కణం - జీవుల మౌలిక ప్రమాణం
- సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన వారిలో ప్రముఖులు అథినాసియస్ కిర్చర్ (1601-1680), జాన్ స్వామ్మర్ డాం(1637-1680), ల్యువెన్ హుక్(1632-1723), రాబర్ట్ హుక్(1635-1702)
- ల్యువెన్ హుక్ మొదటిసారిగా 1674 లో బాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజావా, ఎర్ర రక్తకణాలు వంటి సజీవ కణాలను, నీటి బిందువులలో చలించే సూక్ష్మ ప్రాణులను సైతం చూసాడు. తన సుదీర్ఘ జీవితంలో అనేక రకాల భూతద్దాలు తయారుచేశారు. ఈ కటకాలతో మైక్రోస్కోప్ రూపొందించి ఎన్నో సజీవ, నిర్జీవ అంశాలు అధ్యాయనం చేసాడు.
కణం ఆవిష్కరణ
- రాబర్ట్ హుక్ (బ్రిటన్) 1665 లో ఓక్ చెట్టు మెత్తని కాండం నుంచి పలుచని పొర తీసుకుని పరిశీలించారు.
- కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకం కనుక్కోవడానికి (1831) దాదాపు 180 సంవత్సరాలు పట్టింది.
- రాబర్ట్ బ్రౌన్ మొదటిసారి కేంద్రకాన్ని ఆర్కిడ్ పత్రాలలో పరిశీలించాడు.
- కణానికి ఆకారాన్ని ఇచ్చేది "కణత్వచం". కనత్వచం గుండా కేవలం కొన్ని పదార్ధాలు మాత్రమే లోపలికి బయటికి ప్రవహిస్తాయి.
- కణానికి కావాల్సిన పటుత్వాన్ని ఇచ్చేది "కణకవచం"
- కణత్వచానికి కేంద్రకాన్ని మధ్య ఉన్న జిగురులాంటి పదార్ధాన్ని "కణద్రవ్యం" అంటారు. ఇది ఒక విజాతీయ పదార్ధం.
- కనద్రవ్యంలో కణత్వచం తో కూడిన నిర్మాణాలు ఉన్నాయి. వీటిని "కణాంగాలు" అంటారు. దీనిలో వివిధ రసాయనాలు కూడా ఉంటాయి.
కణాలలో వైవిధ్యం :
- ఒకే కణంతో నిర్మితం అయిన జీవులను "ఏక కణజీవులు" అంటారు.
- ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను "బహు కణజీవులు" అంటారు.
ఆకులో కణాలు :-
- గ్రూప్ ఎ కణాలు - కాండం బయటిపొర ఏర్పరుస్తాయి. ఇవి కాండానికి ఆకారం రక్షణ ఇస్తాయి.
- గ్రూప్ బి కణాలు - కాండంలో ఎక్కువ ఈ భాగంలో ఉంటాయి. ఈ భాగంలో ఉండే నిర్మాణాలు కిరణజన్య సంయోగ క్రియ నిర్వర్తిస్తాయి.
- గ్రూప్ సి కణాలు - ఇందులో కణాలన్ని కలసి పొడవైన నిర్మాణాలు ఏర్పడి నీరు, ఆహారం సరఫరా చేస్తాయి.
- గ్రూప్ డి కణాలు - లేత కాండం మధ్యలో ఉన్నాయి. ముదురు కాండంలో ఈ గ్రూప్ కణాల స్థానంలో ఖాళీలు ఏర్పడతాయి.
కణం - ఆకారం
- ఎర్ర రక్త కణం -
- నునుపు కండర కణం -
- నాడీ కణం -
- ఎముక కణం -
- తెల్ల రక్త కణం -
- రేఖిత కండర కణం -
- అమీబా తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారం మార్చుకుంటుంది. వీటిని "మిద్యాపాదాలు(Pseudopodia)" అంటారు.
- ఈ మిధ్యా పాదాలు అమీబా చలనంలో, ఆహార సేకరణలో ఉపయోగపడతాయి.
- సజీవులలో కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. ఇవి ఒక మైక్రోన్(మీటర్లో మిలియన్ వంతు) నుండి కొన్ని సెంటిమీటర్ వరకు ఉండవచ్చు.
- అతిచిన్న బాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రోన్లు ఉంటుంది. మానవ కాలేయ కణాలు, మూత్రపిండాలు 20 నుండి 30 మైక్రోన్లు వరకు ఉంటాయి.
- నాడీ కణం పొడవు 90 నుండి 100 సెంటీమీటర్లు. ఉష్ణపక్షి అండం అన్నింటికంటే పెద్ద కణం. దీని పరిమాణం 17CM * 18CM ఉంటుంది.
- కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది.
- జీవి యొక్క పరిమాణం ఆ జీవిలో కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు.
అనుబంధం :-
- ఒకే కటకం ఉన్న సూక్ష్మదర్శిని "సాధారణ సూక్ష్మదర్శిని"
- ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటే "సంయుక్త సూక్ష్మ దర్శిని".
- మొదటి సంయుక్త సూక్ష్మదర్శిని తయారుచేసింది "జాకారస్ జాన్సన్" (1595)
- మైక్రోస్కోప్ లో సాధారణంగా 4 కటకాలు ఉంటాయి. అవి 4x, 10x, 40x, 100x సామర్ధ్యం కలిగి ఉంటాయి.
- స్లైడ్ పై గల వస్తువు స్పష్టంగా కనిపించేంత వరకు అక్షీ కటకాన్ని పైకి కిందికి జరపాలి. దీనిని "కేంద్రీకృతం చేయడం" అంటారు.
స్లైడ్ తయారీ :
- స్లైడ్ తయారీకి 2mm మందం, 3cm*8cm ఉన్న దీర్ఘ చతురస్ర పారదర్శక గాజు పలక కావాలి.
రంజనం చేయు విధానం :
- "కణంలో వివిధ భాగాలు వేరు వేరు రంగులను పీల్చుకుంటాయి" అనే విధానంపై రంజనం చేసే పద్దతి ఆధారపడి ఉంటుంది. రంగును కలుగజేసి కారకాలు "రంజనాలు" అని విధానాన్ని "రంజనం చేయడం" అని అంటారు.
- సాఫ్రనిన్, మిథిలీన్ బ్లూ, అయోడీన్ మరియు ఎర్ర సిరాను రంజనాలుగా ఉపయోగిస్తాం.
- సాఫ్రనిన్ తయారీ కొరకు 1/4 టీ స్పూన్ సాఫ్రనిన్ ను 100ml నీటిలో కలపాలి.