Ticker

6/recent/ticker-posts

అందరికీ పునః స్వాగతం





తెలవారు జామునే తెలుగు వాకిళ్ళలో
         ముదితలు వెలయింప ముగ్గు బాట –
గగన వీధులయందు కదన రంగము బోలి
         బాలల గాలిపటాల వేట –
ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి
         గంగిరె ద్దాడంగ గంతు లాట –
“హరిలొ రంగో హరి! హరి హరీ! హరి!” యంచు
          హరిదాసు పాడంగ చిరత పాట –

గోద, రంగనాధుల భక్తి గుడులు చాట –
అరిసెలు, చకినాల్, పొంగళ్ళు కరుగ నోట –
పులకరించు మనసు, జిహ్వ  తెలుగు నాట –
కలుగు సంపూర్ణ తృప్తి సంక్రాంతి పూట!

అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాభినందనలతో

తిరిగి అందరికీ స్వాగతం....

 పరీక్ష కోసం క్రింద క్లిక్ చేయండి