Ticker

6/recent/ticker-posts

NASA : నాసా సంచలన ప్రకటన .. సౌర కుటుంబం అవతల ఏముందంటే ...!

NASA : అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ - నాసా ( NASA ) ప్రత్యేక అద్భుతమైన ఫొటోని ప్రపంచానికి తన ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసింది . ఇందులో ఓ భారీ సూపర్‌ నోవా ( supernova ) ఉంది . దీన్ని చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ కనిపెట్టింది . ఈ పేలుడు ఇప్పుడు జరిగింది కాదు . 2016 లో జరిగింది . సూపర్ నోవా RCW 103 మధ్యలో మెరుస్తున్న కాంతిని నాసా కాప్చర్ చేసింది . ఈ సూపర్‌ నోవా మన భూమికి 10,700 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది . అంటే ఇది మన సౌర కుటుంబనికి అవతల ఉందన్నమాట . ఇదివరకు ఇలాంటి చాలా ఫొటోలను నాసా మనకు షేర్ చేసింది . వాటికీ దీనికీ ఓ తేడా ఉంది . ఫొటోలో చూడండి ... మధ్యలో తెల్లగా ఒకటి మెరుస్తూ కనపడుతోంది ... అదే పేలిపోయన నక్షత్రం లేదా పేలిపోయిన సూర్యుడు .


ఇలా సూపర్ నోవా ఏర్పడ్డాక ... నక్షత్రాన్ని కాప్చర్ చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది . ఏదైనా అతి భారీ నక్షత్రం ... కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ... కుచించుకుపోతూ ... చిన్నగా అయిపోతుంది . ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోతుంది . ఆ పేలుడుతో ... దానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహాలు , ఇతరత్రా అన్నీ అందులో కలిసిపోతాయి . ఇలా సూపర్‌నవా ఏర్పడనప్పుడు పేలిపోయిన నక్షత్రంలోని మధ్య భాగం మరో నక్షత్రం ( న్యూట్రాన్ స్టార్ - neutron star ) లా కనిపిస్తుంది . అది చిన్నగా ఉన్నా ... దానిలో మాస్ 10 నుంచి 25 సోలార్ మాన్లకు సమానంగా ఉంటుంది . ఆ నక్షత్రం మెటల్ రిచ్ అయితే ... మాస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది . దాని వయసు 2000 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు .


ఇక్కడ నాసా ఓ ఆసక్తికర విషయం చెప్పింది . న్యూట్రాన్ స్టార్ లో పదార్థం బలవంతంగా ప్యాక్ అవ్వడం వల్ల ... అది చాలా బరువుగా ఉంటుందట . ఆ నక్షత్రం నుంచి మనం ఓ పంచదార పలుకు అంత సైజు పదార్థాన్ని తీసి తూకం వేస్తే ... అది ఎవరెస్ట్ పర్వతం అంత బరువు ఉంటుందట . అందుకే ఈ పోస్ట్ అందరికీ తెగ నచ్చుతోంది . దీనికి 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి . చాలా మంది ఇది అద్భుతంగా ఉందని అంటున్నారు . ఈ సూపర్ నోవా లాగానే ... 500 కోట్ల సంవత్సరాల తర్వాత మన సూర్యుడు కూడా కుచించుకుపోయి ... చిన్నగా అయ్యి .... ఒక్కసారిగా పేలిపోతాడనీ ... ఆ పేలుడుతో వచ్చే మంటలు , ఎనర్జీ దాటికి సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు , గ్రహశకలాలూ అల్లకల్లోలం అవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు . ఈ విపత్తు నుంచి మనం బయటపడటానికి మనకు 500 కోట్ల సంవత్సరాల టైమ్ మాత్రమే ఉంది . ఈ లోగా మనం ఇతర గ్రహాల పైకి వెళ్లి ... అక్కడి నుంచి సౌర కుటుంబం అవతలికి వెళ్లి ... అక్కడి నుంచి ఇతర సూర్యుళ్ల చుట్టూ తిరిగే భూమి లాంటి గ్రహాలను చేరుకోవాల్సి ఉంటుంది . అందుకు చాలా టైమ్ ఉందిగా అని సైంటిస్టులు అనుకోవట్లేదు . ఇప్పటి నుంచే అలాంటి ప్రయత్నాలు చేస్తేనే ... ఎప్పటికైనా సుదూర తీరాలకు వెళ్లగలం అని లెక్కలు వేస్తున్నారు .