Ticker

6/recent/ticker-posts

VIII Class SS


1. పటాల అధ్యయనం - విశ్లేషణ
ముఖ్యమని భావించే అంశాలు చూపించడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు పటాలను ఉపయోగిస్తారు.
వివిధ కాలాల్లో పటాలు :
ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు నాలుగువేల సంవత్సరాల నాటివి. వాటిని తయారుచేసింది సుమేరియన్లు (ప్రస్తుత ఇరాక్)
వీరు దేవాలయాల భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాలు రూపంలో భద్రపరిచారు. వీటిని మట్టి పలకల మీద చేశారు.

మొదట కొన్ని ప్రపంచ పటాలు తయారుచేసింది బాబిలోనియన్లు (ప్రస్తుత ఇరాక్). దీనిని 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకల మీద గీసారు. అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే.
వీరు బాబిలోన్ పట్టణం మధ్యలో చూపించారు. లోపల వలయం బయట "చేదునది / ఉప్పు నీటి సముద్రం" ఉంది. దానిలో త్రికోణాకృతిలో ఏడు దీవులు ఉన్నాయి.
గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్షిమండర్, మిలేటస్ (ప్రస్తుత టర్కీ)  కు చెందిన హెకేటియన్ లు కూడా ప్రపంచ పటాలు తయారుచేశారు.
వీరు తయారుచేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే వాళ్ళ వివరణలు ఆధారంగా ఆ పటాలను చరిత్రకారులు తిరిగి తయారుచేశారు.
వీళ్ళు ప్రపంచాన్ని యూరప్, లిబియా(ఆఫ్రికా), ఆసియా అని మూడు ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. మధ్యలో గ్రీసు ఉంటుంది
దగ్గర దూర ప్రాంతాల గూర్చి తెలుసుకోవడానికి వాటి పటాలు తయారీకి గ్రీకులు, తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు.
అక్షంశాలు, రేఖంశాలు ఆధారంగా పటాలని ఖచ్చితంగా తయారుచేయడానికి గ్రీకులు ప్రయత్నించారు.
ఒకే సమయంలో మిట్టమధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీసారు. దీనిని "మెరిడియన్ (మధ్యాహ్న రేఖ) లేదా రేఖంశం" అంటారు.
మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షంశాలు గీయడానికి ప్రయత్నించారు.
రెండు రకాల గీతలతో పటం మీద గళ్ళు(గ్రిడ్) గీసారు.
అక్షంశాలు, రేఖంశాలు సరిగా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది.
నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గూర్చి పటాలు తయారుచేసే వాళ్ళకి చెప్పి వాళ్ళకి సహకరించారు.
అక్షంశాలు, రేఖంశాలు ఉపయోగించి సవివరంగా పటాలు తయారుచేసింది "టాలమి". కానీ ఆ పటాలు అందుబాటులో లేవు.
పటాలు తయారీకి అరబ్బు పండితులు, నావికులు టాలమి పుస్తకాలు ఉపయోగించారు.
అల్ ఇద్రిసి తన రాజు కోసం 1154 లో ఒక ప్రపంచ పటం తయారుచేశాడు. పటం వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి.
ఈ పటంలో యురేషియా ఖండం పూర్తిగా మరియు ఆఫ్రికా ఉత్తర భాగం చూపించారు. ఆఫ్రికా దక్షిణ భాగం ఆగ్నేయాసియా భాగాల వివరాలు చూపించలేదు. అరేబియాను మధ్యలో చూపించారు.
పటంలో దక్షిణం పై భాగంలో ఉత్తరం కింది భాగంలో చూపించారు.
1389 లో చైనా చక్రవర్తి కోసం 17 చదరపు మీటర్ల పట్టు గుడ్డ మీద డా మింగ్ హాన్ యి తు ఒక పటం గీసాడు.
బైబిల్ వర్ణించిన పటంలో ప్రపంచాన్ని ఆసియా, ఆఫ్రికా, యూరప్ అనే మూడు ఖండాలుగా విభజించి ఉంది. దీనిలో యేసుక్రీస్తు జన్మ స్థలం అయిన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం పెద్దదిగా పైన చూపించారు. యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింద భాగంలో చూపారు.
1480 ప్రాంతంలో టాలమి పుస్తకాలు యూరోపియన్లు తిరిగి కనుగొన్నారు కానీ అతను గీసిన పటాలు దొరకలేదు.
15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు టాలమీ ఊపిరి ఊదాడు.
మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గం అరబ్బులు మూసివేశారు. దాంతో భారతదేశానికి సముద్ర మార్గం కనుకోవడానికి పచ్చిమ యూరప్ ( స్పెయిన్, పోర్చుగల్, హాలండ్, ఇంగ్లాండ్ వంటివి ) వ్యాపారస్తులు బయలుదేరారు.
కొలంబస్ అమెరికాని, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నారు.
16 శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది.
డచ్ దేశ పటాలు తయారీదారుల పితామహుడు "గెరార్డస్ మెర్కెటర్(1512 - 94)"
ఖండాలు పరిమాణం దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని "మెర్కెటర్ ప్రక్షేపనం" అని అంటారు.

దేశం అంతటిని సర్వే చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖ ఏర్పాటు చేశారు.సర్వేయర్ జనరల్ గా "జేమ్స్ రెన్నల్" ను నియమించారు.
సర్వే ఆధారంగా తయారైన భారతదేశ మొదటి పటాలను అతడు తయారుచేశాడు.
ప్రపంచంలోనే అతి ముఖ్యమైన భౌగోళిక సర్వేను 1802 లో "విలియం లాంబటన్" ఆరంభించాడు. దక్షిణాన చెన్నై దగ్గర మొదలు పెట్టి ఉత్తరాన హిమాలయాల వరకు రేఖంశాలు పొడవు నిర్ణయించి, వివిధ ప్రదేశాల ఎత్తులు నిర్ణయించాడు.
ఈ సర్వే పూర్తి చేసింది సర్ జార్జ్ ఎవరెస్టు. ఈ సర్వేక్షణ ఆధారంగా ఎవరెస్టు పర్వతం ప్రపంచంలో ఎత్తైన పర్వతం అని నిరూపితమైంది. 
అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఈ సర్వే సముద్ర తీరం అయిన చెన్నైలో మొదలైంది.
నేటి కాలంలో దేశ అభివృద్ధికి, ప్రణాళికల తయారీకి పటాలు విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ఒక పటం ఒక అంశం పైనే కేంద్రీకరిస్తే ఇటువంటి పటాలను "విషయ నిర్ధేశిత (థీమాటిక్) పటాలు" అంటారు.
ప్రజలు భూమిని ఉపయోగించే విధానాన్ని తెలిపే పటాలు "భూ వినియోగ పటాలు"
రంగు 
భూ అచ్ఛాదన / భూ వినియోగం  
ముదురు ఆకుపచ్చ 
అడవి 
లేత ఆకుపచ్చ 
గడ్డి భూములు 
గోధుమ / మట్టి రంగు 
వ్యవసాయానికి అనువైన భూములు 
పసుపుపచ్చ (నైసర్గిక పటాలు)  
పంటలు సాగు అవుతున్న ప్రాంతం 
ముదురు ఉదా 
పర్వతాలు 
లేత ఉదా 
గుట్టలు 
పసుపు పచ్చ 
పీఠభూములు, చిత్తడి భూములు 
లేత ఎరుపు 
బంజరు భూములు 
లేత నీలం 
చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి 
ముదురు నీలం 
సముద్రాలు, మహా సముద్రాలు 
తెలుపు 
ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతం 
నలుపు 
సరిహద్దులు 

జనాభాను సూచించే పటాలు - జనసాంద్రత పటాలు
భారత సర్వేక్షణ శాఖ ఉపయోగించే సంకేతాలను మన దేశంలో సాధారణంగా ఉపయోగిస్తారు. భారత సర్వేక్షణ శాఖ జారీ చేసే సాంప్రదాయ సంకేతాలుని "టోపో షీట్లు" అంటారు.
సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో గల ప్రదేశాలను కలిపే రేఖలను"కాంటూరు రేఖలు (ఐసోలైన్స్)" అంటారు.
కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని అర్ధం. దగ్గరగా ఉంటే తీవ్రవాలు ఉందని అర్ధం.
పటాలు సంకలనం - అట్లాస్

2. సూర్యుడు - శక్తి వనరు
రెండు ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలు గాలులను, వానలను ప్రభావితం చేస్తాయి.
సూర్యుడు నుండి శక్తి కాంతి, వేడిమి రూపంలో విడుదల అవుతూ ఉంటుంది. సూర్యుడు నుండి వెలువడే ఈ శక్తిని "సౌర వికిరణం" అంటారు.
భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని "సౌరపుటం" అంటారు.
సౌరశక్తిలో మూడవ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం అవుతుంది. మరికొంత శక్తి వాతావరణ పై పొరలలో చెల్లాచెదురు అవుతుంది.
భూమి ఉపరితలం ఒంపుగా ఉండడం వల్ల సూర్యకిరణాలు ఉపరితలం అంతటా ఒకేలా వేడి కలిగించవు.
భూ ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని "పతన కోణం (యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్)" అని అంటారు.
భూమధ్యరేఖ వద్ద (00) - 100 యూనిట్స్ సూర్యపుటం చేరితే 
450 వద్ద - ఉత్తర జపాన్ - 75 యూనిట్స్
66 1/20 - ధ్రువ మండలం - 50 యూనిట్స్ 
900 వద్ద - దృవాలు - 40 యూనిట్స్
భూమధ్యరేఖ వద్ద సూర్యకిరణాలు ఎక్కువ సాంద్రతలో పడినా సాధారణంగా అక్కడ మధ్యాహ్నం నుండి మబ్బుగా ఉండి నేల మీద తక్కువ సూర్యకిరణాలు పడతాయి. కాబట్టి భూమధ్యరేఖా ప్రాంతం కంటే దానికి ఉత్తర, దక్షిణ ప్రాంతం వేడిగా ఉంటుంది.
ఉత్తర భాగంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో పతనకోణం పెరుగుతుంది. మే, జూన్ నెలల్లో తగ్గుతుంది.
భూమి త్వరగా వేడెక్కి, త్వరగా చల్లబడును. ఇందుకు విరుద్ధంగా సముద్రాలు వేడెక్కడానికి, చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది.
సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి. తర్వాత వేడి వికిరణం చెంది చుట్టూ ఉన్న గాలిని వేడెక్కిస్తుంది.
బొగ్గుపులుసు వాయువు లాంటి కొన్ని వాయువులు భూవికిరణాన్ని అడ్డుకుంటున్నాయి.
వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు శాతం పెరిగి భూవికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనిని "భూగోళం వేడెక్కడం" అని అంటారు.
భూమిపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత - 1992 జులై - లిబియా(ఆఫ్రికా) లోని అజీజియ - 57.80 
అత్యల్ప ఉష్ణోగ్రత - 1983 జులై - అంటార్కిటికా లోని వోస్టాక్ కేంద్రం - (-)89.20
ఉష్ణోగ్రతలలో అత్యల్ప ఉష్ణోగ్రత - (-)273.160. ఉష్ణోగ్రత ఇంతకంటే తగ్గదు.
ఒక్కరోజులో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చేసే పరికరం - సిక్స్ గరిష్ఠ కనిష్ట ఉష్ణమాపకం.
సముద్ర తీర ప్రాంతాలలో సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణస్థితులు ఒకేలా ఉంటాయి. దీనినే "సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి" అంటారు.
గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలలో తేడా ఉండడాన్ని "ఖండతర్గత శీతోష్ణస్థితి" అని అంటారు.
సముద్ర మట్టం నుండి పైకి వెళ్లే కొద్దీ ప్రతీ వెయ్యి మీటర్లకు 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది.
శీతాకాల సమయంలో సూర్యపుటం తక్కువగా ఉండి వికిరణం కూడా తక్కువగా ఉండడం వల్ల భూ ఉపరితలానికి చాలా తక్కువ ఉష్ణోగ్రత అందుతుంది. దీనిని "ఉష్ణ విలోమనం" అని అంటారు.

భూ చలనాలు - ఋతువులు
కాలక్రమాన్ని ప్రభావితం చేసే అంశాలు :
1. భూమి గోళాకారంగా ఉండి దాని ఉపరితలం ఒంపు తిరిగి ఉండడం
2. భూభ్రమణం 
24 గంటలు / ఒకరోజు - భూమి పడమర నుండి తూర్పుకి తిరుగుతుంది.
భూభ్రమణం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి.
సూర్యునికి ఎదురుగా ఉండే ప్రాంతం మారడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు, గాలుల కదలికలు ఎంతో ప్రభావితం అవుతాయి.
సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును "ప్రకాశ వృత్తం" అని అంటారు.
భూభ్రమణం వల్ల భూమి అంతటికీ ప్రతీరోజు కాంతి, వేడిమి అందుతుంటాయి.
3. భూ పరిభ్రమనం
365 రోజులు 5.56 గంటలు / ఒక సంవత్సరం
భూపరిభ్రమనం వల్ల ఋతువులు ఏర్పడతాయి
సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో, ఒకే దారిలో తిరుగుతుంది. దీనినే కక్ష్య అంటారు. తలాన్ని కక్ష్యాతలం అంటారు.
భూమి 66.50 కోణం కలిగి ఉంటుంది. అనగా 23.50 మేర ఒంగి ఉంటుంది.
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపు ఒంగి ఉంటుంది. అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. దీనిని "అక్ష ధ్రువత్వం (పొలారిటీ ఆఫ్ ఆక్సిస్)" అని అంటారు.
4. భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షం ఒంపు కలిగి ఉండడం

కర్కటక రేఖ నుండి మకరరేఖ వరకు ఉన్న ప్రాంతం - ఉష్ణ మండలం
జూన్ 21 - కర్కటకరేఖ మీద సూర్యుడు
డిసెంబర్ 22 - మకరరేఖ మీద సూర్యుడు
మార్చి 21, సెప్టెంబర్ 23 - భూమధ్యరేఖ మీద సూర్యుడు
మార్చి 21, సెప్టెంబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ రెండు రోజులను"విషవత్తులు" అంటారు.
ఉష్ణ మండలం నుండి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తే వేసవిలో వేడిగా ఉండే, శీతాకాలంలో చలిగా ఉండే ప్రాంతం వస్తుంది. దీనిని " సమశీతోష్ణ మండలం" అని అంటారు.
సమశీతోష్ణ మండలం నుండి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తే ధ్రువప్రాంతాలను చేరుకుంటారు.
సూర్యుడు ఆకాశంలో పైకి ఎక్కడు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులో ఉంటుంది. దీనిని "క్షితిజ రేఖ లేదా దిగ్మoడలం" అంటారు
ఆర్కిటిక్ సముద్రం సంవత్సరం అంతా గడ్డకట్టి ఉంటుంది.

Prepared By A.B.Rao