఆగండి), DROP(కింద పడిపోండి), ROLL(అటు ఇటు దొర్లండి).
 • పాయిజన్ తీసుకున్న వ్యక్తికి విష తీవ్రత తగ్గించడానికి ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆ వ్యక్తికి వాంతి చేయించకూడదు. స్పృహ తప్పనివ్వకూడదు.
 • స్పృహ తప్పిన వ్యక్తిని పక్కకి తిప్పి పడుకోబెట్టి, గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వెల్లకిలా పడుకోబెట్టారాదు.
 • ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారంగా ఉండడం, ఛాతి నొప్పి కూడా వస్తే "గుండెపోటు" అనుకోవచ్చు. ఆ వ్యక్తిని దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పడుకోబెట్టరాదు, నడిపించరాదు, నిలుచోబెట్టరాదు.
 • బి.పి ఉన్నవాళ్ళు ఒళ్ళు తిరుగుతుందని, తిమ్మిరిగా ఉందని చెప్తే మొదట నవ్వి చూపెట్టమనండి. నవ్వేటప్పుడు మూతి వంకరగా ఉంటే సరిగ్గా మాట్లాడలేకపోతే దానిని పక్షవాతం చిహ్నంగా గుర్తించాలి.
 • కుక్క, కోతి, పిల్లి, చుంచెలుక వంటివి ఏవి కరిచిన ఆ ప్రాంతాన్ని సబ్బుతో కడగాలి. ఆ గాయానికి బ్యాండేజ్ తో మూయడం గాని కుట్లు వేయడం గానీ చేయరాదు.
 • పాముకాటుకి గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం భయం. కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా ఉంచి, స్పృహ తప్పిపోకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. • వడదెబ్బ లక్షణాలు - విపరీతమైన జ్వరం, ఒళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం, తలనొప్పి
 • వడదెబ్బ తగిలిన వారికి నీళ్ళు తాగించే ప్రయత్నం చేయకూడదు. అతని శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చేదాకా చల్లని నీటితో ముంచిన గుడ్డలో తుడవాలి. తర్వాత O.R.S ద్రావణం ఇవ్వాలి.
 • కంటిలో రసాయనాలు పడితే ఆ ప్రాంతాన్ని ఉదృతంగా ప్రవహించే చల్లని నీళ్ల కింద కంటిని కనీసం 15 - 20 నిమిషాలు ఉంచాలి.
 • గుండె ఆగిపోతే - C.P.R ప్రక్రియ చేపట్టాలి.
 • C.P.R - Cardio(గుండె), Pulmonary(ఊపిరితిత్తులు), Resuscitation & Restart(తిరిగి స్టార్ట్ చేయడం)
 • ఈ ప్రక్రియలో ఛాతీ మధ్య ఎముకల్లో 30 సార్లు ఒత్తిడి కలిగించాలి. తదుపరి నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందించాలి. ఇలా నిమిషానికి (30:2 × 2) 30 సార్లు ఒత్తిడి కలిగించి రెండు సార్లు కృత్రిమ శ్వాస అందించాలి.ఇలా మూడు సార్లు చేయాలి.
 • ముక్కు నుండి రక్తస్రావం వస్తే ఎప్పుడు తలని వెనక్కి పెట్టకూడదు. 
 • కరెంట్ షాక్ ఎక్కువ కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీనిని "కార్డియక్ అరెస్ట్" అంటారు.
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినపుడు తాడు కట్టడం, గాటు పెట్టడం, రక్తం పీల్చడం వంటివి చేయరాదు. • శుభ్రపరచని బ్లేడు, చాకు వంటివి ఉపయోగించి గాటు పెట్టడం వల్ల ధనుర్వాతం రావచ్చు.
 • 108 అందించే సర్వీసులు - HEALTH, POLICE, FIRE
12. చారిత్రక కట్టడాలు - చంద్రగిరి కోట
 • ఉదయగిరి కోట - నెల్లూరు
 • పెనుగొండ కోట - అనంతపురం • గోల్కొండ - హైదరాబాదు
 • ఓరుగల్లు కోట - వరంగల్లు
 • భువనగిరి కోట - నల్గొండ
 • రామగిరి ఖిల్లా - కరీంనగర్
 • ఆనాటి రాజులు శత్రువుల నుండి రక్షణకు, తాము సాధించిన విజయాలను గుర్తుగా కోటలు నిర్మించారు. • చంద్రగిరి కోట : 
 • చంద్రగిరి కోట మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉంది. తిరుపతికి 14 కి.మీ. దూరంలో ఉంది.
 • పురాణ గాధలు అనుసరించి ఇక్కడ ఎత్తైన కొండపై చంద్రుడు తపమాచరించి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని వరములు పొందాడని అందుకే చంద్రగిరి అనే పేరు వచ్చిందని చెప్తారు.
 • ఈ కోటను క్రీ.శ 1000 సం.లో నారాయనవనమును పాలించిన ఇమ్మడి యాదవ నరసింహారాయలు నిర్మించాడు.
 • సాలువ వంశానికి చెందిన నరసింహారాయలు కాలంలో చంద్రగిరి కోట బాగా అభివృద్ధి చెందింది.
 • 1565 సం. లో రాక్షస తంగడి(తల్లికోట) యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయారు. దీంతో వారి రాజధానిని హంపి నుండి పెనుగొండకు అక్కడ నుండి చంద్రగిరి మార్చారు.
 • అరవీటి వంశ రాజులు చంద్రగిరిని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలించారు. 1585 లో అరవీటి వంశ రాజు శ్రీ వెంకటపతిరాయల కాలంలో చంద్రగిరి కోట ప్రాచుర్యంలో వచ్చింది. • చంద్రగిరి కోటలో రాజమహల్ ముఖ్యమైనది. రాజమహల్ పైన మూడు గోపురాలు ఉన్నాయి. గోపురం కింది భాగం వెడల్పుగా ఉండి పైకి పోవు కొద్దీ చిన్నదిగా ఉంటుంది. దీనిని "ద్రవిడ రీతి" అంటారు.
 • రాజమహల్ కట్టడాలలో ఇండో - టర్కీ శైలి కనిపిస్తుంది. • శ్రీ కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద లో కొంత భాగం, అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్రలో కొంత భాగం చంద్రగిరి కోటలో ఉండి రాసారు.
 • తెనాలి రామకృష్ణుడు చంద్రగిరిలో జన్మించాడు.
 • రాజమహల్ పైకప్పు చదరాలుగా విడగొట్టి ప్రతీ చదరంలో ఏదో ఒక ఆకారం ఉంటుంది. దీనిని "స్టాక్కో అలంకరణ" అంటారు.
 • కోటకు అనుకోని పెద్దకొండపై ఒక మండపం ఉంది. ప్రస్తుతం అక్కడ కార్తీక మాసంలో ప్రజలు దీపాలు వెలిగిస్తారు. • శ్రీ కృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చినపుడు రాజమహల్ లో బస చేసేవారు.
 • కోటలో శివాలయం, రామాలయం ఉన్నాయి.
 • విజయనగర రాజులు కాలం నాటి శిథిల కట్టడాలు, దేవాలయాల నుండి సేకరించిన శిలా, కాంస్య విగ్రహాలు మ్యూజియంలో భద్రపరిచారు. దీనిని భారత పురావస్తు సంరక్షణ శాఖ సంరక్షిస్తుంది.
13. శక్తి
 • పదార్ధాలు మండించడం ద్వారా వచ్చే శక్తి ఇంధన శక్తి. వంటచెరకు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్, మొదలైనవి ఇంధనాలు.
 • లక్షల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు, జంతువులు భూమిలో చేరి ఇంధనాలుగా మారతాయి.
 • పేడ నుండి ఉత్పత్తి చేసే సహజ వాయువుని "గోబర్ గ్యాస్" అంటారు.
 • మన రాష్ట్రంలో ఎక్కువ జల / థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతుంది. • సూర్యకిరణాలు సౌరఫలకాల పై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్ తయారు చేస్తాయి. ఆ విద్యుత్ ని బ్యాటరీ నిల్వ చేస్తుంది.
 • మన దేశంలో సౌరశక్తి ఎక్కువ ఉపయోగించే రాష్ట్రం - గుజరాత్
 • గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ - పవన విద్యుత్
 • నీటి వేగం ఉపయోగించి టర్బైన్లు తిప్పడం ద్వారా - జల విద్యుత్
 • మన రాష్ట్రంలో గల జల విద్యుత్ కేంద్రం - శ్రీశైలం ప్రాజెక్ట్, కర్నూల్ • పెద్ద పెద్ద రిజర్వాయర్ లో నీటిని "పెన్ స్టాక్" అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లు తిప్పుతారు.
14. మన దేశం - ప్రపంచం
 • భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. దేశ రాజధాని న్యూ ఢిల్లీ • వైశాల్యం పరంగా భారత్ ప్రపంచంలో ఏడవ స్థానం . మన దేశం కంటే వైశాల్యంలో పెద్ద దేశాలు - రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, 
 • భారతదేశం మధ్యలో గల పర్వతాలు - వింధ్య సాత్పురా పర్వతాలు 
 • రాజ్యాంగం గుర్తించిన భాషలు - 22
భారత దేశ నైసర్గిక మండలాలు
 • 1. తూర్పు భారతదేశం - బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ • 2. పశ్చిమ భారతదేశం - గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్
 • 3. ఉత్తర భాతదేశం - జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ
 • 4. దక్షిణ భారతదేశం - ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ • 5. ఈశాన్య రాష్ట్రాలు - అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ సిక్కిం
 • 6. మధ్య భారతదేశం - మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్
 • ఖండాలు - 7. అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా
 • భారతదేశంలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు, ఐరోపాలో ఆల్ఫ్స్ పర్వతాలు ఎత్తైనవి • ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం - ఎవరెస్టు
 • హిమాలయాల్లో పుట్టిన గంగా నది ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ లో ప్రవహిస్తుంది.
 • భూమిపై విశాలమైన ఉప్పునీటి భాగాలను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలు అని అంటారు.
 • మహాసముద్రాలు - 5. అవి పసిఫిక్ (పెద్దది), హిందు, అట్లాంటిక్, ఆర్కిటిక్ (చిన్నది), అంటార్కిటికా • అన్నివైపులా నీరు గల భూభాగాలు "ద్వీపాలు". ఉదా : గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్
 • మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే "ద్వీపకల్పం" అంటారు.
 • సముద్రమట్టం నుండి 1000మీ ఎత్తుకి పోయేకొద్దీ 60 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగును.
 • సుమారు 75% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంది.
 • అట్లాంటిక్, పసిఫిక్, హిందు మహా సముద్రాల లోపల ఎత్తైన పర్వతశ్రేణులు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కి.మీ.
 • సముద్రజలాల్లో అధికంగా సోడియం క్లోరైడ్ (సాధారణ లవణం) ఉంటుంది.
 • సముద్ర జలాల్లో సుమారు 96% నీరు ఉంటే మిగిలిన 4% లవణాలు, ఇతర కరగని ఘనపదార్ధాలు ఉంటాయి.
 • నదులలో నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.
15. మన రాజ్యాంగం
 • ఆయా స్థాయిలలో ఎలా పరిపాలన చేయాలో తెలపడానికి అనేక నియమ నిబంధనలతో గల అతి పెద్ద గ్రంధం - రాజ్యాంగం.
 • మన దేశ మొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది.
 • రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ - అంబేద్కర్ • రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. అప్పటి నుండి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
 • మనది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ కు లిఖిత రాజ్యాంగం లేదు.
 • రచన కమిటీ సభ్యులు - అంబేద్కర్(అధ్యక్షులు), గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్. మాధవరావు, పి.టి.కృష్ణమాచార్యులు
 • రాజ్యాంగ రచనకు పట్టిన కాలం - 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు
 • ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది.
 • మన దేశంలో ఉన్న భాషలు - 1652
 • సర్వసత్తాక - మన దేశం గురించి ఏం చేయాలన్న మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.
 • సామ్యవాదం - దేశ ప్రజలంతా కలసి సంపద సృష్టించి ఆ సంపద అందరూ సమానంగా అనుభవించాలి.
 • లౌకిక రాజ్యం - మత ప్రమేయం లేని రాజ్యం
 • భారత్ లో హిందువులు 80%, ముస్లీమ్స్ 13%, క్రైస్తవులు 2%
 • ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం - ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు పరిపాలిస్తారు.
 • సౌబ్రాతృత్వం - సోదరభావం
 • చట్టాలు పార్లమెంట్ లో రూపొందుతాయి.
 • పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్య సభ ఉంటాయి.
 • లోకసభకి 543 మంది సభ్యులను ఓట్లు ద్వారా ఎన్నుకుంటారు. ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తారు. • రాజ్యసభకు 233 సభ్యులను ఎన్నుకుంటారు. 12 మందిని నామినేట్ చేస్తారు.
 • పార్లమెంటులో మొత్తం సభ్యులు 790
 • మన రాష్ట్రంలో శాసన సభ, శాసన మండలి ఉంటాయి. 294 మందిని ఓట్ల ద్వారా శాసన సభకి ఎన్నుకుంటారు. వీరిని శాసన సభ్యులు (MLA - Member of Legislative Asembly) అంటారు.
 • శాసన మండలి 90 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని "శాసన మండలి సభ్యులు (MLC - Member of Legislative Council)" అంటారు.
 • రాజ్యాంగం 1949 నవంబర్ 26 న ఆమోదించారు. 1950 జనవరి 26 నుండి అమలు లోకి వచ్చింది.
 • రాజ్యాంగం కల్పించిన హక్కులు - పని చేసే హక్కు, వాక్ స్వాతంత్య్రం, మత స్వాతంత్య్రం, పీడనాన్ని నిరోధించే హక్కు, ఓటు హక్కు, సంఘాలని ఏర్పరిచే హక్కు, విద్య పొందే హక్కు మొదలైన హక్కులు ఇచ్చింది.
16. బాలల హక్కులు
 • హెలెన్ కిల్లర్ - 19 నెలల వయసులో కంటిచూపు,  నోటిమాట పోయాయి.8 సం వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. ఉపాధ్యాయిని పేరు - సారాపుట్టర్
 • బాలలకు ప్రధానంగా 4 హక్కులు ఉన్నాయి. అవి
 • 1. జీవించే హక్కు, 2. రక్షణ పొందే హక్కు, 3. అభివృద్ధి చెందే హక్కు, 4. భాగస్వామ్య హక్కు
 • బాలల పార్లమెంట్ - సుమారు 6 నుండి 18 సంవత్సరాలు వయసు ఉన్న 30 మంది బాల బాలికలతో ఏర్పాటు చేసినది. కేరళలో 2722 పార్లమెంట్ లలో 6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.
 • ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం - 2009 ప్రకారం బాలల హక్కుల భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు. • కార్యాలయం - రాజీవ్ విద్యా మిషన్, హైదరాబాదు
 • కార్యాలయం నెంబర్ - 1800 42 53 525   Prepared: A.B.Rao